జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పెద్దపల్లి నియోజకవర్గం ఎలిగేడు మండలం, సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత కెనడాలో జరిగిన మహిళా ఆర్చరీ 25 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారతదేశం తరపున బంగారు పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. చికిత, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డినీ మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా ఆమెను వారు అభినందించి మాట్లాడారు. ఒలంపిక్స్ లో పతకం సాధించేలా చికిత కి ప్రభుత్వం తరఫున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు , స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.