Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

మంగళవారం, ఆగస్టు 19, 2025

గోదావరిఖని:ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు ను పరిశీలించిన కలెక్టర్

 


నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

పెద్దపల్జి కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఎల్లంపల్లి రిజర్వాయర్ లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం అంతర్గాం లోని ఎల్లంపల్లి రిజర్వాయర్ ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ఉన్న నీటి నిల్వ ఎంత ఉంది?  ఇన్ ఫ్లో ఎంత ఉంది? ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత? వంటి వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.

ప్రస్తుతం 35 గేట్ల ద్వారా  ఎల్లంపల్లి నుంచి దిగువకు వరద విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున వరద వస్తున్నందున ఎల్లంపల్లి దిగువకు నీరు విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు రైతులు సామాన్య ప్రజలు నది దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

ప్రాజెక్టులో నీటి నిల్వ పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఆధారంగా ఎప్పటికప్పుడు దిగువకు నీరు విడుదల చేయాలని  కలెక్టర్ సూచించారు. డ్యాం గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను  పర్యవేక్షించారు. నీటి విడుదల అంశాలు రెగ్యులర్ గా ప్రెస్ కు విడుదల చేయాలని కలెక్టర్ ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు.


భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.  

*అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి రామగుండం మండలం లోని ముంపు ప్రాంతం మల్కాపూర్ గ్రామంలో పర్యటించి  లోతట్టు ప్రాంతాలలో* నీరు ఒకే చోట నిల్వకుండా చర్యలు  తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సీఈ సుధాకర్ రెడ్డి, ఎస్.ఈ. సత్యనారాయణ, డీఈ బుచ్చి బాబు, శరత్ బాబు,తహసిల్దార్ ఈశ్వర్, ఈ ఈ రామన్, సంబంధిత అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.

మంథని: సహకార సంఘంలో రైతులకు అందుబాటులో యూరియా

 

సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని లో 900 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పిఎసిఎస్ మంథని లో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు తమ వెంట పట్టా దారు పాసు పుస్తకం, ఆదార్ జీరాక్స్ ప్రతులు తమ వెంట తీసుకు రావాలని కోరారు. ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యెక చొరువతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరిపడా యూరియా బస్తాలు అందుబాటులో ఉంచుతున్నామని, రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని, రైతులకు యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అలాగే వ్యవసాయ శాఖ ఏడిఏ, ఏఓ, ఏఈఓ ల సహకారంతో యూరియా కొరత లేకుండా తగు చర్యలు చేపడుతున్నారని,రైతులు తమ అవసరాల మేరకే యూరియా తీసుకొని వాడుకోవాలని కోరారు.

సోమవారం, ఆగస్టు 18, 2025

హైదరాబాద్: తెలంగాణాకు యూరియా అందించడంలో కేంద్రమంత్రులు విఫలం



అసెంబ్లీ సి.ఎల్. పి మీడియా పాయింట్ వద్ద   మాట్లాడుతున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు,  రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపాతి రెడ్డి  

నిత్యం రాజకీయాల గురించి మాట్లాడే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు బిజెపి కేంద్రమంత్రులు మిగతా బిజెపి ఎంపీలు తెలంగాణ కు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం చెందారనీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు.  సోమవారం తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ  మీడియా పాయింట్ వద్ద రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపాతి రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.

ఈ సందర్బంగా  మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు లక్షల 69 వేల మెట్రిక్ టన్ను లోటు ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఉన్నది అంటే దానికి కారణం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఎనిమిది లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరపర చేయవలసి ఉండగా ఇప్పటివరకు స్వదేశీ యూరియా నాలుగు లక్షల 34 వేల టన్నులు, దిగుమతి యూరియా మూడు లక్షల 96 మెట్రిక్ టన్నులు కాగా స్వదేశీ యూరియాలో 327 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈరోజు వరకు సరఫరా అయింది అన్నారు

ఆర్ ఎఫ్ సి ఎల్ లో 145 పని దినాల్లో కేవలం 78 రోజుల్లో ఉత్పత్తి జరగకపోవడంతోనే రాష్ట్రానికి తరపున కావాల్సిన యూరియా ఈరోజు వరకు కూడా సరఫరా కాలేదన్నారు

బయట నుండి రావలసిన యూరియా ఏదైతే ఉన్నాదో యూరియా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం రాష్ట్రానికి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రంలో యూరియా కొడతా రాబోతుందని మీరు ఇప్పటివరకు దిగుమతి చేయవలసిన యూరియా ఇంకా దిగుమతి చేయలేకపోయారని తక్షణమే దిగుమతి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు మాసాల కిందనే జేపీ నడ్డా గారిని కలిసి విన్నవించిన కూడా కేంద్రం ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు

ఇక్కడి యూరియాను ఒక పద్ధతి ప్రకారం గా రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ పెట్టి ఎక్కడ పక్కదారి పట్టకుండా ఏ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే బిఆర్ఎస్ పార్టీ ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందనీ ఆరోపించారు.

హైదరాబాద్: కృష్ణాష్టమి శోభాయాత్ర మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ గోకులే నగర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.అనంతరం గాంధీ ఆసుపత్రి దగ్గర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా,గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం దురదృష్టకరం.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి,మరో 100 మీటర్ల దూరంలో శోభయాత్ర ముగుస్తుందనగా 

ఘటన జరగడం దురదృష్టకరం,కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు.కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశాం .దర్యాప్తు నివేదిక వచ్చాకా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశాం అన్నారు.

మంథని: బహుజనులకు పోరాటస్పూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

 


మాట్లాడుతున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

బహుజన వర్గాలకు పోరాట స్పూర్తి సర్థార్‌ సర్వాయి పాపన్న గౌడ్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు.  నవాబులను ఓడించి తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్బంగా సోమవారం మంథనిలోని సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 375ఏండ్ల క్రితమే సర్థార్‌ సర్వాయిపాపన్న గొప్ప సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. ఆనాడు ఖిలాసాపూర్‌ కేంద్రంగా పోరాటాన్ని ప్రారంభించి గోల్కొండ ఖిలా ఎక్కి రాజుల పరిపాలనను అంతమొందించి ఏడు నెలలు రాజ్యం ఏలాడని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు ఎక్కేటి అనంత రెడ్డి, ఏగోలపు శంకర్ గౌడ్, జంజర్ల శేఖర్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మంథని: ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

 


మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375 వ జయంతి సందర్భంగా  వారి చిత్రపటానికి మంథని మండల కాంగ్రెస్ నాయకులు, గౌడ్ సంగ నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు అయిలి ప్రసాద్, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు మాచిడి రవితేజ గౌడ్, AMC చైర్మన్ కుడుదుల వెంకన్న, PACS చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ మండల అధ్యక్షులు అయిలి శ్రీనివాస్, మాజీ మండల యూత్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, అజీమ్ ఖాన్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ ఆరెల్లి కిరణ్ గౌడ్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఆర్ల నాగరాజు, మాజీ సర్పంచ్ దొరగొర్ల శ్రీనివాస్ యాదవ్, రాజిరెడ్డి, గట్టయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరెల్లి వరుణ్, ఎరుకల సురేష్, పోగుల సాగర్ గౌడ సంఘం నాయకులు టి.రాజు, పూదరి సమ్మయ్య గౌడ్, మాచిడి మోహన్, పోన్నం చంద్రయ్య, మాచిడి సదాశివ్, భీముని రాములు, మాచిడి లింగయ్య, కొండ్ర శ్రీనివాస్, వేగోల్లపు చిన్న శంకర్. తాటి  శ్రీనివాస. ఆరెళ్ళి మల్లయ్య మాచిడి కిష్టయ్య తాళ్లపల్లి సత్యనారాయణ, మాచిడి బాపు, తాటి శ్రీదర్, తాటి శంకర్, మాచిడి బాపు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.*

పెద్దపల్లి: ప్రజావాణిలో యువకుడి ఆత్మహత్యాయత్నం

 


పెద్దపల్లి  కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.  ప్రజావాణి జరుగుతున్న సమయంలో కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన సతీష్ అనే యువకుడు వచ్చి తన తండ్రికి సంబంధించిన ఉద్యోగం ఇస్తానని చెప్పి, ఇవ్వలేదని కలెక్టర్ శ్రీహర్ష సమక్షంలో పురుగుల మందు సేవించేందుకు యత్నించాడు. గమనించిన కలెక్టరేట్ సిబ్బంది సదరు యువకుడిని వారించారు. బాధితుడి తండ్రి కిష్టంపేట ఉన్నత పాఠశాలలో తాత్కాలిక స్వీపర్‌గా పని చేస్తున్న సమయంలో విధి నిర్వహణలో పాము కాటుకు గురై మృతిచెందాడు. దీంతో తన తండ్రి ఉద్యోగం తనకు ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడిని కలెక్టర్ సిబ్బంది 108కు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పెద్దపల్లి: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష

సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో* కలిసి  పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, ముఖ్య అంశాలను అధికారులు వివరించారు. 

ఈ సందర్భంగా  *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోరారు.  వీరోచిత పోరాటానికి, సమానత్వానికి ప్రతీకగా పాపన్న గౌడ్ నిలిచారని అన్నారు.  గోల్కొండ కోట నుంచి ఈ ప్రాంతాన్ని ఆయన పాలించారని, ప్రతి వర్గాన్ని తన పాలనలో కలుపుకొని వెళ్లారని అన్నారు.

ఔరంగ జేబ్  ప్రపంచంలో మంచి కీర్తి సంపాదిస్తున్న సమయంలో ఒక  సామాన్య వ్యక్తి నుంచి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలన చేసే స్థాయికి పాపన్న గౌడ్ ఎదిగారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం పాపన్న గౌడ్ పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసి అభివృద్ధి అధికారి రంగా రెడ్డి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఎం.అంజయ్య గౌడ్,  మాజీ ఎం పి పి గోపగాని సారయ్య గౌడ్, గౌడ సంఘాల నాయకులు బాలసాని వెంకటేశం గౌడ్, జాగిరి అంజి గౌడ్, పడాల సతీష్ గౌడ్, మూల మల్లేశం గౌడ్,బొబ్బిలి రాజమౌళి గౌడ్, కొండ సుజాత గౌడ్, బీసీ నాయకులు తాడూ రి శ్రీమాన్,  నరేంద్ర, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..

పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి

అర్జీలను స్వీకరిస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సంబంధిత  అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

* పెద్దపల్లి మండలం జీలకుంట గ్రామానికి చెందిన స్వరూప భారీ వర్షాలకు తన ఇండ్లు కూలిపోయిందని, తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు 

* పెద్దపల్లి మండలం రాఘవ పూర్ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త బొబ్బిలి సత్యనారాయణ  పెద్ద బొంకూరు గ్రామంలో సర్వే నెంబర్ 534 లో 6 ఎకరాల భూమి ఎల్.ఆర్.ఎస్ అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా ఓపెన్ ప్లాట్లు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

* ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గోనెల రవి, ఎన్.లక్ష్మీ, ఓదెలు , రాజమల్లు గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి 59వ సర్వే నెంబర్ లో  భూమి గత 40 సంవత్సరాలుగా పూర్వీకుల నుండి   సాగు చేసుకుంటున్నారని, ఆ భూమి ప్రస్తుతం తన కబ్జాలో ఉందని, తనకు ఎటువంటి పట్టా లేదని మోకా పై సర్వే చేయించి పట్టాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా  తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో  సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

శనివారం, ఆగస్టు 16, 2025

మంచిర్యాల: వరద ప్రభావిత పరిస్థితులను పరిశీలించిన డిసిపి

 



స్థానిక పోలీస్ అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ సందర్శించారు. రాళ్లవాగు, మంచిర్యాల, లక్సెట్టిపేట్ పరిధిలోనీ గ్రామాలు గంపలపల్లి, కొమ్ముగూడెం, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలు మరియు ప్రధాన రహదారులను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. డీసీపీ మాట్లాడుతూ  ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాము అన్నారు.  వర్షాల ప్రభావం, వరద పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు  అవగాహన కల్పిస్తున్నాము అని తెలిపారు. అలాగే వివిధ గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కల్వర్ట్లు, బ్రిడ్జిలు నీటిమునిగే ప్రమాదం ఉన్నందున, వరద నీటి ఉధృతిని అంచనా వేయకుండా నదులు, వాగులు, కాలువలు, కుంటలు దాటే ప్రయత్నం చేయకూడదు అన్నారు .వర్షాల కారణంగా ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లకుండా, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అత్యవసర సహాయం కోసం ప్రజలు 100 నంబర్‌కు కాల్ చేయవచ్చు అన్నారు.  డిసిపి వెంట మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, లక్షేట్టి పేట్ సిఐ రమణమూర్తి , ఎస్ఐ సురేశ్ పాల్గొన్నారు.

గోదావరిఖని: ఆర్ ఎఫ్ సిఎల్ అధికారుల పై ఎమ్మెల్యే ఆగ్రహం




*రైతులకు యూరియా కొరత సృష్టించేందుకు కేంద్రం కుట్రలు

*అణుబాంబుల క్రింద బ్రతుకుతున్నాం 

 *తెలంగాణ కు 50 శాతం యూరియా ఇవ్వవలసిందే

*ఆర్ఎఫ్ సిఎల్ లో జరుగుతున్న అక్రమాల పై సిబిఐకి ఫిర్యాదు చేస్తా   

*రసాయనాల శాఖమంత్రిని కలిసి సమస్యల పై విన్నపిస్తా                                           

                                          

 రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ శనివారం ఎస్ సి ఎల్ లో సందర్శించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మరియు రాష్ట్రానికి రావలసిన యూరియా వాటా గురించి ప్రస్తావిస్తూ పలు అంశాలతో కూడిన మెమోరండం ను సంబంధిత మంత్రిత్వ శాఖ కు అధికారుల ద్వారా ఇవ్వడం జరిగింది ఈ పత్రంలోని ముఖ్య విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి



1 ,Rfcl ప్లాంట్ 2021 లో ప్రారంభం అయినప్పటినుంది అమ్మోనియా పైప్ లైన్ లికేజ్ వలన ఉత్పత్తి ఆగిపోయినది

 

2, పైప్ లైన్ నిర్మాణం నాసిరకంగా జరిగినది దీనివలన అమ్మోనియా లీక్ అయి ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది 

ఈ పైప్ లైన్ నిర్మాణంపై సీబీఐ తో గాని ఎక్సపర్ట్ కమిటీతో విచారణ చేపట్టాలి


3, ఈ పైప్ లైన్ నిర్మించిన కంపెనీ EIL నుండి పెనాల్టీ వసూల్ చేయాలి

 సీన్స్ట్రేక్షన్ మరియు ఎరక్షన్ ప్రాబ్లేమ్ ను వెంటనే సరి చేయాలి

4, తెలంగాణాకు యూరియా కొరత లేకుండా  చూసేందుకుగా యూ url కండిషల్ గాను రాష్ట్ర ప్రభుత్వం 11శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది


5,   50 శాతం యూరియా తెలంగాణా కు ఇస్తామని ప్లంట్ నిర్మాణం సమయంలో హామీ ఇవ్వడం జరిగింది కానీ అమలు జరగడం లేదు


6 'గత ఏడాది కంటే ఈ సంవత్సరం సాగు పెరిగింది అదనంగా యూరియా సప్లై చేయాలసింది పోయి తెలంగాణాకు ఇవ్వవల్సిన యూరియా కోటాలో లక్ష టన్నుల యూరియా తగ్గించారు


మే,జూన్,జులై,కోటాలో సగం కూడా ఇవ్వలేదు


ఆగస్ట్ లో 65 వేల టన్నులకు గాను 20 వేల టన్నులే ఇచ్చారు

ఇప్పుడు మల్లి ఫ్యాక్టరీ షట్ డౌన్ అయింది


 జీరో లెవెల్ డిశ్చర్జ్  ప్లాంట్ ను ఉత్పత్తి కి ముందే నిర్మించాలి కానీ 4సంవత్సరాలు గా టెండర్ కాల్ ఫార్ చేసి  వాళ్లకు సంబంధించిన  కాంట్రాక్టర్  రాకపోవడం తో వాయిదా వేయడం రామగుండం ప్రజలు కాలుష్యంతో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వెంటనే ZDL ప్లా0ట్ నిర్మాణం చేపట్టాలి.ప్రాజెక్టు నిర్మాణ లోపాలతో వరుసగా షాట్ డౌన్ అవుతుంది దీనివలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు  దీనికి కారణం నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది దీనికి కారణం ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్ ఇక్కడ లేకపోవడమే కాబట్టి వెంటనే నోయిడా నుండి కేంద్ర కార్యాలయాన్ని రామగుండానికి తరలించాలి. పై విషయాలను  విషయాలపై స్పందించి ఫ్యాక్టరీ యజమానులు మరియు కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని రైతులకు సకాలంలో యూరియా అందించాలి  అదేవిధంగా ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని పలు సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేయడం చేశారు, వీర్లపల్లి గ్రామాన్ని ఆర్ అండ్ ఆర్ కింద ఇతర ప్రాంతాలకు తరలించి వారిని ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.  లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడతారని విచారించారు  ఈ కార్యక్రమంలో ఆర్ ఎఫ్ సి ఎల్ అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు గ్రామ నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నా

శుక్రవారం, ఆగస్టు 15, 2025

పెద్దపల్లి: వెలుగు కాంతుల్లో పెద్దపల్లి పట్టణం

 



 పట్టణ సుందరీకరణకు ప్రజలందరూ సహకరించాలి..

*పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు 

పెద్దపల్లి పట్టణంలో కునారం రోడ్ మరియు కమాన్ రోడ్డు వద్ద టి.యూ.ఎఫ్.ఐ.డి.సి నిధులు ₹44.00 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్ మరియు ఎల్ఈడి స్ట్రిప్ లైట్స్ ని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ గారు మరియు స్థానిక నాయకులతో  కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని అందుకు నిదర్శనం ఇటీవల చాకలి ఐలమ్మ విగ్రహం  నుండి జండా చౌరస్తా వరకు, పెద్దమజీద్ నుండి అమర్ నగర్ వరకు, దేవిడి కోట నుండి చాకలి ఐలమ్మ వరకు బీటీ రోడ్లను వెయ్యడం జరిగింది అని అలాగే చీకురాయి రోడ్, పెద్దమ్మ నగర్, చందపల్లి వైపు డివైడర్లను ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది అని వాటికి కూడ త్వరలోనే దసరా వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని జెండా చౌరస్తా కూడలి కూడ 50 లక్షల రూపాయలతో అద్భుతంగా హైలాండ్ లాగ త్వరలోనే అభివృద్ధి చేయడం6 జరుగుతుందని త్వరలోనే జండా చౌరస్తా నుండి మజీద్ వరకు వ్యాపారస్తులతో మాట్లాడి వారి అభిప్రాయం ఆలోచన మేరకు ఒక కోటి ఐబై లక్షల రూపాయలతో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేయబోతున్నమని పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ పరిసరాల్లో ఇండోర్ గేమ్స్ కొరకు కూడ ఆలోచన చెయ్యడం జరుగుతుంది అని పెద్దపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనులకు గౌరవ మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన చేసినప్పటికీ వర్షాకాలం దృష్ట్యా పనులు మొదలు కాలేదని వర్షాకాలం అయిపోగానే పనులు మొదలు పెట్టడం జరుగుతుందని అన్నారు పెద్దపల్లి బస్ డిపో నిర్మాణం కూడ టెండర్ పూర్తి చేసుకోవడం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పిల్లర్ల నిర్మాణం పూర్తి కావచయని పెద్దపల్లి పట్టణంలో కులాల వారిగా స్మశానవాటికలు ఉన్నప్పటికీ అందరికీ ఉపయోగపడేలా స్మశాన వాటిక లేకపోవడంతో గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందని త్వరలోనే అన్ని కులాలకు ఉపయోగపడేలా ఐదు కోట్ల రూపాయలతో మోడ్రన్ హిందు స్మశాన వాటిక త్వరలో అందుబాటులో తీసుకొస్తామని గడిచిన 18 నెలల కాలంలో 35 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్న మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అధికారులకు పట్టణ ప్రజలకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఏఈ సతీష్, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్: స్వాతంత్ర్య వేడుకల వీడియో 2

 



కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 

కరీంనగర్: స్వాతంత్ర్య వేడుకల వీడియో

 కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హాజరయ్యారు.

పోలీసు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించారు.


కరీంనగర్: స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హాజరయ్యారు.
పోలీసు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమర యోధులను సత్కరించారు.











మంథని: జెండా వందనం చేసిన దుద్దిల్ల శ్రీను బాబు


మంథని పోలీస్ స్టేషన్ సమీపంలోని కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె వద్ద, మంథని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మరియు మంథని పట్టణములో టాటా ఏసీ ఆటో యూనియన్ ఆద్వర్యంలో,మరియు ఫ్రెండ్స్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గణంగా నిర్వహించ్చారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వాతంత్ర్య సంగ్రామ వీరులను స్మరించుకుంటూ, దేశ భక్తి భావనతో ప్రతి పౌరుడు దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం  దుదిల్ల శ్రీను బాబు విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసినారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, పట్టణ అధ్యక్షుడు పోలు శివ, మంథని మాజీ ఎంపీపీ కొండా శంకర్,మంథని మాజీ సర్పంచ్ బొడ్నాల శ్రీనివాస్,ఎఏంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంతిని సత్యం, గోటికారి కిషన్ జి,స్థానిక కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కాటారం: ఉచిత కంటి అద్దాలు పంపీణి చేసిన TPCC ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సౌజన్యంతో, పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇటీవల  నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ లో కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి గారేపల్లి గ్రామంలో ఈ రోజు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. 

ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న వందలాది మంది రోగులు ఈ సేవా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు.

ఈ కార్యక్రమానికి *TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు* ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు చేరువ చేయడం, ముఖ్యంగా కంటి వెలుగు కోల్పోయే పరిస్థితులను నివారించడం కోసం ఇలాంటి వైద్య శిబిరాలు, ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాలు ఎంతో అవసరం” అని పేర్కొన్నారు.

అలాగే, కంటి శస్త్రచికిత్సల తరువాత సక్రమమైన కంటి సంరక్షణ అవసరాన్ని వివరించి, పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య బృందం చేస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రజలు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, వైద్యులకు మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గురువారం, ఆగస్టు 14, 2025

మంథని: పాలకవర్గం గడువు పొడగింపుపై హర్షం



మంథనిలో సిఎం, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం

ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాల పదవి కాలం మరో ఆరు నెలలు పొడగించి మాపై ఎంతో బాధ్యతను పెట్టిందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. సహకార సంఘాల పదవి కాలం మరో ఆరు నెలలు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉతర్వులు జారి చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం మంథని సహకార సంఘం పాలవర్గ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ల చిత్ర పటాలకు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సంఘ పాలకవర్గ సభ్యులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లడుతూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సంఘ వ్యాపారాన్ని ద్విగ్విజయంగా సాగిస్తూ సభ్యులు, రైతుల అవసరాలను తీర్చడం జరిగిందని అన్నారు. గ్రామగ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులను దళారుల భారి నుంచి కాపాడటం తో పాటు ధాన్యం లో ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరను అందిచడం తో పాటు సన్న వడ్ల కు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందిచామని తెలిపారు. అంతే కాకుండా రైతుల కు రూ.2లక్షల రుణ మాఫీ చేశామన్నారు.  రైతులకు ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయిస్తున్నామని తెలిపారు. అంతేగాకుండా సంఘ సభ్యుల వ్యవసాయ పెట్టుబడుల అవసరాలను తీర్చేందుకు సకాలంలో సభ్యులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను అందజేసి వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నామని తెలిపారు. సంఘ పరిధిలోని నాగారం గ్రామ శివారు, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు ప్రక్కనే 3ఎకరాల 20గుంటల భూమిని కొనుగోలు చేసి రైస్ మిల్లు నిర్మాణానికి తగు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. అలాగే గుంజపడుగు గ్రామా శివారులోని 4 ఎకరాల ప్రభుత్వ్హ స్థలoలో పిఎం కుసుమ్ ద్వారా రూ.3.50 కోట్లతో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లు పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్నామని అన్నారు. ఈ సోలార్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి రూ.50 లక్షల ఆదాయం సంఘానికి సమకూరుతుందని అన్నారు. మరో ఆరు నెలల పదవీ కాలాన్ని పెంచి మాపై ఎంతో బాధ్యతను పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, టిజిక్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావులకు ఈ సందర్భంగా మా సంఘ పాలకవర్గం, రైతుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఇన్ని రోజులు సంఘం అభివృద్ధికి సహకరించిన సభ్యులు, రైతులు, అధికారులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ డైరెక్టర్లు పెద్దిరాజు ప్రభాకర్, సిరిముర్తి ఓదెలు, గడ్డం పోచం, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మీ-మొండయ్య, ఉడుత మాధవి- పర్వతాలు యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: స్వాతంత్ర్య వేడుకలను వైభవంగా నిర్వహించాలి

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కోయ శ్రీ హర్ష


స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ప్రాంగణంలో చేస్తున్న స్వాతంత్ర  దినోత్సవ వేడుకలు ఏర్పాట్లను  అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ వేడుకలకు  తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మహమ్మద్ ఒబేదుల్లా కోత్వాల్  సాహెబ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని, ఉదయం 9.25 గంటలకు ముఖ్య అతిథి కలెక్టరేట్ కు చేరుకుంటారని, ఉదయం 9.30 గంటలకు  జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలపన కార్యక్రమాలు ఉంటాయని  అన్నారు . 

ఉదయం 9.33 నుంచి 9.45  వరకు గౌరవ వందల స్వీకారం,  పరేడ్  ఉంటుందని, అనంతరం ముఖ్య అతిథి తన సందేశం అందిస్తారని కలెక్టర్ తెలిపారు.  అనంతరం ఉద్యోగస్తులకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందిగా పూర్తి చేయాలని,  సౌండ్ సిస్టం, విద్యుత్ సరఫరా, డయాస్, టెంట్ , బ్యారికేడ్లు వంటి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు.  

ఈ  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట  పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

బుధవారం, ఆగస్టు 13, 2025

మంథని: హర్ ఘర్ తిరంగా ర్యాలీ


 మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సబ్బాని సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం హర్గర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి,రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి,కొండపాక సత్య ప్రకాష్ పాల్గొన్నారు. ,"ఆజాధికా అమృత్ మహోత్సవ్"లో భాగంగా మంథని పురవీధుల గుండా సాగిన ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీ లో భారీ ఎత్తున వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు మంథని పురవాసులు,వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటి పైన మువ్వన్నెల త్రివర్ణ పతాకం ఎగరాలి,ప్రతి మనిషి గుండెల్లో దేశభక్తి పొంగిపొర్లాలి అంటూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ప్రపంచ స్థాయిలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా మార్చడానికి ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులనే వాడాలి అంటూ పిలుపునిచ్చారు. దానికి మనందరం కట్టుబడి ప్రయత్నం చేయాలని,దేశ ప్రయోజనాల కోసం పార్టీలు పక్కన పెట్టి అందరం ఏకధాటిపైకి వచ్చి ఒకే మాటగా ముందుకు సాగాలని పిలుపునిస్తూ ఆపరేషన్ సింధూర్ తో మన దేశ సత్తా ప్రపంచాన్ని నివ్వరపరిచిందని,దేశ ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించే భారత సైన్యానికి ప్రతి భారతీయుడు వెన్నుదన్నుగా ఉండాలని, ఈనాటి బాలలే రేపటి పౌరులు ఆ పౌరులే రేపటి ఈ దేశ బలమైన దేశభక్తి కలిగిన పునాదిరాళ్లుగా మారాలని... బాల్యం నుంచే పిల్లల్లో దేశభక్తి , పోరాటపటిమ ,బలమైన ఆశయాలు నెరవేర్చుకునే ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని విద్యాసంస్థలకు వినమ్ర సూచన చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అవడంలో సహకరించిన విద్యాసంస్థలకు,మంథని పట్టణ వాసులకు వివిధ పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్, రాజమౌళి గౌడ్, సీనియర్ నాయకులు చిలువేరి సతీష్,పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, ఎడ్ల సాగర్,పట్టణ కార్యదర్శి వేల్పుల సత్యం,నాయకులు ఈసంపల్లి కొమరయ్య, మండల నాయకులు బూడిద విష్ణు, బొల్లంపల్లి లక్ష్మణ్, తోటపల్లి మహేష్,సదానందం పాల్గొన్నారు.



FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026