రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సౌజన్యంతో, పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ లో కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి గారేపల్లి గ్రామంలో ఈ రోజు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న వందలాది మంది రోగులు ఈ సేవా కార్యక్రమం ద్వారా లబ్ధి పొందారు.
ఈ కార్యక్రమానికి *TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు* ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా కంటి అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు చేరువ చేయడం, ముఖ్యంగా కంటి వెలుగు కోల్పోయే పరిస్థితులను నివారించడం కోసం ఇలాంటి వైద్య శిబిరాలు, ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాలు ఎంతో అవసరం” అని పేర్కొన్నారు.
అలాగే, కంటి శస్త్రచికిత్సల తరువాత సక్రమమైన కంటి సంరక్షణ అవసరాన్ని వివరించి, పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్య బృందం చేస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రజలు ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, వైద్యులకు మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి