ఉప్పల్ పీఎస్ పరిధిలోని రామంతపూర్ గోకులే నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యులను గాంధీ ఆసుపత్రిలో పరామర్శించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.అనంతరం గాంధీ ఆసుపత్రి దగ్గర మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా,గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం దురదృష్టకరం.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి,మరో 100 మీటర్ల దూరంలో శోభయాత్ర ముగుస్తుందనగా
ఘటన జరగడం దురదృష్టకరం,కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు.కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశాం .దర్యాప్తు నివేదిక వచ్చాకా బాధ్యులపై చర్యలు తీసుకుంటాము.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశాం అన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి