సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో* కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర, ముఖ్య అంశాలను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు పాటుపడాలని జిల్లా కలెక్టర్ కోరారు. వీరోచిత పోరాటానికి, సమానత్వానికి ప్రతీకగా పాపన్న గౌడ్ నిలిచారని అన్నారు. గోల్కొండ కోట నుంచి ఈ ప్రాంతాన్ని ఆయన పాలించారని, ప్రతి వర్గాన్ని తన పాలనలో కలుపుకొని వెళ్లారని అన్నారు.
ఔరంగ జేబ్ ప్రపంచంలో మంచి కీర్తి సంపాదిస్తున్న సమయంలో ఒక సామాన్య వ్యక్తి నుంచి గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని పరిపాలన చేసే స్థాయికి పాపన్న గౌడ్ ఎదిగారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం పాపన్న గౌడ్ పోరాటాలను గుర్తు చేసుకుంటూ ఆయన జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసి అభివృద్ధి అధికారి రంగా రెడ్డి, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు ఎం.అంజయ్య గౌడ్, మాజీ ఎం పి పి గోపగాని సారయ్య గౌడ్, గౌడ సంఘాల నాయకులు బాలసాని వెంకటేశం గౌడ్, జాగిరి అంజి గౌడ్, పడాల సతీష్ గౌడ్, మూల మల్లేశం గౌడ్,బొబ్బిలి రాజమౌళి గౌడ్, కొండ సుజాత గౌడ్, బీసీ నాయకులు తాడూ రి శ్రీమాన్, నరేంద్ర, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి