అసెంబ్లీ సి.ఎల్. పి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపాతి రెడ్డి
నిత్యం రాజకీయాల గురించి మాట్లాడే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు బిజెపి కేంద్రమంత్రులు మిగతా బిజెపి ఎంపీలు తెలంగాణ కు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం చెందారనీ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అన్నారు. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపాతి రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు లక్షల 69 వేల మెట్రిక్ టన్ను లోటు ఈరోజు వరకు తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఉన్నది అంటే దానికి కారణం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఎనిమిది లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరపర చేయవలసి ఉండగా ఇప్పటివరకు స్వదేశీ యూరియా నాలుగు లక్షల 34 వేల టన్నులు, దిగుమతి యూరియా మూడు లక్షల 96 మెట్రిక్ టన్నులు కాగా స్వదేశీ యూరియాలో 327 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి రెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈరోజు వరకు సరఫరా అయింది అన్నారు
ఆర్ ఎఫ్ సి ఎల్ లో 145 పని దినాల్లో కేవలం 78 రోజుల్లో ఉత్పత్తి జరగకపోవడంతోనే రాష్ట్రానికి తరపున కావాల్సిన యూరియా ఈరోజు వరకు కూడా సరఫరా కాలేదన్నారు
బయట నుండి రావలసిన యూరియా ఏదైతే ఉన్నాదో యూరియా రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం రాష్ట్రానికి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది ఎంపీలు కేంద్రమంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్రంలో యూరియా కొడతా రాబోతుందని మీరు ఇప్పటివరకు దిగుమతి చేయవలసిన యూరియా ఇంకా దిగుమతి చేయలేకపోయారని తక్షణమే దిగుమతి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు మాసాల కిందనే జేపీ నడ్డా గారిని కలిసి విన్నవించిన కూడా కేంద్రం ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు
ఇక్కడి యూరియాను ఒక పద్ధతి ప్రకారం గా రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ పెట్టి ఎక్కడ పక్కదారి పట్టకుండా ఏ రైతులకు కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే బిఆర్ఎస్ పార్టీ ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందనీ ఆరోపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి