Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

బుధవారం, అక్టోబర్ 01, 2025

మంథని : దుర్గామాత మండపాల్లో మంత్రి శ్రీధర్ బాబు పూజలు

 తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కమాన్ పూర్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం భక్తిశ్రద్ధలతో పలు దుర్గామాత మండపాలను సందర్శించారు.bకమాన్ పూర్ పట్టణంలోని కిష్టం పల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవిని, సుభాష్ నగర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవిని,చత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గాదేవిని, వేణుగోపాల స్వామి దేవాలయంలో  అమ్మవారిని ,జూలపల్లి ఆదర్శ నగర్ లో దుర్గావేవినీ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాను. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం నా ధర్మం” అని పేర్కొన్నారు.తరువాత యూత్ సబ్యులు మంత్రి శ్రీధర్ బాబు ని శాలువాతో సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు .













పెద్దపల్లి: ఎం.సి.హెచ్ లో రికార్డు స్థాయిలో ప్రసవాలు

మంచి వైద్య సేవలు అందిస్తున్న బృందానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్న కలెక్టర్

 సెప్టెంబర్ నెలలో పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ఎం.సి.హెచ్  ఆసుపత్రిలో  రికార్డు స్థాయిలో 250 ప్రసవాలు జరిగాయని, దీనికి కృషి చేసిన అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 

గతంలో ఎన్నడు సాధించని విధంగా సెప్టెంబర్ నెల జిల్లా లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల యందు కలుపుకొని 503 ప్రసూతులు  నిర్వహించినందుకు గాను జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, సంబంధిత డాక్టర్లను, సిబ్బందిని  క్షేత్రస్థాయి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.


*జిల్లా ఆసుపత్రి లో గతంలో డెలివరీ లు సరాసరి 130 ఉండగా సెప్టెంబర్ నెలలో అత్యధికంగా అల్ టైం రికార్డు స్థాయిలో 250 డెలివరీ లు జరీగాయని*,  ఈ సంవత్సరము లోనే ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రం ద్వారా 68 మంది నవ జాత శిశువు లకు చికిత్స అందించడం జరిగిందని అన్నారు. 


గతంలో సరాసరి ఒపీ నెలకీ 12,500 ఉండగా గత సంవత్సర కాలంలో క్రమంగా పెరిగి ఈ నెల 26,730 కు చేరుకుందని , దీనిలో అధికంగా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడీయాట్రిక్స్, గైనాకలజీ, కంటికి సంబందించిన ఒపీ, చెవి ముక్కు గొంతు, డెంటల్ మరియు స్కిన్ ఒపీ లు రెట్టింపు  కొన్ని విభాగలలో మూడు రేట్లు పెరిగాయని అన్నారు. 


గతంలో ఇన్ పేషెంట్ ఒక నెలకు సరాసరి 1100 ఉండగా ఈ సెప్టెంబర్ 2025 నెలలో 2300 మంది ఇన్ పేషెంట్ సర్వీస్ పొందారని, గతంలో ఆర్థోపెడిక్ సర్జరీలు సరాసరి నెలకు 9 మేజర్ 10 మైనర్ ఉండగా ఈ నెల 34 మేజర్ 27 మైనర్ శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగింది. జనరల్ సర్జరీ గతంలో మేజర్ మరియు మైనర్ కలిపి 20 కాగా ఈ నెల 45 నిర్వహించారు. గతంలో కంటి శస్త్ర చికిత్సలు పెద్దపల్లి లో ఆపరేషన్ థియేటర్ లేనందున మన కంటి వైద్యులు పెద్దపల్లి జిల్లా పేషెంట్ లను కరీంనగర్ ఆసుపత్రి లో సర్జరీ చేసేవారు. ఈ సంఖ్య నెలకు 20 ఉండగా, నూతనంగా ఏర్పాటు చేసిన కంటి ఆపరేషన్ థియేటర్ వల్ల సెప్టెంబర్ 2025 గాను 229 కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. 


గతంలో ఈ.ఎన్.టి, డెంటల్ సర్జరీ లు నిర్వహించే వాళ్ళు కాదని, గత నెల 15 ఈ.ఎన్.టి  ప్రొసీజర్స్ మరియు 529 డెంటల్ ప్రొసీజర్స్ నిర్వహించారని, గతంలో రక్త పరీక్షలు నెలకు 15 వేలు సరాసరి చేసేవారని, నేడు ఆ సంఖ్య 31 వేలకు పెరిగిందని,  గతంలో స్కానింగ్ సేవలు సరాసరి నెలకు 800 ఉండగా ఈ నెల 1960 స్కానింగ్ సేవలు చేశారు.


 గతంలో టిఫ్ఫా స్కానింగులు , 2 డి ఎకో సేవలు జరిగేవి కావని, నేడు  సెప్టెంబర్ నెలలో 123 టిఫ్ఫా స్కానింగ్ లు, 164 2డి ఎకో లు చేయడం జరిగిందని అన్నారు . గతంలో ఫిజియోథెరపీ సేవలు నెలకు 120 కాగా గత నెల 678 మందికి ఫిజియోథెరపీ సేవలు  చేయడం జరిగింది.


జిల్లాలో 5148 గర్భిణీ స్త్రీలను నమోదు చేయగా, అందులో 4,581 గర్భిణీలను మూడు నెలల లోపే నమోదు చేశారు. వీరందరికీ 100 శాతం , నాలుగు గర్భిణీ పరీక్షలను  ప్రభుత్వ ఆసుపత్రుల యందు నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వాస్త్ కార్యక్రమంలో 99882 విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సమగ్ర టీబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమములో 72,495 మందికి ఛాతి ఎక్స్ రే లు నిర్వహించారు. ఇందులో 1097 టి.బి. వ్యాధి గ్రస్తుల గుర్తించి చికిత్స అందించు చున్నారు. ఎన్. సి. డి. స్క్రీనింగ్ 416530 మందికి 95% గా స్క్రీనింగ్ నిర్వహించారు.  స్వస్థ్ నారి సశక్త్ పరివార అభియాన్ కార్యక్రమములో 104 శిబిరంలో నిర్వహించి 7634 మహిళలకు స్పెషలిస్ట్ డాక్టర్ ల చే పరీక్షలు నిర్వహించడం జరిగింది. అదనముగా 27210 మంది మహిళలకు ఆయుష్మాన్ మరియు బస్తీ దవాఖాన ల ద్వారా పరీక్షలు నిర్వహించడం జరిగింది అని అన్నారు.

మంథని: దేవి భాగవతం అత్యంత మహిమాన్వితం

ప్రవర్తిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త పాలెపు చంద్రశేఖర శాస్త్రి

విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ దేవీ నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్న ప్రజలు

విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంథని గాంధీ చౌక్ లోని మండపంలో ప్రవచన కర్త వేదమూర్తులైనటువంటి ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మ శ్రీ పాలెపు చంద్రశేఖర శాస్త్రి పాల్గొని ప్రవచనం అందించారు. ఈ కార్యక్రమంలో  విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ ,సహ కార్యదర్శి నామని నాగేష్, ప్రచార ప్రముఖ్ తూర్పాటి రాము, మఠ్ మందిర్ ప్రముఖ్ కొమురవెల్లి హరీష్ , ధర్మజాగరణ ప్రముఖ్ కనుకుంట్ల స్వామి , సత్సంగ్ ప్రముఖ్ మెడగొని రాజమౌళి,అవధాని మోహన్ శర్మ ,భజరంగ్ దళ్ మంథని ప్రఖండ ప్రముఖ్ నరేడ్ల రాజేష్, సహా ప్రముఖ్ బోగే సందీప్, జంబోజు సాయి, లోకే రాధా కిషన్ ,ఒల్లాల అశోక్, రాచకొండ నరేష్, అధిక సంఖ్యలో భక్తులు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దపల్లి: స్ట్రాంగ్ రూం లను పరిశీలించిన కలెక్టర్

బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పెద్దపెల్లి జిల్లాలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల, రామగిరి లోని జేఎన్టీయూ మంథని ఇంజనీరింగ్ కళాశాల, గోదావరిఖనిలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలను స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు నిమిత్తం స్థానిక సంస్థల *అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ, డి.సి.పి కరుణాకర్* లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో  పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని 6 మండలాలు , రామగిరి మండలంలోని జేఎన్టియు కళాశాలలో   మంథని నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలు, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ మరియు పి.జి (గోదావరిఖని) కళాశాలలో పాలకుర్తి, అంతర్గం, ధర్మారం, మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.

స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, కౌంటింగ్ నిర్వహణ సంసిద్దత ను కలెక్టర్ పరిశీలించారు. మంథని, గోదావరిఖని నియోజకవర్గం సంబంధించి 7 మండలాలకు  స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 23న, పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు పోలింగ్ అక్టోబర్ 27న జరుగుతుందని అన్నారు.

ఈ పర్యటనలో  జడ్పీ సీఈవో నరేందర్, ఆర్డీవో లు గంగయ్య, సురేష్, తాహసిల్దారులు, ఎంపీడీవోలు, పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







మంథని: దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు



దుర్గామాత అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు అందరిపై ఉండాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ వేడుకున్నారు. దేవి శరన్నవరాత్రోత్సవాల్లో బాగంగా బుధవారం మంథని పట్టణంలోని హనుమాన్ నగర్ లో  ప్రతిష్టించిన దుర్గామాతను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్–శైలజ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు అమ్మవారి దీవెనలతో సంతోషంగా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్–శైలజ దంపతుల ను సన్మానించారు .

మంథని: సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసన



మంథని : మంథనిలోని ప్రభుత్వ హాస్పటల్, మాత శిశు కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు గత ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం  మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.అనంతరం మంత్రి పిఏ ఆకుల చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని కార్మికులకు 6 నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారని అన్నారు. బతుకమ్మ పండగ పూట మహిళా కార్మికులు పస్తులతో బతుకమ్మలను ఆడుకున్నారని కనీసం దసరా పండగలను దృష్టిలో ఉంచుకోనైనా కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా కార్మిక కుటుంబాలను పస్తులుంచిన కాంట్రాక్టర్ పై మండిపడ్డారు. అదేవిధంగా సబ్ కాంట్రాక్టర్ కార్మికులను బలవంతంగా విధుల నుండి తొలగిస్తున్నారని,వేతనాలు అడిగిన కార్మికుల పట్ల బెదిరింపులకు పాల్పడుతూ అక్రమంగా తొలగిస్తున్నారని, కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వకుండా జీతంలో సగం కోత విధిస్తున్నారని విమర్శించారు. కార్మికులకు ఈరోజే వేతనాలు ఎకౌంట్లో పడాలని అప్పటిదాకా ఇక్కడి నుండి వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. స్పందించిన పిఏ మంత్రి తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలియజేయగా మంత్రి వెంటనే స్పందించి పెద్దపల్లి డిసిహెచ్ తో మాట్లాడి ఈ రోజే కార్మికుల ఎకౌంట్లో వేతనాలు వేయాలని వేతనాలు అందించడంలో నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గొర్రెంకల సురేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మంథని లింగయ్య, కార్మికులు శ్రావణ్,భరత్,చంద్రయ్య రామా దేవి,పూర్ణిమ,ఓదక్క తదితర కార్మికులు పాల్గొన్నారు.

మంగళవారం, సెప్టెంబర్ 30, 2025

పెద్దపల్లి: పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష*

* స్థానిక సంస్థల ఎన్నికల పై పత్రిక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, ఎంపిటిసి, జడ్పిటిసి) ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష  తెలిపారు. 

మంగళవారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై పత్రికా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  *జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పిటిసి స్థానిక సంస్థలను రెండు విడతలలో మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసిందని , అదే ప్రకారం పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు.   జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎం.సి.సి కోడ్ అమలు కావడం జరుగుతుందని అన్నారు.


పెద్దపల్లి జిల్లాలో  మొత్తం 13 మండలాల్లో 263 గ్రామ పంచాయతీలు, 2432 వార్డులు,   జిల్లా వ్యాప్తంగా 2432 గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు, 273 పోలింగ్ లోకేషన్స్ ఏర్పాటు చేశారని తెలిపారు.

ఓటర్ల వివరాల ప్రకారం పురుషులు 198728, మహిళలు 205439, ఇతరులు 14 మంది కలిపి మొత్తం 404181 మందికి ఓటు ఇవ్వడానికి అవకాశం ఉందని,   ప్రతి విడతలో మండల వారీగా గ్రూప్ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా నామినేషన్, పరిశీలన, పోలింగ్ తేదీలు నిర్ణయించామని అన్నారు. 

  స్థానిక సంస్థ ఎన్నికలకు సరిపడా ఏర్పాట్లు, ఇంచార్జి నియామకాలు, బ్యాలట్ బాక్స్‌లు, పోలింగ్ బూత్‌లు, పార్టీ ప్రతినిధులతో సంప్రదింపులు, షెడ్యూల్ వివరాల అనుసరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో పాటు స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నియమాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సన్నద్ధంగా ఉందని అన్నారు

పౌలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారని, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయిస్తామని అన్నారు. 

మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నామినేషన్ల స్క్రూటినీ , ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పై  సిబ్బందికి శిక్షణ అందిస్తామని తెలిపారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనల, విధుల పై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు. 

పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్లు అన్నారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఒక నోడల్ అధికారి నియమించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రి -పోల్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనంతరం పాత్రికేయులకు ఉన్న వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశములో నరేందర్, సీఈఓ జడ్పీ మరియు వీర బుచ్చయ్య, DPO పాల్గొన్నారు.

సోమవారం, సెప్టెంబర్ 29, 2025

హన్మకొండ: ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురం

వీడియో కోసం కింది లింక్ క్లిక్ చేయండి

 https://youtube.com/shorts/GVeu8QW1VQY?si=RftPHY0DFT4XvMQS

హన్మకొండ పద్మాక్షి ఆలయం వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు సోమవారం కనుల పండువగా జరిగాయి. పూల సింగిడితో మహిళలు ఒక ప్రవాహంలా పద్మాక్షి ఆలయ సమీపంలోని మైదానానికి చేరుకొని బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆట ఆడుతూ ఆనందోత్సాహాలు వెలిబుచ్చారు. కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాల మధ్య అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు, యువతులు ఆట, పాటతో సందడి చేశారు. అంతరం పద్మాక్షి కొలనులో నిమజ్జనం చేసి, గౌరమ్మను సాగనంపారు. అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటూ మురిసిపోయారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండాల పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. దొంగతనాలు జరుగకుండా గట్టి నిఘా ఏపాటు చేశారు.















మంథని: అలరించిన ఆబాల గోపాల కాలువలు

వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి

https://youtube.com/shorts/9m8vxWUdt1U?si=CUyoir6yV96Wcdni

https://youtube.com/shorts/ELs6JHTfp_o?si=uXLSxRRP_xe4V0uh

https://youtube.com/shorts/oFJscmgJpt0?si=kKIGUGvtNGpxXyaG

శరన్నవరాత్రుల్లో భాగంగా మంథని  శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గోపాలకాలువలు కార్యక్రమం సోమవారం కన్నులపండువగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అమ్మవారి ఆలయం ప్రదక్షణ అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాధాకృష్ణుల సరస సల్లపాలను గీతాలుగా ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ మజ్జిగ చిలికే దృశ్యం కనులపండువుగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన కమలంపై పెట్టీ ట్రాక్టర్లో పట్టణ పూర్వేడుగుల గుండా ఊరేగించారు.  వాడవాడల్లో ఉట్టి కట్టి గోపాల కాలువలు కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. తమ్మిచెరువు కట్టప్రముఖ క్రికెట్ కామెంటటర్లు మహావాది సుధీర్, విజయ్ లు భక్తి పాటలతో డ్యాన్స్ చేస్తూ అందరిని అలరించారు. 






















FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026