మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
* స్థానిక సంస్థల ఎన్నికల పై పత్రిక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లాలో స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, ఎంపిటిసి, జడ్పిటిసి) ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై పత్రికా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పిటిసి స్థానిక సంస్థలను రెండు విడతలలో మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు విడతలలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేసిందని , అదే ప్రకారం పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున గ్రామీణ ప్రాంతాల్లో ఎం.సి.సి కోడ్ అమలు కావడం జరుగుతుందని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో మొత్తం 13 మండలాల్లో 263 గ్రామ పంచాయతీలు, 2432 వార్డులు, జిల్లా వ్యాప్తంగా 2432 గ్రామ పంచాయతీ పోలింగ్ స్టేషన్లు, 273 పోలింగ్ లోకేషన్స్ ఏర్పాటు చేశారని తెలిపారు.
ఓటర్ల వివరాల ప్రకారం పురుషులు 198728, మహిళలు 205439, ఇతరులు 14 మంది కలిపి మొత్తం 404181 మందికి ఓటు ఇవ్వడానికి అవకాశం ఉందని, ప్రతి విడతలో మండల వారీగా గ్రూప్ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కు అనుగుణంగా నామినేషన్, పరిశీలన, పోలింగ్ తేదీలు నిర్ణయించామని అన్నారు.
స్థానిక సంస్థ ఎన్నికలకు సరిపడా ఏర్పాట్లు, ఇంచార్జి నియామకాలు, బ్యాలట్ బాక్స్లు, పోలింగ్ బూత్లు, పార్టీ ప్రతినిధులతో సంప్రదింపులు, షెడ్యూల్ వివరాల అనుసరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులతో పాటు స్థానిక నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నియమాల ప్రకారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం సన్నద్ధంగా ఉందని అన్నారు
పౌలింగ్ కేంద్రాలను పంచాయతీ కార్యదర్శులు పరిశీలించి ఎన్నికల నిర్వహణకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నారని, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయిస్తామని అన్నారు.
మండల కేంద్రాలలో నామినేషన్ స్వీకరణ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నామినేషన్ల స్క్రూటినీ , ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియ పై సిబ్బందికి శిక్షణ అందిస్తామని తెలిపారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనల, విధుల పై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత బ్యాలెట్ పేపర్ల ముద్రణ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకుంటున్నట్లు అన్నారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఒక నోడల్ అధికారి నియమించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రి -పోల్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అనంతరం పాత్రికేయులకు ఉన్న వివిధ సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశములో నరేందర్, సీఈఓ జడ్పీ మరియు వీర బుచ్చయ్య, DPO పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి