Dtv updates
శుక్రవారం, సెప్టెంబర్ 12, 2025
భూపాలపల్లి అన్ని పాఠశాలల్లో ఏ ఐ లాబ్స్
గురువారం, సెప్టెంబర్ 11, 2025
మంథని: నేడు కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
ముత్తారం.. కృత్రిమ మేధస్సుపై విద్యార్థులకు అవగాహన
పెద్దపల్లి: అటవీ శాఖ అమరవీరులకు జోహార్లు
మంథని: విద్యారంగ అభివృద్ధికి కృషి
బుధవారం, సెప్టెంబర్ 10, 2025
మంథని: నేడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
ఘనంగా సంకష్ట హర చతుర్థి
మంగళవారం, సెప్టెంబర్ 09, 2025
సోమవారం, సెప్టెంబర్ 08, 2025
హైదరాబాద్: నియో పోలీస్ ట్రంపెట్ ఇంటర్ చేంజ్ ప్రారంభం
మంథని: మంథని ఠాణాను ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ
హైదరాబాద్: ఆదిలాబాద్ సిమెంటు ప్లాంటును పునరుద్ధరించాలి
సిసిఐ ఉన్నతాధికారులతో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
ఖాయిలా పడిన సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆదిలాబాద్ ప్లాంటును పునురుద్ధరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పరిశ్రమను తిరిగి నడిపించాలని సిఎం రేవంత్ రెడ్డి, తానూ పలు సందర్బాల్లో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెడ్ డి కుమారస్వామిని కలిసి కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.
సోమవారం నాడు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిసిఐ సిఎండీ సంజయ్ బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పునరుద్ధరణ ప్రతిపాదనలపై శ్రీధర్ బాబు చర్చించారు. ప్లాంటును ఆధునిక యంత్రాలతో పునరుద్ధరించడానికి రూ. 2 వేల కోట్లు అవసరమవుతాయని సిఎండి చెబ్తున్నారని, అది జరిగితే మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని శ్రీదర్ బాబు తెలిపారు. వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని ఈ భారీ పరిశ్రమను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే రివైవ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్బాల్లో కోరారని తెలిపారు. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్టుగా ప్లాంటు ప్రైవేటీకరణను (డిస్ ఇన్వెస్ట్ మెంటును) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పునురుద్ధరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సిసిఐ కోరుతోందని, త్వరలోనే దీనిపైన తమ అభిప్రాయాలను అందచేస్తామని వెల్లడించారు.
రెండు వేల ఎకరాల్లో నాణ్యతతో కూడిన సున్నపురాయి గనులు ఉన్నందున ప్లాంటు నిర్వహణ అసాధ్యమేమీ కాదని శ్రీధర్ బాబు చెప్పారు. సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్, గనుల శాఖ డైరెక్టర్ వల్లూరు క్రాంతి, టిజిఐఐజి ఎండీ శశాంక తాండూరు సిసిఐ ప్లాంట్ జిఎం శరద్ కుమార్, సిసిఐ రీజినల్ మేనేజర్ ఉమేశ్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారిలు కూడా సమావేశానికి హాజరై తమ సూచనలను వెల్లడించారు.
మంథని: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న భరత్ రెడ్డి
హైదరాబాద్: చికితను అభినందించిన సీఎం
మంథని: ట్రైబల్ కనెక్టివేటీ రోడ్లకు నిధులు మంజూరు
మంథని నియోజకవర్గం పరిధిలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన గిరిజన గ్రామాల అనుసంధానం (ట్రైబల్ కనెక్టివిటీకి) రోడ్లకు సంబంధించి మహాముత్తారం, కాటారం మండలాలలో మూడు బిటి రోడ్ల పనులకు రూ.10 కోట్ల 66 లక్షల నిధులు ప్రభుత్వం నుండి మంజూరు అయినట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన రెండు మండలాలైన కాటారం, మహాముత్తారం కు సంబంధించిన నిధులు మంజూరైన మూడు బిటి రోడ్డు పనుల వివరాలను వారు ఈ ప్రకటనలో వివరించారు. కాటారం మండలం లో రూ. 4 కోట్ల 45 లక్షలు 30వేలు ప్రతిపాదిత వ్యయంతో 4.20 కిలోమీటర్ల దేవరంపల్లి టు ఎడ్లపల్లి బీటీ రోడ్డు, మహాముత్తారం మండలం ఎర్రం టు నర్సింగాపూర్ ఎక్స్ రోడ్ వయా మీనాజీపేట రెండు కిలోమీటర్లు బిటి రోడ్ కు రూ. కోటి 96 లక్షల 52వేలు, మహాముత్తారం మండలం ప్రేమ్ నగర్ టు నందిగామ 4.80 కిలోమీటర్ల రోడ్డుకు రూ.4 కోట్ల 24 లక్షల 90 వేలు మంజూరైనట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మహాముత్తారం, కాటారం మండలల ప్రజలు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్
*ఆస్ట్రేలియా ‘డికన్ యూనివర్సిటీ’ భాగస్వామ్యంతో ఏర్పాటు
*మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై సంతకాలు
తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘డికన్(Deakin) విశ్వవిద్యాలయం’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ వోఐ)పై సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ‘డికన్ యూనివర్సిటీ’ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా సంతకాలు చేశారు*.
అనంతరం ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ‘అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు డికన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. ఇది కేవలం లాంఛనప్రాయ ఒప్పందం కాదు. రాబోయే రోజుల్లో కీలక రంగాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షి సంబంధాల మెరుగుదలకు దిక్సూచీగా మారుతుంది. సమాజానికి ఉపయోగపడే అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశోధనలు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.
* ఏఐ కోర్సుల రూపకల్పన, శిక్షణ, స్టార్టప్ లకు చేయూత
‘ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ రంగాల్లో ప్రపంచానికి అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తెలంగాణ నుంచే అందించాలని లక్ష్యంగా పెట్టుకుని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్, యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా నేటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేసి, ఇక్కడి యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణనిస్తాయి. మన ఏఐ స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ లో తెలంగాణ బ్రాండ్ ను మరింత విశ్వ వ్యాప్తం చేసేలా ఆస్ట్రేలియా నిపుణులు మార్గదర్శకత్వం చేస్తారు ’ అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
* ఏఐ ఆధారిత పౌర సేవలను అందించేలా...
‘ఏఐ కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాకుండా, సమ్మిళిత వృద్ధికి, మానవాభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనంగా మార్చేలా మా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ లక్ష్య సాధనలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మార్గదర్శిగా మారుతుంది. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గవర్నెన్స్ తదితర రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేలా సంయుక్త పరిశోధనలు నిర్వహిస్తాం. ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఏఐ ఆధారిత పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేస్తాం’ అని తెలిపారు.
* అందుకే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం; ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, వీసీ, డికన్ యూనివర్సిటీ
‘ఏఐలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయం. ప్రజల శ్రేయస్సు కోసం సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన ఏఐ పరిష్కారాలను అందించాలనే లక్ష్యంతోనే భారత్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందుకోసం తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని గుర్తించాం. అందుకే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాం’ డికన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కాన్సూల్ జనరల్(ఆస్ట్రేలియన్ కాన్సూలేట్- జనరల్ బెంగళూరు) స్టీవెన్, కాన్సూల్ ఆండ్రూ కాలిస్టర్, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కమిషనర్ వికా సింగ్, పొలిటిల్ అండ్ ఎకానమిక్ రీసెర్చ్ ఆఫీసర్ రంజని మాధవన్, డికన్ యూనివర్సిటీ ప్రతినిధులు రౌనీత్ పాహ్వా, ప్రియాంక సింగ్, గాయత్రి వేద్ నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి: 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షిస్తున్న పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సెప్టెంబర్ 10న స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితా ప్రచురణ జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లో స్థానిక సంస్థల ఓటర్, పోలింగ్ కేంద్రాల జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. 650 ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
గత ఎన్నికలతో పోలిస్తే వివిధ గ్రామాలలో మున్సిపాల్టీల్లో విలీనం అవ్వడం కారణంగా 3 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయని, ప్రస్తుతం జిల్లాలో 137 ఎంపిటిసి, 13 జడ్పిటిసి స్థానాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయన్నారు.
ఒక మేజర్ గ్రామ పంచాయతీ 2 ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉంటే ఒక కుటుంబంలోని సభ్యులందరూ ఒకే ఎంపీటీసీ స్థానంలో ఓటర్లుగా ఉండేలా చర్యలు చేపట్టామని అన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్న సెప్టెంబర్ 8 సాయంత్రం లోపు అందించాలని, సెప్టెంబర్ 9న అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబర్ 10న తుది ఓటర్ జాబితా ప్రచురించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఓటర్ జాబితా లో అర్హులైన నూతన ఓటర్ల ను రెవెన్యూ డివిజన్ అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కలపాలని అన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గోన్నారు.
ఆదివారం, సెప్టెంబర్ 07, 2025
సంపూర్ణ చంద్ర గ్రహణం గురించి మంగళంపల్లి వేణుగోపాల్ శర్మ (ఆడియో)
మంథని: వీడియో.. వందేళ్ల చరిత్ర గలిగిన వినాయకుని శోభాయాత్ర
![]() |
| 112 ఏళ్ల గణేశుని నిమజ్జన శోభాయాత్ర.. వీడియో కింద |
బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బాల గంగాధర్ తిలక్ ముంబై లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను స్పూర్తిగా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లోనే ప్రథమ గణేష్ ఉత్సవాలను మంథనిలో సర్వజన గజానన సంస్థ పేరుతో 1913లో ప్రారంభించారు. ఒక్కో ఇంట్లో ఒక్కో సంవత్సరం గణేశ్ నవరాత్రి ఉత్సవాలు చేసి చివరికి పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయంలో ఈ ఉత్సవాలు క్రమం తప్పకుండా భక్తిపార్వశ్యంతో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. 1976 లో ఈ సిద్ధి, బుద్ధి సహిత గణేశునికి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షష్టి పూర్తి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించారు. 110 ఏళ్లు నిరాటంకంగా నిర్వహిస్తున్న ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్ర మినహా దక్షిణ భారతంలో నే మొదటి సంస్థగా విరాజిల్లుతున్నది. ఆ తరువాత సంస్థ సభ్యులు వివిధ వీధుల్లో వేర్వేరు గణేష్ సంస్థలు ఏర్పాటు చేసుకొని, నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. వాటిలో రావులచెరువు కట్ట, వాగుగడ్డ, నడివీధి గణేష్ సంస్థలు వందేళ్లు పూర్తి చేసుకున్నాయి. వారసత్వాన్ని కొనసాగిస్తూ ఒక పద్దతి ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ మిగతా సంస్థలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది.
2013 లో వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో..
NTV ప్రత్యేక కథనం just click below link
https://youtu.be/LRARe9viAf0?si=6Nv0mSntaxm3D0DR
శనివారం, సెప్టెంబర్ 06, 2025
హైదరాబాద్: మానవ సేవతోనే సమాజ వికాసం
మాట్లాడుతున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
*ప్రతి ఒక్కరూ 'మానవ సేవే - మాధవ సేవ' అనే భావనతో ముందుకొచ్చి తోటివారికి సాయం చేస్తేనే సమాజం పురోగమిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
శనివారం బాచుపల్లిలో ‘కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కాలేజ్ ఫీ రెన్యూవల్స్ ప్రోగ్రామ్ ఫర్ ది అకడమిక్ ఇయర్ 2025-26 & ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘జనాభాకు అనుగుణంగా ప్రజల అవసరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే కృషి చేస్తే సరిపోదు. సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే సామాజిక బాధ్యతతో కూడిన ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. ముఖ్యంగా కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకం. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘సమాజం మనకేమిచ్చిందన్నది కాదు, మనమేమిచ్చామన్నది ముఖ్యం. అన్నదానంతో పాటు విద్యాదానం చాలా ముఖ్యం. విద్య అనేది కేవలం ఒక డిగ్రీ కాదు, అది ఒక వ్యక్తి భవిష్యత్తును మార్చే శక్తి. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 మంది పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తుండటం నిజంగా ప్రశంసనీయం. అందరికీ ఆదర్శనీయం’ అని కొనియాడారు. ‘సామాజిక సేవ అంటే కేవలం డబ్బులు ఖర్చు చేయడం మాత్రమే కాదు. ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం కూడా సేవే. ఇప్పుడు మనం చేసే మంచి పనులు మనతోనే ఆగిపోవు. అవి మన పిల్లలకు, భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి’ అని వివరించారు. ‘మీకు ఏ రంగంలో ఆసక్తి ఉందో తెలుసుకోండి. అందుకు అనుగుణంగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి... గొప్ప విజయాలు అంత సులభంగా రావు. ఓపిక, పట్టుదల, నిరంతర కృషి అవసరం. ఎన్ని అడ్డంకులొచ్చినా లక్ష్య సాధనలో ధైర్యంగా ముందుకు సాగండి. తప్పకుండా విజయం సాధిస్తారు’ అని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కామరాజు అన్నపూర్ణమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, ప్రణీత్ గ్రూప్ సీఎండీ నరేంద్ర కుమార్ కామరాజు, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్, మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం










