Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శుక్రవారం, జులై 03, 2026

కమనీయం శ్రీనివాస కళ్యాణం


శ్రవణ నక్షత్రం సందర్భంగా జ్యోతినగర్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వైభవంగా తిరుకల్యాణ మహోత్సవం

కరీంనగర్, జూలై 3: కరీంనగర్ జ్యోతినగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని స్వామివారి దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి అనంతరం తిరుకల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగగా, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు.




వీడియో క్లిక్ చేయండి...




గురువారం, జులై 02, 2026

కరీంనగర్‌లో వైభవంగా సామూహిక ఉపనయన ఉత్సవం


రాష్ట్రవ్యాప్తంగా వటువులకు బ్రహ్మోపదేశం

కరీంనగర్, జూలై 2: కరీంనగర్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని వేద భవన్‌లో గురువారం సామూహిక ఉపనయన మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వటువులకు రెండు రోజుల పాటు ఉపనయనం, బ్రహ్మోపదేశం కార్యక్రమాలను ప్రముఖ వేద పండితుడు మల్లోజల రత్నాకర శర్మ ఆధ్వర్యంలో, వేద పండితుల పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారణల నడుమ వటువులకు యజ్ఞోపవీత ధారణ, గాయత్రీ మంత్ర బ్రహ్మోపదేశం, నిత్య సంధ్యావందన విధానాలను వివరించి ఆచరింపజేశారు. కార్యక్రమానికి వటువుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఇటువంటి సామూహిక ఉపనయన కార్యక్రమాలు యువతలో వేద సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

సర్​ ప్రక్రియపై అవగాహన


చింతకానిలో మాట్లాడుతున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

దిక్సూచి, ఖమ్మం, జూలై 2: 

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ (BLA) సూపర్వైజర్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, ముదిగొండ మండల కేంద్రాల్లో   గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్​ ప్రక్రియపై BLA సూపర్వైజర్ల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రతి బీఎల్ఏ సూపర్వైజర్ చురుకుగా పనిచేసి అర్హులైన ప్రతి ఓటరును జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై పూర్తి అవగాహనతో పనిచేస్తూ, ప్రజలకు అవసరమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏ సూపర్వైజర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

3న కరీంనగర్ కు టీపీసీసీ అధ్యక్షుడు రాక


దిక్సూచి, కరీంనగర్, జూలై 2: 

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం (జూలై 3) కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 8:00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 11:00 గంటలకు కరీంనగర్ చేరుకుంటారు. అనంతరం జగిత్యాల రోడ్డులోని రాజశ్రీ కన్వెన్షన్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి, 1:30 గంటలకు ధర్మపురి చేరుకుని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:00 గంటలకు ధర్మపురి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి.

4న సమైక్య సాహితి విశిష్ట పురస్కారాల ప్రదానం


కరీంనగర్ : కరీంనగర్ సమైక్య సాహితి, ఏటా నిర్వహించే విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవంఈనెల 4 న శనివారం సా॥ 5.00 గంటలకు స్థానిక ఫిల్మ్ భవన్ లో నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి గోపాల్, కె ఎస్ అనంతాచార్య లు తెలిపారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా ఐ.ఏ.ఎస్. అధికారి, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ హాజరు కానున్నారు.అలాగే విశిష్ట అతిథులుగా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు, గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర, గౌరవ అతిథులుగా వాస్తు, జ్యోతిష్య పండితులు గోవర్ధనగిరి అనంతాచార్యులు నంది శ్రీనివాస్, సాహితీ గౌతమి అధ్యక్షులు హాజరు కానున్నారని వారు తెలిపారు.ఆచార్య రజనిశ్రీ పురస్కారాన్ని ప్రముఖ నృత్య కళాకారులు, ఆదివాసీ నృత్య నికేతన్ అధ్యక్షులు జె. రతన్ కుమార్ కు అందించనున్నారు.ఈ పురస్కార ప్రదాతగా జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ వ్యవహరిస్తున్నారు.డాక్టర్ దారం నాగభూషణం పురస్కారాన్ని, ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కవి కరిపె రాజ్ కుమార్ కు ప్రదానం చేస్తారు.ఈ పురస్కార ప్రదాత గాసీనియర్ ఫిజీషియన్ డాక్టర్. డి. రఘురామన్ , అందిస్తున్నారు.మాడిశెట్టి మల్లయ్య ఉపాధ్యాయ పురస్కారాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్, ఛైర్మన్ బోర్డు ఆఫ్ స్టడీస్, ఎస్. రఘు కు అందించనున్నారు.ఈ పురస్కారాన్ని సమైక్య సాహితి అధ్యక్షులు మాడిశెట్టి గోపాల్ అందిస్తున్నారు.రావికంటి రామయ్య గుప్త పురస్కారాన్ని ప్రముఖ పద్యకవి, చతుర, విపుల పూర్వ ఎడిటర్ చంద్ర ప్రతాప్ కంతేటి కి అందజేయనున్నారు.పురస్కార ప్రదాత గా ఈనాడు పూర్వ డిప్యూటి న్యూస్ ఎడిటర్ రావికంటి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.సంపత్ కుమారాచార్య పురస్కారాన్ని ప్రముఖ మృదంగ కళాకారులు నమిలికొండ వేణుగోపాల్ కు ప్రదానం చేస్తున్నారు. పురస్కార ప్రదాతగా సమైక్య సాహితి ప్రధాన కార్యదర్శి ఎస్.అనంతాచార్య వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని, అందరూ ఆహ్వానితులేనని వారు తెలిపారు.

వైభవంగా హరే రామ స్వామి జయంతోత్సవాలు

రామకృష్ణానంద ఆశ్రమంలో స్వామివారి విగ్రహం వద్ద హరేరామ భజన చేస్తున్న భక్తులు

వీడియో కోసం క్లిక్​ చేయండి
 
https://youtu.be/-WOgpwNG6ck

మంథని, జూలై 2: పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీ శ్రీ శ్రీ రామకృష్ణానంద స్వామీజీ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం లోకకళ్యాణార్థం శ్రీమద్భగవద్గీత పారాయణాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వేద పండితులు, భక్తులు సామూహికంగా భగవద్గీత పారాయణంలో పాల్గొని ప్రపంచ శాంతి, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం స్వామీజీ ఆశీస్సులతో భక్తులకు అన్నప్రసాదాన్ని సమర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, వేద పండితులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. స్వామీజీ జయంతి ఉత్సవాలు మరికొన్ని రోజుల పాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.



బంధంపల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయాలి

  

పెద్దపల్లి పట్టణంలోని బంధంపల్లి చెరువు అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్  కోయ శ్రీహర్ష

అమృత్ 2.0 పథకం కింద రూ.2.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విహార కేంద్రంగా చెరువును తీర్చిదిద్దాలి

జిల్లా కలెక్టర్  కోయ శ్రీహర్ష

 

దిక్సూచి, పెద్దపల్లి, జూలై 02:

 అమృత్ 2.0 పథకం కింద పెద్దపల్లి పట్టణంలోని బంధంపల్లి చెరువును మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేస్తూ, జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విహార కేంద్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులోని బంధంపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్  పరిశీలించారు.  ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, చేపడుతున్న పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  అమృత్ 2.0 పథకం కింద రూ.2.50 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. చెరువు పరిసరాలను ప్రజలు సేదతీరే విధంగా అందంగా తీర్చిదిద్దడంతో పాటు, మినీ ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేసి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. శాంతినగర్ వైపు నుంచి సందర్శకులు సులభంగా చేరుకునేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, అవసరమైతే అదనపు నిధులు సమీకరించి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కులు, నడక మార్గాలు, విశ్రాంతి సదుపాయాలు తదితర మౌలిక వసతులను సమకూర్చాలని సూచించారు. పనుల అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ పరిశీలనలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, నూగిళ్ల మల్లయ్య,రెవెన్యూ డివిజనల్ అధికారి బి. గంగయ్య,  మున్సిపల్ కమిషనర్ వెంకటేష్,1 వ వార్డు కౌన్సిలర్ శైలజ సుధాకర్,  సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

బుధవారం, జులై 01, 2026

బీఎల్ఏ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

SIR ప్రక్రియపై BLA సూపర్వైజర్ల అవగాహన సమావేశంలో పాల్గొన్న వైనం

వరంగల్:

బీఎల్ఏ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పిలుపునిచ్చారు.

జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ఎస్ కన్వెన్షన్ హాల్‌లో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి అధ్యక్షతన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సూపర్వైజర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు.



ఈ కార్యక్రమంలో  పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో BLAలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి బూత్ పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు.

అలాగే, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాల్లో  నిబంధనల మేరకు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ జన్మదిన వేడుకలు

డాక్టర్ అజయ్ కుమార్ ను సన్మానిస్తున్న  విజయ్ కుమార్

కరీంనగర్:

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ మరియు తెలంగాణ బ్రాహ్మణ సేవా సమైక్య కన్వీనర్ అయిన బసవరాజు శ్రీనివాస్ జన్మదినము మరియు జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని యువజన నాయకులు పామరాజ్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రం లోని సీనియర్ వైద్యులు అజయ్ కుమార్ ను సన్మానించారు.  28 సంవత్సరాలుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ఉత్తమ వైద్య అధికారిగా పేరొందిన అజయ్ కుమార్ (పిల్లల వైద్య నిపుణులు) ను సంఘ సేవకులు నిస్వార్థ ప్రజా నాయకులు నిరంతరం ఎంతోమందికి విద్య వైద్యం కొరకు సంస్థ ద్వారా విరాళాలు అందిస్తూ ఇత్తోదికంగా సేవ చేస్తున్న బసవరాజు శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని విజయకుమార్ పేర్కొన్నారు. అనంతరం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్  చౌరస్తాలో పేదలకు మిఠాయి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు దేవరాజు వెంకటేశ్వరరావు ప్రతాప రాజేశ్వరరావు చేపూరి రామారావు గూడూరి సంతోష్ కుమార్ గజవెళ్లి నవీన్ రేప్రవీణ్ ప్రశాంత్ ప్రసాద్ మహిధర్ యుగంధర్ బసవరాజు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా విజయ రాజం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలక మండలిని (ట్రస్ట్ బోర్డు) అధికారికంగా ఏర్పాటు చేసింది. ఈ కొత్త పాలక మండలిలో మెట్రో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీ. విజయ రాజంకు సభ్యురాలిగా అవకాశం కల్పించింది. ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో పాటు పలువురు ప్రముఖులకు కూడా బోర్డులో స్థానం దక్కింది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఎం. సత్యనారాయణ రెడ్డిని పాలక మండలి ఛైర్మన్‌గా నియమించింది. సభ్యులుగా వినోద్ వెంకటస్వామి (ఎమ్మెల్యే), విజయేందర్ తుల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతామణి, ఎం. రాఘవేందర్ రావు, సీ. విజయ రాజంలను నామినేట్ చేసింది. అలాగే డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ వ్యవస్థాపక ట్రస్టీ గా కొనసాగనున్నారు.

దేవస్థానం పాలనలో భాగంగా పలువురు ఉన్నతాధికారులు ఎక్స్-ఆఫిషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. వీరిలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (దేవాదాయ శాఖ) ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, వైస్ చైర్మన్, దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో), స్థానాచార్య సీనియర్ ప్రధాన అర్చకులు సభ్యులుగా ఉంటారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఛైర్మన్‌తో పాటు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం నియామక తేదీ నుంచి రెండేళ్లు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, ఏది ముందుగా అమల్లోకి వస్తే అప్పటి వరకు కొనసాగుతుంది. అయితే ఎక్స్-ఆఫిషియో సభ్యులు, వ్యవస్థాపక ట్రస్టీకి ఈ నిబంధన వర్తించదు.

కొత్తగా ఏర్పాటైన పాలక మండలి సభ్యులతో పదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణం చేయించే బాధ్యతను యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో)కి ప్రభుత్వం అప్పగించింది.

యాదాద్రి దేవస్థానం తెలంగాణలో అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటి. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో ఈ పాలక మండలి కీలక పాత్ర పోషించనుంది.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ

​రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 

మెడికల్ ఆఫీసర్ పోస్టుకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ 

- మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. హిమబిందు సింగ్

​రామగుండం:

​రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ ప్రోగ్రాంలో ఖాళీగా ఉన్న ఒక (01)మెడికల్ ఆఫీసర్ పోస్టును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, అర్హత గల అభ్యర్థులు హాజరుకావాలని రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్. హిమబిందు సింగ్  ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్  ఉత్తీర్ణులై ఉండాలని, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లేదా నేషనల్ మెడికల్ కమిషన్‌లో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని, జూలై, 7 ఉదయం 11:00 గంటలకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, రామగుండం, ​నందు అభ్యర్థులు తమ విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ ధృవీకరణ పత్రం, ఇతర సంబంధిత అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని, పూర్తి వివరాల కోసం రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సంప్రదించాలని మెడికల్ సూపరింటెండెంట్ ఆ పేర్కొన్నారు.

మంగళవారం, జూన్ 30, 2026

డాక్టర్స్ డే ప్రత్యేక కథనం


 వైద్యో నారాయణో హరి.. 

సేవలోనే దైవత్వం

డాక్టర్స్ డే ప్రత్యేక కథనం

హైదరాబాద్​:

ఈ రోజును  ప్రాణాలను కాపాడే ప్రతీ వైద్యుడి సేవలను స్మరించుకునే రోజే జాతీయ డాక్టర్స్ డే.  మనిషి జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయంలో ఆశాకిరణంగా నిలిచి, రోగిని మళ్లీ ఆరోగ్యవంతుడిగా మార్చేందుకు అహర్నిశలు శ్రమించే వైద్యులకు కృతజ్ఞతలు తెలిపే సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1న ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.


భారతదేశంలో ప్రముఖ వైద్యుడు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి, వర్ధంతి రెండూ జూలై 1నే కావడంతో ఆయన సేవలకు గుర్తింపుగా ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నారు.

వైద్యుల సేవ అమూల్యం

రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహించే వైద్యులు సమాజానికి నిజమైన సేవకులు. మహమ్మారులు, ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు వైద్యం అందించడం వారి సేవాభావానికి నిదర్శనం.

ఆధునిక వైద్యం.. పెరుగుతున్న అవకాశాలు

సాంకేతికత అభివృద్ధితో వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కృత్రిమ మేధస్సు (AI), రోబోటిక్ శస్త్రచికిత్సలు, టెలీమెడిసిన్, అత్యాధునిక నిర్ధారణ పద్ధతులు వైద్య సేవలను మరింత సమర్థవంతంగా మార్చాయి. అయినప్పటికీ వైద్యుడి అనుభవం, మానవత్వం, రోగిపై చూపే ఆప్యాయతకు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య బీమా ప్రాధాన్యం

నేటి కాలంలో పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ప్రతి కుటుంబం ఆరోగ్య బీమా కలిగి ఉండటం అత్యంత అవసరం. మంచి వైద్య సేవలు పొందేందుకు, అనుకోని ఆర్థిక భారం నుంచి రక్షణ పొందేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది.

డాక్టర్స్ డే సందేశం

"ప్రాణాలకు కొత్త ఆశను అందించే ప్రతి వైద్యుడికి కృతజ్ఞతలు. వారి అంకితభావం, సేవాస్ఫూర్తి, మానవత్వం సమాజానికి ఆదర్శం. ప్రతి వైద్యుడికి హృదయపూర్వక డాక్టర్స్ డే శుభాకాంక్షలు."


— హ్యాపీ డాక్టర్స్ డే!  

వైభవ్ కు ఇంకా టైమ్ రాలేదా?

 


15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌ను తన బ్యాటింగ్‌తో ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నా.. తుది జట్టులో మాత్రం వరుసగా బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. అతడి దూకుడు బ్యాటింగ్‌ను చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అసలు వైభవ్‌కు ఎందుకు అవకాశం రావడం లేదు? జట్టు వ్యూహమా.. లేక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న నిర్ణయమా? దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

న్యూఢిల్లీ:

భారత క్రికెట్‌కు మరో సూపర్‌స్టార్ దొరికాడని ఇప్పటికే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ప్రశంసలు కురిపించిన పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుతమైన షాట్లు, నిర్భయమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ యువ బ్యాటర్ ఇప్పుడు భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. అయితే జట్టులో ఎంపికైనప్పటికీ.. మ్యాచ్‌లో మాత్రం అవకాశం దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

వైభవ్ క్రీజ్‌లోకి అడుగుపెడితే బౌలర్లపై ఎలాంటి ఒత్తిడి సృష్టిస్తాడో ఇప్పటికే దేశీయ క్రికెట్‌తో పాటు లీగ్ క్రికెట్‌లో కూడా చూపించాడు. పవర్‌ప్లేలోనే మ్యాచ్ గమనాన్ని మార్చేయగల సామర్థ్యం అతడికి ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే అతడు భారత జెర్సీలో ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కానీ వరుస మ్యాచ్‌ల్లో తుది జట్టును ప్రకటించిన ప్రతిసారీ వైభవ్ పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో "వైభవ్‌కు అవకాశం ఇవ్వండి", "ఇంకెంతకాలం బెంచ్‌పైనే కూర్చోబెడతారు?", "ప్రతిభకు అవకాశం ఎప్పుడు?" వంటి పోస్టులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి.

అయితే దీనిపై క్రికెట్ వర్గాలు చెబుతున్నది మాత్రం భిన్నంగా ఉంది. జాతీయ జట్టులో తుది పదకొండు మందిని ఎంపిక చేయడం కేవలం ఒక్క ఆటగాడి ప్రతిభ ఆధారంగా ఉండదని, ప్రత్యర్థి జట్టు, పిచ్ పరిస్థితులు, మ్యాచ్ అవసరాలు, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల ఫామ్, జట్టు సమతుల్యత వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు.

ప్రస్తుతం భారత జట్టులో ఓపెనింగ్‌, టాప్ ఆర్డర్‌లో ఇప్పటికే స్థిరపడిన ఆటగాళ్లు ఉండటంతో వైభవ్‌కు వెంటనే అవకాశం దక్కడం కష్టంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్త ఆటగాడిని ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కాకుండా, అనుకూల పరిస్థితుల్లో అరంగేట్రం చేయించాలనే ఆలోచన కూడా జట్టు యాజమాన్యానికి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

గతంలోనూ పలువురు స్టార్ ఆటగాళ్లు జట్టులో ఎంపికైన వెంటనే ఆడలేదు. కొంతకాలం బెంచ్‌పై వేచి చూసిన తర్వాతే అవకాశం దక్కింది. అవకాశం వచ్చిన తర్వాత మాత్రం తమ ప్రతిభతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నారు. వైభవ్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్న అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు.

అయితే అభిమానులు మాత్రం ఈ వివరణతో పూర్తిగా సంతృప్తి చెందడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో యువ ప్రతిభను త్వరగా పరీక్షించాలని, మ్యాచ్‌ల్లో నిర్భయంగా అవకాశాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా వైభవ్‌లాంటి దూకుడు బ్యాటర్ టీ20 ఫార్మాట్‌కు బాగా సరిపోతాడని, అతడిని బెంచ్‌కే పరిమితం చేయడం సరైన నిర్ణయం కాదని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం ఎలాంటి తొందరపడకుండా యువ ఆటగాడిని దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా తీర్చిదిద్దాలని చూస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. చిన్న వయసులోనే అతడిపై అధిక అంచనాలు, ఒత్తిడి పడకుండా చూసేందుకు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు భారత క్రికెట్‌లో అత్యంత ఆసక్తిగా చర్చించబడుతున్న అంశాల్లో ఒకటిగా మారింది. అతడు తుది జట్టులో ఎప్పుడు చోటు దక్కించుకుంటాడు? తొలి మ్యాచ్‌లోనే తనదైన శైలిలో బౌలర్లపై విరుచుకుపడతాడా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి. వైభవ్ సూర్యవంశీని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారనే దానికి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదా విశ్వసనీయ ఆధారాలు లేవు. ప్రస్తుతం అతడికి అవకాశం రాకపోవడం జట్టు కూర్పు, వ్యూహాత్మక నిర్ణయాల ఫలితంగానే కనిపిస్తోంది. అవకాశం వచ్చినప్పుడు తన ప్రతిభతో సమాధానం చెప్పేందుకు వైభవ్ సిద్ధంగా ఉన్నాడనే నమ్మకం మాత్రం అభిమానుల్లో బలంగానే ఉంది.


సోమవారం, జూన్ 29, 2026

బెంగళూరులో ‘ఈగల్‌’ ఆపరేషన్‌


పోలీసుల చేతికి అంతర్జాతీయ డ్రగ్​ సిండికేట్​ ఏజెంట్​ 

 హైదరాబాద్: 

కొన్నేళ్లుగా హైదరాబాదీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్కు చెందిన ఏజెంట్ తెలంగాణ ఈగల్కు చిక్కాడు. నిందితుడు నైజీరియాలోని స్మగ్లర్ ఆదేశాలతో బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నైజీరియా ఫోన్ నంబరు వాడుతూ, డెడ్ డ్రాప్ విధానంలో ఎండీఎంఏ విక్రయిస్తున్న అతడిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సాయంతో ఆదివారం బెంగళూరులో ఈగల్ అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి 241 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. గతంలో హైదరాబాద్లో సంచలనం రేపిన మల్నాడు డ్రగ్స్ కేసు, కొండాపూర్ రేవ్ పార్టీ కేసులోని నిందితులకు ఇతడే డ్రగ్స్ సరఫరా చేశాడని పోలీసులు గుర్తించారు. వివరాలను ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

డబ్బు కోసం డ్రగ్స్ దారి...

కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ జిల్లాకు చెందిన పీవీ రాహుల్(24) బెంగళూరులోని కార్ల షోరూంలో పనిచేస్తున్న అర్షలన్ ద్వారా డ్రగ్స్కు అలవాటుపడ్డాడు. నైజీరియా దేశస్థుడు మైకెల్ జాక్సన్ ఎలియాస్ హానర్ నుంచి డ్రగ్స్ కొనేవాడు. తర్వాత రాహుల్ ఉద్యోగం కోల్పోవడంతో నేరుగా డ్రగ్స్ దందాలోకి దిగాడు. హానర్ దగ్గర తక్కువ ధరకు ఎండీఎంఏ కొని కస్టమర్లకు ఎక్కువకు అమ్మేవాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ విక్రయిస్తూ బాలాపూర్ ఎక్సైజ్ స్టేషన్ సిబ్బందికి చిక్కాడు. జైలులో పేట్బషీరాబాద్కు చెందిన మోహిత్కుమార్(32)తో పరిచయమైంది. జూన్ 9న మోహిత్ బెంగళూరులోని రాహుల్ గదికి వెళ్లి డ్రగ్స్ తీసుకొస్తుండగా.. ఈగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో ఈగల్ ఇన్స్పెక్టర్ సంతోష్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఐదు రోజులు బెంగళూరులో మాటు వేసి రాహుల్​ను అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు



వరంగల్ సీపీగా ఎన్. శ్వేత

​హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. ఈ మేరకు 2026 జూన్ 29న సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్ 931ని విడుదల చేసింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడంతో పాటు, మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

​ముఖ్యమైన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ​వరంగల్ కమిషనర్‌గా ఎన్. శ్వేత: ప్రస్తుతం హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (L&O, నార్త్ రేంజ్)గా ఉన్న ఎన్. శ్వేత (IPS: 2012) వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. దీనితో పాటు ఆమె భద్రాద్రి జోన్-IV డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు.
  • ​సైబరాబాద్ ట్రాఫిక్‌కు సున్‌ప్రీత్ సింగ్: వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న శ్రీ సున్‌ప్రీత్ సింగ్ (IPS: 2011) సైబరాబాద్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్)గా బదిలీ అయ్యారు. ఆయనకు రాజన్న జోన్-III డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • ​సీఐడీ విభాగానికి రూపేష్, ప్రవీణ్ కుమార్: హైదరాబాద్ డీసీపీ (SM&IT) శ్రీ చెర్నూరి రూపేష్ (IPS: 2017), అలాగే ఏసీబీ జాయింట్ డైరెక్టర్ శ్రీ చ. ప్రవీణ్ కుమార్ (IPS: 2017) ఇద్దరూ సీఐడీ ఎస్పీలుగా బదిలీ అయ్యారు.
  • ​ఇంటెలిజెన్స్ సీఐ సెల్‌కు సింధు శర్మ: ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న  సింధు శర్మ (IPS: 2014) ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆమెకు ఎస్ఐబీ (SIB) ఎస్పీగా అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు.
  • ​రైల్వే ఎస్పీగా వై. సాయి శేఖర్: సింధు శర్మ బదిలీతో ఇంటెలిజెన్స్ నుండి రిలీవ్ అయిన శ్రీ వై. సాయి శేఖర్ (IPS: 2018) సికింద్రాబాద్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు.

​అదనపు బాధ్యతలు పొందిన ఇతర అధికారులు:

  • ​రామగుండం సీపీ శ్రీ అంబర్ కిషోర్ ఝా (IPS: 2009) కు కాళేశ్వరం జోన్-I డీఐజీగా అదనపు బాధ్యతలు లభించాయి.
  • ​హైదరాబాద్ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) శ్రీ డి. జోయల్ డెవిస్ (IPS: 2010) కు యాదాద్రి జోన్-V డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  • ​ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీ శ్రీ ఆర్. భాస్కరన్ (IPS: 2012) కు బాసర జోన్-II డీఐజీగా అదనపు బాధ్యతలు దక్కాయి.
  • ​హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ శ్రీ ఎస్.ఎం. విజయ్ కుమార్ (IPS: 2012) కు హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (L&O) గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

​ఈ బదిలీలు తక్షణమే అమలుల్లోకి వస్తాయని, అధికారులు వెంటనే తమ కొత్త బాధ్యతలను స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.

పాఠశాలల అభివృద్ధి పనులను ప్రారంభించాలి

– బీజేపీ మంథని మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్

మంథని:

మంథని మండలం, గుంజపడుగు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT) నిధుల ద్వారా కేటాయించిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం అత్యంత బాధాకరమని బీజేపీ మంథని మండల అధ్యక్షుడు వీరబోయిన రాజేందర్ అన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.77 లక్షలు, ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి రూ.29 లక్షలు కేటాయించి దాదాపు 7–8 నెలలు గడిచినా ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

ఈ విషయమై సంబంధిత జిల్లా అధికారులను, డీఈని కలిసి పాఠశాలల అభివృద్ధి పనులు, కాంపౌండ్ వాల్ నిర్మాణం, గ్రౌండ్ మరమ్మతులు తదితర పనులను వెంటనే ప్రారంభించి వేగవంతంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించామని చెప్పి నెలలు గడిచినా ఎలాంటి పురోగతి కనిపించకపోవడం విచారకరమన్నారు. గుంజపడుగు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

మంథనిలో వైభవంగా వటసావిత్రి వ్రతం

* ఏరువాక పౌర్ణమి సందర్భంగా మర్రి చెట్టుకు మహిళల పూజలు

మంథని:

 పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మహిళలు వటసావిత్రి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానికంగా ఉన్న మర్రి చెట్టు వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు చేరి ప్రత్యేక పూజలు చేశారు.

వట వృక్షాన్ని పసుపు, కుంకుమలతో అలంకరించి, పూలమాలలు వేశారు. భర్త ఆయురారోగ్యాల కోసం, కుటుంబ క్షేమం కోసం మహిళలు మర్రి చెట్టు చుట్టూ పచ్చి దారాలతో ప్రదక్షిణలు చేశారు. సావిత్రి సత్యవంతుల కథను స్మరించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు.

పూజలో భాగంగా శనగలు, నిమ్మకాయ, తమలపాకులు, కొబ్బరికాయలు, పూలు, పండ్లు నైవేద్యంగా సమర్పించారు. దీపారాధన చేసి, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పురోహితుల సమక్షంలో వ్రత కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

"ప్రతి ఏటా ఏరువాక పౌర్ణమి రోజున ఇలా వటసావిత్రి వ్రతం చేయడం మా ఆనవాయితీ. మర్రి చెట్టును సాక్షాత్తు సావిత్రీ దేవిగా భావించి పూజిస్తాం" అని స్థానిక మహిళలు తెలిపారు.

వ్రతం పూర్తి చేసిన అనంతరం మహిళలు ఒకరికొకరు వాయనాలు అందించుకున్నారు. పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వట వృక్షం పరిసరాలు భక్తిమయంగా మారాయి.

 

-  



ఆదివారం, జూన్ 28, 2026

దక్షిణాఫ్రికా లో విమాన ప్రమాదం తెలంగాణ కు చెందిన కోపైలట్ మృతి

విమాన ప్రమాదంలో మృతి చెందిన సుమంత్

స్పెయిన్ లో మృతి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి

వరంగల్: 

ఉన్నత చదువు కోసమని విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు విమాన ప్రమాదంలో మృతి చెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన చంద్రమోహన్-నిర్మల దంపతులకు హేమంత్, సుమంత్(22) కుమారులున్నారు. చిన్న కుమారుడు సుమంత్ పైలట్ శిక్షణ కోసం ముంబయికి వెళ్లారు. ప్రాక్టికల్ ట్రైనింగ్లో భాగంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్కు వెళ్లిన సుమంత్ భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి అక్కడ జెట్ విమానం నడుపుతుండగా ప్రమాదానికి గురై దుర్మరణంపాలయ్యారు. సుమంత్ మరణ వార్తతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్పెయిన్ లో పెద్దపల్లి  యువకుడు ..

పెద్దపల్లి:

స్పెయిన్ దేశంలోని వేలెన్సియా నగరంలో పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి(30) ఆదివారం ఒక భవనంపై నుంచి పడి మృతి చెందినట్లు అతడి బంధువులు తెలిపారు.

కూనారం గ్రామానికి చెందిన గీట్ల సుభాషినిరెడ్డి, గుణాకర్ రెడ్డి దంపతులు హైదరాబాద్లో నివాసం

ఉంటున్నారు. వారి ఒక్కగానొక్క కుమారుడు సాయి అఖిల్ రెడ్డి వేలెన్సియా నగరంలో గత ఆరు నెలలుగా హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కూనారంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మాజీ ప్రధాని పీవీకి నివాళి


కరీంనగర్:

మాజీ ప్రధాని పి.వి, నరసింహారావు జయంతినీ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. 

జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల  అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, పలువురు నాయకులు, కార్యకర్తలు, పి.వి.నరసింహారావు  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ ముద్దు బిడ్డ అయిన పివి  నరసింహారావు బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ కర్త అని, పివి నరసింహారావు జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారికి నివాళులు అర్పిస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలకు రూపు తీసుకువచ్చి,దేశాన్ని ఆర్థికంగా ముందంజలో నిలిపిన వ్యక్తి పి.వి. అని, వారి ఆశయ సాధన కోసం, వారు చూపిన బాటలో, వారి అడుగుజాడల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడవాలన్నారు.  కార్యక్రమంలో నాయకులు వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆకుల ఉదయ్, వంగల విద్యాసాగర్, శుకూర్,  నాగుల సతీష్, కుంభాల రాజ్ కుమార్, మాదాసు శ్రీనివాస్, సుదర్శన్, మాలోతు మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

మంథనిలో..



మంథనిలో పీవీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు టక్కేగారి కృష్ణ, లొకేగారి మనోహర్ నివాళి అర్పించారు. 

హైదరాబాద్ లో మన మంథని గ్రూప్ అడ్మిన్ అవధానుల నరసింహ ప్రసాద్ పీవీ ఘాట్ లో నివాళి అర్పించారు.

పలువురు నాయకులు,  పీవీ తో తమకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

 పీవీ వియ్యంకులు కెప్టెన్ లక్ష్మికాంత రావు, కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు తో కలిసి మంథని లో భోజనం చేస్తున్న మాజీ ప్రధాని దివంగత నేత పీవీ నరసింహారావు. చిత్రంలో పనకంటి చంద్రశేఖర్, గట్టు నరహరి


పీవీ తో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ దివంగత పనకంటి కిషన్ రావు, కాంగ్రెస్ నాయకులు 1969 తెలంగాణ ఉద్యమకారుడు దివంగత  అవధానుల మురళీధర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్ అప్పటి మిత్ర బృందం..



పీవీతో వడవత విఠల్ రావు, చిలప్పగారి సత్యనారాయణ వకీల్, పీవీకి  కుడివైపు మహవాది సతీష్, విజయ్ కూడా ఉన్నారు.



అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండాలి

మాట్లాడుతున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు

ధన్వాడ లో మాట్లాడుతున్న శ్రీను బాబు


మంథనిలో పాల్గొన్న నాయకులు


మంథనిలో..

టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

SIR ప్రక్రియపై BLA సూపర్వైజర్లకు అవగాహన 


మంథని:

అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. ఆదివారం మంథని పట్టణంలో మంథని నియోజకవర్గ పరిధిలోని కమాన్ పూర్,  రామగిరి, మంథని, ముత్తారం,పాలకుర్తి మండలాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సూపర్వైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియలో BLAలు క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొని, ప్రతి బూత్ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావడంతో పాటు, తప్పులను గుర్తించి సరిదిద్దే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు BLAలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

ధన్వాడలో..

కాటారం: కాటారం మండలం ధన్వాడలో మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం, మహాదేవపూర్, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాలకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సూపర్వైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.


FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026