టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
SIR ప్రక్రియపై BLA సూపర్వైజర్ల అవగాహన సమావేశంలో పాల్గొన్న వైనం
వరంగల్:
బీఎల్ఏ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పిలుపునిచ్చారు.
జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎస్ కన్వెన్షన్ హాల్లో స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి అధ్యక్షతన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సూపర్వైజర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో BLAలు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రతి బూత్ పరిధిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు.
అలాగే, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాల్లో నిబంధనల మేరకు పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి