Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

గురువారం, ఆగస్టు 28, 2025

హైదరాబాద్: చికిత కు స్వాగతం



ఆర్చరీ విభాగంలో ప్రపంచ యూత్ ఛాంపియన్ గా నిలిచిన చికిత పెద్దపల్లి నివాసి అయినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది

కుమారి తానిపర్తి చికితకు నా అభినందనలు..

* పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు 

అండర్ 21 కేటగిరి ఫైనల్ లో కొరియాకు చెందిన పార్క్ యేరీన్ పై విజయం సాధించి స్వర్ణ పతకం చేజిక్కించుకున్న పెద్దపల్లి నియోజకవర్గ ముద్దుబిడ్డ ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన కుమారి. తానిపర్తి చికిత మొదటి సారిగా హైదరాబాద్ కి విచ్చేసిన సందర్బంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రివర్యులు వాకిడి శ్రీహరి గారు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారు మరియు పలువురు ఎమ్మెల్సీ బలమురి వెంకట్ గార్లతో కలిసి ఘన స్వాగతం పలికిన తదుపరి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని:ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించినా సీఎం రేవంత్ రెడ్డి


శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏరియల్ మార్గం ద్వారా పెద్దపల్లి జిల్లా లోని గోలి వాడ పంప్ హౌస్  వద్ద ఉన్న హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి  జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. 

అనంతరం *అంతర్గాం లోని శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్  ప్రాజెక్టు ను సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తం కుమార్ రెడ్డి, టి పి సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష,రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి పరిశీలించారు.*  ప్రాజెక్టుకు వస్తున్న వరద, ప్రస్తుతం ఉన్న నీటి నిలువ, దిగువకు వదులుతున్న వరద మొదలగు వివరాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ పకడ్బందిగా  ఉండాలని, వరద ముగిసే సమయానికి ప్రాజెక్టు నీటి నిల్వ  పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం సంబంధిత  ఇంజనీరింగ్ అధికారులకు  సూచించారు. 

వరద పెరిగే నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు

 గోదావరి నీటిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జంక్షన్ లాగా ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని సీఎం తెలిపారు. నిపుణులు, ఇంజనీర్ల సూచనలు, సలహాలు తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లోని మేడిగడ్డ , అన్నారం, సుందిల్ల ప్రాజెక్టు పునరుద్దరణ, మరమ్మత్తు అవకాశాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇరిగేషన్ సి.ఈ. సుధాకర్ రెడ్డి, ఎస్.ఈ. శ్రీనివాస్ గుప్తా, అదనపు కలెక్టర్ రెవెన్యూ వేణు, ఆర్డీవో గంగయ్య, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ఇరిగేషన్ సీ.ఈ. సుధాకర్ రెడ్డి, జిల్లా లోని ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





బుధవారం, ఆగస్టు 27, 2025

గోదావరిఖని: రామగుండం పోలీస్ కమీషనరేట్ లో వినాయక చవితి వేడుకలు


రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.  కార్యాలయం లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకొన్నారు. 

సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ... ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకోవాలని, అందరు తాము మొదలు పెట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి అయ్యేటట్లు చూడాలని, కష్టాలను తొలగించి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలలో ఉన్న సోదరభావం, ఐక్యత ఎంతో సంతోషాన్ని కలిస్తుందని, పోలీసు శాఖ సూచించిన మేరకు ఆయా మండపాల వద్ద నిర్వాహకులు, యువత పోలీస్ వారి సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ఇదేరీతిలో ఈరోజు నుండి నిమజ్జనం రోజు వరకు ప్రతి ఒక్కరు పోలీస్ వారికి సహకరించాలని ఎటువంటి ఆటంకాలు లేకుండా నవరాత్రులు, నిమజ్జన శోభయాత్ర నిర్వహించుకోవాలని ప్రజలకు సీపీ గారు తెలిపారు. పూజా కార్యక్రమంలో  గోదావరిఖని ఎసిపి ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  భీమేష్, ఆర్ ఐ దామోదర్, శ్రీనివాస్, శేఖర్,మల్లేశం, సిసి హరీష్, ఆర్ఎస్ఐ లు , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

పెద్దపల్లి: వైభవంగా గణనాధుని పూజలు

సమూహ జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC), పెద్దపల్లి  ప్రాంగణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వారి దేవాలయ కల్యాణ మండపంలో  ఈ సంవత్సరం వినాయక చతుర్ధి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుటకు మన ఉద్యోగ గణనాథుడిని  టి.ఎన్.జి.వో. ల ఆధ్వర్యంలో సమస్త జిల్లా ఉద్యోగుల పక్షాన టి.ఎన్.జి.వో. సంఘం - పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయుల జే.ఏ.సీ. ఛైర్మన్ , ఆలయ సంఘం ఛైర్మన్ శ్రీ బొంకూరి శంకర్ గణేష్ విగ్రహాన్ని  ఏర్పాటు చేయించడం జరిగింది. బుధవారం మొదటి రోజు పూజకు  పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న దాసరి వేణు సతీ సమేతంగా విచ్చేసి పూజలో భాగస్వామ్యులు కావడం జరిగింది. వారితో పాటు టి.ఎన్.జి.వో. సంఘం - పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మరియు ఉద్యోగ, ఉపాధ్యాయుల జే.ఏ.సీ. ఛైర్మన్ , ఆలయ సంఘం ఛైర్మన్ శ్రీ బొంకూరి శంకర్ గారి దంపతులు, వారి కార్యదర్శి శ్రీ పిస్క సత్యనారాయణ గారి దంపతులు ఈ రోజు పూజలో భాగస్వామ్యులు కావడం జరిగింది. ఆలయ ఆస్థాన అర్చకులు శ్రీ రంగాచార్యులు ఈ పూజను ఘనంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.జి.వో. ల పట్టణ అధ్యక్షులు శ్రీ అయిరెడ్డి సందీప్ రెడ్డి గారు, ఆలయ కోశాధికారి శ్రీకాంత్ గారు, సరిత , రాజ్ కుమార్, జిల్లా పంచాయితీ సెక్రటరీ సంఘం అధ్యక్షులు నుశాంత్ రావు, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.

సోమవారం, ఆగస్టు 25, 2025

పెద్దపల్లి: నేత్రదానంతో వెలుగులు

నేత్రదాన పక్షోత్సవాలు కరపత్రాలు, బ్యానర్లు ఆవిష్కతీస్తున్న జిల్లా జడ్జి సునీత కుంచాల

నేత్రదానంతో మన చూపు సజీవంగా ఉంటుందని, మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడానికి నేత్రదానం మహా పుణ్యకార్యమని పెద్దపల్లి జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నేత్రదాన పక్షోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా, సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి పృధ్వీ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమానికి, జిల్లా జడ్జి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వరకు నిర్వహించే నేత్రదాన పక్షోత్సవాల అవగాహన కల్పించే కరపత్రాలు, బ్యానర్లను జిల్లా జడ్జి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గారు మాట్లాడుతూ... అవయవ దానంలో  తెలంగాణ రాష్ట్రం మొదటి  స్థానంలో నిలవడం గొప్ప విషయమన్నారు. పెద్దపల్లి జిల్లాలో నేత్రదానంపై అవగాహన పెరుగుతోందని, ఇందుకోసం సదాశయ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. నేత్ర దానంతో చూపు సజీవంగా ఉంటుందని, మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించే గొప్ప పుణ్యకార్యమని, అపోహలు, అనుమానాలు వీడి అందరూ మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు పిలుపునిచ్చారు. జిల్లాలోని ఓదెల, అబ్బిడిపల్లి గ్రామాల ప్రజలంతా స్వచ్చందంగా ముందుకు రావడం స్పూర్తిదాయకమని, ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకొని మరిన్ని గ్రామాలు కూడా ముందుకు రావాలని కోరారు. సదాశయ ఫౌండేషన్ ద్వారా ఇప్పటి వరకు నేత్ర, అవయవ దానాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరు బాగుందని, అందరూ అవగాహన తెచ్చుకొని  చనిపోయిన తరువాత  నేత్రాలను దానం చేసి, మరో ఇద్దరి దేహంలో ఆ కళ్ళతో సజీవంగా ఈ లోకాన్ని చూసే అదృష్టం పొందవచ్చని, మరో ఇద్దరు అంధులకు పునర్జన్మ ఇచ్చినవారవుతన్నారు. కోర్టులో త్వరలో నేత్రదానం, రక్తదానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్థామన్నారు.   తలసేమియా బాధితులను ఆదుకోవడానికి, త్వరలోనే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో distric legel service athority sectrtory  శ్రీమతి swapna Rani garu, AO. p. రవీందర్ గారు , పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేష్ గారు, court lisening officer కోటేశ్వర రావు గారు, ఫౌండేషన్ సభ్యులు భీమనపల్లి పృధ్వీ రాజ్ , శ్యాంప్రసాద్, అశోక్, మేన మహేందర్, బొడ్డుపెళ్ళి లక్ష్మణ్ పాల్గొన్నారు.

పెద్దపల్లి:పరిరక్షణకు మట్టి గణపతులను పూజిద్దాం

మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేస్తున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష


*మట్టి వినాయక విగ్రహా పోస్టర్ ను ఆవిష్కరించి, మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన  జిల్లా కలెక్టర్*

పర్యావరణ పరిరక్షణ కోసం మనమంతా మట్టి గణపతులను పూజించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* ప్రజలను కోరారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో మట్టి వినాయక విగ్రహా పోస్టర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పై ఉందని, మట్టి వినాయకులను పూజించాలని చేసే  అవగాహన కార్యక్రమంలో భాగంగా బస్ స్టాప్, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో వాల్ పోస్టర్లను ప్రదర్శన చేయాలని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేస్తూ పర్యావరణం పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రంగులు ఉపయోగించి తయారు చేసిన గణపతి విగ్రహాల వలన పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని, ఎక్కువ కాలం కరగకుండా నీటిలో ఉండడం వలన నీటిలో ఉన్న స్వచ్ఛత పోతుందని, నీటిలో జీవించే ప్రాణులకు హాని కలుగుతుందని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, మట్టి గణపతిని పూజించాలని ఆయన సూచించారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు సంస్కృతి,  సాంప్రదాయాలను కాపాడవచ్చునని ఆయన వివరించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు వినాయక చవితి పండగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో   బీసీ సంక్షేమ అధికారి రంగా రెడ్డి, ఈఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బిక్షపతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ బండి ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సంబంధిత  అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన ఎం.కవిత తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 

ముత్తారం మండలం పోతారం గ్రామానికి చెందిన గడ్డం పుష్పలత గ్రామ శివారు లోని 59వ సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి తన కబ్జాలో ఉందని, తనకు పట్టా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అర్హత మేరకు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో  సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదివారం, ఆగస్టు 24, 2025

కరీంనగర్: ఘనంగా గాయత్రి హోమం

కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో మంథనికి చెందిన రాంపెల్లి సత్యనారాయణ స్వగృహంలో గాయత్రి హోమం ఆదివారం నిర్వహించారు. లక్ష గాయత్రి జపం పూర్తి చేసిన సందర్భంగా హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ప్రముఖ వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములతో  నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


వర్ధన్నపేట: పాదయాత్రను విజయవంతం చేయాలి

మాట్లాడుతున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి శ్రీనుబాబు

వర్ధన్నపేట నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం జరగనున్న మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పిలుపునిచ్చారు. జనహిత పాదయాత్ర సమీక్ష సమావేశంలో దుద్దిళ్ల శ్రీను బాబు. వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఈ నేపథ్యంలో పాదయాత్ర విజయవంతం అయ్యే విధంగా ఏర్పాట్లపై చర్చించడానికి వర్ధన్నపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ నాగరాజుతో కలిసి  టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. సమావేశంలో పాదయాత్ర రూట్ మ్యాప్, ప్రజలతో అనుసంధానం, స్థానిక స్థాయిలో సమీకరణలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించారు.

శనివారం, ఆగస్టు 23, 2025

హైదరాబాద్: యూరియా’పై ఆందోళన వద్దు


సచివాలయంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు సమీక్ష

రాష్ట్రానికి సరఫరా పెంచేందుకు అన్ని రకాల చర్యలు

ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి పునరుద్ధరణపై మార్గనిర్దేశం

రాష్ట్రానికి యూరియా సరఫరాను పెంచేందుకు మా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురి కావొద్దని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు*. 

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) యాజమాన్యం, వ్యవసాయ శాఖ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో శనివారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సీజన్ లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే శాశ్వత చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆర్ఎఫ్సీఎల్ సీఈవో అలోక్ సింఘాల్ ను ప్రశ్నించారు. మిమ్మల్ని మేం కేవలం వ్యాపారవేత్తలుగా మాత్రమే చూడటం లేదని, రాష్ట్రాభివృద్ధిలో మాతో కలిసి నడిచే భాగస్వామిగా చూస్తున్నామని స్పష్టం చేశారు. 

ప్లాంట్ పునరుద్ధరణకు రూపొందించిన యాక్షన్ ప్లాన్ ను సమీక్షించి మార్గనిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణను చూడొద్దన్నారు. రామగుండంలో ఉత్పత్తి ప్రారంభమయ్యే వరకు ఆర్ఎఫ్సీఎల్ మాతృ సంస్థ ఎన్ఎఫ్ఎల్ కు సంబంధించిన ఇతర ప్లాంట్ల నుంచి తెలంగాణకు ప్రతి రోజు ఒక రేకు యూరియాను సరఫరా చేసేలా చొరవ చూపాలని కోరారు. ఈ విషయంలో మీకేమైనా ఇబ్బందులుంటే కేంద్రంతో మాట్లాడి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భరోసానిచ్చారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్ఎఫ్సీఎల్ రామగుండం యూనిట్ హెడ్, జీఎం రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ: జనహిత పాదయాత్ర సమీక్షా సమావేశంలో శ్రీను బాబు

 


హన్మకొండ జిల్లా డీసీసీ కార్యాలయంలో శనివారం టీపీసీసీ జనహిత పాదయాత్రపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతు జనహిత పాదయాత్ర ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచే దిశగా అడుగులు వేస్తోంది. 25,26వ తేదీల్లో   వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర ఉన్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసి పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.

మహదేవపూర్: పలిమెల మండల పరిషత్ కార్యాలయం నిర్మాణానికి రూ.కోటి యాభై లక్షలు మంజూరు



ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

మంథని నియోజకవర్గంలోని అతిమారుమూల ప్రాంతమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని పలిమెల మండలానికి ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం తెలంగాణ ప్రభుత్వం నుండి పలిమెల నూతన మండల పరిషత్ కార్యాలయానికి కోటి 50 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేయించారు. మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ మంత్రి సీతక్ కి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. పలిమెల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఉండడం వల్ల మారుమూల ప్రాంతమైన ఈ మండలంలో గ్రామాలైన పంకెన, పలిమెల, దమ్మురు, సర్వాయిపేట, లెంకల గడ్డ, మోదేడు, నీలంపల్లి, ముకునూరు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేవేసే విధంగా ఉపయోగపడుతుందని,పలిమెల నూతన మండల పరిషత్ నిర్మాణానికి కోటి 50 లక్షలు ప్రభుత్వం నుండి మంజూరు కావడం పై మండలం లోని ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల ప్రజలు మంత్రి శ్రీధర్ బాబు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

మంథని: వర్క్ షాప్ సందర్శించిన బాలికల కళాశాల విద్యార్థులు

 


మంథనిలోని టీ వర్క్స్ కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రీమ్ స్టార్ట్ రైజ్ వర్క్‌షాప్‌ను  శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్  కళాశాల విద్యార్థులు సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు ఆధునిక పరికరాలు, ప్రోటోటైపింగ్ ప్రక్రియలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రత్యక్షంగా వీక్షించారు. వర్క్‌షాప్‌లో నిర్వాహకులు విద్యార్థినులకు ఆవిష్కరణ, సృజనాత్మకత, సాంకేతిక రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించారు. ఇలాంటి ఫీల్డ్ విజిట్లు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ప్రేరణగా నిలుస్తాయని  నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినులు కూడా ఈ సందర్శన తమకు కొత్త అనుభవాన్ని కలిగించిందని, సాంకేతిక రంగంపై ఆసక్తి పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్తినిలతో పాటు అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు, తిరుపతి,నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి,సబిత, మౌనిక, దీపారాణి,  సురేష్ పాల్గొన్నారు.

గోదావరిఖని: గణపతి మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

 


మాట్లాడుతున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

రామగుండం పోలీస్ కమీషనరేట్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉన్నందున, రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం లో మతసామరస్యం సోదర భావంతో పండుగలను  నిర్వహించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి, మంచిర్యాల జోన్  పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్-నబీ ల పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నిర్వహించారు. 

సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4786 లో మంచిర్యాల జోన్ పరిధిలో- 2316,పెద్దపెల్లి జోన్ పరిధిలో  2476 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంవత్సరం వినాయక విగ్రహాల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందన్నారు.వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయత్ర  సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు.గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి ఒక్క గణపతి మండప కమిటీ అధ్యక్షుడు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.గణేష్ మండపాల వద్ద నిర్మాణ కమిటీలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి నిరంతర నిఘా ఉంటుంది.

24×7 నిరంతరం ప్రతి విగ్రహం వద్ద ఇద్దరు తప్పనిసరిగాఉండాలి. పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తాం, బ్లూ క్లోట్స్,పెట్రో కార్ వారు చెక్ చేయడం జరుగుతుందన్నారు. 

మండపాల పేరుతో ఎలాంటి లక్కీ డ్రాలు నిర్వహించకూడదు.అలాగే జూదాన్ని నిర్వహించరాదు. బలవంతపు చందాలు తీసుకోరాదు.గణేశుని మండపాల వద్దకు మద్యం సేవించి రాకుండా కమిటీ నిర్వాహకులు చూసుకోవాలి.ప్రతి మండపం వారు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలునిర్వహించకూడదు.

తప్పనిసరిగా విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకోవాలి,అనుమతి లేకుండా మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకూడదు. విద్యుత్ కనెక్షన్లు,లైట్ల ఏర్పాటుకు నాణ్యమైన వైర్లను,పరికరాలను వినియోగించాలి. ప్రమాదము జరగకుండా చూసుకోవాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్,అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని,ట్రాఫిక్ కు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా చూసుకోవాలన్నారు.

విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాల చుట్టూ ప్రక్కల నిమజ్జనం వెళ్లే దారులలో ఎలాంటి ఇబ్బందులు కలగాకుండా ఉండేలాగా ముందు గానే చూసుకోవాలి. కొంతమంది సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు పుకార్లు ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు పెట్టే అవకాశం ఉందని ప్రజలు పోస్టులను చూసి సంయమనం పాటించాలని, నిజామా ,అబద్దమా అని స్థానిక పోలీస్ వారిని అడిగి తెలుకోవాలని అన్నారు.ఏలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే డయాల్ 100,కమీషనరేట్ కంట్రోల్ రూం 8712656597 కానీ లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.

సోషల్ మీడియా లో అసత్య ప్రచారాలు చేసి మత ఘర్షణలు జరిగేలాగా లా అండ్ ఆర్డర్ సమస్య కు కారణం అయితే అట్టి వారి ఫై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని మతాలకు సంబంధించిన సమస్య ఆత్మక ప్రాంతాలను గుర్తించి నిరంతరం  నిఘా ఉంచి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను సంతోషంగా జరుపుకునేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సిపి గారు అధికారులను ఆదేశించారు.గణేష్ నిమజ్జనంతో పాటు,మిలన్ -ఉన్ -నబి పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని శోభాయాత్ర సమయంలో పోలీస్ శాఖ రోడ్ మ్యాప్ ను అనుసరించాలని పోలీస్ వారికీ శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్,  స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, గోదావరిఖని ఏసిపి ఎమ్ రమేష్, మంచిర్యాల ఎసిపి ఆర్ ప్రకాష్ జైపూర్ ఏసిపి ఏ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్,ఏ ఆర్ ఏసి పి ప్రతాప్,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరిఖని టూ టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు,పెద్దపెల్లి సిఐ ప్రవీణ్ కుమార్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్,ఇతర వింగ్స్ ఇన్స్పెక్టర్లు, పీస్ కమిటీ సభ్యులు,అన్ని మతల పెద్దలు పాల్గొన్నారు.

హైదరాబాద్: మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం

ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

సాధారణంగానే ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారు. మూసీ విషయంలోనూ ఇదే జరుగుతోంది,భావి తరాల కోసం ప్రక్షాళన చేసి తీరుతాం,వెనక్కి తగ్గేదే లేదు,నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్ గా నిలుపుతాం అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ఐటీపీఐ) తెలంగాణ స్టేట్ రీజినల్ ఛాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టూవార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అని అన్నారు. పర్యావరణం,సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదన్నారు. భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధి ఆవశ్యకమన్నారు.ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని నొక్కి చెప్పారు. మనం రూపొందించే ప్రతి విధానం, కాపాడే ప్రతి అడవి, పునరుద్ధరించే ప్రతి నది, సృష్టించే ప్రతి జీవనోపాధి - ఇవన్నీ తరాల మధ్య న్యాయానికి సంకేతాలని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, కార్బన్ – న్యూట్రల్ గ్రోత్, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంభిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చేయోచ్చన్నారు. వాతావరణ మార్పులు, పట్టణ వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాల తరుగుదల,పట్టణీకరణ, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీపీఐ ప్రెసిడెంట్ ఎన్ కే పటేల్, సెక్రటరీ జనరల్ కుల్ శ్రేష్ఠ, కో-ఆర్డినేటర్(టెక్నో అడ్మిన్) ప్రదీప్ కుమార్,ఐటీపీఐ తెలంగాణ రీజినల్ ఛాప్టర్ ఛైర్మన్ ఎస్.దేవేందర్ రెడ్డి, కార్యదర్శి కె.మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శుక్రవారం, ఆగస్టు 22, 2025

మంథని: యూరియా కొరత లేదు

కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి

రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో మంథని డివిజన్ లో యూరియా కొరత లేదని కిసాన్ సేల్ జిల్లా అధ్యక్షులు ముస్కుల సురేందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథని డివిజన్ లోని ప్రాథమిక సహకార సంఘాలలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని సురేందర్ రెడ్డి తెలిపారు.‌  యూరియా బస్తాల కోసం వచ్చే రైతులు పట్టాదారు పాసుపుస్తకం ఆధార్ జిరాక్స్ పత్రాలను తమ వెంట తీసుకురావాలని కోరారు.  మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో రైతులకు యూరియా కోసం  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా నిల్వలు సరిపడ ఉన్నాయన్నారు. రైతులు ఏమాత్రం అధైర్య పడవద్దని, రైతులకు యూరియా కొరత లేకుండా వ్యవసాయ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కొందరు కావాలని యూరియా నిల్వలు లేవని అసత్య ప్రచారాలు చేస్తున్నారని,  యూరియా కావలసిన రైతులు సహకార సంఘం లో సంప్రదించగలరని కోరారు. యూరియా మంథని నుంచి అక్రమంగా తరలిపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

బుధవారం, ఆగస్టు 20, 2025

మంథని: బహిరంగ సభకు భారీగా తరలిరావాలి

మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

సెప్టెంబర్ 9న హైదరాబాదులో పెద్ద ఎత్తున నిర్వహించే భారీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఎమ్మార్పీఎస్సీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. 

బుధవారం మంథని ఎస్ఎల్బి గార్డెన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పెంచుతామని చెప్పి మోసం చేసి 20 నెలలు గడిచిన మాట నిలబెట్టుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఏర్పడినాక వాగ్దానాలను తుంగలో తొక్కారని ఆయన విమర్శించారు. వికలాంగులకు 6000 పెన్షన్, వృద్ధులకు, వితంతువులకు 4000 పెన్షన్ చివరకు ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. వికలాంగులకు  వృద్ధులకు, వితంతువులకు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిన విధంగా పెన్షన్ పెంచి ఇవ్వాలని తాము ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేస్తే ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్  నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని ఆయన మండిపడ్డారు. వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ పెరిగేందుకు 30 సంవత్సరాల నుండి ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నానని దాని ఫలితమే ఇప్పుడు కొనసాగుతున్న 2000 రూపాయల పెన్షన్ అని ఆయన తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి సర్కార్ వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ పెంచి ఇవ్వాలని లేకుంటే తాడోపేడో తేల్చుకుంటామని ఆయన సవాలు విసిరారు. ఎన్నికల్లో గెలుపు కోసం వికలాంగులను, వృద్ధులను, వితంతువులను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు పెన్షన్ పెంచి ఇవ్వకుంటే గద్ద దింపే వరకు తాము నిరంతరం పోరాడుతామని ఆయన హెచ్చరించారు సెప్టెంబర్ 9న జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాగా గుణపాఠం చెప్పే విధంగా మనం చాటు చెప్పాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా డివిజన్ మండల స్థాయి నాయకులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, అంబాల రాజేందర్ మాదిగ, ఎల్ గోపాల్ పల్లె బాపు మాదిగ, నరిగ మల్లేశ్వరి మంథని చందు, ఐరెడ్డి నారాయణరెడ్డి, కేసారపు నరేష్ మాదిగ, మడిపల్లి దశరథం, అగ్గిమల్ల కొమురయ్య మాదిగ, నేదూరి రవి,పెర్క శ్యామ్, మంథని లక్ష్మణ్, కన్నూరి ఓదెలు, ఆసం తిరుపతి, గద్దల శంకర్,ఊట్ల శ్రీనివాస్,కొయ్యల మొండి, చిలుక సారయ్య, మంథని సమ్మయ్య, ఇందారపు ప్రభాకర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షురాలు మల్లేశ్వరి, జిల్లా కన్వీనర్ మామిడి సంపత్, మంథని డివిజన్ అధ్యక్షుడు లక్కేపురి శ్రీనివాస్ లతోపాటు మంత్ర నియోజకవర్గంలోని వివిధ మండలాల కు చెందిన అధ్యక్షులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

గోదావరిఖని: ఫోరెన్సిక్‌ వాహనం ప్రారంభించిన రామగుండం సీపీ

నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను   సేకరించే  ఫోరెన్సిక్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్‌  విభాగం రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ నూతనంగా మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో  పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 

 ఈ సందర్బంగా రామగుండం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.... ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, అత్యాధునిక పరికరాల తో రూపోందించబడిన ఈ మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనాని రామగుండం కమిషనరేట్‌ పోలీసులకు మరింత మెరుగైన సేవలందించనున్నది. ఇకపై ఎదైనా నేరం జరిగిన ప్రదేశానికి ఫోరెన్సిక్‌, ఫింగర్‌ ప్రింట్‌ అధికారులు, సిబ్బంది ఈ మొబైల్‌ ఫోరెన్సిక్‌ వాహనంలో చేరుకోని సంఘటన జరిగిన స్థలం నుండి రక్తమరకలు, వ్రేలిముద్రలతో ఇతర సాక్ష్యాదారాలను సేకరించి ఈ మొబైల్‌ వాహనంలో ఏర్పాటు చేసిన  ఆధునిక పరికరాలతో  పరీక్షలను  నిర్వహించి సంబంధిత దర్యాప్తు అధికారికి ప్రాథమిక సాక్ష్యాధారాలను అందజేయడం జరుగుతుందని. రామగుండం పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు. ఈ కార్యక్రమములో  స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, ఏ ఓ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏ. రాము, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ మంచిర్యాల్, ఇన్స్పెక్టర్ లు రవీందర్, చంద్రశేఖర్ గౌడ్, ఆర్ఐ లు దామోదర్, మల్లేశం, ఆర్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిసి హరీష్ తో ఇతర పోలీస్‌, క్లూస్ టీమ్, RFSL సిబ్బంది పాల్గొన్నారు.

సుల్తానాబాద్: యూరియా కొరత లేదు

 గోడౌన్లో తనిఖీ చేస్తున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష

రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఎక్కడ కొరత లేదని, పంట విస్తీర్ణం ఆధారంగా యూరియా రైతులకు అమ్మాలని, ప్రస్తుత అవసరాలకే కొనుగోలు చేయాలని అనవసరంగా యూరియా నిల్వ చేయవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

బుధవారం  మండలంలోని అనంతరం సుల్తానాబాద్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య సహకార సంఘం గోడౌన్ ను, ఎరువుల షాప్ తనిఖీ చేశారు. ఎరువుల విక్రయం వివరాల రిజిస్టర్ పక్కగా మెయింటైన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి ఆవరణ చుట్టు విద్యుత్ దీపాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను  కలెక్టర్ ఆదేశించారు. 

*12 లక్షల 50 వేల రూపాయల  నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎన్.ఎస్.టి యంత్రాలను* కలెక్టర్ ప్రారంభించారు. 

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సుల్తానాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమా దేవి, మున్సిపల్ కమిషనర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి నాగార్జున,  సంబంధిత అధికారులు,  తదితరులు పాల్గొన్నారు. 

మంథని: మాజీ ఎమ్మెల్యేకు మతిభ్రమించింది


మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు 

వీడియో



మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు మతిభ్రమించిందని మంథని కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బుధవారం మంథనిలో మీడియా సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, తెలంగాణ  విద్యుత్ నియంత్రణ  సలహా కమిటి సభ్యులు శశి భూషణ్ కాచే, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న,  మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్ మాట్లాడారు.

సిరిపురం బ్యారేజ్  నుంచి నీళ్లను వృధా కిందికి వదిలిపెడుతున్నారని  మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.  భారీ వర్షం వల్ల బ్యారేజీలలో వరద నీరు చేరి బ్యారేజ్ నిండుకుండలా ఉండడం ద్వారా వరద నీటిని అధికారులు కిందికి వదులుతున్నారని, ఇది కూడా తెలువక మాట్లాడుతున్న పుట్ట మధు అజ్ఞానానికే వదిలేస్తున్నామని అన్నారు.

రాబోయే రోజులలో గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణలో మొదటగా అరెస్టు అయ్యే వ్యక్తి పుట్టనే అని, చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానమేనని ఇన్ని రోజులు వేచి చూసిన సందర్భం త్వరలోనే రాబోతున్నదని సిబిఐ ఎంక్వయిరీలో నిజాలు బట్టబయలు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ ప్రాంత రైతులు బ్యారేజ్ల ద్వారా నష్టపోయారే తప్ప ఈ ప్రాంత రైతులకు ఒక్క చుక్కనీరు అందించిన పాపాన పోలేదని, గత ప్రభుత్వంలో బ్యారేజీల బ్యాక్ వాటర్ ద్వారా పంట పొలాలు వరద నీరు చేరి ఈ ప్రాంత రైతులు నష్టపోయారని గుర్తు చేశారు.

 గత ప్రభుత్వం ఈ ప్రాంత ఇసుకను దోచుకుని ప్రభుత్వాన్ని నడిపించిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని నిర్మించారని ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని వారన్నారు.

ఈ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉద్దేశంతో జేఎన్టీయూ, పాలిటెక్నిక్, ఐటిఐ డిగ్రీ ఇంటర్ తదితర కాలేజీలను ఈ ప్రాంత విద్యార్థుల కోసం తీసుకువచ్చి మంచి విద్యను అందించాలని సంకల్పంతో మంత్రి శ్రీధర్ బాబు ముందుకెళ్తున్నారని నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎస్సీ సెల్ బీసీ సెల్. విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026