మంథనిలోని టీ వర్క్స్ కేంద్రంలో నిర్వహిస్తున్న డ్రీమ్ స్టార్ట్ రైజ్ వర్క్షాప్ను శనివారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థినులు ఆధునిక పరికరాలు, ప్రోటోటైపింగ్ ప్రక్రియలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రత్యక్షంగా వీక్షించారు. వర్క్షాప్లో నిర్వాహకులు విద్యార్థినులకు ఆవిష్కరణ, సృజనాత్మకత, సాంకేతిక రంగాల్లో ఉన్న అవకాశాలను వివరించారు. ఇలాంటి ఫీల్డ్ విజిట్లు బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ప్రేరణగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినులు కూడా ఈ సందర్శన తమకు కొత్త అనుభవాన్ని కలిగించిందని, సాంకేతిక రంగంపై ఆసక్తి పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్తినిలతో పాటు అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు, తిరుపతి,నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి,సబిత, మౌనిక, దీపారాణి, సురేష్ పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి