హన్మకొండ జిల్లా డీసీసీ కార్యాలయంలో శనివారం టీపీసీసీ జనహిత పాదయాత్రపై ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క,అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతు జనహిత పాదయాత్ర ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీని మరింత బలపరచే దిశగా అడుగులు వేస్తోంది. 25,26వ తేదీల్లో వర్ధన్నపేట నియోజకవర్గంలో జనహిత పాదయాత్ర ఉన్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేసి పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి