గోడౌన్లో తనిఖీ చేస్తున్న కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఎక్కడ కొరత లేదని, పంట విస్తీర్ణం ఆధారంగా యూరియా రైతులకు అమ్మాలని, ప్రస్తుత అవసరాలకే కొనుగోలు చేయాలని అనవసరంగా యూరియా నిల్వ చేయవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం మండలంలోని అనంతరం సుల్తానాబాద్ మండలంలో ప్రాథమిక ఆరోగ్య సహకార సంఘం గోడౌన్ ను, ఎరువుల షాప్ తనిఖీ చేశారు. ఎరువుల విక్రయం వివరాల రిజిస్టర్ పక్కగా మెయింటైన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి ఆవరణ చుట్టు విద్యుత్ దీపాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు.
*12 లక్షల 50 వేల రూపాయల నిధులతో నూతనంగా కొనుగోలు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్, ఎన్.ఎస్.టి యంత్రాలను* కలెక్టర్ ప్రారంభించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సుల్తానాబాద్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమా దేవి, మున్సిపల్ కమిషనర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి నాగార్జున, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి