Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

బుధవారం, ఆగస్టు 13, 2025

పెద్దపల్లి: సినిమా/ వినోద రంగంలో నైపుణ్య కోర్సులు



**ప్రతి కోర్సు కు 25 వేల ఫీజు, హస్టల్  ఫీజు 20 వేలు* 

**ఆసక్తిగల అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం నుంచి కొంత సబ్సిడీ

  సినిమా/వినోద రంగంలో స్వల్ప కాలిక నైపుణ్య కోర్సులు అందిస్తున్నామని ఆసక్తి గల వారు జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

 నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్  ఆధ్వర్యంలో 3 నెలల పాటు సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ స్కిల్, డిజిటల్ డిజైన్ & సోషల్ మీడియా మేనేజ్మెంట్  కోర్సులలో నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. 


ప్రతి కోర్స్ కు 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని అన్నారు. 3 నెలల పాటు జరిగే కోర్సు కు  25 వేల రూపాయల ఫీజు , 20 వేల రూపాయల హస్టల్ ఫీజు ఉంటుందని,  హైదరాబాద్ కొండాపూర్ లోని న్యాక్ అకాడమీలో శిక్షణ ఉంటుందని అన్నారు.   

ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కోర్సుపట్ల ఆసక్తి గలవారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులో రూమ్ నెంబర్ 225 లో గల జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో సంబంధిత ధృవ పత్రాలతో తమ పేర్లు నమోదు చేసుకోవాలని , కోర్సు పట్ల ఆసక్తిగల అభ్యర్థులకు ఫీజు లో కొంత భాగం కలెక్టరేట్ నిధుల నుంచి సబ్సిడీ కింద అందించడం జరుగుతుందని ఆ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మంథని: మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం


‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో చోటు



రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో ఆయనకు చోటు లభించింది. తమ సమర్థవంతమైన నాయకత్వం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహామిస్తూ భారత్ ను ఏఐ రంగంలో అగ్రగామిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్న వ్యక్తులకు ఇందులో చోటు కల్పించారు. విధాన రూపకర్తల విభాగంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పీయూష్ గోయల్, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, ఇండియా ఏఐ మిషన్ సలహాదారు ఆకృత్ వైష్, ఇండియా ఏఐ మిషన్ సీఈవో, ఎన్ఐసీ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, ఎన్ పీసీఐ సీఈవో దిలీప్ అస్బే, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్, నాస్కామ్ మాజీ అధ్యక్షులు దేబజాని ఘోష్ తదితర ప్రముఖులను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.

** ఏఐ రంగంలో రోల్ మోడల్ గా తెలంగాణ **

మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏఐ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ మారిందని, అందుకే ఆయనను ఈ జాబితాలో చేర్చినట్లు అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ నిర్వాహకులు ప్రకటించారు. ‘బాధ్యతాయుతమైన ఏఐ అమలు కోసం సమగ్ర ఏఐ ఆధారిత తెలంగాణ స్ట్రాటజీ అండ్ రోడ్ మ్యాప్ ను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. గుడ్ గవర్నెన్స్, నూతన ఆవిష్కరణలు, సురక్షితమైన డేటా షేరింగ్‌ను ప్రోత్సహించేలా దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్ ను ప్రారంభించేందుకు చొరవ చూపారు’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కొనియాడారు. ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహణలోనూ మంత్రి శ్రీధర్ బాబు కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో ఏఐ ఎకో సిస్టమ్ ను మరింత బలోపేతం చేసేలా 2025–26లో 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఆర్ అండ్ డీ, నూతన ఆవిష్కరణలు, అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేయాలనే సంకల్పంతో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీ విషయంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు’ అని ప్రశంసించారు. ఏఐ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమయ్యేలా మంత్రి శ్రీధర్ బాబుకు దక్కిన ఈ గుర్తింపు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

** సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహాంతోనే ఈ గుర్తింపు ; మంత్రి శ్రీధర్ బాబు **

ఇది నా ఒక్కడికి లభించిన గుర్తింపు కాదు. యావత్తు తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. సమ్మిళిత వృద్ధి, మెరుగైన జీవితాలను అందించేందుకు ఏఐని వినియోగించాలన్న మా ప్రభుత్వ సుదూర దృష్టికి ఈ గుర్తింపు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే నాకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఆయన నాయకత్వంలో తెలంగాణను ఏఐ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ గా తీర్చిదిద్దేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. నూతన ఆవిష్కరణలకు సమానత్వాన్ని జోడించి, సాంకేతిక పురోగతి ఫలితాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందేలా కృషి చేస్తున్నాం.

మంథని:కార్మిక నేత బాసాని రాజయ్య విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

 


మంథని నియోజకవర్గంలో కార్మిక నేతగా వారి హక్కుల సాధన కోసం కృషి చేసిన హమాలి సంఘం మంథని డివిజన్ వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు స్వర్గీయ బాసాని రాజయ్య విగ్రహ ఏర్పాటుకు మంథని హమాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం భూమి పూజ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు.. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని హమాలీ సంఘం కార్యాలయం ముందు భాగంలో స్వర్గీయ బాసాని రాజయ్య విగ్రహ ఏర్పాటు కోసం హమాలీ సంఘం సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నేతల అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో వివిధ రంగాలోని కార్మికులు, హమాలీల హక్కుల కోసం బాసాని రాజయ్య పోరాడటం తోపాటు వారిని ఏకం చేసి గ్రామ గ్రామాన హమాలీ సంఘాలను నెలకొల్పి చట్టబద్ధంగా వారికి రిజిస్ట్రేషన్ చేసి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. రాజయ్య జీవితకాలం కార్మిక వర్గాల పక్షపాతిగా బతికారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేష్, బుక్క పుల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, ఆర్టీఏ  మెంబర్ మంథని సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మాజీ సర్పంచ్ వొడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ-సురేష్ రెడ్డి , కొండేల మారుతి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, సీపీఎం నేత బూడిద గణేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, శ్రీపతి బానయ్య, మంథని సత్యం, బాసాని రమేష్, చింతల గోవింద్ లు పాల్గొన్నారు.

మంథని: సరిపడా ఎరువులను అందించాలి

జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్



 మంథనిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి తిరుగుతున్నారని,రైతులకు సకాలంలో ఎరువులను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతాంగానికి సకాలంలో ఎరువులు అందడం లేదని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి ఎరువులను సరఫరా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

మంథని:పరిశుభ్రతకు ప్రాధాన్యత

10వ వార్డులో డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్న పెంటరి రాజు 

 వర్షాలు అధికంగా కురువడంతో డ్రైనేజీ శుబ్ర పరచడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు మంథని పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటరి రాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు లు వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించడంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులో బుధవారం మున్సిపల్ కమిషనర్ వెంకన్న సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం అలాగే దోమల బెడద లేకుండా బ్లీచింగ్ పౌడర్ మున్సిపల్ సిబ్బందితో చల్లించినట్లు రాజు పేర్కొన్నారు. వర్షాలు అధికంగా ఉన్న మూలంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రపరచాలని ఆయన మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు పట్టణ ప్రజలు వివరించారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీపతి బాలయ్య,,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిషోర్ రెడ్డి, సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జి ఆరెల్లి కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు పెరుగు సతీష్, కవుటం సాయి పాల్గొన్నారు.

పెద్దపల్లి: ఉద్యోగ అవకాశాలు

 ప్రీ - ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ , ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

పెద్దపల్లి డీఈవో మాధవి

 ఆగస్టు 21 లోపు ప్రీ - ప్రైమరీ  ఇన్ స్ట్రక్టర్, ఆయా పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన పని చేయుటకు ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని *జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి* బుధవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి 46  ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలో తాత్కాలికంగా 10 నెలల గౌరవ వేతనానికి పని చేయుటకు  ప్రీ - ప్రైమరీ  ఇన్ స్ట్రక్టర్, ఆయా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీ.ఈ.ఓ తెలిపారు.

 ప్రీ - ప్రైమరీ  ఇన్ స్ట్రక్టర్ పోస్టుకు అభ్యర్థి ఇంటర్మీడియట్ , ఆయా కు 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలని, అభ్యర్థులకు 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ బీసీ, ఈ.డబ్ల్యూ.ఎస్ కు 5 సంవత్సరాల, దివ్యాంగులకు 10 సంవత్సరాల , మాజీ సైనికులకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుందని అన్నారు. 

అభ్యర్థుల ఒకే నివాసం, హేబిటేషన్ మండలం పెద్దపెల్లి జిల్లా ప్రాధాన్యత క్రమంలో ఎంపిక ఉంటుందని అన్నారు.  విద్యార్హతలు గల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు ఆగస్టు 21 లోపు సమర్పించాలని విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 

పెద్దపల్లి: విదేశాల్లో ఉపాధి అవకాశాలు

 26న అవగాహన సదస్సు



పెద్దపల్లి కలెక్టర్  కోయ శ్రీ హర్ష

 ఆగస్టు 26న విదేశాల్లో ఉపాధి అవకాశాల పై కలెక్టరేట్ లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని *జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.


తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా రాష్ట్ర యువతకు సురక్షితమైన  చట్టబద్ధమైన విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. టామ్‌ కామ్‌ విదేశీ నియామకదారులతో అనుసంధానం చేసి, అవసరమైన డాక్యుమెంటేషన్, శిక్షణ, ప్లేస్‌మెంట్ వంటి సదుపాయాలు అందిస్తోందని కలెక్టర్ తెలిపారు.

జపాన్  లో  ప్రస్తుతం నర్సింగ్ కేర్ (₹14–16 లక్షలు వార్షిక ప్యాకేజ్), జర్మనీ  లో ఎలక్ట్రిషియన్ ( ₹32.76– 34.80 లక్షలు వార్షిక ప్యాకేజ్), ఇజ్రాయెల్  లో కన్స్‌ట్రక్షన్ వర్కర్: (₹19.20 లక్షలు వార్షిక ప్యాకేజ్), ఫిజీ – ఫిట్టర్ / ఎలక్ట్రిషియన్ / సర్వీస్ టెక్నీషియన్ ( ₹6–10 లక్షలు వార్షిక ప్యాకేజ్) గ్రీస్ – హౌస్‌కీపింగ్ / వెయిటర్ / ఎలక్ట్రిషియన్ / మేసన్ (₹12 లక్షలు వార్షిక ప్యాకేజ్), ఇతర అవకాశాలు పోర్చుగల్, యుఏఈ దేశాల్లో అందుబాటులో ఉన్నాయని అన్నారు.

ఆగస్టు 26న పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు టామ్ కామ్ ద్వారా విదేశాలలో ఉపాధి అవకాశాల పై అవగాహన  కార్యక్రమం  నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని టామ్‌ కామ్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు. టామ్‌కామ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని  జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం, గది నం. 231 ఆగస్టు 26 వరకు సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు 

మంగళవారం, ఆగస్టు 12, 2025

గోదావరిఖని:72 గంటలు హై అలర్ట్

అత్యవసమైతే తప్ప బయటికి రావద్దు 


రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

రానున్న 72 గంటల పాటు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ సూచించిందని, భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనరేట్ పరిధిలోని  ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనను విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

*భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి*

📌 రాగల 72 గంటల్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ గారు తెలిపారు.

📌 వర్షాలు కురుస్తున్నందున రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని డ్యామ్స్ మరియు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది అని సాధారణ పరిస్థితి వచ్చే వరకు అక్కడికి ఎవరు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.

📌రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా  తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు  సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

📌 ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు.

📌 చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు. 

📌ఎవ్వరు కూడా ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువులోకి, నాలాలు, డ్యామ్స్, వాటర్ ఫాల్స్  లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి.

📌 స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ  అధికారులతో  సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు  ఏర్పాటు చేయడం జరిగింది.

📌 ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.

📌వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు.

📌వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా  ప్రయాణించండి. వర్షానికి రోడ్లు  కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి  అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.

📌వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.

మంథని: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా..


* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

* అసలు దోషులకు శిక్ష పడాలి

* సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి

గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. మంథనిలో నడిరోడ్డుపై అడ్వకేట్ వామన్ రావు దంపతులు హత్యకు గురైతే అప్పటీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా అసలు దోషులను కాపాడిందన్నారు. కుమారుడు, కోడలిని కోల్పోయిన ఆ వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సిన అప్పటి ప్రభుత్వ పెద్దలు.. విచారణను తప్పుదోవ పట్టించి అసలు హంతకులను కాపాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. చివరకూ... న్యాయమే గెలుస్తుందన్నారు.

న్యూడిల్లీ:సీబీఐకి న్యాయవాద దంపతుల హత్య కేసు

 


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 2021 ఫిబ్రవరి 19న మంథని కోర్టులో ఒక కేసు గురించి వచ్చి హైదరాబాద్ కు కారులో తిరిగి వెళ్తున్న క్రమంలో ఇరువురు దంపతులను దుండగులు రామగిరి పోలీసుస్టేషన్ పరిధిలోని నడిరోడ్డుపై

దారికాచి అందరూ చూస్తుండగానే  మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ దాడిలో నాగమణి అక్కడికక్కడే మృతిచెందగా,  వామన్ రావు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా గమనించిన కొంతమంది అతన్ని ఒక వాహనంలో పెద్దపల్లి ఆసుపత్రికి తరించగా అక్కడే ఆయన తుది శ్వాస వదిలారు. మంథని పెద్దపల్లి రహదారి మధ్య పట్టపగలు రద్దీగా ఉన్న సమయంలోనే జరిగిన ఈ హత్యాకాండ ను కొంతమంది ప్రయాణికులు మొబైల్ లో చిత్రీకరించారు.  అలాగే దాడిలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై సహాయం కోసం అర్థిస్తున్న వామనరావు కొనఊపిరితో ఉండగా తనపై దాడి చేసిన వారి వివరాలను వెల్లడించిన ఒక వీడియో కూడా అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి విచారణ జరిపారు. అప్పటి ఐజీ నాగిరెడ్డి కేసు దర్యాప్తు జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటనపై రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, అప్పటి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను తో పాటు కుంట శ్రీను, చిరంజీవి ప్రధాన నిందితులుగా నిర్ధారించగా, వారికి సహకరించిన వారిని కోర్టుకు హాజరుపర్చారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రమేయముందని, కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరుపాలని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు ఎన్నోసార్లు విచారణకు వచ్చింది కానీ ఫైనల్ గా మంగళవారం మాత్రం ఈ కేసుకు సంబంధించి కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది.  2021 ఫిబ్రవరి 19న జరిగిన ఈ హత్యలో అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉండడంతో విచారణ సరిగ్గా జరగలేదంటూ గట్టు కిషన్ రావు తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో  ఉన్నట్లు ఆరోపించబడుతున్న పుట్ట మధుతో పాటు మరికొంతమంది తరపున వాదిస్తున్న న్యాయవాదులు ఇప్పటివరకు ఈ కేసు విచారణ సరిగ్గానే జరిగిందనీ, కేసు హైకోర్టు పర్యవేక్షణ ఉందని  వాదించారు.  అలాగే హత్య ఘటన జరుతున్న సమయంలో తీసిన వీడియోలు అన్ని కూడా హైదరాబాదులో ఎఫ్ఎస్ఎల్ సంబంధించి పూర్తి నివేదిక తయారు చేసిందనీ, ఇప్పుడు మళ్లీ కొత్తగా మరొక దర్యాప్తు సంస్థకు ఈ కేసును బదిలీ చేయాల్సిన అవసరం లేదని తమ వాదనలు వినిపించారు. కానీ గట్టు కిషన్ రావు మాత్రం తన కొడుకు, కోడలు హత్యకు సంబంధించిన విచారణ రాష్ట్రంలో సరిగా జరగట్లేదు అంటూ ఆయన తరుపున వినిపించిన వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. సిబిఐకి ఈ కేసును బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్లకు ప్రొటెక్షన్ కావాలని కూడా ప్రతివాదులకు చెందిన అడ్వకేట్స్ అడిగినా,  ప్రొటెక్షన్ ఇచ్చేది లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సంచలనం సృష్టించిన గట్టు వామనరావు దంపతుల కేసును సిబిఐ కి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్, శ్రీమంతుల చిరంజీవి, అక్క పాక కుమార్, తులసిగారి శ్రీనివాస్, ఊదరి లక్ష్మణ్, వెల్ది వసంతరావు, కాపు అనిల్ లు విచారణ ఎదురు కొంటున్నారు. సిబిఐ విచారణలో వాస్తవాలు అన్ని వెలుగులోకి వస్తాయని నమ్మకం తమకు ఉందని వామన్ రావు తండ్రి కిషన్ రావు తెలిపారు. సిబిఐ విచారణలో పూర్తి విషయాలు బయటకు వస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

మంథని: అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి"



అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీ మహా గణపతి దేవాలయంలో సిద్ధి,బుద్ధి సమేతంగా కొలువు తీరిన గణనాథున్ని  సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గణనాథుని ఆలయాలు భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది.

 దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ  సంకష్టహర చతుర్థి దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. కొత్తగా చతుర్థి దీక్ష తీసుకునేవారు అంగారక చతుర్థి రోజున దీక్ష తీసుకోవడం ఎంతో శ్రేయష్కారం. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికమించడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష చేపట్టడం అనాదిగా పాటిస్తున్న నియమం. సంకష్టహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వరుని పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేసి మోదకులు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.  గణపతికి ఇష్టమైన వారం మంగళవారం అలాగే నవగ్రహాల్లోని కుజ గ్రహ దోషం పోవాలన్న మంగళవారం వచ్చే అంగారక చతుర్థి రోజున "ఓం గం గణపతియై నమః " అని స్మరిస్తూ విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటే అన్ని సంకటాలు తొలగిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకష్టహర చతుర్థి వస్తుంది ఏడాదిలో ఒకసారి మంగళవారం వచ్చే చతుర్థి ని అంగారక అంటారు. ఈ రోజున రాత్రి 9 గంటలకు చంద్రోదయం అనంతరం స్వామివారికి పూజ చేసి భోజనం చేయడం ఎంతో శ్రేయష్కారం. ఈ రోజున ఉపవాస దీక్ష స్వీకరిస్తే జీవితంలో ఎదుర్కొంటున్న విజ్ఞాలన్ని తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి దేవాలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు. దేవతలలో మొట్టమొదట పూజించబడే ఎంతో విశిష్టత కలిగిన శ్రీ విఘ్నేశ్వరున్ని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి అంతా శుభం జరుగుతుందనే విశ్వాసంతో సంకష్టహర చతుర్థి దీక్షను స్వీకరిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరునికి ఇష్టమైన గరిక ( దూర్వాలు ) సమర్పించడం అలాగే 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రలవుతారు అని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ రోజున చంద్రోదయం అనంతరం  భోజనం చేయడం ఈ దీక్షలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆలయ పూజారి పల్లి రాము భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.


సోమవారం, ఆగస్టు 11, 2025

కాటారం: అన్నదాతలకు ఆదాయ వనరులు పెంచుతాం


 ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు



జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో  తనకున్న  భూమిలో  ఆయిల్ ఫామ్ మొక్కలను నాటించారు. 


అనంతరం రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు   మాట్లాడుతూ.. 


రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. 


రాష్ట్రంలో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్న సమయంలో అంతర్భాగంగా ఇతర పంటలను కూడా సాగు చేసుకోవడం ద్వారా రెండు రకాలుగా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని అన్నారు. 


ఆయిల్ ఫామ్ పంట మూడు సంవత్సరాలలో దిగుబడి వస్తుందని తెలిపారు. 


ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ఉద్యానవన శాఖ నుంచి సబ్సిడీ రాయితీలను అందిస్తున్నామని పేర్కొన్నారు. 


మొక్కలకు ట్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తారని, మొక్క నాటిన నుంచి నాలుగేళ్ల వరకు రూ. 4,200 వరకు రాయితీ ఇస్తారని అన్నారు. 


అన్నదాతలు ఆయిల్ ఫామ్ సాగు చేసేలా మా యొక్క భూమిలో ఈ పంటను నాటామని అన్నదాతలు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసి ఆర్థిక అభివృద్ధిని సాధించాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


చిల్డ్రన్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు


భవిష్యత్ తరాలకు బహుమతిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చిల్డ్రన్ పార్కును ఘనంగా ప్రారంభించారు.  కాటారం మండల కేంద్రంలో CSR 36 లక్షలతో శ్రీపాద చిల్డ్రన్ పార్క్ మరియు ఓపెన్ జిమ్  మంత్రి శ్రీధర్ బాబు  ప్రారంభించారు అనంతరం,మరియు మద్దులపల్లి,ధర్మసాగర్, అంకుశాపూర్, రేగులగూడెం, కాటారం  నూతన గ్రామ పంచాయతీ భవనాలకు 7 అంగన్వాడీ నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు.


కమాన్ పూర్: రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకు ఉపయోగపడాలి

- రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు డి.శ్రీధర్ బాబు



* కమాన్ పూర్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, సహకార బ్యాంకు బ్రాంచ్ ను  ప్రారంభించిన మంత్రి  

 రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులో ఉపయోగ పడాలని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.

సోమవారం  మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి వర్యులు  కమాన్ పూర్ మండలంలో  65 లక్షలతో నిర్మించిన నూతన పి.ఎ.సి.ఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) భవనాన్ని, 79 లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని, కరీంనగర్ డి.సి.సి.బి  చైర్మన్ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష లతో కలిసి  మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కమాన్ పూర్ మండలంలో సహకార బ్యాంకు బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా రైతులకు సహకార సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజా ప్రభుత్వం లో గత సంవత్సర కాలంలో రైతు సంక్షేమం దిశగా రాజీ లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. 

జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ బ్రాంచ్ నందు డిపాజిటర్లకు, కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా నిర్మించడం జరిగిందని అన్నారు.  పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను వారికి చేర్చేందుకు బ్యాంకులు ఉపయోగ పడతాయని అన్నారు.

రైతుల సంక్షేమం దృష్ట్యా సహకార బ్యాంకులో దోహదపడతాయని అన్నారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా కమాన్ పూర్ మండల కేంద్రం లో సహకార బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేశామని అన్నారు.  

కరీంనగర్ డి.సి.సి.బి  చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ,  కమాన్ పూర్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని,  సహకారం బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. 

కేంద్ర సహకార బ్యాంకులో 72 శాఖలు ఉంటే 32 భవనాలు నిర్మించుకోవడం జరిగిందని,సహకార  సొసైటీ ద్వారా కూడా  భవనాలు బ్యాంకుకు అద్దె ఇవ్వడం జరుగుతుందని అన్నారు.  గతంలో 70కోట్ల నష్టం 400 కోట్ల వ్యాపారంతో ఉన్న సహకార బ్యాంకును  నేడు 7200 కోట్ల వ్యాపారం, 120 కోట్ల లాభాలతో నడిచేలా అభివృద్ధి చేశామని, ప్రతి సంవత్సరం కస్టమర్లకు వాటాదారులకు బోనస్ కూడా అందిస్తున్నామని అన్నారు 

ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్,  ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


అచ్చంపేట: నూతన మునిసిపల్ భవనం ప్రారంభం

కార్యాలయం ప్రారంభించిన మంత్రి వివేక్

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో 3 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యధిక అంగులతో నూతనంగా నిర్మించిన మునిసిపల్ కార్యాలయ భవనాన్ని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ లు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ల తో కలిసి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మునిసిపల్ సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని అత్యంత సుందరమైన భవనాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి మున్సిపాలిటీ భవనాన్ని ఎక్కడ చూడలేదని మంత్రి తెలిపారు. ఇంతటి గొప్ప భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ నిర్మాణానికి ప్రత్యేక కృషి చేయడంతోనే భవనం సుందరంగా రూపుదిద్దుకుందని మంత్రి ఎమ్మెల్యే వంశీకృష్ణ ను అభినందించారు.  పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, పట్టణాలు గ్రామాల అభివృద్ధికి బాటలు వేసేలా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సకాలంలో తొలగింపు, కాలువల శుభ్రత, తాగునీటి సరఫరాలో వ్యత్యాసాలు లేకుండా చూసేలా సంబంధిత శాఖల అధికారులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి నివాసానికి శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో కాలువలు, డ్రెయిన్‌లు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్య పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన మున్సిపల్ కౌన్సిలర్లకు సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, కార్మికులు, తదితర వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇవి సామాజిక, ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా తెలిపారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ‌ము ఇచ్చిన 6 గ్యారెంటీల‌ను   తప్ప‌క అమ‌లు  చేస్తామ‌ని, ఇందులో భాగంగా ఒక్కొక్క‌టిగా  నిరంత‌రంగా సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. అలాగే ఇచ్చిన వాగ్దానంతో  అర్హులైన అందరికీ పథకాలు అందిస్తూ  ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నామని, ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ను మెరుగు ప‌రుస్తూన్నామ‌న్నారు. ప్రతి ఒక్కరికి కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో  ఆహార భద్రత చట్టం తీసుకురావడం  జరిగిందని, గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల నిరుపేదలు కడుపునిండా తిండి తినలేక పోవడానికి గ్రహించి నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. మన రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకు 5 వందల రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ పండించిన సన్నబియ్యాన్ని ధనవంతుడు తింటున్న విధంగానే పేదలు తినాలన్న ఉద్దేశంతో  సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు.  దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా పేదలకు 5 లక్షలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున పేద ప్రజల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులకు రైతు భరోసా,రుణమాఫీ చేశామని తెలిపారు. గృహ‌జ్యోతి ప‌థ‌కం,  గ్యాస్ ప‌థ‌కం,  ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో  ఎ క్కడ కూడా రాజీ పడకుండా అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా మహిళలు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిక్షత తో  ఉందని మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న  ప్ర‌తి ప‌థ‌కాన్ని అర్హులైన ల‌బ్డిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్దికంగా అభివృద్ధి చేందాల‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఇన్చార్జి ఎస్పీ రావుల గిరిధర్, మున్సిపల్ చైర్మన్ జి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.


మంథని : సోలార్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

 రైతులను బలోపేతం చేసే దిశగా చర్యలు

రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మంత్రి డి.శ్రీధర్ బాబు



మంథని  మండలం గుంజపడుగు గ్రామం వద్ద 2 కోట్ల 90 లక్షల రూపాయలతో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. రైతులను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. సోమవారం  మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కరీంనగర్ డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు  లతో కలిసి మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వేరు హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 7 కోట్ల రూపాయలతో  5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రెండు గోదాములకు, గుంజపడుగు గ్రామంలో 2 కోట్ల 90 లక్షల రూపాయలతో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్  శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో గుంజపడుగు శివారులో పిఎం కుసుమ్ క్రింద 3.5 కోట్ల రూపాయలతో 1 మెగా వాట్ సోలార్ విద్యుత్  ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో నంది మేడారం, కాల్వ శ్రీరాంపూర్,అప్పన్న పేట, మంథని ప్రాంతాలలో 1 మెగా వాట్ చోప్పున ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 4 నెలల కాలంలో ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, గ్రిడ్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. చిల్లపల్లి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను 7 కోట్ల రూపాయలతో చేపట్టామని అన్నారు. గుంజపడుగు ప్రాంతంలో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆర్బిఐ కు పంపాలని మంత్రి సూచించారు. సహకార శాఖ లో 20 సంవత్సరాల కాలంగా తన వంతు కృషి చేస్తున్న కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతు సోదరులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనుబంధ రంగాలైన గోదాముల నిర్మాణం, పిఏసిఎస్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు నువ్వంటే కార్యక్రమాల వల్ల రైతులను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్,  మంథని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకన్న,ఆర్డిఓ సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహసిల్దార్, ఎంపిడిఓ,సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


శనివారం, ఆగస్టు 09, 2025

హైదరాబాద్: కొత్తపేటలో బ్రాహ్మణ ఉపకర్మ

హైదరాబాదులోని కొత్తపేట శ్రీ గౌతమి గజానన మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఉపాకర్మ( శ్రావణి)*

👇👇👇👇

అవధానుల ప్రసాద్ శర్మ సౌజన్యం


మంథని :ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

మంథని నియోజకవర్గ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ దగ్గర్లో గల కాంగ్రెస్ జెండాను ఎగరవేసి అనంతరం కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు. స్థానిక బస్టాండ్ లో యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలతో రాఖీలు కట్టించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసి డిపో మేనేజర్ తో మాట్లాడి మహిళల ప్రయాణ సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరినారు. మేనేజర్ సానుకూలంగా స్పందించి బస్సులు అదనంగా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ 1960 లో స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య యువజన విభాగం,యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి విభాగం యూత్ కాంగ్రెస్ అని తెలిపారు.యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ఓనమాలు నేర్చి అనేకమంది దేశవ్యాప్తంగా ప్రముఖంగా రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు.యువత రాజకీయంగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ మంచి ప్లాట్ ఫామ్ అని ఈ సందర్భంగా తెలిపారు.గత 10 సంవత్సరాలు యువజన కాంగ్రెస్ ప్రతి గ్రామాల తిరుగుతూ గ్రామ గ్రామాన యువజన కాంగ్రెస్ కమిటీలు వేసి అనేక ధర్నాలు, దీక్షలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి యువజన కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందిస్తుందో వాటిని అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా మరియు ప్రజలకు నాయకులు శ్రీధర్ బాబు కి మధ్య యువజన కాంగ్రెస్ వారధిల పని చేస్తుందని తెలిపారు.యువజన కాంగ్రెస్ నాయకులు ప్రియతమ నేత రాష్ట్ర మంత్రి అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు ఏదైతే ఈ నియోజవర్గాన్నే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోతు ఉన్నారు.ఈ ప్రాంతంలో విద్య వైద్యం మౌలిక సదుపాయాలు తాగునీరు సాగునీరు అందిస్తూ అన్ని రంగాలలో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్నారని, శ్రీను బాబు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వారు పరిష్కరిస్తూ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారని అన్నారు.శ్రీధర్ బాబు మరియు శ్రీనుబాబు నాయకత్వంలో రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా శ్రీధర్ బాబు ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు శక్తి వంచన లేకుండా పని చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కమాన్ పూర్ లో..

 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెబల్ రాజు ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అన్వర్ తోపాటు లల్లు, మల్యాల మహేష్, ఇ రుగు రాళ్ల రాజు, చొప్పరి సంతోష్, నల్లెల్లి శంకర్, కా డిపల్లిసుమన్ తదితరులు పాల్గొన్నారు.

మంథని:

 ఆపరేషన్ సింధూర్ 

జవాన్ కు చెల్లెలి రాఖీ


కమాన్ పూర్ మండలం నాగారం లింగాల గ్రామానికి చెందిన ఆపరేషన్ సింధూర్ జవాన్ పెరుమాళ్ అభిరామ్ కు తన చెల్లెలు శ్రీజ రాఖీ కట్టారు. ఇటీవల పాకిస్తాన్ తో ఆపరేషన్స్ సింధూర్ లో భాగంగా అభిరాం రాజోలి బోర్డర్లో తన సేవలను అందించారు. ఇటీవల సెలవుల్లో స్వగ్రామానికి రాగా తన చెల్లెలు శ్రీజ రాఖీ కట్టి నువ్వు దేశానికి ఇలాగే రక్షణగా ఉండాలని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ దేశానికి సేవ చేయాలని కోరింది.

హైదరాబాద్:

మంత్రి శ్రీధర్ బాబుకు రాఖీ కట్టిన మహిళలు



రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్  మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబు కు మంథని నియోజకవర్గ మహిళలు సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

మంథని:

ఘనంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ

మంథని పట్టణంలోని అన్ని వాడల్లోని దేవాలయాలు సాముహిక యజ్ఞోపవీతధారణ కార్యక్రమం శనివారం  భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తమ్మిచెరువు కట్ట శ్రీ వీర హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వేదమూర్తులైన అవధానుల పురుషోత్తం, కిషోర్ లు హోమగుండం ఏర్పాటు చేసి వేదమంత్రాలతో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026