ప్రీ - ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ , ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లి డీఈవో మాధవి
ఆగస్టు 21 లోపు ప్రీ - ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్, ఆయా పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన పని చేయుటకు ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని *జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి* బుధవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో 2025-26 విద్యా సంవత్సరానికి 46 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలో తాత్కాలికంగా 10 నెలల గౌరవ వేతనానికి పని చేయుటకు ప్రీ - ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్, ఆయా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీ.ఈ.ఓ తెలిపారు.
ప్రీ - ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్ పోస్టుకు అభ్యర్థి ఇంటర్మీడియట్ , ఆయా కు 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలని, అభ్యర్థులకు 18 నుంచి 44 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని, ఎస్సీ, ఎస్టీ బీసీ, ఈ.డబ్ల్యూ.ఎస్ కు 5 సంవత్సరాల, దివ్యాంగులకు 10 సంవత్సరాల , మాజీ సైనికులకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుందని అన్నారు.
అభ్యర్థుల ఒకే నివాసం, హేబిటేషన్ మండలం పెద్దపెల్లి జిల్లా ప్రాధాన్యత క్రమంలో ఎంపిక ఉంటుందని అన్నారు. విద్యార్హతలు గల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు ఆగస్టు 21 లోపు సమర్పించాలని విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి