మంథని నియోజకవర్గంలో కార్మిక నేతగా వారి హక్కుల సాధన కోసం కృషి చేసిన హమాలి సంఘం మంథని డివిజన్ వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు స్వర్గీయ బాసాని రాజయ్య విగ్రహ ఏర్పాటుకు మంథని హమాలి సంఘం ఆధ్వర్యంలో బుధవారం భూమి పూజ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు.. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని హమాలీ సంఘం కార్యాలయం ముందు భాగంలో స్వర్గీయ బాసాని రాజయ్య విగ్రహ ఏర్పాటు కోసం హమాలీ సంఘం సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నేతల అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో వివిధ రంగాలోని కార్మికులు, హమాలీల హక్కుల కోసం బాసాని రాజయ్య పోరాడటం తోపాటు వారిని ఏకం చేసి గ్రామ గ్రామాన హమాలీ సంఘాలను నెలకొల్పి చట్టబద్ధంగా వారికి రిజిస్ట్రేషన్ చేసి అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు. రాజయ్య జీవితకాలం కార్మిక వర్గాల పక్షపాతిగా బతికారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేష్, బుక్క పుల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, మాజీ సర్పంచ్ వొడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ-సురేష్ రెడ్డి , కొండేల మారుతి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, సీపీఎం నేత బూడిద గణేష్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకుల కిరణ్, శ్రీపతి బానయ్య, మంథని సత్యం, బాసాని రమేష్, చింతల గోవింద్ లు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి