**ప్రతి కోర్సు కు 25 వేల ఫీజు, హస్టల్ ఫీజు 20 వేలు*
**ఆసక్తిగల అభ్యర్థులకు జిల్లా యంత్రాంగం నుంచి కొంత సబ్సిడీ
సినిమా/వినోద రంగంలో స్వల్ప కాలిక నైపుణ్య కోర్సులు అందిస్తున్నామని ఆసక్తి గల వారు జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సినిమాటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, డబ్బింగ్ అండ్ వాయిస్ ఓవర్ స్కిల్, డిజిటల్ డిజైన్ & సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోర్సులలో నైపుణ్య శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి కోర్స్ కు 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలని అన్నారు. 3 నెలల పాటు జరిగే కోర్సు కు 25 వేల రూపాయల ఫీజు , 20 వేల రూపాయల హస్టల్ ఫీజు ఉంటుందని, హైదరాబాద్ కొండాపూర్ లోని న్యాక్ అకాడమీలో శిక్షణ ఉంటుందని అన్నారు.
ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కోర్సుపట్ల ఆసక్తి గలవారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని మొదటి అంతస్తులో రూమ్ నెంబర్ 225 లో గల జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో సంబంధిత ధృవ పత్రాలతో తమ పేర్లు నమోదు చేసుకోవాలని , కోర్సు పట్ల ఆసక్తిగల అభ్యర్థులకు ఫీజు లో కొంత భాగం కలెక్టరేట్ నిధుల నుంచి సబ్సిడీ కింద అందించడం జరుగుతుందని ఆ కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి