శ్రీ వారాహీదేవి యంత్ర, విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో శ్రీను బాబు
మల్హర్రావు మండలంలోని పెద్దతుండ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ వారాహీదేవి యంత్ర మరియు విగ్రహ ప్రతిష్ఠాపన, అలాగే నవగ్రహ యంత్ర మరియు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య యంత్రాలు, విగ్రహాలను ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చి, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీను బాబు ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించి, గ్రామ ప్రజల శ్రేయస్సు, సుఖసంపదల కోసం ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చి, ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి