Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శుక్రవారం, ఆగస్టు 08, 2025

కలెక్టర్ కు రాఖీలు కట్టిన అంగన్వాడీ టీచర్లు

కలెక్టర్ కు రాఖీలు కట్టిన అంగన్వాడీ టీచర్లు
పెద్దపల్లి కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష కు సంక్షేమ శాఖ లోనే అంగన్వాడీ టీచర్లు మహిళా సిబ్బంది శుక్రవారం రాఖీలు కట్టారు.

స్థానిక సంప్రదాయాలను ప్రజా చైతన్యం కోసం వినియోగించాలి : కలెక్టర్

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాఖీ పండుగ వంటి స్థానిక సంప్రదాయాలను ప్రజా చైతన్యం కోసం వినియోగించాలని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాల ద్వారా  పోషకాహారం పంచినప్పటికీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు,  పిల్లలకు అది సరిగ్గా స్వీకరించక పోవడానికి పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యత పై ప్రజలలో అవగాహన లోపం ప్రధాన కారణంగా గమనించామని అన్నారు.  

  స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ప్రజలు ప్రభుత్వ పథకాలను స్వీకరించడం లో నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారని,  బలహీనంగా ఉన్న పిల్లలు సాధారణ స్థితికి చేరుకోవడానికి అంగన్వాడీల ద్వారా 'బాలామృతం', 'బాలామృతం ప్లస్' వంటి పోషకాహార పొట్లాలను తల్లిదండ్రులకు అందజేసినా, వాటిని పిల్లలకు సరిగ్గా ఇవ్వడం లేదని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

ఈ సమస్యను అధిగమించేందుకు **పోషణ బంధం'* పేరిట  రాఖీ పండగ సందర్భంగా ప్రత్యేక 'పోషణ రాఖీలు' తయారు చేయించి, వాటిని జిల్లాలోని అన్ని అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేశామని ,  ప్రతి అంగన్వాడీ టీచర్ తమ పరిధిలోని గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల ఇళ్లకు స్వయంగా వెళ్లి, ఆ ఇంటిలోని పురుషులకు రాఖీ కట్టి, పోషకాహారం యొక్క అవసరాన్ని వివరిస్తారని అన్నారు .

 అంగన్వాడీలలో అందించే పూర్వ ప్రాథమిక విద్య, ఒకపూట పూర్తి భోజనం, 'బేటి బచావో, బేటి పడావో' పథకం కింద బాలికల విద్య, సంక్షేమం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారని, వారి పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీకి పంపాలని కోరతారని, జిల్లాలో దాదాపు 15000 గృహాలకు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు వెళ్ళి చైతన్యం కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు.పోషణ బంధం కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని , జిల్లా సంక్షేమ అధికారి , సిడిపిఓ లను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026