Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శుక్రవారం, ఆగస్టు 08, 2025

గోదావరిఖని:

క్రిటికల్ కేర్ భవనం త్వరలో ప్రారంభించాలి

-  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష


* ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

* సీజనల్ వ్యాధుల నేపథ్యంలో పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

* నగరంలో పారిశుధ్య నిర్వహణ అత్యంత ప్రాధాన్యత కల్పించాలి

* రామగుండంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్

జనరల్ ఆసుపత్రి లో క్రిటికల్ కేర్ భవనం నిర్మాణం పెండింగ్ పనులు పూర్తి చేసి త్వరలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ రామగుండం ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు.  రామగుండం ప్రాధమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అర్బన్ హెల్త్ సెంటర్, గోదావరిఖని జనరల్ ఆసుపత్రి, తబిత ఆశ్రమం, రామగుండం మున్సిపల్ కార్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్దేశించిన లక్ష్యం మేరకు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ఎన్.సి.డి సర్వే పకడ్బందీగా నిర్వహించి బీపీ మధుమేహం ఉన్న వారికి అవసరమైన మందుల కిట్ అందించి మందులు వాడేలా రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని అన్నారు. ఏ.ఎన్.ఎమ్, ఆశా కార్యకర్తల పనితీరు ప్రతివారం సమీక్షించాలని అన్నారు.  పి.హెచ్.సి, అర్బన్ హెల్త్ సెంటర్ లలో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సేవలు, ప్రసవాలు పెంచాలని అన్నారు.  జనరల్ ఆసుపత్రిలో   పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రి క్రిటికల్ కేర్ భవనం నిర్మాణ పనులు పూర్తి చేసి క్రిటికల్ కేర్ భవనం త్వరలో ప్రారంభించాలని అన్నారు.  ఆసుపత్రిలో సమస్యల పట్ల కమిటి ఏర్పాటు చేసి నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. సీజనల్ వ్యాధుల వ్యాప్తి వర్షాకాలంలో అధికంగా జరిగే అవకాశం ఉన్నందున తబితం ఆశ్రమంలో ఉన్న పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆశ్రమంలో ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు.  కార్పొరేషన్ లో పారిశుధ్య నిర్వహణ పట్ల కలెక్టర్ అధికారులతో చర్చించి వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, సిజనల్ వ్యాధుల వ్యాప్తి జరగకుండా చూడాలని, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వంటివి వేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట గోదావరిఖని జనరల్ ఆసుపత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ హిమబిందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ఆర్.ఎం.ఓ డాక్టర్ రాజు, వైద్య అధికారులు డాక్టర్ అతుల్య, డాక్టర్ శ్రీధర్, సంబంధిత వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026