దండేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ
మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, జోన్ పోలీస్ స్టేషన్ ల విజిట్ లో భాగంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సందర్శించి పిటిషన్ లను వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. డిసీపీ, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల, పిడియస్ రైస్, గుడుంబా సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, చట్టం వ్యతిరేకమైన కార్యకలా పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, దండేపల్లి ఎస్ ఐ తైసినద్దీన్ ఉన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి