Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శనివారం, సెప్టెంబర్ 27, 2025

హైదరాబాద్: మెట్రో లో మంత్రి శ్రీధర్ బాబు ప్రయాణం



రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నగరవాసుల "మెట్రో" అనుభవాలను స్వయంగా తెలుసుకునేందుకు శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొని, తూర్పున ఉన్న నాగోల్ స్టేషన్ నుండి పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ రాయదుర్గం వరకు ప్రయాణించారు. మెట్రో సేవలు, సౌకర్యాలు, స్టేషన్లలో భద్రత, రవాణా సవాళ్లు, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రయాణీకులతో  ముచ్చటించారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన రవాణాను అందించేందుకు తమ  ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఈ సందర్భంగా ప్రయాణీకులకు వివరించారు. 

నగరంలో ప్రజా రవాణా బలోపేతానికి ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, మెట్రో ఫేజ్ - 2 విస్తరణ, ఆర్ఆర్ఆర్, ఇతర భవిష్యత్తు ప్రణాళికలను ప్రయాణీకులకు వివరించారు. సలహాలు, సూచనలు స్వీకరించారు.  ఇది ప్రజా ప్రభుత్వం. ప్రశంసలను తీసుకుంట్లుగానే... విమర్శలను స్వీకరిస్తామని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

మంథని: డాక్టర్ ప్రవీణ్ కుమార్ కు సన్మానం

డిస్టింగ్విస్ట్ హోమియోపతి సైంటిస్ట్ గా 2025లో నేషనల్ అవార్డు పొందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను శనివారం మంథనిలో ఘనంగా సన్మానించారు. ఆయన జె ఎస్ పి ఎస్ జిహెచ్ఎంసి కళాశాలలో ఆయన ప్రిన్సిపాల్ గా సేవలందించి పదవీ విరమణ పొందారు. తన వృత్తిలో ఆయన ఉన్నతమైన సేవలు అందించారని, అలాగే ఆయన ఎన్నో అవార్డులు పొందారని మంథని ప్రముఖులు పనకంటి చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాది లోకే రాధా కిషన్ రావు లు ఈ సందర్భంగా కొనియాడారు. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంథని విచ్చేసిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను మహాలక్ష్మి ఆలయంలో శాలువాతో సన్మానించి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేశ్వరం దేవస్థానం మాజీ చైర్మన్ అవధాని మోహన్ శర్మ, లోకి మనోహర్ రావు, టక్కేగారి రాధాకృష్ణ లు పాల్గొన్నారు.

శుక్రవారం, సెప్టెంబర్ 26, 2025

మంథని: సహకార సంఘాన్ని అభివృద్ధి చేస్తాం

మాట్లాడుతున్న సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారానే వ్యాపార వైవిద్యం సాధ్యమవుతుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మంథని సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన 87వ సర్వ సభ్య సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, సహకార సంఘాలు ఆకాశమే హద్దుగా ఏ వ్యాపారమైనా చేయవచ్చని అన్నారు. ఇందులో భాగంగానే ఐటి, పరిశ్రమలు,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ గుంజపడుగు గ్రామా శివారులో 4 ఎకరాల ప్రభుత్వ స్థలం  కేటాయించారని అన్నారు. రూ.3.50కోట్లతో ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా సంఘానికి సంవత్సరానికి సుమారు 50లక్షల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల పదవి కాలాన్ని రెండు మార్లు పెంచి తమపై ఎంతో బాద్యతను పెంచిందని అన్నారు. బి గ్రేడ్ లో కొనసాగుతున్న మంథని సహకార సంఘం 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో ఏ గ్రేడ్ లోకి వచ్చిందని అన్నారు. అలాగే గతంలో ఎప్పుడు కూడా సంఘ సభ్యులకు డివిడెండ్ ఇవ్వలేదని, సంఘ చరిత్రలోనే తమ పాలకవర్గం మొట్టమొదటి సారి డివిడెండ్ ప్రకటించిoదని అన్నారు. సహకార సంఘం పురోభివృద్దికి తాము, తమ పాలకవర్గం అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. కరోనా లాంటి విప్పత్తు కాలంలో కూడా సహకార సంఘ ద్వారా రైతులకు ఏ ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు. సహకార సంఘంలో నూతన ఒరవడి సృష్టిస్తూ సంఘాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. సంఘం ద్వారా నాగారం శివారు లో రైస్ మిల్ ఏర్పాటుకు అన్ని అనుమతులు లభించాయని, రహదారి సమస్య పరిష్కారం కాగానే మిల్లు నిర్మాణ పనులు చేపడుతామని అన్నారు. సహకార సంఘం ద్వారా గత సీజన్ లో కంటే ఈ సారి ఎక్కువగానే యూరియా అందిoచడం జరిగిందని అన్నారు. ఇతర ప్రాంతాల్లో యూరియా కొరత ఉన్నప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యెక కృషితో ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతూ కొరత లేకుండా తగు చర్యలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భంగా సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్ సంఘ జమఖర్చులను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సంఘ చైర్మన్, కార్యదర్శి ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు. మొట్టమొదటి సారిగా సంఘానికి విచ్చేసిన ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, డైరెక్టర్ మేదరవేన ఓదెలు ను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షులు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, మాచిడి రాజుగౌడ్, ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, సిరిముర్తి ఓదెలు, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్. దాసరి లక్ష్మి-మొండయ్య. ఉడుత మాధవి-పర్వతాలు యాదవ్, దేవల్ల విజయ్ కుమార్, టీజీఈఆర్సి సలహాదారు’ శశిభూషణ్ కాచే, నాయకులు మూల పురుషోత్తం రెడ్డి, భూడిద గణేష్, బెజ్జంకి డిగంబర్, రామడుగు మారుతీ, నామని సుగుణ, నాగుల రాజయ్య, ఎరుకల ప్రవీణ్,గొల్లపల్లి శ్రీనివాస్,సాదుల శ్రీకాంత్, బడికెల లింగయ్య, పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు.

మంథని: మహాలక్ష్మి సన్నిధిలో మంత్రి శ్రీధర్ బాబు


భజన చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబు

వీడియో కోసం కింద లింక్ క్లిక్ చేయండి
https://youtube.com/shorts/hEh_Dhvc8o4?si=0HV936PcajR5vQ0g

మంథని పట్టణంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భక్తిశ్రద్ధలతో పలు దేవాలయాలను సందర్శించారు. మొదటగా  మహాలక్ష్మి దేవాలయంలో మహాలక్ష్మి అమ్మవారిని, లలితా దేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతారామ సేవాసదనలో, సాయిబాబా దేవాలయంలో సాయిబాబాని దర్శించుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నాను. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయడం నా ధర్మం” అని పేర్కొన్నారు. దేవాలయ అర్చకులు మంత్రి శ్రీధర్ బాబు ని శాలువాతో సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

పెద్దపల్లి: వీర వనిత చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

నివాళి అర్పిస్తున్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మహిళా శక్తికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. 

శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* చాకలి ఐలమ్మ సంఘ సేవకురాలుగా, భూమి, సాయుధ రైతాంగ పోరాటంలో ప్రదర్శించిన పోరాట పటిమతో వీర వనితగా చరిత్రలో నిలిచి, ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.

సమాజహితం కొరకు పోరాడిన మహనీయుల స్ఫూర్తి, వారి త్యాగాలు, గొప్పతనం ప్రజలకు తెలిసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచి, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అటువంటి వీర వనితను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి, రజక సంఘ నాయకులు, జిల్లా అధికారులు,  కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

గురువారం, సెప్టెంబర్ 25, 2025

మంథని: రెడ్డి సేవ సంఘం అధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

Vedio link click...

https://youtube.com/shorts/OpD9UgoJctM?si=GkGgnd0iVlI29KhU

దిక్సూచి ప్రతినిధి: మంథని పట్టణంలోని రెడ్డి సేవ సంక్షేమ సంఘం అధ్వర్యంలో గురువారం  బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రెడ్డి భవనంలో భారీ బతుకమ్మ ను ఏర్పాటు చేసిన ఈ  వేడుకల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు బతుకమ్మ పండుగ ఎంతో ప్రాముఖ్యమైందని, ఈ పండుగను మహిళలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారని వారందరికీ ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. రెడ్డి సేవ సంక్షేమ సంఘం అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు కే.కే. రెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎంఎస్.  రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎలుక సత్యనారాయణ రెడ్డి, సహాయక కార్యదర్శి ముసుకట్ల రమణారెడ్డి, మంథని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండ్రు రమాదేవి, మాజీ జడ్పిటిసి మూల సరోజనతో పాటు తదితరులు పాల్గొన్నారు.









కాటారం: పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్

వీడియో కోసం క్లిక్ చేయండి..
https://youtube.com/shorts/yPGOx9G6t-8?si=gNBkEo5Pm0k7TgUh

పేదవాని సొంతింటి  కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు  రాష్ట్ర, ఐటి పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు అన్నారు. గురువారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు,

మహిళ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణమాసం  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను  పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు.  అనంతరం

అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా పోషణ మాసం కార్యక్రమ చేపట్టడం జరిగిందన్నారు.

మరొకటి పేద వాడి సొంతింటి  కల నెరవేర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకుకు వచ్చి అర్హులైన లబ్ధిదారులకు నేడు మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందన్నారు.

ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు, గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, అట్టి జాబితా ను గెజిటెడ్ అధికారులతో విచారణ నిర్వహించి నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజక వర్గం వ్యాప్తంగా 3500 ఇళ్ళు మంజూరు అయ్యాయని తెలిపారు.

ప్రతి సంవత్సరం 3500 ఇళ్ళు మంజూరు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఒక్క ఇల్లు అందించలేదని తెలిపారు. మంజూరు అయిన ఇళ్లకు 5 లక్షలతో నిర్మాణము జరుగుతుందని, 

4 విడతలుగా  నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి సోమ వారం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా  మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.

400 నుండి 599 ఎస్ ఎఫ్ ఫ్టీ  వరకు ఇంటి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. అంతకు మించి సైజు పెరిగితే బిల్లులు విడుదల కావని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే సిమెంట్ కూడా తక్కువ దరకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు  ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు  20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. రైతు ఋణ మాఫీ, విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు నేడు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

ఒక ఇళ్లు నిర్మిస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్లుగా నిలిచిపోటామని తెలిపారు. పేదోళ్లకు ఇబ్బందులు కలిగించే పనులు చేయొద్దని మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు సేవలు చేయాలని ప్రజలను మన్ననలు పొందాలని  తెలిపారు. 

నిర్మాణంలో జాప్యం లేకుండా ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని,  ఇల్లు నిర్మాణం ఆగిపోతే ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారుల వేతనాల నుంచి కోత విధిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వ అధికారులు గానీ ఇతరులు ఎవరైనా లబ్ధిదారులను డబ్బులు అడిగితే పోలీస్ కేసు నమోదు చేయాలని సూచించారు.  మీ ఆశలను నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిర ఇల్లు మంజూరు చేసిందని మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలని సూచించారు.  ర ఇల్లు నిర్మాణంతో సంతోషంగా ఉండాలని, మనం మనం గుర్తుకు రావాలని ఆయన సూచించారు

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. గెజిటెడ్ అధికారులతో విచారణ జరిపి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని తెలిపారు. A I ద్వారా కూడా విచారణ చేపట్టామని తెలిపారు. లబ్ధిదారులు ఫోటో దిగిన చోట మాత్రమే ఇళ్లు నిర్మాణం చేపట్టాలని, 4 విడతలుగా లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు త్వరిత గతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణీ లకు సీమంతం, కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, మహిళా, శిశు సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి, మిషన్ భగీరథ ఈఈ శ్వేతా, మహాదేవపూర్ సింగిల్ విండో ఛైర్మన్ తిరుపతి రెడ్డి, సీడీపీఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.









పెద్దపల్లి: కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు

కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, టీఎన్జీవో అధ్యక్షులు బొంకూరి శంకర్ ,జిల్లా అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

కాటారం: మహా చండీయాగం చేసిన మంత్రి శ్రీధర్ బాబు



వీడియో కోసం... క్లిక్ చేయండి
https://youtu.be/v0mUAzcaF0c?si=NM0tlVP7fe7Y5Tvh

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూజలు చేసి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం, నవగ్రహా హోమం, మహా చండీ యాగం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని,సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు, అనంతరం వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.

మంథని: గ్రీన్ హైవే రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న పుట్టపాక గ్రామస్థులు


ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

 ఏసీబీ మడత రమేష్ జోక్యంతో శాంతించిన రైతులు

 మంథని :మంథని మండలం పుట్టపాక  గ్రామంలో భూ నిర్వాసితులు పుట్టపాక దగ్గర నిర్మిస్తున్న గ్రీన్ హైవే నిర్మాణ పనులను గురువారం ఉదయం అడ్డుకున్నారు. పుట్టపాక దగ్గర నిర్మిస్తున్న నాగ్ పూర్ - విజయవాడ గ్రీన్ హైవే నిర్మాణ పనులను చేపట్టడానికి వచ్చిన అధికారులను, జెసిబిలను భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనతో పోలీస్ పహార మధ్య ఉద్రిక్తంగా మారింది. మొత్తం 108 కి.మీ దూరం నిర్మించే జాతీయ రహదారి పనులను మూడు ప్యాకేజీల కింద విభజించారు.1వ ప్యాకేజీలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్‌పల్లి నుంచి మంథని మండలం పుట్టపాక వరకు 31 కి.మీ దూరానికి రూ.873లో 2వ ప్యాకేజీ కింద పుట్టపాక నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి వరకు 38 కిలోమీటర్ల దూరానికి రూ.881 కోట్లు, 3వ ప్యాకేజీ కింద భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి నుంచి హనుమకొండ జిల్లా ఊరగొండ వరకు 39 కి.మీ దూరానికి రూ.851 కోట్లు కేటాయించారు.డివిజన్‌లో మొత్తం 204.46 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇప్పటివరకు 164.49 హెక్టార్లకు పరిహారం చెల్లించగా వివిధ కారణాలతో 19.73 హెక్టార్లు చెల్లింపులు జరగాల్సి ఉంది. 1,519 మంది నిర్వాసితుల్లో 1,303 మందికి రూ.47.13 కోట్ల పరిహారం అందించారు. మరో 216 మందికి రూ.8.51 కోట్లు చెల్లించాల్సి ఉంది. సాగులో ఉన్నవారి పేరిట రికార్డులో లేకపోవడం, సాదా బైనామాలు ఉండటం, వివాదాలు, కోర్టు కేసులతో పరిహారం చెల్లింపులో జాప్యం చోటుచేసుకుంటుంది.
భూ నిర్వాసితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగిందంటూ రైతులు ఆర్బిట్రేషన్ కింద కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పరిహారం మొత్తాన్ని పెంచారు. రూ.51.17 కోట్లు మంజూరు కాగా ఇప్పటివరకు రూ.46.12 కోట్లు చెల్లించగా ఇంకా రూ.5.04 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. రికార్డులు సరిగ్గా లేని వారికి పరిహారం చెల్లించలేక పోతున్నామని అధికారులు వివరణ ఇస్తున్నారు. చివరికి గోదావరిఖని ఏసిపి మడత రమేష్ జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు.

మంథని: కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబురం

మంథని కోర్టు ఆవరణలో గురువారం మద్యాహ్నం బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు,ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.భవాని,కోర్టుల సిబంది,మహిళా న్యాయవాదులు శ్రీమతి  జి.శ్రీ లక్ష్మి,శ్రీమతి  బండ మాధురి, తో పాటు బార్ అసోసియేషన్ ఉపాద్యక్షులు కే.రఘోత్తం రెడ్డి,ప్రధాన కార్యదర్శి యం. సహేందర్ రెడ్డి, గ్రంథాలయ కార్యదర్శి కటుకం శరీనివాస్,ఏజీపి బి ఆంజనేయులు,సదన్ కుమార్,శశి భూషణ్ కాచె,మంథని శ్రీనివాస్, వ్యాస్ కుమార్ లు పాల్గొన్నారు

బుధవారం, సెప్టెంబర్ 24, 2025

కాటారం: 25న మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం కాటారం మండలంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. మధ్యాహ్నం  1-00 గంటలకు కాటారంలోని  BLM గార్డెన్ లో కాటారం, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్, మలహర్ రావు సంబంధించిన గ్రామాలలో 300 ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు  మంజూరు పత్రాలను మరియు 4 మండలాల 50 CMRF/90 కల్యాణ లక్ష్మి చెక్కులను శ్రీధర్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు, మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి పోషణ్ మహా మాసం అంగన్వాడి లబ్ధిదారులకు నిర్వహించే  కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నట్లు ఆ ప్రకటలో పేర్కొన్నారు.

హైదరాబాద్: యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్థారు

'డేర్ టూ డ్రీమ్' శిబిరం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు

వీడియో కోసం.. క్లిక్ చేయండి
https://youtube.com/shorts/0PvtszPGet4?si=9D-5nZxyxQR2xt8o

(దిక్సూచి ప్రధాన ప్రతినిధి)
యువతలో అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని, వారిని మనం ప్రోత్సహిస్తే అద్భుతాలుసృష్టించగలరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా తూంకుంటలోని అలంకృత రిసార్ట్‌లో 'డేర్ టూ డ్రీమ్' పేరిట సిఖ్ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు.* ఆలోచనలకు, ఆకాంక్షలకు పరిమితులు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా యువతకు దిశా నిర్దేశం చేశారు. కలలు కనడం ఎంత ముఖ్యమో, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడటం కూడా అంతే ముఖ్యమన్నారు. గెలుపోటముల గురించి ఆలోచించొద్దని, లక్ష్యాన్ని చేరుకునే వరకూ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాలని సూచించారు. కృషి, పట్టుదల లేకుండా ఏ కల సాకారం కాదన్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సిఖ్ సొసైటీ ప్రతినిధులు తేజ్ దీప్ కౌర్, గగన్ కోహ్లీ, సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం, సెప్టెంబర్ 23, 2025

మంథని: లేబర్ స్కీములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు

సహాయ కార్మిక అధికారికి వినతి పత్రం అందజేత         
దిక్సూచి ప్రతినిధి: సీఐటీయూ ఆధ్వర్యంలో మంథని సహాయ కార్మిక అధికారి డి రవీందర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు  బూడిద గణేష్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ప్రమాద మరణానికి 10 లక్షలు సహజ మరణానికి రెండు లక్షలు పెంచుతూ నిర్ణయం చేసిందని అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలుగా చేసిన పోరాట ఫలితంగానే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.కానీ స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని జీవో నెంబర్ 12 తీసుకువచ్చి 346 కోట్ల రూపాయలను ప్రైవేటు సంస్థలకు అక్రమంగా అప్పజెప్పడం అన్యాయమని అన్నారు. జీవో నెంబర్ 12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న క్లైమ్ లను వెంటనే పరిష్కారం చేయాలని సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దుచేసి కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులతో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాబు రవి,మంథని కిష్టయ్య,నఫీజ్ తదితరులు పాల్గొన్నారు

సోమవారం, సెప్టెంబర్ 22, 2025

హైదరాబాద్: ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు

మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ముస్కుల సురేందర్ రెడ్డి సోమవారం సాయంత్రం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. సేవా కార్యక్రమాలతో సంఘాన్ని బలోపేతం చేసే దిశలో అడుగులు వేయాలని, ఆదర్శంగా నిలిచి అందరి మన్ననలు పొందాలని మంత్రి సూచించారు. తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ సంఘానికి, వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఉంటాయని అన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి, దామోదర్ రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని: దుర్గమాత మండపాలను సందర్శించిన ఏసీపీ

గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ గారు, గోదావరిఖని ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ దుర్గామాత విగ్రహాలను సందర్శించి అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడుతూ మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నవరాత్రులు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండపాల ప్రాంతాలలో బ్లూ క్లోట్స్ పెట్రో కార్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించాలని,పాయింట్ బుక్స్ చెక్ చేయాలని సూచించారు.

హైదరాబాద్: సేవే నిజమైన సంపద

*శ్రీ అగ్రసేన్ మహారాజ్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ది* 

  *అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి*

*రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*

సేవే నిజమైన సంపద అని చాటి చెప్పిన శ్రీ అగ్రసేన్ మహారాజ్ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 
రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో సహా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ లో తెలంగాణ అగర్వాల్
సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘5149వ అగ్రసేన్ జయంతి వేడుకల’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి వృద్ధి సాధించినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. శ్రీ అగ్రసేన్ మహారాజ్ కేవలం పాలకుడు మాత్రమే కాదని, ఒక గొప్ప సామాజిక శిల్పి అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన 'ఒక ఇటుక, ఒక నాణెం' సూత్రం ప్రపంచంలోనే మొదటి స్టార్టప్ ఇంక్యుబేటర్‌ అని పేర్కొన్నారు. సంపదను కొద్దిమందికే పరిమితం చేయకుండా, సమాజంలో పంపిణీ చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని నిరూపించారన్నారు. సమ్మిళిత వృద్ధి, స్టార్టప్‌లు, సామాజిక న్యాయం గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నామంటే అందుకు ఆయన వేల ఏళ్ల కిందట వేసిన మార్గమే కారణమన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ శ్రీ అగ్రసేన్ మహారాజ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ అనిరుధ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ రూపేష్ అగర్వాల్, జనరల్ సెక్రటరీ వికాస్ కేషన్, జాయింట్ సెక్రటరీ డా.సీమ జైన్, ట్రెజరర్ అచల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని: సైబర్ వారియర్స్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

సైబర్ వారియర్స్ కు టీషర్ట్లను అందజేస్తున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

 రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ తో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  సైబర్ వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. TGCSB హైదరాబాద్  పంపించిన టీ షర్ట్ లను సైబర్ వారియర్స్ కి అందజేశారు.
 ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సైబర్ వారియర్స్ గా పనిచేస్తున్న వారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలకు సైబర్ క్రైమ్ సెక్యూరిటీ పై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని మీమీ పోలీస్ స్టేషన్ ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించాలి చైతన్య పరచాలని సూచించారు.సైబర్ వారియర్స్ కి అప్పగించిన బాధ్యత ని సక్రమంగా నిర్వహిస్తూ విధులలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఇన్వెస్టిగేషన్ నిర్వహించి సైబర్ బాధితులకి న్యాయం చేసే విధంగా కృషి చేయాలనీ సీపీ సూచించారు.
 రామగుండము కమిషనరేట్ పరిధి లో ఇటీవల తేదీ:-13-09-2025 రోజున నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా మొత్తం 134 సైబర్ కేసులలో 41,81,824/- రూపాయలు బాధితులకు డబ్బులు వారి సంబంధిత అకౌంట్ లకు రిఫండ్ కావడం జరిగింది. లోక్ అదాలత్ సంబంధించి అధిక కేసులు రిఫండ్ అయ్యేలా కృషి చేసిన ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు సైబర్ వారియర్ పోలీస్ కానిస్టేబుల్ లకు ప్రశంసా పత్రాలను  ఇవ్వడం జరిగింది. 
ఈ సమావేశం లో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ N శ్రీనివాస్, CCPS ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సీసీ హరీష్, సైబర్ వారియర్స్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.

హైదరాబాద్: ఎన్.హెచ్. హైవే నిర్మాణానికి భూ సేకరణ పూర్తి చేయాలి

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* జాతీయ రహదారుల భూ సేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

జాతీయ రహదారుల నిర్మాణానికి గడువు లోగా భూ సేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

సోమవారం సోమవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సిఎస్ కె.రామ కృష్ణ రావు లతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ విజయవాడ ఎన్.హెచ్ 65 6 లైన్ల విస్తరణ, హైదరాబాద్ నుంచి అమరావతి, మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్ డిండి ఎన్ హెచ్ 764 నాలుగు లైన్ల విస్తరణ, ఎన్.హెచ్ 163 మన్నెగూడ సెక్షన్ 4 లైన్ల విస్తరణ, హైదరాబాద్ మంచిర్యాల కారిడార్ 4 లైన్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడర్ పనుల అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్ లు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా *రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,*   ఎన్.హెచ్ అధికారులు , రాష్ట్ర అధికారులు సమన్వయంతో పని చేస్తూ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు.  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారులకు మొదటి ప్రాధాన్యతగా భూ సేకరణ పూర్తి చేయాలని అన్నారు.

ఎన్.హెచ్ 163జి పరిధిలో పెండింగ్ లో ఉన్న 130 హెక్టార్ల భూ బదలాయింపు ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, ఈ రొడ్డు పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్లు  ప్రత్యేకంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ భూ బదలాయింపు వేగవంతం చేయాలని, ఆర్డీవో స్థాయి అధికారులకు ప్రత్యేక బాధితులు అప్పగించాలని సీఎం సూచించారు. 

భూ సేకరణ ప్రక్రియలో కలెక్టర్ లు నేరుగా రైతులతో చర్చించాలని, వారికి జాతీయ రహదారుల అథారిటీ ద్వారా మెరుగైన పరిహరం అందించేందుకు కృషి చేస్తున్నామని భరోసా కల్పించాలని అన్నారు.  జాతీయ రహదారులనిర్మాణంలో కోల్పోతున్న అటవీ శాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములు గుర్తించి అడవుల పెంపకం పనులు ప్రారంభించాలని, అటవీ శాఖ ద్వారా అవసరమైన అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులుసమన్వయంతో పని చేయాలని అన్నారు.  
ఈ సమావేశంలో డి.ఎఫ్.ఓ. శివయ్య,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ డి.వేణు

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత  అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా *అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

దుబ్బలపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని  సర్వే నెంబర్ 8 గ్రామానికి దూరం కాకుండా సర్వే నెంబర్ 225 లో గ్రామ ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పంచాయతీ రాజ్ ఇంజనీర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన సంకేత్ కుమార్ తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన బొబ్బిలి సత్యనారాయణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ  పిచ్చి చెట్లను తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా  ఎంపిడిఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

సుల్తానాబాద్ పట్టణం జవహర్ నగర్ కు చెందిన కీర్తి సరిత తనకు దివ్యాంగుల కోటా క్రింద అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధీ సొసైటీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో  సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026