వీడియో కోసం... క్లిక్ చేయండి
https://youtu.be/v0mUAzcaF0c?si=NM0tlVP7fe7Y5Tvh
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూజలు చేసి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం, నవగ్రహా హోమం, మహా చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని,సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు, అనంతరం వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి