అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ డి.వేణు
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా *అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
దుబ్బలపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని సర్వే నెంబర్ 8 గ్రామానికి దూరం కాకుండా సర్వే నెంబర్ 225 లో గ్రామ ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పంచాయతీ రాజ్ ఇంజనీర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన సంకేత్ కుమార్ తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన బొబ్బిలి సత్యనారాయణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ పిచ్చి చెట్లను తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపిడిఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
సుల్తానాబాద్ పట్టణం జవహర్ నగర్ కు చెందిన కీర్తి సరిత తనకు దివ్యాంగుల కోటా క్రింద అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధీ సొసైటీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి