Dtv updates
బుధవారం, సెప్టెంబర్ 17, 2025
రామగిరి: అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకం
మంథని: అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన
మంథని: సామాజిక వైద్య శాలను తనిఖీ చేసిన జడ్జీ
మంథని: ఘనంగా విశ్వకర్మ జయంతి
మంథని: జాతీయ జెండాను ఎగరవేసిన కాంగ్రెస్ నాయకులు
పెద్దపల్లి: తెలంగాణ ప్రజాపాలన వేడుకల్లో ఎమ్మెల్యే
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణ రావు, మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప మరియు మాజీ కౌన్సిలర్లు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని: ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు
కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిపి
ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు , సిబ్బందితో జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ గారు ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడి సెప్టెంబర్ 17న ప్రజాపాలనలోకి వచ్చిన రోజు అని కావున తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు అన్నారు. ప్రజల పై జరిపే హింస పెరిగిపోవడం తో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, కొమురం బీమ్ వంటి ఎంతోమంది పోరాటయోధులు పోరాటాలు సాగించరని వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రధాని నెహ్రు, ఉపప్రదాని హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ల చోరువతో జనరల్ చౌదరి అధ్వర్యంలో సైనిక చర్య జరిపి నిజాం ప్రాంతాన్ని భారత్ లో కలపడం జరిగిందని, ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు.
ఈకార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్ , ఆర్ఐ వామన మూర్తి, శ్రీనివాస్, మల్లేశం , గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ సిఐ ప్రసాద్ రావు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు ఎస్ఐ లు ఆర్ఎస్ఐ సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు
మంగళవారం, సెప్టెంబర్ 16, 2025
పెద్దపల్లి: పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయం
మాట్లాడుతున్న రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్
ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ అన్నారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. బుధవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు గౌరవ వందనం స్వీకరించి ,జాతీయ పతాకావిష్కరణ చేసారు. అనంతరం ముఖ్య అతిథి తన సందేశాన్ని తెలియజేసారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభయహస్తం గ్యారెంటీ పథకాలను ఒక్కోకటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.
పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీక రేషన్ కార్డు లను అర్హులైన పేద కుటుంబాల అందరికీ పంపిణీ చేస్తున్నామని, మన జిల్లాలో నూతనంగా 12 వేల 168 కుటుంబాలకు రేషన్ కార్డ్ జారి చేశామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని అన్నారు.
కాకతీయ కాలువ క్రింద ఉన్న 2 లక్షల 30 వేల ఆయకట్టు స్థిరీకరణ,10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాగు నీరు అందించేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్ ను 3 నుంచి 5 టిఎంసీల సామర్థ్యంతో నిర్మాణానికి డిపిఆర్ తయారు కోసం కోటి 10 లక్షల రూపాయల మంజూరు చేసామని అన్నారు. 13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పథకం పెండింగ్ పండ్లు యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేసే నీటి పారుదల శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించామని తెలిపారు.
గోదావరిఖని జనరల్ ఆసుపత్రి 160 కోట్లతో నిర్మాణం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 173 కోట్లు ఖర్చు చేస్తూ సిసి రోడ్లు, సిసి డ్రైయిన్లు, బీ.టి రోడ్లు, స్మశాన వాటికలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పురపాలక భవనం, డంప్ యార్డ్ వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు.
రాజీవ్ ఆరొగ్య శ్రీ కవరేజిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని , 23 కోట్ల 75 లక్షలతో గోదావరిఖని జనరల్ ఆసుపత్రి నందు 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్, 26 కోట్లతో, 51 కోట్లతో పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రి, 22 కోట్లతో మంథని లో 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసి లకు 42 శాతం రిజర్వేషన్ తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ. అన్నయ్య గౌడ్, అదనపు కలెక్టర్లు జె .అరుణశ్రీ, డి.వేణు, డి.సి.పి. కరుణాకర్, ఆర్.డి.ఓ. బి.గంగయ్య, కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్: మరో పాస్ పోర్ట్ కేంద్రం అవసరం
మంథని: అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసినందుకేనా ఇంటిపై దాడి
మంథని: మాజీ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి
గోదావరిఖని: భార్యను చంపిన భర్త అరెస్ట్
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామ పంచాయతీ పరిది వకీల్‌పల్లి ప్లాట్స్ లో ఆదివారం పూసల రమాదేవి @ ప్రశాంతి హత్య కేసు లో నిందితుని అరెస్ట్ వివరాలు పెద్దపెల్లి డిసిపీ పి. కరుణాకర్ గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ లు వెల్లడించడం జరిగింది.
*మృతురాలి వివరాలు*
మేడి రమాదేవి @ పూసల ప్రశాంతి W/o ప్రభాకర్ కృపాకర్, 38yrs, SC- నేతకానీ R/o. సున్నాంబట్టి వాడ మంచిర్యాల, ప్రస్తుతం వకీలపల్లి ప్లాట్స్ ho పన్నూరు v/o రామగిరి.
*నిందితుల వివరాలు*
*పూసల కృపాకర్ @ ప్రభాకర్ S/o. రంగయ్య 45yrs, గోలుస్మిత్ R/o. కిష్టంపూర్ v/o జైపూర్ (m) చిర్యాల జిల్లా ప్రస్తుతం వకీలపల్లి ప్లాట్స్ h/o పన్నూరు v/o రామగిరి.*
*స్వాధీనం చేసుకొన్న వాటి వివరాలు:*
1)హీరో హోండా CD 100 SS బైక్ నెంబర్: AP 15, 2008
2) హత్యకు ఉపయోగించిన కత్తి
తేదీ 14-09-2025 రోజున మేడి కమల W/o. Late రమేష్, 58yrs SC- నేతకానీ R/o సున్నాంబట్టి ఫిర్యాదు మేరకు U/S: 103(1), 85 BNS, Sec. 3(2)(V) of SC/STS (POA) Amendment Act-2015, జరిగింది. పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పరిశోధన అధికారి ఆధ్వర్యంలో రామగిరి ఎస్ ఐలు శ్రీనివాస్, దివ్యలు ప్రత్యేక టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్మదగిన సమాచారం ఆధారంగా నిందితున్ని 0CP-2 కమాన్ ఏరియా లద్నపూర్ వద్ద పెట్టుకోవడం జరిగింది అని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేస్ ఈరోజు రిమాండ్ చేస్తున్నట్లు డీసీపీ గారు తెలిపారు. హత్య కేసులో మిగిలిన అత్తమామలను త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది.
వివరాల్లోకి వెళితే..
మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవి @ ప్రశాంతిని పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్‌పల్లి ప్లాట్స్ కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9) జ్యోత్స ఉన్నారు.. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది ఈ క్రమం లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి రోజు వారి దాంపత్య వివాదాల కారణంగా కృపాకర్ మృతురాలిని చంపాలని నిర్ణహించుకొని అప్పుడు మాత్రమే తన సమస్య పరిష్కారం అవుతుంది రమాదేవి చంపాలనే ఉద్దేశ్యంతో తన ఇంట్లో ని కత్తిని తీసుకొని ఆమె తల, మెడ, తుంటి, కడుపుపై విచక్షణారహితంగా పొడిచాడు. దానితో మృతురాలి తల, మెడ, కడుపుపై తీవ్ర రక్త స్రావం జరిగి రక్తపు మడుగులో నేలపై పడి అక్కడికక్కడే మరణించింది. హత్య కు సంబందించిన సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి గోదావరిఖని ఏసిపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నేరంకు సంబందించిన సాక్ష్యాలు, ఆధారాలు, కారణాల సమాచారం సేకరించడం జరిగింది అని ఈరోజు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని డీసీపీ గారు తెలిపారు.
సోమవారం, సెప్టెంబర్ 15, 2025
పెద్దపల్లి: భూగర్భ జలాల వృధా నియంత్రణకు చర్యలు
మంథని: పాత్రికేయునికి విశ్వ విభూషన్ జాతీయ పురస్కారం
శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ సాహితి సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 2025 విశ్వకర్మ జాతీయ పురస్కారాల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్టమైన కృషి చేసినందుకు.. తెలుగు వెలుగు సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 14న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రాజ్యలక్ష్మి కన్వెన్షన్ హాల్లో జరిగిన పురస్కారాల ప్రధానోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లారం గ్రామానికి చెందిన కాశీపేట శ్రీకాంత్ పత్రిక మరియు సామాజిక సేవా రంగంలో విశిస్టమైన కృషి చేసినందుకు అభినందిస్తూ బతుకమ్మ తల్లి గ్రంథకర్త, సహస్ర మహోత్సవ సామ్రాట్, ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతి కృష్ణ చేతుల మీదుగా విశ్వ విభూషన్ జాతీయ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీర ధర్మేంద్రస్వామి విచ్చేశారు. అన్ని రంగాలకు చెందిన వారు 200 పైగా పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా సిద్ధిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడెం లింగమూర్తి, డాక్టర్ అప్పినపెళ్లి భాస్కరాచార్యులు, డాక్టర్ వలబోజు మోహన్ రావు, అద్దంకి కృష్ణమాచార్యులు, హాస్యనటులు ఆర్ఎస్ నంద, సమాజ సేవకురాలు డాక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం, సెప్టెంబర్ 14, 2025
హైదరాబాద్: జిడిపిలో ఎంఎస్ఎంఇలు పది శాతం వాటా సాధించాలి
మంథని రెడ్డి సేవా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముస్కుల సురేందర్ రెడ్డి
మంథని: మంథని రెడ్డి సేవా సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం ముంథని పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో ఎన్నికలు నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా మండల సత్యనారాయణ రెడ్డి,అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్క కొండారెడ్డిప్రదాన కార్యదర్శి గా ఎలుక సత్యనారాయణ రెడ్డి, సహయ కార్యదర్శిగా ముసిపట్ల రమణారెడ్డి, మూల శేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా లంబు ప్రభాకర్ రెడ్డి, అల్ల రమణారెడ్డి, గంట్ల పురేందర్ రెడ్డి మారం సత్యనారాయణ రెడ్డి, రిక్కీల కిషన్ రెడ్డి, మాసిరెడ్డి రాజి రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా చందుపట్ల సుధాకర్ రెడ్డి వ్యవహరించారు. సహయమలుగా బెల్లంకొండ గిరిధర్ రెడ్డి, గట్ల భరత్ రెడ్డి వ్యవహరించారు.
మంథని: అందుబాటులో యూరియా...ఆందోళన వద్దు
మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న
మంథని మండలం రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చొరవతో మంథని రైతుల అవసరాల కొరకు ఆదివారం యూరియా దిగుమతులు చేసుకోవడం జరిగింది.వంద మెట్రిక్ టన్నులు అనగా రెండు వేల (2250) యూరియా బస్తాలు మంథనికి రావడం జరిగింది.మంథని మండలంలోని గ్రామాల్లో అందుబాటులో డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే ద్వారా 2,250 బస్తాల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందని ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు పట్టా పాస్ బుక్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డు చూపించిన రైతులకు అందజేయడం జరుగుతోంది అని అన్నారు.దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అధికారుల పర్యవేక్షణలో దళారులకు అందకుండా యూరియా దుర్వినియోగం కాకుండా అధికారుల పర్యవేక్షణలో రైతులకు యూరియా అందించడం జరుగుతుందని మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న తెలిపారు.
శనివారం, సెప్టెంబర్ 13, 2025
మంథని: రాజీమార్గమే.. రాజమార్గం
మాట్లాడుతున్న పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ( డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి) సునిత కుంచాల
సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ అదాలత్‌లో కక్షిదారులు రాజీమార్గమని, రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునిత కుంచాల అన్నారు. శనివారం మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. లోక్ అదాలతో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వక వాతావరణముతో కలుసుకొని, కోపాలు, భావోద్వేగా లేకుండా, డబ్బులు, సమయం వృధా కాకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడం ఇరువురి కి సంతోష కారణమని, కక్షి దారులు రాజీమార్గంలో వచ్చినట్లయితే, ఒక ప్రక్క కోర్టుకు, మరొక ప్రక్క సమయం కూడా వృధా కాదని, ఇతర అత్యవసర కేసులో పరిష్కరించుటకు, సమయం దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కక్షి దారులు, ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియరు సివిల్ జడ్జి శ్రీమతి వి భవాని, అడిషనల్ జూనియరు సివిల్ జడ్జీ కమారి ఎ.సుదారాణి,ద్వితీయ శ్రేణి న్యాయాదికారిణి శ్రీమతి అనురాధ, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ బి సురేష్, గోదావరిఖని ఎసిపి శ్రీ మడత రమేష్, అసోసియేషన్ అధ్యక్షుడు హరి బాబు, తహసీల్దార్ కుమార స్వామి న్యాయవాదులు,వివిధ బ్యాంకుల అధికారులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంథని: అవార్డు గ్రహీతకు మాజీ ఎమ్మెల్యే సన్మానం
ఉత్తమ సేవకే మంచి గుర్తింపు
విద్యార్ధులకు మంచి విద్యాబోధన అందిస్తూ వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడంలో సేవలు అందించే వారికే మంచి గుర్తింపు లభిస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు అందుకున్న మంథనికి చెందిన గీట్ల భరత్‌రెడ్డిని శనివారం మంథనిలోని ఆయన నివాసంలో కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం మంథనికే గర్వకారణమన్నారు. అంకితభావంతో పని చేస్తూ విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని ఆయన ఆకాంక్షించారు.
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్‌తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్‌బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం
















