అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టిన విధంగా పుట్టమధు వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుపై పుట్టమధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాజకీయ బిక్ష పెట్టిన స్వర్గీయ శ్రీపాద రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా స్పందించారు. శ్రీపాద రావు మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతినిధిగా ఆ పదవికి వన్నె తెచ్చి దేశంలోనే ఒక గొప్ప స్పీకర్ గా వారు పేర్కొన్నారు. దమ్ముంటే ఒకసారి శ్రీపాద రావు విగ్రహాన్ని ముట్టుకొని చూడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు సత్తా ఏందో నీకు చూపిస్తానీ సవాల్ చేశారు. ఈరోజు నీ ఇంటి ముందు ధర్నాకు దిగినం రాబోయే రోజులలో నిన్ను రోడ్డు మీద తిరుగకుండా చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి స్వర్గీయ శ్రీపాదరావు గారని అన్నారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వల్లే ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, జడ్పి ఛైర్మన్ గా ఎదిగిన పుట్ట మధుకు అహంకారం నెత్తికెక్కి శ్రీపాదరావు గారి విగ్రహాలు తీసేస్తామని అంటున్నారని అన్నారు. మంథని నియోజకవర్గాన్ని అన్ని రకాలు అభివృద్ది చేసేందుకు అనునిత్యం పనిచేస్తున్న శ్రీధర్ బాబు గారిని చూసి ఓర్వలేకనే బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చిచ్చుపెట్టేందుకు పుట్టమధు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మంథని ప్రజల ప్రతీ కష్టసుఖాల్లో భాగమవుతున్న శ్రీనుబాబుపై సైతం పదేపదే తన అక్కసును వెళ్లగక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా, అణగారిన వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిన మంథని ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి