Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

మంగళవారం, సెప్టెంబర్ 16, 2025

పెద్దపల్లి: పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయం

మాట్లాడుతున్న రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన  కొనసాగుతుందని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ అన్నారు.   

సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన  దినోత్సవ వేడుకలలో  రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. బుధవారం ఉదయం ముఖ్య అతిథి పోలీసు గౌరవ వందనం స్వీకరించి ,జాతీయ పతాకావిష్కరణ చేసారు.  అనంతరం ముఖ్య అతిథి  తన సందేశాన్ని తెలియజేసారు. 

 ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అభయహస్తం గ్యారెంటీ పథకాలను ఒక్కోకటిగా అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల,  500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.

పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీక రేషన్ కార్డు లను అర్హులైన పేద కుటుంబాల అందరికీ పంపిణీ చేస్తున్నామని, మన జిల్లాలో నూతనంగా 12 వేల 168 కుటుంబాలకు రేషన్ కార్డ్ జారి చేశామని అన్నారు.  ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిందని అన్నారు. 

కాకతీయ కాలువ క్రింద ఉన్న   2 లక్షల 30 వేల ఆయకట్టు స్థిరీకరణ,10 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాగు నీరు అందించేందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పత్తిపాక రిజర్వాయర్  ను 3 నుంచి 5 టిఎంసీల  సామర్థ్యంతో నిర్మాణానికి డిపిఆర్ తయారు కోసం కోటి 10 లక్షల రూపాయల మంజూరు చేసామని అన్నారు. 13 వేల 396 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేసే రామగుండం ఎత్తిపోతల పథకం పెండింగ్ పండ్లు యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేసే నీటి పారుదల శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించామని తెలిపారు. 

గోదావరిఖని జనరల్ ఆసుపత్రి 160 కోట్లతో నిర్మాణం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో 173 కోట్లు ఖర్చు చేస్తూ సిసి రోడ్లు, సిసి డ్రైయిన్లు, బీ.టి రోడ్లు, స్మశాన వాటికలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పురపాలక భవనం, డంప్ యార్డ్ వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. 

రాజీవ్ ఆరొగ్య శ్రీ  కవరేజిని   5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని ,  23 కోట్ల 75 లక్షలతో గోదావరిఖని జనరల్ ఆసుపత్రి నందు 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్, 26 కోట్లతో, 51 కోట్లతో పెద్దపల్లిలో 100 పడకల ఆసుపత్రి, 22 కోట్లతో మంథని లో 50 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసి లకు 42 శాతం రిజర్వేషన్ తో సామాజిక తెలంగాణ సాధనకు కృషి చేస్తున్నామని తెలిపారు.   

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏ. అన్నయ్య గౌడ్, అదనపు కలెక్టర్లు జె .అరుణశ్రీ,  డి.వేణు,  డి.సి.పి. కరుణాకర్,  ఆర్.డి.ఓ.  బి.గంగయ్య,  కలెక్టరేట్ ఏ. ఓ. శ్రీనివాస్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




హైదరాబాద్: మరో పాస్ పోర్ట్ కేంద్రం అవసరం

రాయదుర్గ్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ లో కొత్తగా మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు కోరారు. మంగళవారం రాయదుర్గ్ పాస్‌ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నగరం నలువైపులా వేగంగా అభివృద్ధి చెందుతోందని, రోజురోజుకీ పెరుగుతున్న జనాభాకు మరింత మెరుగైన సేవలు అందాలంటే మరో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అవసరమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఏటా దేశవ్యాప్తంగా సగటున కొత్త పాస్‌పోర్ట్ కోసం కోటి మందికి పైగా దరఖాస్తు చేసుకుంటున్నారని, ఇందులో తెలంగాణ వాటా సుమారు 11 లక్షల వరకు ఉంటుందన్నారు. గతంలో పాస్‌పోర్ట్ కోసం నెలల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చేదని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని పౌర సేవలను సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజల ముంగిటకే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కొత్త పాస్ పోర్ట్ సేవా కేంద్రం నగర ప్రజలకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సికింద్రాబాద్ ఆర్పీవో  స్నేహజ తదితరులు పాల్గొన్నారు.

మంథని: అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ చేసినందుకేనా ఇంటిపై దాడి

మాట్లాడుతున్న మంథని మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ

కమాన్‌పూర్‌ మండలం పెంచికల్‌పేట గ్రామంలో బారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ చేసిన తప్పా అని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పుట్ట శైలజ ప్రశ్నించారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఇంటిపై కాంగ్రెస్‌ నాయకులు చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో మంథని ఎమ్మెల్యే కేవలం తన తండ్రి శ్రీపాదరావు విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటామని, ఇంటింటికి తన తండ్రి విగ్రహాలు ఇస్తామంటామని ఇంకా ఎవరి విగ్రహాలు ఉండవద్దనే ఆలోచనతో తమ ఇంటిపై కార్యకర్తలను పురమాయించి దాడి చేయించాడని ఆమె ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడవక ముందే ఇంతలా దాడికి పాల్పడితే మరో రెండేళ్లు ఎలా గట్టెక్కుతుందని మనం చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని అన్నారు. ఏసీపీ, సీఐలు దగ్గరుండి మరీ దాడి చేయించారని, అంబేద్కర్‌ విగ్రహం అవిష్కరించి 24గంటలు గడువకముందే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ ఇంటిపై దాడికి దిగడం ఎంత అరాచకమో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. తాము బ్రతికినా చచ్చినా ఇక్కడే ఉంటామని, శ్రీధర్‌బాబు చంపినా ఇక్కడే చచ్చిపోతామని, మంథని ప్రజలకు సేవ చేయడం కోసమే నిరంతరం బార్యాభర్తలం కృషి చేస్తామన్నారు. రైతులు ఒకవైపు యూరియా కోసం అల్లాడతుంటే వారి కష్టాలు తీర్చాల్సిన అధికార పార్టీ నాయకులు ఇలా దాడులకు దిగడం అమానుషమన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో అనేక విగ్రహాలను ఆవిష్కరించామని, ఏ ఒక్క విగ్రహాన్ని శ్రీధర్‌బాబు ముట్టుకోడని, బహుజనులంటే ముట్టుడా అని ఆమె ప్రశ్నించారు. దాడులకు దిగడం కాదు దమ్ముంటే మేము పెట్టిన పీవీ, చాకలి ఐలమ్మ, జగ్జీవన్‌రాం, గుండా నాగరాజు విగ్రహాలకు పూలదండలు ఎమ్మెల్యేతో వేయించాలన్నారు. బహుజనులంతా అన్ని విగ్రహాలను ముట్టుకోవాలని పోరాటం చేయాలని ఆమె హితవు పలికారు. మా సారువాళ్ల నాన్నను అన్నాడు మేము ఊరుకోమని అంటున్న నాయకుల నాన్నను ఏమీ అనలేదు కదా అని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు అచ్చిన 420 హమీలను అమలు చేయాలనే ఆలోచన చేయాలే తప్ప ఇలా మహనీయుల విగ్రహాలను ఆవిష్కరిస్తే దాడులకు పాల్పడటం సరికాదన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం అయితే ప్రజలే మిమ్మల్ని తరిమికొడుతారని ఆమె ఈసందర్బంగా స్పష్టం చేశారు.

మంథని: మాజీ ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి

మంథని నియోజకవర్గ కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం
ముట్టడించారు. కమాన్పూర్ మండలంలోని పెంచికల్పేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం పుట్ట మధు స్వర్గీయ శ్రీపాద రావుపై,  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పుట్ట మధు ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు పుట్ట మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అలాగే శ్రీపాదరావు  విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్, శశిభూషణ్ కాచే, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మాజీ ఎంపీపీ కొండ శంకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఆరెల్లి కిరణ్ మాట్లాడుతూ పుట్ట మధుకు రాజకీయ బిక్ష పెట్టిన శ్రీపాద రావు పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. శ్రీపాద రావు మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతినిధిగా ఆ పదవికి వన్నె తెచ్చి దేశంలోనే ఒక గొప్ప స్పీకర్ గా వారు పేర్కొన్నారు. మంథని నియోజకవర్గ ప్రజలు శ్రీపాద రావు ని మూడుసార్లు, శ్రీధర్ బాబు ని ఐదు సార్లు ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు నిత్యం ప్రజల్లో ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వారందరినీ సమానంగా చూస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం దళిత బహుజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అని తెలిపారు. రాబోయే రోజులలో ఈ ప్రాంతంలో ఉన్న శ్రీపాద రావు విగ్రహాలు కూలుస్తామని మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. గతంలో కవిత ఎమ్మెల్యే టికెట్ ఇప్పిచ్చినప్పుడు వారిని తన సొంత అక్క అని అన్న మధు, బహిష్కరించిన తరువాత ఆమెపై విమర్శలు చేసి,  కపట బుద్ధి ప్రజలందరికీ తెలిసిందని అన్నారు. లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో సిబిఐ కి విచారణలో భాగోతం బయటపడుతుందని భయంతో నోటికి వచ్చినట్టు మాట్లాడతున్నావని సిబిఐ త్వరలోనే విచారణ జరిపి నిన్ను కటకటాలకు పంపిస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇంకోసారి శ్రీపాద రావు పైన, శ్రీధర్ బాబు పైన, శ్రీను బాబు  పైన అనుచిత వాక్యాలు చేస్తే కోరుకునేది లేదని అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

గోదావరిఖని: భార్యను చంపిన భర్త అరెస్ట్

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామ పంచాయతీ పరిది వకీల్పల్లి ప్లాట్స్ లో ఆదివారం పూసల రమాదేవి @ ప్రశాంతి హత్య కేసు లో నిందితుని అరెస్ట్ వివరాలు పెద్దపెల్లి డిసిపీ పి. కరుణాకర్ గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ లు వెల్లడించడం జరిగింది.

*మృతురాలి వివరాలు*

మేడి రమాదేవి @ పూసల ప్రశాంతి W/o ప్రభాకర్ కృపాకర్, 38yrs, SC- నేతకానీ R/o. సున్నాంబట్టి వాడ మంచిర్యాల, ప్రస్తుతం వకీలపల్లి ప్లాట్స్ ho పన్నూరు v/o రామగిరి.

*నిందితుల వివరాలు*

*పూసల కృపాకర్ @ ప్రభాకర్ S/o. రంగయ్య 45yrs, గోలుస్మిత్ R/o. కిష్టంపూర్ v/o జైపూర్ (m) చిర్యాల జిల్లా ప్రస్తుతం వకీలపల్లి ప్లాట్స్ h/o పన్నూరు v/o రామగిరి.*

*స్వాధీనం చేసుకొన్న వాటి వివరాలు:*

1)హీరో హోండా CD 100 SS బైక్ నెంబర్: AP 15, 2008

2) హత్యకు ఉపయోగించిన కత్తి

తేదీ 14-09-2025 రోజున మేడి కమల W/o. Late రమేష్, 58yrs SC- నేతకానీ R/o సున్నాంబట్టి ఫిర్యాదు మేరకు U/S: 103(1), 85 BNS, Sec. 3(2)(V) of SC/STS (POA) Amendment Act-2015, జరిగింది. పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ ఆదేశాల మేరకు గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పరిశోధన అధికారి ఆధ్వర్యంలో రామగిరి ఎస్ ఐలు శ్రీనివాస్, దివ్యలు ప్రత్యేక టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్మదగిన సమాచారం ఆధారంగా నిందితున్ని 0CP-2 కమాన్ ఏరియా లద్నపూర్ వద్ద పెట్టుకోవడం జరిగింది అని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేస్ ఈరోజు రిమాండ్ చేస్తున్నట్లు డీసీపీ గారు తెలిపారు.  హత్య కేసులో మిగిలిన అత్తమామలను త్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది.

వివరాల్లోకి వెళితే..

మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవి @ ప్రశాంతిని పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్ కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9) జ్యోత్స ఉన్నారు.. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది ఈ క్రమం లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతి రోజు వారి దాంపత్య వివాదాల కారణంగా కృపాకర్ మృతురాలిని చంపాలని నిర్ణహించుకొని అప్పుడు మాత్రమే తన సమస్య పరిష్కారం అవుతుంది రమాదేవి చంపాలనే ఉద్దేశ్యంతో తన ఇంట్లో ని కత్తిని తీసుకొని ఆమె తల, మెడ, తుంటి, కడుపుపై విచక్షణారహితంగా పొడిచాడు. దానితో మృతురాలి తల, మెడ, కడుపుపై తీవ్ర రక్త స్రావం జరిగి రక్తపు మడుగులో నేలపై పడి అక్కడికక్కడే మరణించింది. హత్య కు సంబందించిన సమాచారంతో వెంటనే సంఘటనా స్థలానికి గోదావరిఖని ఏసిపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నేరంకు సంబందించిన సాక్ష్యాలు, ఆధారాలు, కారణాల సమాచారం సేకరించడం జరిగింది అని ఈరోజు నిందితులను పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగిందని డీసీపీ గారు తెలిపారు.

సోమవారం, సెప్టెంబర్ 15, 2025

కరీంనగర్: రిటైర్డ్ చీఫ్ ఇంజినీరుకు సన్మానం


ఇంజినీర్స్ డే సందర్భంగా రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కొంతం కృష్ణమూర్తి దంపతులను సోమవారం సన్మానించారు. ఆవోపా, కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక  కార్యక్రమంలో జ్ఞాపికతో పాటు శాలువాతో సత్కరించారు.

పెద్దపల్లి: భూగర్భ జలాల వృధా నియంత్రణకు చర్యలు

భూగర్భ జలాల కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో పాల్గొన్న  జిల్లా కలెక్టర్

పెద్దపల్లి జిల్లాలో భూగర్భ జలాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా భూగర్భ జలాల కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్  పాల్గొనీ మాట్లాడారు.  జిల్లాలో అధికంగా భూగర్భ జలాలను వాడుతున్న గ్రామాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని పరిశ్రమలు విధిగా భూగర్భ జల శాఖ నుంచి అనుమతి పొందేలా చూడాలని అన్నారు. అనంతరం భూగర్భ జల అధికారి భూగర్భ జల అంచనాలను, జి.ఓ.15 ను కలెక్టర్, కమిటీ సభ్యులకు వివరించారు.
ఈ సమావేశంలో  భూగర్భ శాఖ జిల్లా అధికారి లావణ్య,   గ్రామీణ అభివృద్ధి జిల్లా అధికారి ఎం.కాళిందిని,  డీఈవో
మాధవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మంథని: పాత్రికేయునికి విశ్వ విభూషన్ జాతీయ పురస్కారం

శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ సాహితి సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం 2025 విశ్వకర్మ జాతీయ పురస్కారాల సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్టమైన కృషి చేసినందుకు.. తెలుగు వెలుగు సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 14న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రాజ్యలక్ష్మి కన్వెన్షన్ హాల్లో జరిగిన పురస్కారాల ప్రధానోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లారం గ్రామానికి చెందిన కాశీపేట శ్రీకాంత్ పత్రిక మరియు సామాజిక సేవా రంగంలో విశిస్టమైన కృషి చేసినందుకు అభినందిస్తూ బతుకమ్మ తల్లి గ్రంథకర్త, సహస్ర మహోత్సవ సామ్రాట్, ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, విశ్వ కళావిరాట్ డాక్టర్ శాంతి కృష్ణ చేతుల మీదుగా విశ్వ విభూషన్ జాతీయ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీర ధర్మేంద్రస్వామి విచ్చేశారు. అన్ని రంగాలకు చెందిన వారు 200 పైగా పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా సిద్ధిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడెం లింగమూర్తి, డాక్టర్ అప్పినపెళ్లి భాస్కరాచార్యులు, డాక్టర్ వలబోజు మోహన్ రావు, అద్దంకి కృష్ణమాచార్యులు, హాస్యనటులు ఆర్ఎస్ నంద, సమాజ సేవకురాలు డాక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

ఆదివారం, సెప్టెంబర్ 14, 2025

హైదరాబాద్: జిడిపిలో ఎంఎస్ఎంఇలు పది శాతం వాటా సాధించాలి

జ్యోతిప్రజ్వలన చేస్తున్న ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

రాష్ట్ర జిడిపిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) ల వాటా 10 శాతం ఉండేలా సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ఎంఎస్ ఎంఇ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం నాడు ఆయన శంషాబాద్ ఏర్పాటైన గో-నేషనల్- ఎక్స్ పో(GoNat) 2025 ఐదో ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. దాదాపు 4 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సును బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ (బిఎన్ ఐ) నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ప్రదర్శనతో పాటు వివిధ అంశాలపై సదస్సులు జరుగుతాయి. నూతన సాంకేతికత, డిజిటలైజేషన్లతో ఎంఎస్ ఎంఇలు ఎప్పటికప్పుడు ఆధునీకరించుకునేలా తమ ప్రభుత్వం సహకరిస్తోందని శ్రీధర్ బాబు వివరించారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు. 
“ఎస్ ఎం ఎస్ ఇ లలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇది అత్యంత ప్రాధాన్యతా రంగం. వచ్చే రెండు నెలల్లో కృత్రిమ మేథ నూతన ఆవిష్కరణల హబ్ ను ప్రారంభిస్తాం. చిన్న పరిశ్రమల ఉత్పాదనల ఎగుమతులకు రాష్ట్రంలో రెండు డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. హైదబాద్ పశ్చిమాన ముంబాయి వైపు ఒకటి, తూర్పున కాకినాడ వైపు మరొకటి నెలకొల్పుతాం. ప్రదర్శనలో రెండు వందల ఎంఎస్ ఎస్ ఇ లు తమ తయారీలను ప్రదర్శించడం సంతోషంగా ఉంది. పారిశ్రామిక వేత్తలంతా ఒక వేదికపై కలుసుకుని పరస్పర సహకారం, భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలి”. 
బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషన్ ఈ సంకల్పాన్ని చేపట్టడం ప్రశంసనీయమని శ్రీధర్ అన్నారు.
సదస్సులో ఉత్పత్తుల ప్రదర్శన, వివిధ అంశాలపై సమావేశాలతో పాటు బేకింగ్, ఫుడ్ ఇన్నోవేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ స్టయిలింగ్ ఫోటోగ్రఫీ, వాణిజ్య ప్రకటనలపై పోటీలు జరిగాయి.

మంథని రెడ్డి సేవా సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముస్కుల సురేందర్ రెడ్డి

మంథని: మంథని రెడ్డి సేవా సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం ముంథని పట్టణంలోని రెడ్డి సంఘం భవనంలో  ఎన్నికలు నిర్వహించారు.‌ గౌరవ అధ్యక్షులుగా మండల సత్యనారాయణ రెడ్డి,అధ్యక్షులుగా ముస్కుల సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా  కర్క కొండారెడ్డిప్రదాన కార్యదర్శి గా ఎలుక సత్యనారాయణ రెడ్డి, సహయ కార్యదర్శిగా ముసిపట్ల రమణారెడ్డి, మూల శేఖర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా లంబు ప్రభాకర్ రెడ్డి, అల్ల రమణారెడ్డి, గంట్ల పురేందర్ రెడ్డి మారం సత్యనారాయణ రెడ్డి, రిక్కీల కిషన్ రెడ్డి, మాసిరెడ్డి రాజి రెడ్డి ఎన్నికయ్యారు.   ఎన్నికల అధికారిగా చందుపట్ల సుధాకర్ రెడ్డి వ్యవహరించారు. సహయమలుగా బెల్లంకొండ గిరిధర్ రెడ్డి, గట్ల భరత్ రెడ్డి  వ్యవహరించారు.

మంథని: అందుబాటులో యూరియా...ఆందోళన వద్దు

మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న

మంథని మండలం రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చొరవతో మంథని రైతుల అవసరాల కొరకు ఆదివారం యూరియా దిగుమతులు చేసుకోవడం జరిగింది.వంద మెట్రిక్ టన్నులు అనగా రెండు వేల (2250) యూరియా బస్తాలు మంథనికి రావడం జరిగింది.మంథని మండలంలోని గ్రామాల్లో అందుబాటులో డీసీఎంఎస్, ఏఆర్ఎస్కే ద్వారా 2,250 బస్తాల యూరియా పంపిణీకి సిద్ధంగా ఉందని ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో రైతులకు పట్టా పాస్ బుక్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డు చూపించిన రైతులకు అందజేయడం జరుగుతోంది అని అన్నారు.దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అధికారుల పర్యవేక్షణలో దళారులకు అందకుండా యూరియా దుర్వినియోగం కాకుండా అధికారుల పర్యవేక్షణలో రైతులకు యూరియా అందించడం జరుగుతుందని మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న తెలిపారు.

శనివారం, సెప్టెంబర్ 13, 2025

మంథని: రాజీమార్గమే.. రాజమార్గం

మాట్లాడుతున్న పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ( డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్  సెషన్స్ జడ్జి) సునిత కుంచాల

సుప్రీంకోర్టు ఆదేశానుసారం లోక్ అదాలత్లో కక్షిదారులు రాజీమార్గమని, రాజీ చేసుకోవడం ఇరువురు గెలుపుకు నాంది పలుకుతుందని పెద్దపల్లి  జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునిత కుంచాల అన్నారు. శనివారం మంథని పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జీ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో పాల్గొని  ఆమె మాట్లాడారు. లోక్ అదాలతో కక్షిదారులు ఇరువురు స్నేహపూర్వక వాతావరణముతో కలుసుకొని, కోపాలు, భావోద్వేగా లేకుండా, డబ్బులు, సమయం వృధా కాకుండా వారి సమస్యలను పరిష్కరించుకోవడం ఇరువురి కి సంతోష కారణమని, కక్షి దారులు రాజీమార్గంలో వచ్చినట్లయితే, ఒక ప్రక్క కోర్టుకు, మరొక ప్రక్క సమయం కూడా వృధా కాదని, ఇతర అత్యవసర కేసులో పరిష్కరించుటకు, సమయం దొరుకుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న కక్షి దారులు, ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో  సీనియరు సివిల్ జడ్జి శ్రీమతి వి భవాని, అడిషనల్  జూనియరు సివిల్ జడ్జీ కమారి ఎ.సుదారాణి,ద్వితీయ శ్రేణి  న్యాయాదికారిణి శ్రీమతి అనురాధ, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ బి సురేష్, గోదావరిఖని ఎసిపి శ్రీ మడత రమేష్,‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరి బాబు, తహసీల్దార్ కుమార స్వామి న్యాయవాదులు,వివిధ బ్యాంకుల అధికారులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మంథని: అవార్డు గ్రహీతకు మాజీ ఎమ్మెల్యే సన్మానం

ఉత్తమ సేవకే మంచి గుర్తింపు

విద్యార్ధులకు మంచి విద్యాబోధన అందిస్తూ వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడంలో సేవలు అందించే వారికే మంచి గుర్తింపు లభిస్తుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు అందుకున్న మంథనికి చెందిన గీట్ల భరత్‌రెడ్డిని శనివారం మంథనిలోని ఆయన నివాసంలో కలిసి శాలువా పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం మంథనికే గర్వకారణమన్నారు. అంకితభావంతో పని చేస్తూ విద్యార్ధుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

మంథని: సాయి సంస్థాన్ లో సాముహికసౌందర్యలహరి పారాయణం

వేదగడ్డగా ప్రసిద్ధిగాంచిన మంత్రపురిలోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ లో శుక్రవారం రాత్రి మహిళా భక్తులు సౌందర్యలహరి పారాయణం నిర్వహించారు. శ్రీ సాయిబాబా హారతి కార్యక్రమం అనంతరం సౌందర్యలహరి పారాయణం ప్రారంభించారు. గంటన్నర పాటు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు ఓకే కంఠం స్వరంతో శ్లోకాలు చదువుతూ భక్తులను అలరింపజేశారు. ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన మంథని పట్టణంలో అనేక దేవాలయాలు కొలువుతీరి ఉన్నాయి. మంత్రపురిగా ప్రసిద్ధిగాంచిన మంథనిలో ప్రతినిత్యం ఆధ్యాత్మిక శోభ విరసిల్లుతుంది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులతో పాటు ఆలయ కమిటీ అధ్యక్షురాలు మహావాది జలజ సత్యనారాయణ, ఆలయ అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్ తో పాటు భక్తులు పాల్గొన్నారు.

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2025

భూపాలపల్లి అన్ని పాఠశాలల్లో ఏ ఐ లాబ్స్

మాట్లాడుతున్న రాష్ట్ర  ఐటీ మంత్రి శ్రీధర్ బాబు 
 
వీడియో కోసం క్లిక్ చేయండి 
https://youtube.com/shorts/ugJK4LyrrOQ?si=SFN5rWjTq5lLmwJL

అన్ని పాఠశాలల్లో యుద్ధ ప్రాతిపదికన ఏ ఐ లాబ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం మహా ముత్తారం మండలంలో 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీవిబి జూనియర్ కళాశాల భవన ప్రారంభోత్సవం, మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.70 లక్షలతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి, రూ.72 లక్షలతో నిర్మించనున్న అంగన్వాడి భవనాలు, 7 గ్రామ పంచాయతీల్లో 1 కోటి 40 లక్షలతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.  
ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే  విద్యకు పెద్ద పీట వేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు ద్వారా అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. నాణ్యమైన విద్యాబోధనకు  డీఎస్సీ నిర్వహించి
టీచర్ల నియామకం చేపట్టామని, 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. విద్యార్థులకు
కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచి  నాణ్యమైన విద్య, భోజనం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి తమ కాళ్ళపై తాము నిలబడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. నా కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బంది లేకపోవడం వల్ల నన్ను  ఆంగ్లమాద్యమంలో చదివానని, నాలాగే  విద్యార్థులు ఇంగ్లీష్ లో చదవాలని, బాలికా విద్యకు ఇబ్బంది కలగకూడదని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మన ప్రాంతానికి పెద్ద ఎత్తున కెజిబివి, మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు.
విద్యార్థులు ఒక ప్లాన్ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం ఖచ్చితంగా చదవాలని, చదివిన చదువు తప్పక ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగ పడుతుందన్నారు.
గ్రామంలో ఒక్కరు చదువుకున్నా ..వారు మాత్రమే కాకుండా మొత్తం గ్రామమే బాగుపడుతుందని తెలిపారు.10 వతరగతి పరీక్షలలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. కెజిబివిలో 10 వతరగతి విద్యార్థులకు టి ఫైబర్ ద్వారా ఏ.ఐ ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, విద్యార్థులు చక్కగా చదువుకుని గొప్ప స్థాయికి ఎదిగి మన గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో భూపాల్జిపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మెన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కోట రాజాబాపు,  సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగాని తిర్మల సమ్మయ్య, డీఈఓ రాజేందర్, ఈఈలు, కెజిబివి ఎస్ఓ పుష్పవతి, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిడిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

గురువారం, సెప్టెంబర్ 11, 2025

మంథని: నేడు కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

   
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాశనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం మంథని నియోజకవర్గం లోని కాటారం లో పర్యటించానున్నారు. ఉదయం 11 గంటలకు మహ ముత్తారం మండలంలో 2 కోట్ల 30 లక్షలతో నిర్మించిన కేజీబీవీ జూనియర్ కాలేజ్ భవన ప్రారంభం,అక్కడే  పోలారం, కొర్లకుంట, మహబూబ్ పల్లి, నిమ్మగూడెం, ములుగు పల్లి, మాదారం నూతన గ్రామ పంచాయతీ భవనాలకు, 6 అంగన్వాడీ నూతన భవనాలకు,70 లక్షల సిఆర్ఆర్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు 20 లక్షలతో నిర్మించబోతున్న బోర్ల గూడెం నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన మరియు అంగన్వాడి నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు.

ముత్తారం.. కృత్రిమ మేధస్సుపై విద్యార్థులకు అవగాహన

- రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు

 అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి

  కృత్రిమ మేధస్సు పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని  రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.

గురువారం రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి  ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్, ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎల్ఎంఎస్ పుస్తకాల పంపిణీ, టి ఫైబర్ ద్వారా గ్రామానికి ఏర్పాటుచేసిన సీసీటీవీ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ప్రతి ఇంటి వద్ద టి ఫైబర్  కనెక్షన్ అందించడం జరిగిందని అన్నారు.   పాఠశాలలో ఏఐ ల్యాబ్ ద్వారా ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందుతుందని అన్నారు.
హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మారుమూల ముత్తారం ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యం కల్పించేందుకు ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 
భవిష్యత్తులో వచ్చే సాంకేతికతను అలవాటు చేసుకుంటూ పోటీ ప్రపంచానికి విద్యార్థులను సిద్ధం చేయాలని అన్నారు.
మంథని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాస్ లను ఏర్పాటు చేయాలని, దీని కోసం సిఎస్ఆర్ నిధులు వినియోగిస్తామని అన్నారు. రోబోటిక్స్, డ్రైవర్ లెస్ కార్లు వంటి సాంకేతిక అంశాలు పిల్లలకు నేర్పాలని అన్నారు. మంథని లో ఉన్న ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ను  విద్యార్థులు వాడుకోవాలని మంత్రి సూచించారు. 
ఏఐ టూల్స్ (కృత్రిమ మేధస్సు) పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని అన్నారు. టీచర్స్ కు కూడా ఏ.ఐ బోధన  పై శిక్షణ అందిస్తామని అన్నారు.   పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ రావాల్సిన అవసరం ఉందని, దీని కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసింగ్ అందజేశారు. మరియు అడవి శ్రీరాంపూర్ గ్రామపంచాయతీ లోని టీ ఫైబర్ ద్వారా హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమైన టెక్నాలజీని ప్రారంభించారు.
అంతకుముందు ముత్తారం మండలంలోని దర్యాప్పూర్ వద్ద 2 కోట్ల 80 లక్షల, పోతారం వద్ద రెండు కోట్ల 20 లక్షలతో నిర్మించనున్న సబ్ స్టేషన్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ముత్తారం తాసిల్దార్ కార్యాలయంలో 18 మంది కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా ముత్తారం మండలంలోని పలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల మరమత్తు కోసం రెండు కోట్ల 81 లక్షలతో చేపట్టిన పనులను మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ గౌడ్,  ఆర్.డి.ఓ. సురేష్, హౌసింగ్ పీడీ రాజేశ్వర్,  తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,  తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: అటవీ శాఖ అమరవీరులకు జోహార్లు

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష
అటవీ అమరవీరులకు జోహార్లు తెలుపుతూ నివాళులు అర్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష  తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్కరణ దినోత్సవ కార్యక్రమంలో*  పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బంది జోహార్లు అర్పిస్తూ అటవీ అమరవీరుల స్ఫూర్తితో అడవుల సంరక్షణకు అధికారులంతా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 
అనంతరం అటవి శాఖ సిబ్బంది చేపట్టిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు.
అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. 
ఈ  కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

మంథని: విద్యారంగ అభివృద్ధికి కృషి

రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు*
**మంథని  మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు 

మంథని ప్రాంతంలో విద్యారంగ అభివృద్ధికి సంపూర్ణ కృషి చేస్తామని   రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.

గురువారం  మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించారు.

మంథని మున్సిపాలిటీలో 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ ఫార్మర్ రిపేర్ సెంటర్ కు మంత్రి శంకుస్థాపన చేశారు.  పట్టణంలో ఎంపిపిఎస్ బాలికల పాఠశాల లో టీచ్ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.  

ఈ సందర్భంగా *మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,* 
  పేదలకు నాణ్యమైన విద్య అందాలని స్వచ్ఛంద సంస్థ  టీచ్ ఫర్ చేంజ్ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు  ప్రత్యేక అభినందనలు తెలిపారు.

విద్య, వైద్య రంగాలలో స్పష్టమైన మార్పు తీసుకుని రావాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.  మంథని నియోజకవర్గ పరిధిలో 6 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన టీచ్ ఫర్ చేంజ్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుతో పాటు పిల్లల వ్యక్తిగత అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో టీచ్ ఫర్ చేంజ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.  సమాజంలో మంచి జర జరగాలని నిస్వార్ధంగా కృషి చేస్తున్న మంచు లక్ష్మి గారికి అభినందనలు తెలిపారు. 

విద్యా రంగంలో అభివృద్ధి కోసం ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ సహకారం అందించడం సంతోషకరమని అన్నారు. విద్యతో విజ్ఞానం వస్తుందని, బాగా చదువుకున్న తర్వాత నాయకులుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. 

మంథని నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. 

**జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులు ఏర్పటు చేస్తూ పిల్లలకు మెరుగైన బోధన అందించేందుకు సహకారం అందిస్తున్న టీచ్ ఫర్ చేంజ్ సంస్థ స్థాపకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు డిజిటల్ తరగతులను, మూడు సంవత్సరాల వరకు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ అందించే కరి కులం ను సద్వినియోగం చేసుకుంటూ పిల్లల్లో మంచి మార్పు తీసుకుని రావాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తుందని, అవసరమైన పాఠశాలల్లో ప్రహరీ గోడ, అదనపు తరగతులు, టాయిలెట్స్ అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టామని అన్నారు. 

**టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ప్రతినిధులు ప్రముఖ నటులు మంచు లక్ష్మి మాట్లాడుతూ,*  మంథని లో  6  తరగతి గదులను డిజిటలైజ్  చేయడం జరిగిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో మొత్తం మా సంస్థ ద్వారా 51 తరగతి గదులలో డిజిటల్ సౌకర్యాలు కల్పించామని అన్నారు. 

తమ కుటుంబ నేపథ్యం విద్య రంగం నుంచి వచ్చిందని, తమ తాతగారు హెడ్ మాస్టర్ గా పని చేసేవారని తెలిపారు. మంచి నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో  టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 

పిల్లలు మంచి నాయకత్వ లక్షణాలు, జీవితంలో ఒక మంచి లక్ష్యం కలిగి ఉండాలని అన్నారు. పిల్లలు అందరూ డాక్టర్లు, ఇంజనీర్ కలెక్టర్ వంటి పెద్ద స్థాయికి చేరుకోవాలని అన్నారు.     మా సంస్థ సహకారంతో ఇక్కడి పాఠశాలల్లో మంచి మార్పులు వస్తే మరిన్ని పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ముందుకు వస్తామని అన్నారు. 

అనంతరం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో  విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్స్ , మంథని రామగిరి కమాన్ పూర్ మండలంలో ఎంపికైన 205 లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని,  ప్రతి సోమవారం లబ్ధిదారులకు  ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా నిధులు జమ చేయడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, మంథని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకన్న,ఆర్.డి.ఓ. సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బుధవారం, సెప్టెంబర్ 10, 2025

మంథని: నేడు మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  గురువారం మంథనిలో పర్యటించనున్నారు. ఉదయం 9 30 నిమిషాలకు మంథనిలోని శ్రీపాద కాలనీ వద్ద 80 లక్షలతో నిర్మించబోతున్న నూతన (SPM) ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ సెంటర్ శంకుస్థాపన చేయనున్నారు. 10 గంటలకు మంథని మున్సిపాలిలోని ఎంపీపీఎస్ గర్ల్స్ పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ -(మంచు లక్ష్మీ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభోత్సవం చేయనున్నారు.  12-00 గంటలకు మంథని మంత్రి క్యాంప్ కార్యాలయంలో Fortune RAMA వారి విద్యార్థులకు బుక్స్ & బ్యాగ్స్ మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.12 గంటల 30 నిమిషాలకు మంత్రి  క్యాంప్ కార్యాలయంలో  మంథని,రామగిరి, కమాన్ పూర్, 205 ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు  మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ముత్తారం మండలంలో దర్యాపూర్ వద్ద  రెండు కోట్ల 80 లక్షలతో నిర్మించబోతున్న దర్యాపూర్ సబ్ స్టేషన్ మరియు రెండు కోట్ల 20 లక్షలతో నిర్మించబోతున్న పోతారం సబ్ స్టేషన్ ను శంకుస్థాపన చేయనున్నారు. 2న గంటల 30 నిమిషాలకు ముత్తారం ఏంఆర్ఓ కార్యాలయం వద్ద 18 కళ్యాణ లక్ష్మి చెక్కులు, ముత్తారం ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభోత్సవం మరియు 20 లక్షలతో జిల్లాలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం,12 లక్షలతో లక్కారం అంగన్వాడి భవనం శంకుస్థాపన మరియు డిఎంఎఫ్ టి నిధుల నుండి ముత్తారం మండలంలోని పలు పాఠశాల, అంగన్వాడి రిపేర్లు రెండు కోట్ల 81 లక్షలు పనులను,మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు .
మధ్యాహ్నం 3-00 గంటలకు ముత్తారం మండలం లోని అడవి శ్రీరాంపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా AI కంప్యూటర్ ల్యాబ్ మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభం, మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులకు విద్యార్థులకు LMS బుక్స్ పంపిణీ, అడవి శ్రీరాంపూర్ గ్రామం లో టీ ఫైబర్ సిఎస్ఆర్ ద్వారా గ్రామనికి సీసీటీవీ ప్రారంభోత్సవం చేయనున్నారు, ఇందిరమ్మ ఇంటి పత్రాల పంపిణీ మంత్రిగారి చేతుల మీదుగా చేయనున్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026