Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

మంగళవారం, ఆగస్టు 12, 2025

గోదావరిఖని:72 గంటలు హై అలర్ట్

అత్యవసమైతే తప్ప బయటికి రావద్దు 


రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

రానున్న 72 గంటల పాటు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ సూచించిందని, భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనరేట్ పరిధిలోని  ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనను విడుదల చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు. అధికారుల సూచనలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

*భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి*

📌 రాగల 72 గంటల్లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని సీపీ గారు తెలిపారు.

📌 వర్షాలు కురుస్తున్నందున రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని డ్యామ్స్ మరియు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగింది అని సాధారణ పరిస్థితి వచ్చే వరకు అక్కడికి ఎవరు ప్రజలు వెళ్లకూడదని సూచించారు.

📌రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా  తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రజలు పోలీసు వారి సూచనలు  సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

📌 ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు.

📌 చెట్ల కింద, పాడైన భవనాలు కింద, శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు. 

📌ఎవ్వరు కూడా ఎట్టిపరిస్థితుల్లో కూడా చెరువులోకి, నాలాలు, డ్యామ్స్, వాటర్ ఫాల్స్  లేదా చేపల వేటకు గాని వెళ్ళరాదు. అత్యవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలి.

📌 స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ  అధికారులతో  సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు  ఏర్పాటు చేయడం జరిగింది.

📌 ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.

📌వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండగలరు.

📌వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా  ప్రయాణించండి. వర్షానికి రోడ్లు  కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి  అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.

📌వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.

మంథని: సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా..


* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

* అసలు దోషులకు శిక్ష పడాలి

* సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి

గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు. ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు. మంథనిలో నడిరోడ్డుపై అడ్వకేట్ వామన్ రావు దంపతులు హత్యకు గురైతే అప్పటీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా అసలు దోషులను కాపాడిందన్నారు. కుమారుడు, కోడలిని కోల్పోయిన ఆ వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సిన అప్పటి ప్రభుత్వ పెద్దలు.. విచారణను తప్పుదోవ పట్టించి అసలు హంతకులను కాపాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. చివరకూ... న్యాయమే గెలుస్తుందన్నారు.

న్యూడిల్లీ:సీబీఐకి న్యాయవాద దంపతుల హత్య కేసు

 


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 2021 ఫిబ్రవరి 19న మంథని కోర్టులో ఒక కేసు గురించి వచ్చి హైదరాబాద్ కు కారులో తిరిగి వెళ్తున్న క్రమంలో ఇరువురు దంపతులను దుండగులు రామగిరి పోలీసుస్టేషన్ పరిధిలోని నడిరోడ్డుపై

దారికాచి అందరూ చూస్తుండగానే  మారణాయుధాలతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఈ దాడిలో నాగమణి అక్కడికక్కడే మృతిచెందగా,  వామన్ రావు తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుకుంటుండగా గమనించిన కొంతమంది అతన్ని ఒక వాహనంలో పెద్దపల్లి ఆసుపత్రికి తరించగా అక్కడే ఆయన తుది శ్వాస వదిలారు. మంథని పెద్దపల్లి రహదారి మధ్య పట్టపగలు రద్దీగా ఉన్న సమయంలోనే జరిగిన ఈ హత్యాకాండ ను కొంతమంది ప్రయాణికులు మొబైల్ లో చిత్రీకరించారు.  అలాగే దాడిలో తీవ్రంగా గాయపడి రోడ్డుపై సహాయం కోసం అర్థిస్తున్న వామనరావు కొనఊపిరితో ఉండగా తనపై దాడి చేసిన వారి వివరాలను వెల్లడించిన ఒక వీడియో కూడా అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.

ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి విచారణ జరిపారు. అప్పటి ఐజీ నాగిరెడ్డి కేసు దర్యాప్తు జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ సంఘటనపై రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే, అప్పటి పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను తో పాటు కుంట శ్రీను, చిరంజీవి ప్రధాన నిందితులుగా నిర్ధారించగా, వారికి సహకరించిన వారిని కోర్టుకు హాజరుపర్చారు. అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రమేయముందని, కేసును సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరుపాలని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు ఎన్నోసార్లు విచారణకు వచ్చింది కానీ ఫైనల్ గా మంగళవారం మాత్రం ఈ కేసుకు సంబంధించి కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది.  2021 ఫిబ్రవరి 19న జరిగిన ఈ హత్యలో అప్పటి ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ప్రమేయం ఉండడంతో విచారణ సరిగ్గా జరగలేదంటూ గట్టు కిషన్ రావు తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో  ఉన్నట్లు ఆరోపించబడుతున్న పుట్ట మధుతో పాటు మరికొంతమంది తరపున వాదిస్తున్న న్యాయవాదులు ఇప్పటివరకు ఈ కేసు విచారణ సరిగ్గానే జరిగిందనీ, కేసు హైకోర్టు పర్యవేక్షణ ఉందని  వాదించారు.  అలాగే హత్య ఘటన జరుతున్న సమయంలో తీసిన వీడియోలు అన్ని కూడా హైదరాబాదులో ఎఫ్ఎస్ఎల్ సంబంధించి పూర్తి నివేదిక తయారు చేసిందనీ, ఇప్పుడు మళ్లీ కొత్తగా మరొక దర్యాప్తు సంస్థకు ఈ కేసును బదిలీ చేయాల్సిన అవసరం లేదని తమ వాదనలు వినిపించారు. కానీ గట్టు కిషన్ రావు మాత్రం తన కొడుకు, కోడలు హత్యకు సంబంధించిన విచారణ రాష్ట్రంలో సరిగా జరగట్లేదు అంటూ ఆయన తరుపున వినిపించిన వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. సిబిఐకి ఈ కేసును బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన విషయంలో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్లకు ప్రొటెక్షన్ కావాలని కూడా ప్రతివాదులకు చెందిన అడ్వకేట్స్ అడిగినా,  ప్రొటెక్షన్ ఇచ్చేది లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సంచలనం సృష్టించిన గట్టు వామనరావు దంపతుల కేసును సిబిఐ కి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్, శ్రీమంతుల చిరంజీవి, అక్క పాక కుమార్, తులసిగారి శ్రీనివాస్, ఊదరి లక్ష్మణ్, వెల్ది వసంతరావు, కాపు అనిల్ లు విచారణ ఎదురు కొంటున్నారు. సిబిఐ విచారణలో వాస్తవాలు అన్ని వెలుగులోకి వస్తాయని నమ్మకం తమకు ఉందని వామన్ రావు తండ్రి కిషన్ రావు తెలిపారు. సిబిఐ విచారణలో పూర్తి విషయాలు బయటకు వస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

మంథని: అంగరంగ వైభవంగా "అంగారక చతుర్థి"



అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా మంథని పట్టణంలోని శ్రీ మహా గణపతి దేవాలయంలో సిద్ధి,బుద్ధి సమేతంగా కొలువు తీరిన గణనాథున్ని  సంకష్టహర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గణనాథుని ఆలయాలు భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది.

 దైనందిన జీవితంలో మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ  సంకష్టహర చతుర్థి దీక్షతో తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. కొత్తగా చతుర్థి దీక్ష తీసుకునేవారు అంగారక చతుర్థి రోజున దీక్ష తీసుకోవడం ఎంతో శ్రేయష్కారం. ప్రతి మనిషి తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను అధికమించడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష చేపట్టడం అనాదిగా పాటిస్తున్న నియమం. సంకష్టహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వరుని పూజించి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేసి మోదకులు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.  గణపతికి ఇష్టమైన వారం మంగళవారం అలాగే నవగ్రహాల్లోని కుజ గ్రహ దోషం పోవాలన్న మంగళవారం వచ్చే అంగారక చతుర్థి రోజున "ఓం గం గణపతియై నమః " అని స్మరిస్తూ విఘ్నేశ్వరున్ని దర్శించుకుంటే అన్ని సంకటాలు తొలగిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి రోజున సంకష్టహర చతుర్థి వస్తుంది ఏడాదిలో ఒకసారి మంగళవారం వచ్చే చతుర్థి ని అంగారక అంటారు. ఈ రోజున రాత్రి 9 గంటలకు చంద్రోదయం అనంతరం స్వామివారికి పూజ చేసి భోజనం చేయడం ఎంతో శ్రేయష్కారం. ఈ రోజున ఉపవాస దీక్ష స్వీకరిస్తే జీవితంలో ఎదుర్కొంటున్న విజ్ఞాలన్ని తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి దేవాలయాన్ని ఎంతో అందంగా అలంకరించారు. దేవతలలో మొట్టమొదట పూజించబడే ఎంతో విశిష్టత కలిగిన శ్రీ విఘ్నేశ్వరున్ని పూజించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి అంతా శుభం జరుగుతుందనే విశ్వాసంతో సంకష్టహర చతుర్థి దీక్షను స్వీకరిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరునికి ఇష్టమైన గరిక ( దూర్వాలు ) సమర్పించడం అలాగే 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రలవుతారు అని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ రోజున చంద్రోదయం అనంతరం  భోజనం చేయడం ఈ దీక్షలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆలయ పూజారి పల్లి రాము భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.


సోమవారం, ఆగస్టు 11, 2025

కాటారం: అన్నదాతలకు ఆదాయ వనరులు పెంచుతాం


 ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు



జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో  తనకున్న  భూమిలో  ఆయిల్ ఫామ్ మొక్కలను నాటించారు. 


అనంతరం రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు   మాట్లాడుతూ.. 


రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ఆయిల్ ఫామ్ పంటను సాగు చేయించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. 


రాష్ట్రంలో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్న సమయంలో అంతర్భాగంగా ఇతర పంటలను కూడా సాగు చేసుకోవడం ద్వారా రెండు రకాలుగా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని అన్నారు. 


ఆయిల్ ఫామ్ పంట మూడు సంవత్సరాలలో దిగుబడి వస్తుందని తెలిపారు. 


ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ఉద్యానవన శాఖ నుంచి సబ్సిడీ రాయితీలను అందిస్తున్నామని పేర్కొన్నారు. 


మొక్కలకు ట్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందిస్తారని, మొక్క నాటిన నుంచి నాలుగేళ్ల వరకు రూ. 4,200 వరకు రాయితీ ఇస్తారని అన్నారు. 


అన్నదాతలు ఆయిల్ ఫామ్ సాగు చేసేలా మా యొక్క భూమిలో ఈ పంటను నాటామని అన్నదాతలు ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసి ఆర్థిక అభివృద్ధిని సాధించాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


చిల్డ్రన్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు


భవిష్యత్ తరాలకు బహుమతిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చిల్డ్రన్ పార్కును ఘనంగా ప్రారంభించారు.  కాటారం మండల కేంద్రంలో CSR 36 లక్షలతో శ్రీపాద చిల్డ్రన్ పార్క్ మరియు ఓపెన్ జిమ్  మంత్రి శ్రీధర్ బాబు  ప్రారంభించారు అనంతరం,మరియు మద్దులపల్లి,ధర్మసాగర్, అంకుశాపూర్, రేగులగూడెం, కాటారం  నూతన గ్రామ పంచాయతీ భవనాలకు 7 అంగన్వాడీ నూతన భవనాలకు శంకుస్థాపన చేశారు.


కమాన్ పూర్: రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకు ఉపయోగపడాలి

- రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు డి.శ్రీధర్ బాబు



* కమాన్ పూర్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, సహకార బ్యాంకు బ్రాంచ్ ను  ప్రారంభించిన మంత్రి  

 రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులో ఉపయోగ పడాలని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.

సోమవారం  మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి వర్యులు  కమాన్ పూర్ మండలంలో  65 లక్షలతో నిర్మించిన నూతన పి.ఎ.సి.ఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) భవనాన్ని, 79 లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని, కరీంనగర్ డి.సి.సి.బి  చైర్మన్ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష లతో కలిసి  మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కమాన్ పూర్ మండలంలో సహకార బ్యాంకు బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా రైతులకు సహకార సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.  ప్రజా ప్రభుత్వం లో గత సంవత్సర కాలంలో రైతు సంక్షేమం దిశగా రాజీ లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. 

జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ బ్రాంచ్ నందు డిపాజిటర్లకు, కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా నిర్మించడం జరిగిందని అన్నారు.  పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను వారికి చేర్చేందుకు బ్యాంకులు ఉపయోగ పడతాయని అన్నారు.

రైతుల సంక్షేమం దృష్ట్యా సహకార బ్యాంకులో దోహదపడతాయని అన్నారు. రైతులకు అందుబాటులో ఉండే విధంగా కమాన్ పూర్ మండల కేంద్రం లో సహకార బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేశామని అన్నారు.  

కరీంనగర్ డి.సి.సి.బి  చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ,  కమాన్ పూర్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని,  సహకారం బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. 

కేంద్ర సహకార బ్యాంకులో 72 శాఖలు ఉంటే 32 భవనాలు నిర్మించుకోవడం జరిగిందని,సహకార  సొసైటీ ద్వారా కూడా  భవనాలు బ్యాంకుకు అద్దె ఇవ్వడం జరుగుతుందని అన్నారు.  గతంలో 70కోట్ల నష్టం 400 కోట్ల వ్యాపారంతో ఉన్న సహకార బ్యాంకును  నేడు 7200 కోట్ల వ్యాపారం, 120 కోట్ల లాభాలతో నడిచేలా అభివృద్ధి చేశామని, ప్రతి సంవత్సరం కస్టమర్లకు వాటాదారులకు బోనస్ కూడా అందిస్తున్నామని అన్నారు 

ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్,  ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


అచ్చంపేట: నూతన మునిసిపల్ భవనం ప్రారంభం

కార్యాలయం ప్రారంభించిన మంత్రి వివేక్

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో 3 కోట్ల రూపాయల ఖర్చుతో అత్యధిక అంగులతో నూతనంగా నిర్మించిన మునిసిపల్ కార్యాలయ భవనాన్ని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ లు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ల తో కలిసి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మునిసిపల్ సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని అత్యంత సుందరమైన భవనాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి మున్సిపాలిటీ భవనాన్ని ఎక్కడ చూడలేదని మంత్రి తెలిపారు. ఇంతటి గొప్ప భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ నిర్మాణానికి ప్రత్యేక కృషి చేయడంతోనే భవనం సుందరంగా రూపుదిద్దుకుందని మంత్రి ఎమ్మెల్యే వంశీకృష్ణ ను అభినందించారు.  పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, పట్టణాలు గ్రామాల అభివృద్ధికి బాటలు వేసేలా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సకాలంలో తొలగింపు, కాలువల శుభ్రత, తాగునీటి సరఫరాలో వ్యత్యాసాలు లేకుండా చూసేలా సంబంధిత శాఖల అధికారులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి నివాసానికి శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో కాలువలు, డ్రెయిన్‌లు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్య పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన మున్సిపల్ కౌన్సిలర్లకు సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, కార్మికులు, తదితర వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇవి సామాజిక, ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా తెలిపారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ‌ము ఇచ్చిన 6 గ్యారెంటీల‌ను   తప్ప‌క అమ‌లు  చేస్తామ‌ని, ఇందులో భాగంగా ఒక్కొక్క‌టిగా  నిరంత‌రంగా సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. అలాగే ఇచ్చిన వాగ్దానంతో  అర్హులైన అందరికీ పథకాలు అందిస్తూ  ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నామని, ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ను మెరుగు ప‌రుస్తూన్నామ‌న్నారు. ప్రతి ఒక్కరికి కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో  ఆహార భద్రత చట్టం తీసుకురావడం  జరిగిందని, గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల నిరుపేదలు కడుపునిండా తిండి తినలేక పోవడానికి గ్రహించి నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. మన రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకు 5 వందల రూపాయల బోనస్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ పండించిన సన్నబియ్యాన్ని ధనవంతుడు తింటున్న విధంగానే పేదలు తినాలన్న ఉద్దేశంతో  సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు.  దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా పేదలకు 5 లక్షలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున పేద ప్రజల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులకు రైతు భరోసా,రుణమాఫీ చేశామని తెలిపారు. గృహ‌జ్యోతి ప‌థ‌కం,  గ్యాస్ ప‌థ‌కం,  ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో  ఎ క్కడ కూడా రాజీ పడకుండా అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా మహిళలు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిక్షత తో  ఉందని మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న  ప్ర‌తి ప‌థ‌కాన్ని అర్హులైన ల‌బ్డిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్దికంగా అభివృద్ధి చేందాల‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఇన్చార్జి ఎస్పీ రావుల గిరిధర్, మున్సిపల్ చైర్మన్ జి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.


మంథని : సోలార్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

 రైతులను బలోపేతం చేసే దిశగా చర్యలు

రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మంత్రి డి.శ్రీధర్ బాబు



మంథని  మండలం గుంజపడుగు గ్రామం వద్ద 2 కోట్ల 90 లక్షల రూపాయలతో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. రైతులను బలోపేతం చేసే దిశగా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి పటిష్ట చర్యలు చేపట్టామని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. సోమవారం  మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కరీంనగర్ డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు  లతో కలిసి మంథని మండలం చిల్లపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వేరు హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 7 కోట్ల రూపాయలతో  5 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న రెండు గోదాములకు, గుంజపడుగు గ్రామంలో 2 కోట్ల 90 లక్షల రూపాయలతో పీఎం కుసుమ్ ద్వారా ప్యాక్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్  శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రాథమిక  వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో గుంజపడుగు శివారులో పిఎం కుసుమ్ క్రింద 3.5 కోట్ల రూపాయలతో 1 మెగా వాట్ సోలార్ విద్యుత్  ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో నంది మేడారం, కాల్వ శ్రీరాంపూర్,అప్పన్న పేట, మంథని ప్రాంతాలలో 1 మెగా వాట్ చోప్పున ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 4 నెలల కాలంలో ఈ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం, గ్రిడ్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలని అన్నారు. చిల్లపల్లి గ్రామంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను 7 కోట్ల రూపాయలతో చేపట్టామని అన్నారు. గుంజపడుగు ప్రాంతంలో సహకార బ్యాంక్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఆర్బిఐ కు పంపాలని మంత్రి సూచించారు. సహకార శాఖ లో 20 సంవత్సరాల కాలంగా తన వంతు కృషి చేస్తున్న కరీంనగర్ డిసిసిబి చైర్మన్ కు అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతు సోదరులకు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.రైతు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనుబంధ రంగాలైన గోదాముల నిర్మాణం, పిఏసిఎస్ ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు నువ్వంటే కార్యక్రమాల వల్ల రైతులను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల అమలులో స్థానిక ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో  గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్,  మంథని మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వెంకన్న,ఆర్డిఓ సురేష్, సహకార సంఘ అధ్యక్షులు శ్రీనివాస్, తహసిల్దార్, ఎంపిడిఓ,సంబంధిత అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


శనివారం, ఆగస్టు 09, 2025

హైదరాబాద్: కొత్తపేటలో బ్రాహ్మణ ఉపకర్మ

హైదరాబాదులోని కొత్తపేట శ్రీ గౌతమి గజానన మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఉపాకర్మ( శ్రావణి)*

👇👇👇👇

అవధానుల ప్రసాద్ శర్మ సౌజన్యం


మంథని :ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

మంథని నియోజకవర్గ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ దగ్గర్లో గల కాంగ్రెస్ జెండాను ఎగరవేసి అనంతరం కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు. స్థానిక బస్టాండ్ లో యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలతో రాఖీలు కట్టించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేసి డిపో మేనేజర్ తో మాట్లాడి మహిళల ప్రయాణ సౌకర్యం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరినారు. మేనేజర్ సానుకూలంగా స్పందించి బస్సులు అదనంగా ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ 1960 లో స్థాపించబడిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య యువజన విభాగం,యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగినటువంటి విభాగం యూత్ కాంగ్రెస్ అని తెలిపారు.యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ఓనమాలు నేర్చి అనేకమంది దేశవ్యాప్తంగా ప్రముఖంగా రాజకీయాల్లో ఉన్నారని తెలిపారు.యువత రాజకీయంగా ఎదగడానికి యువజన కాంగ్రెస్ మంచి ప్లాట్ ఫామ్ అని ఈ సందర్భంగా తెలిపారు.గత 10 సంవత్సరాలు యువజన కాంగ్రెస్ ప్రతి గ్రామాల తిరుగుతూ గ్రామ గ్రామాన యువజన కాంగ్రెస్ కమిటీలు వేసి అనేక ధర్నాలు, దీక్షలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి యువజన కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందిస్తుందో వాటిని అర్హులైన నిరుపేదలకు అందించే విధంగా మరియు ప్రజలకు నాయకులు శ్రీధర్ బాబు కి మధ్య యువజన కాంగ్రెస్ వారధిల పని చేస్తుందని తెలిపారు.యువజన కాంగ్రెస్ నాయకులు ప్రియతమ నేత రాష్ట్ర మంత్రి అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు ఏదైతే ఈ నియోజవర్గాన్నే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోతు ఉన్నారు.ఈ ప్రాంతంలో విద్య వైద్యం మౌలిక సదుపాయాలు తాగునీరు సాగునీరు అందిస్తూ అన్ని రంగాలలో మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్నారని, శ్రీను బాబు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వారు పరిష్కరిస్తూ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారని అన్నారు.శ్రీధర్ బాబు మరియు శ్రీనుబాబు నాయకత్వంలో రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి చేయడమే లక్ష్యంగా శ్రీధర్ బాబు ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ నాయకులు శక్తి వంచన లేకుండా పని చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు, అన్ని విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కమాన్ పూర్ లో..

 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రెబల్ రాజు ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు అన్వర్ తోపాటు లల్లు, మల్యాల మహేష్, ఇ రుగు రాళ్ల రాజు, చొప్పరి సంతోష్, నల్లెల్లి శంకర్, కా డిపల్లిసుమన్ తదితరులు పాల్గొన్నారు.

మంథని:

 ఆపరేషన్ సింధూర్ 

జవాన్ కు చెల్లెలి రాఖీ


కమాన్ పూర్ మండలం నాగారం లింగాల గ్రామానికి చెందిన ఆపరేషన్ సింధూర్ జవాన్ పెరుమాళ్ అభిరామ్ కు తన చెల్లెలు శ్రీజ రాఖీ కట్టారు. ఇటీవల పాకిస్తాన్ తో ఆపరేషన్స్ సింధూర్ లో భాగంగా అభిరాం రాజోలి బోర్డర్లో తన సేవలను అందించారు. ఇటీవల సెలవుల్లో స్వగ్రామానికి రాగా తన చెల్లెలు శ్రీజ రాఖీ కట్టి నువ్వు దేశానికి ఇలాగే రక్షణగా ఉండాలని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ దేశానికి సేవ చేయాలని కోరింది.

హైదరాబాద్:

మంత్రి శ్రీధర్ బాబుకు రాఖీ కట్టిన మహిళలు



రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్  మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి శ్రీధర్ బాబు కు మంథని నియోజకవర్గ మహిళలు సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

మంథని:

ఘనంగా సామూహిక యజ్ఞోపవీత ధారణ

మంథని పట్టణంలోని అన్ని వాడల్లోని దేవాలయాలు సాముహిక యజ్ఞోపవీతధారణ కార్యక్రమం శనివారం  భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తమ్మిచెరువు కట్ట శ్రీ వీర హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వేదమూర్తులైన అవధానుల పురుషోత్తం, కిషోర్ లు హోమగుండం ఏర్పాటు చేసి వేదమంత్రాలతో నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

శుక్రవారం, ఆగస్టు 08, 2025

మంథని:

 బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లో కూడా కల్పించాలి

మంథని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోటికార్ కిషన్ జి



బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లోనే కాదు చట్టసభల్లో కూడా కల్పించాలని మంథని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోటికార్ కిషన్ జి డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపిస్తే ఇప్పటికీ కేంద్రం ఉలుకు పలుకు లేకుండా ఉండడం సూచనీయమని ఆయన అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ కు, రాష్ట్రపతికి పంపించిన దీనిపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. అందువల్లే తెలంగాణ కు చెందిన ప్రజాప్రతినిధులు, బీసీ నాయకులు ఢిల్లీలో ధర్నా చేసిన కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం యావత్తు తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టుగానే భావించాలన్నారు. శాసనసభ ఏకగ్రీవ తీర్మానంలో పాలుపంచుకున్న బిఆర్ఎస్, బిజెపిలు ఢిల్లీలో చేసిన ధర్నాకు రాకపోగా అవహేళనగా మాట్లాడడం వారి చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. 42 శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగంలో కల్పించడంలో టిఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదన్నారు. మంథని నియోజకవర్గంలో బీసీ నినాదం ఎత్తుకున్న బిఆర్ఎస్ నాయకులు మీ వైఖరి స్పష్టం చేయాలన్నారు. మీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి ఢిల్లీ లో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బిజెపి ముస్లింలను బీసీల్లో చేర్చినట్టు కుంటి సాకులు చెబుతున్న మీరు గుజరాత్ లో, ఉత్తరప్రదేశ్ మొదలగు రాష్ట్రాల్లో ముస్లింలో ఉన్న బీసీలను గుర్తించి రిజర్వేషన్లు కల్పించలేదా అని ప్రశ్నించారు. బిజెపి ద్వందనితిని ఖండించి బిసి రిజర్వేషన్లు 42 శాతం కోసం పార్టీలకు అతీతంగా బీసీలు అంతా ఏకమై పోరాడేందుకు సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోటికార్ కిషన్ జి అన్నారు

మంథని:

మంథనిలో ఘనంగా వరలక్ష్మీ వ్రత పూజలు 



- శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైనది వరలక్ష్మి శుక్రవారం 

- అందంగా అలంకరించిన అమ్మవారి దేవాలయం


శ్రావణ మాసంలో అత్యంత పవిత్రమైన రోజు శ్రావణ శుక్రవారం. మంథని పట్టణంలోని ఎంతో మహిమాన్వితం కలిగిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఉదయం 3 గంటలకు అమ్మవారి మూల విగ్రహమునకు ఫల పంచామృతాలతో అభిషేకం చేయించే కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే శ్రీ చక్రమునకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. సహస్రనామ త్రిషది నామ ఖడ్గనామ, కుంకుమార్చన అనంతరం హారతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 9:30 గంటలకు మహిళలచే సామూహిక కుంకుమార్చన అలాగే సాయంత్రం 5 గంటలకు సామూహిక లలిత సహస్రనామ పారాయణము, రాత్రి 9 గంటలకు భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించి తలయింపు సేవతో వరలక్ష్మి శుక్రవారం కార్యక్రమాలు శాస్త్రోప్తంగా నిర్వహించినట్లు  ఆలయ అర్చకులు మారుపాక ప్రశాంత్ తెలిపారు. అమ్మవారి దయ ఉంటే అన్ని అన్నీ ఉన్నట్లే అని ఆయన తెలిపారు. అనాదిగా ఎంతో విశిష్టత కలిగిన అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం 5 గంటల నుండి భక్తుల సందడి మొదలవుతుంది. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడంతో ఆలయంలో పండుగ వాతావరణ నెలకొంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు ఉన్న పోచమ్మ తల్లి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడింది. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.

సంగారెడ్డి:

 గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా తెలంగాణ 

- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు



- ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి 

- రాష్ట్రంలో "తోషిబా" రూ.347 కోట్ల పెట్టుబడి 

- రూ.177 కోట్లతో ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ

-రూ.65 కోట్లతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్

- రూ.105 కోట్లతో  స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ యూనిట్


తెలంగాణను గ్లోబల్మా న్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చేందుకు మా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. 

శుక్రవారం సంగారెడ్డి జిల్లా రుద్రారం లోని తోషిబా ట్రాన్స్ మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో రూ.347 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీఆర్జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, సర్జ్ అరెస్టేర్ యూనిట్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. "ఆనతి కాలంలోనే తెలంగాణ తయారీ రంగంలో దేశానికి దిక్సూచిగా మారింది. 2024 -25 లో ఇండస్ట్రియల్ అవుట్ పుట్ రూ.2.77 లక్షల కోట్లు. ఇందులో 48 శాతం వాటా తయారీ రంగానిదే. 9 నెలల్లోనే రూ.లక్ష కోట్ల విలువైన మార్చండైజ్ ఎక్స్ పోర్ట్స్ రాష్ట్రం నుంచి జరిగాయి. జీఎస్ డీపీ వృద్ధి రేటు 8.2 శాతం. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ" అని ఈ సందర్భంగా ఆయన వివరించారు. 

2040 నాటికి దేశీయ విద్యుత్ డిమాండ్ రెట్టింపు..

"2040 నాటికి దేశీయ విద్యుత్ డిమాండ్ రెట్టింపు అవుతుందని ఆర్థిక సర్వే(2024 - 25) లెక్క తేల్చింది. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకొని రాష్ట్రానికి కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. తెలంగాణ ను రెన్యువబుల్స్ ఇంజిన్ ఆఫ్ ఇండియా గా మార్చాలనే సంకల్పంతో క్లీన్ & గ్రీన్ ఎనర్జీ పాలసీ - 2025 ను తీసుకొచ్చాం. ఇప్పటికే క్లీన్ ఎనర్జీలో రూ.29వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగాం. 2030 నాటికి న్యూ రెన్యువబుల్ కెపాసిటీని 20వేల మెగా వాట్లకు పెంచేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం" అని చెప్పారు. 

ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్ మెంట్ జోన్లు

"బ్యాటరీలు, పవర్ కాంపోనెంట్స్, స్మార్ట్ గ్రిడ్స్ తదితర రంగాల్లో తోషిబా లాంటి దిగ్గజ సంస్థలను తెలంగాణాకు ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ఎక్విప్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయబోతున్నాం.  

స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్ కోసం తోషిబా - తెలంగాణ ఆర్ అండ్ డీ హబ్ కు శ్రీకారం చుట్టబోతున్నాం. 

క్లీన్ టెక్, సెమీ కండక్టర్స్, రోబోటిక్స్, అడ్వాన్స్ మాన్యుఫాక్చరింగ్ లో పెట్టుబడులకు తెలంగాణలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఈ వేదిక ద్వారా జపాన్ కంపెనీలను 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నా" అని అన్నారు. 

దుష్ప్రచారానికి ధీటైన సమాధానం తోషిబా...

"కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో నే అంతర్జాతీయ, జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం. 

కానీ.. కొందరు కావాలని పని గట్టుకొని వాటిని ఉత్తుత్తి ఎంవోయూ లు అంటూ మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విమర్శలకు ఈరోజు మేం కాదు, తోషిబా కంపెనీనే మీకు ధీటైన సమాధానం ఇస్తుంది. ఈ ఏప్రిలో లో జపాన్ పర్యటనలో 

రూ. 562 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తోషిబా కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో ఈరోజు రూ.177 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఈహెచ్ వీ పవర్ ట్రాన్స్ఫార్మర్ల ప్లాంట్ విస్తరణ పనులకు భూమి పూజ నిర్వహించుకున్నాం. రూ.65 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సీ ఆర్ జీవో కోర్ ప్రాసెసింగ్ సెంటర్, 

రూ.105 కోట్లతో  స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫర్ సర్జ్ అరెస్టేర్ ను ప్రారంభించుకున్నాం. ఈ పెట్టుబడులతో ఎనర్జీ రంగంలో తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అవుతుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకట స్వామి, ఐటీ శాఖ స్పెషల్ సీఎస్ సంజయ్ కుమార్, జపాన్ ఎంబసీ ఎకనామిక్ & డెవలప్మెంట్ మంత్రి Kyoko  Hokugo, తోషిబా కార్పొరేషన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ Hiroshi Kaneta, సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.

మంథని:

శ్రీ వారాహీదేవి యంత్ర, విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో శ్రీను బాబు



మల్హర్‌రావు మండలంలోని పెద్దతుండ్ల గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ వారాహీదేవి యంత్ర మరియు విగ్రహ ప్రతిష్ఠాపన, అలాగే నవగ్రహ యంత్ర మరియు విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య యంత్రాలు, విగ్రహాలను ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చి, శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీను బాబు  ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చనలు నిర్వహించి, గ్రామ ప్రజల శ్రేయస్సు, సుఖసంపదల కోసం ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో సానుకూల వాతావరణాన్ని తీసుకువచ్చి, ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

మంచిర్యాల:

 దండేపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన డీసీపీ


మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, జోన్ పోలీస్ స్టేషన్ ల విజిట్ లో భాగంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న డీసీపీ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ సందర్శించి పిటిషన్ లను వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధి  లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. డిసీపీ, పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.  పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు.  పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల, పిడియస్ రైస్, గుడుంబా సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర   నిఘా ఉంచాలని, చట్టం వ్యతిరేకమైన కార్యకలా పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి  చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, దండేపల్లి ఎస్ ఐ తైసినద్దీన్  ఉన్నారు.

పెద్దపల్లి:

11 అక్రమ ఇసుక డంప్ సీజ్



పెద్దపల్లి జిల్లాలో 11 అక్రమంగా ఇసుక డంప్ లను సీజ్ చేసి మూసివేయడం జరిగిందని  *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*  శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

రామగుండం ప్రాంతంలో 5 ఇసుక డంప్ లు, మంథని ప్రాంతంలో 3 ఇసుక డంప్ లు, శ్రీరాం పూర్, రామగిరి, ధర్మారం మండలాల్లో ఒక్కో అక్రమ ఇసుక డంప్ మొత్తం 11 అక్రమ ఇసుక డంప్ లను గుర్తించి సీజ్ చేయడం జరిగిందని అన్నారు.  అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై సంబంధిత సెక్షన్లతో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరిగిందని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని పాముల పేట మేడిపల్లి ఇసుక రీచ్ లను శాశ్వతంగా మూసి వేస్తున్నామని అన్నారు.

జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్ట ప్రకారం అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కలెక్టర్ అక్రమార్కులను ఆ ప్రకటనలో హెచ్చరించారు. 

పెద్దపల్లి:


స్వాతంత్ర్య వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

అదనపు కలెక్టర్ డి.వేణు



పెద్దపల్లి జిల్లాలో నిర్వహించు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు.  శుక్రవారం అదనపు కలెక్టర్ డి.వేణు లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్  డి.వేణు మాట్లాడుతూ*  స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని,  జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని  అదనపు కలెక్టర్ తెలిపారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు.  స్వాతంత్ర వేడుకల వేదిక, సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆర్ &బీ అధికారులను ఆదేశించారు.  ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. 

వేడుకల వద్ద ఏ.ఎన్.ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని,  అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు  మున్సిపల్ కమిషనర్  ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.  వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ  అందాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం  రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా ఆగస్టు 11  సాయంత్రం నాటికి అందజేయాలని అన్నారు.ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు.  సమావేశంలో డి సి పి. కరుణాకర్, ఏ సి పి.జి. కృష్ణ , పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య,  కలెక్టరేట్ సి విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026