Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

సోమవారం, సెప్టెంబర్ 14, 2026

ముంబాయ్ నుంచి మంథనికి

దేశంలో మొదటి సంస్థ పూణె, ముంబైలో..
తెలుగు రాష్ట్రాల్లో మొదటి సంస్థ మంథనిలో..
ఇప్పుడు గల్లి గల్లి కి విస్తరించిన వైనం..

(దిక్సూచి ప్రత్యేక కథనం..)
భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ పిలుపుతో దేశవ్యాప్తంగా గణేష్ మండళ్లు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా మహారాష్ట్రలోని ముంబై, పూణే, థానే, కర్ణాటకలోని బెలగావి, తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథనిలో సార్వజనిక గణేష్ మండలి పేరుతో సంస్థలు ఏర్పడ్డాయి. 1892 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంస్థలు గణేష్ ఉత్సవాలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ సంస్థల గురించి తెలుసుకుందాం.
1893లో ముంబైలో ..
ముంబైలోని గిర్గావ్‌లో కేశవ్‌జీ నాయక్ చాల్ సార్వజనిక్ గణేశోత్సవ మండలి 1893 లో స్థాపించారు. తిలక్ స్వయంగా ఈ మండలిని సందర్శించారు. ఇప్పటికీ ఇక్కడ భారీ విగ్రహాలు కాకుండా సాంప్రదాయబద్ధంగా కేవలం 2 అడుగుల మట్టి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించడం విశేషం. 

1892లో పూణే లో..
 శ్రీమంత్ బావూ సాహెబ్ రంగారి గణపతి ట్రస్ట్ స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీమంత్ బావూ సాహెబ్ రంగారి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఇక్కడి విగ్రహం రాక్షస సంహారం చేస్తున్న వినాయకుడి రూపంలో చెక్కతో ప్రత్యేకంగా చెక్కబడింది. 
గ్రామ దేవతగా గణేశుడు..
1893 లో లక్ష్మీ రోడ్ లో కాసబా గణపతి మండలి. పుణే నగరానికి గ్రామ దేవతగా భావిస్తారు. పుణే నిమజ్జన ఊరేగింపులో ఇప్పటికీ ఈ గణేషుడికే మొదటి ప్రాధాన్యత (మొదటి గౌరవం) దక్కుతుంది. 
ఆగమనం ముంబైలో పెద్ద పండుగ
 ముంబై లో చిన్చ్‌పోక్లి చింతామణి గణేష్ మండలి 1920 లో స్థాపించారు. చిన్చ్‌పోక్లి సార్వజనిక గణేష్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి గణనాథుడి ఆగమనం (ఆగమన్ సోహళా) ముంబైలోనే ఒక పెద్ద పండుగలా సాగుతుంది. 2026 ఆగమనం కింద లింక్​ క్లిక్​ చేసి చూడండి..
థానే లో.. 
శ్రీ గణేష్ ఉత్సవ మండలి ప్రారంభించారు.  థానేలోని లోకమాన్య ఆలి వద్ద ఉన్న ఈ పండల్ 100 సంవత్సరాలకు పైగా ఎలాంటి ఆర్భాటాలు, బాలీవుడ్ మ్యూజిక్ లేకుండా కేవలం సాంప్రదాయబద్ధంగా, పర్యావరణహితంగా బట్టలు, కాగితపు అలంకరణలతో మాత్రమే పూజలు నిర్వహిస్తోంది. 
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి లో..
జెండా చౌక్ గణేష్ ఉత్సవ మండలి 1905 లో ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్రంలోనే మొట్టమొదటి సార్వజనిక గణేష్ ఉత్సవ సంస్థగా ఇది గుర్తింపు పొందింది. హిందూ-ముస్లిం ఐక్యతకు, మత సామరస్యానికి ఈ మండలి ఒక ప్రతీకగా నిలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి గణేశ ఉత్సవ సంస్థ 
తెలుగు రాష్ట్రాల్లో మొదటి గజానన్ సంస్థ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథనిలో ప్రారంభించారు. తిలక్ పిలుపు మేరకు పూణే, ముంబై, నాగపూర్ ప్రాంతాల్లో ప్రవాసం చేసే మంథని పురోహిత, వంట బ్రాహ్మణులంతా కలిసి ఒక కమిటీ గా ఏర్పడి ఈ సంస్థ ను స్థాపించారు. దీనికి సర్వజన గజానన మండలి పేరుతో వాగుగడ్డ ప్రాంతంలోని సువర్ణ రఘురామయ్య ఇంట్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించినట్లు అప్పుడు వారు రాసుకున్న
బైలాస్ రికార్డు పుస్తకం ద్వారా తెలిసింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కో కమిటీ సభ్యుల ఇళ్లకు మారుస్తూ మంథనిలోనీ అన్ని వీధుల్లో ఈ సంస్థ పేరుతో నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయ పద్దతిలో నిర్వహించారు. అదే వరుసలో మారుపాక శేషాద్రి, టక్కేగారి మల్లన్న, మొతేరాం పెద్ద రాజేశ్వర్ రావు ఇళ్లలో కొన్ని సంవత్సరాలు ఉత్సవాలు నిర్వహించిన తరువాత, స్థిరంగా పెంజేరుకట్ట హనుమాన్ దేవాలయంలో  ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సిద్ధి, బుద్ధి సహిత గణేష్ గా పూజింపబడుతున్న గజాననునికి 1976 లో 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా షస్టిపూర్తి ఉత్సవాలు నిర్వహించారు. ఆ తరువాత 2016 లో శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకున్నారు. 
అలాగే మంథనిలోని నడివీధి, రావులచెరువు కట్ట గణపతి సంస్థ లు 2023, 2025 లో వందేళ్ల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. 

2013 లో  వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో..

NTV ప్రత్యేక కథనం just click below link

https://youtu.be/LRARe9viAf0?si=6Nv0mSntaxm3D0DR

శనివారం, సెప్టెంబర్ 12, 2026

కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లు


రాష్ట్రం లో క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు *శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు*. ప్రతి కార్పోరేషన్ లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు.  తెలంగాణా మున్సిపల్ చట్టం-2019 కి సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్లను ప్రధాన స్రవంతిలో కి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.

గ్రీన్, రీసైకిల్ టాయిలెట్ల ప్రారంభం

దిక్సూచి, హైదరాబాద్:
నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఎదిగిన హైదరాబాద్ నగరం మరో ప్రపంచస్థాయి అత్యుధునిక సాంకేతికతకు వేదిక కానుంది. బిల్ గేట్స్ ఫౌండేషన్ అభివృద్ధి చేసిన పునర్వినియోగానికి వీలుగా నీటిని శుద్ధి చేసే నెట్ జీరో, గ్రీన్ టాయిలెట్లను తయారు చేయడానికి నగరం ఎంపికైంది. రీ ఫ్లో అనే పర్యావరణ అనుకూల సాంకేతిక సంస్థ, తెలంగాణా ప్రభుత్వ ఆధీనంలోని టీ- వర్క్స్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి ఇక్కడ అత్యాధునిక గ్రీన్ టాయిలెట్లను ఉత్పత్తి చేసి దేశంలోని వివిధ రాష్ట్రాలు, దేశాలకు సరఫరా చేయనున్నాయి. దేశంలోని మొట్టమొదటి గ్రీన్ టాయిలెట్లను ఇక్కడి లుంబినీ పార్కులో ఏర్పాటు చేసాయి. నీటిని పునర్విగించే ఈ నెట్ జీరో టాయిలెట్ల సముదాయాన్ని ఐటి, పరిశ్రమలు, శాసనవ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*, రవాణా, బిసి సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ లు ప్రారంభించారు. రూ. కోటితో ఏర్పాటు చేసిన ఈ మరుగుదొడ్లను ఎక్కడికైనా తరలించే వీలుంటుంది. రీ ఫ్లో సంస్థ టీ వర్క్స్ తో కలిసి వాటిని ఇక్కడే ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం పట్ల శ్రీధర్ బాబు ప్రశంసించారు. సోలార్ విద్యుత్తుతో నడిచే ఈ టాయిలెట్లకు విద్యుత్తు కనెక్షన్ అవసరం లేదు. ఒకసారి ట్యాంకును నింపితే అదే నీటిని అనేక సార్లు శుద్ది చేసి తిరిగి వినియోగిస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. టెక్నాలజీని ఉచితంగా అందజేస్తున్న గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. 50 యూనిట్ల రీసైకిల్ టాయిలెట్లకు ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్డర్లు లభించాయని ఆయన వెల్లడించారు. గేట్స్ ఫౌండేషన్ పరిశోధన సంస్థలు అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత ఉచితంగా లభించడం వల్ల తక్కువ ధరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తక్కువ నీటిని వినియోగించడం, కరెంటు సరఫరా అవసరం లేక పోవడం వల్ల వీటిని ఎక్కడైనా ఉపయోగించవచ్చని శ్రీధర్ బాబు వివరించారు. కార్యక్రమంలో గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి అర్చనా వ్యాస్, రీ ఫ్లో ప్రతినిధి అభిషేక్, టి వర్క్స్ సిఇఓ జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.

గురువారం, సెప్టెంబర్ 10, 2026

కనకధారా స్తోత్రం


వందే వందారు మందారమిందిరానందకందలమ్ ।
అమందానందసందోహ బంధురం సింధురాననమ్ ॥

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిలవిభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 1 ॥

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని ।
మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 2 ॥

ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం-
ఆనందకందమనిమేషమనంగతంత్రమ్ ।
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 3 ॥

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 4 ॥

కాలాంబుదాళిలలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 5 ॥

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన ।
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 6 ॥

విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షం
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి ।
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం [క్షణమీక్షణార్ధం]
ఇందీవరోదరసహోదరమిందిరాయాః ॥ 7 ॥

ఇష్టా విశిష్టమతయోఽపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ।
దృష్టిః ప్రహృష్టకమలోదరదీప్తి-రిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 8 ॥

దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా-
మస్మి-న్నకించన విహంగశిశౌ విషణ్ణే ।
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీనయనాంబువాహః ॥ 9 ॥

గీర్దేవతేతి గరుడధ్వజసుందరీతి
శాకంభరీతి శశిశేఖరవల్లభేతి ।
సృష్టిస్థితిప్రళయకేలిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైకగురోస్తరుణ్యై ॥ 10 ॥

శ్రుత్యై నమోఽస్తు శుభకర్మఫలప్రసూత్యై
రత్యై నమోఽస్తు రమణీయగుణార్ణవాయై ।
శక్త్యై నమోఽస్తు శతపత్రనికేతనాయై
పుష్ట్యై నమోఽస్తు పురుషోత్తమవల్లభాయై ॥ 11 ॥

నమోఽస్తు నాళీకనిభాననాయై
నమోఽస్తు దుగ్ధోదధిజన్మభూమ్యై ।
నమోఽస్తు సోమామృతసోదరాయై
నమోఽస్తు నారాయణవల్లభాయై ॥ 12 ॥

నమోఽస్తు హేమాంబుజపీఠికాయై
నమోఽస్తు భూమండలనాయికాయై ।
నమోఽస్తు దేవాదిదయాపరాయై
నమోఽస్తు శారంగాయుధవల్లభాయై ॥ 13 ॥

నమోఽస్తు దేవ్యై భృగునందనాయై
నమోఽస్తు విష్ణోరురసిస్థితాయై ।
నమోఽస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోఽస్తు దామోదరవల్లభాయై ॥ 14 ॥

నమోఽస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోఽస్తు భూత్యై భువనప్రసూత్యై ।
నమోఽస్తు దేవాదిభిరర్చితాయై
నమోఽస్తు నందాత్మజవల్లభాయై ॥ 15 ॥

సంపత్కరాణి సకలేంద్రియనందనాని
సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి ।
త్వద్వందనాని దురితోద్ధరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే ॥ 16 ॥

యత్కటాక్షసముపాసనావిధిః
సేవకస్య సకలార్థసంపదః ।
సంతనోతి వచనాంగమానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే ॥ 17 ॥

సరసిజనిలయే సరోజహస్తే [సరసిజనయనే]
ధవళతమాంశుకగంధమాల్యశోభే ।
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ ॥ 18 ॥

దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట
స్వర్వాహినీవిమలచారుజలప్లుతాంగీమ్ ।
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథ-గృహిణీం-అమృతాబ్ధిపుత్రీమ్ ॥ 19 ॥

కమలే కమలాక్షవల్లభే త్వం
కరుణాపూరతరంగితైరపాంగైః ।
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ॥ 20 ॥

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ ।
గుణాధికా గురుతర-భాగ్య-భాగినో [భాగినః]
భవంతి తే భువి బుధభావితాశయాః ॥ 21 ॥

సువర్ణధారాస్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ॥

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కనకధారాస్తోత్రం సంపూర్ణమ్ ।

పొలాల అమావాస్య శుభాకాంక్షలు

 


హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ కొత్త టెక్నాలజీ సెంటర్ ప్రారంభం

లైఫ్‌సైన్సెస్ రంగంలో హైదరాబాద్‌ది కీలక పాత్ర: మంత్రి శ్రీధర్ బాబు

దిక్సూచి, హైదరాబాద్:

ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద లైఫ్‌సైన్సెస్ సంస్థ ఎంఎస్‌డీ (MSD) హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కొత్త టెక్నాలజీ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు కావడం తెలంగాణ లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధిలో మరో కీలక మైలురాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ఇప్పటికే సమగ్ర లైఫ్‌సైన్సెస్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసిందని తెలిపారు.

రాష్ట్రంలో ఏపీఐలు, బల్క్ డ్రగ్స్, జనరిక్స్, సీడీఎంఓ, వ్యాక్సిన్లు, మెడికల్ అండ్ క్లినికల్ రీసెర్చ్, డ్రగ్ డిస్కవరీ తదితర రంగాల్లో 2,000కుపైగా సంస్థలు పనిచేస్తున్నాయని మంత్రి వివరించారు. గత రెండేళ్లలో ఈ బలమైన పునాదిపై మరింత దృష్టి సారించి, ఇప్పుడు డిస్కవరీ, ఇన్నోవేషన్, అధునాతన పరిశోధన–అభివృద్ధి, ప్రపంచ స్థాయి సామర్థ్యాల నిర్మాణంపై దృష్టి పెట్టామని చెప్పారు.


అమ్జెన్, ఎలి లిల్లీ, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, సనోఫీ, అలైన్ టెక్నాలజీ, జోయెటిస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించాయని మంత్రి పేర్కొన్నారు.

ఎంఎస్‌డీ కొత్త టెక్నాలజీ సెంటర్ తెలంగాణలోని లైఫ్‌సైన్సెస్ ఎకోసిస్టమ్‌కు సహజమైన అనుసంధానమని శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ లైఫ్‌సైన్సెస్ సామర్థ్యాలతో పాటు, దేశంలోని అతిపెద్ద టెక్నాలజీ కారిడార్లలో ఒకటి ఉండటం నగరానికి ప్రత్యేక బలమని చెప్పారు.

లైఫ్‌సైన్స్, టెక్నాలజీ, ప్రతిభ ఒకేచోట కలిసే అవకాశం హైదరాబాద్‌లో ఉందని, దీనివల్ల ప్రపంచ అవసరాలకు అనుగుణంగా పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ సంస్థలకు బలమైన వేదిక ఏర్పడుతోందని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ అభివృద్ధిలో ఇది తదుపరి దశ అని శ్రీధర్ బాబు అన్నారు. తయారీ, శాస్త్రీయ పరిశోధన రంగాల్లో తెలంగాణకు ఉన్న బలాన్ని ఉపయోగించుకుని ఆవిష్కరణలు, డిస్కవరీని మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు.

నెక్స్ట్-జెన్ లైఫ్‌సైన్సెస్ పాలసీ 2026–30 ద్వారా లైఫ్‌సైన్సెస్, టెక్నాలజీ రంగాల మధ్య అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ ఏడాది 100 గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల (GCCs) స్థాయికి చేరుకునే దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని తెలిపారు. గత ఏడాది ఇప్పటికే 75కుపైగా GCCలు ఏర్పాటు అయ్యాయని, వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 4 లక్షల అధిక విలువైన ఉద్యోగావకాశాలు సృష్టించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు.

ఎంఎస్‌డీని తెలంగాణకు స్వాగతిస్తున్నామని, లైఫ్‌సైన్సెస్, టెక్నాలజీ, ఆవిష్కరణలకు హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు మరో కీలక అడుగని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

బుధవారం, సెప్టెంబర్ 09, 2026

పొలాల అమావాస్య.. రైతు బతుకుతో ముడిపడిన పండుగ

 

మంథని మహాలక్ష్మి ఆలయం వద్ద పోచక్క తల్లి 

(దిక్సూచి ప్రత్యేక కథనం)

తెలంగాణ పల్లెల్లో వ్యవసాయానికి, రైతు జీవితానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న సంప్రదాయ పండుగల్లో పొలాల అమావాస్య ఒకటి. మట్టిని నమ్ముకుని జీవించే రైతు.. తనకు అన్నం పెట్టే భూమిని, వ్యవసాయాన్ని, పశువులను గౌరవిస్తూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

పొలాల అమావాస్య సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి పూజిస్తారు. నాగలి, కొడవలి, పార వంటి వ్యవసాయ పరికరాలకు పసుపు, కుంకుమలు పెట్టి పూజలు నిర్వహిస్తారు. పంట పొలాలకు వెళ్లి భూమాతను స్మరించుకుని.. పంటలు బాగా పండాలని, కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటారు.

పశువులకు ప్రత్యేక గౌరవం

వ్యవసాయంలో రైతుకు తోడుగా నిలిచే ఎద్దులు, పశువులకు ఈ పండుగలో ప్రత్యేక స్థానం ఉంటుంది. వాటిని శుభ్రంగా కడిగి, కొమ్ములకు రంగులు వేసి, పూలతో అలంకరించి పూజలు చేస్తారు. పశువుల ఆరోగ్యం బాగుండాలని, వ్యవసాయ పనుల్లో అవి సహకరించాలని కోరుకుంటారు.

మట్టితో మనిషికి ఉన్న అనుబంధం

పొలాల అమావాస్య కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. రైతు–భూమి–పశువు–పంట మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక. విత్తనం వేసి పంట చేతికొచ్చే వరకు రైతు పడే శ్రమను, ప్రకృతిపై అతనికున్న నమ్మకాన్ని ఈ పండుగ ప్రతిబింబిస్తుంది.

ఆధునిక వ్యవసాయంలో ట్రాక్టర్లు, యంత్రాలు విస్తరించినా.. భూమిని పూజించడం, వ్యవసాయ పరికరాలను గౌరవించడం, పశువులను ఆదరించడం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ తెలంగాణ గ్రామాల్లో కొనసాగుతున్నాయి.

తరతరాలకు అందాల్సిన సంప్రదాయం

నేటి తరం పిల్లలకు వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాకుండా.. రైతు జీవితం, మట్టితో ఉన్న అనుబంధం, ప్రకృతిని గౌరవించే సంస్కృతి గురించి తెలియజేసే సందర్భం కూడా పొలాల అమావాస్య.

భూమిని గౌరవిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది.. రైతును గౌరవిస్తేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది అనే సందేశాన్ని చాటిచెప్పే పండుగగా పొలాల అమావాస్యకు తెలంగాణ పల్లెల్లో ప్రత్యేక స్థానం ఉంది.

పొలాల అమావాస్య వ్రత కధ :

అనగా అనగా ఒక ఊర్లో ఓ బ్రహ్మణమ్మ . ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతునారు . పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి ధుఖించి ఆ బ్రహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టు ప్రతి ఏట పిల్లల్ని బొంద పెడుతున్నది . ఈ పొలలమావాస్యకు పుడుతున్నారు , మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు . నోముకుందామని ఎవర్ని పేరంటం పిలిచినా రామంటునారు . ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం మైనది , చనిపోయింది . ఆ పిల్లను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది . అప్పుడు పోచక్క తల్లి ఈ ఊర్లలో వాళంత నాకు మొక్కేందుకు వస్తారు . పాయసం , వడలు నైవేద్యం తెస్తారు . ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి , ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు . పాలేర్లు కల్లు తెస్తారు . వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు . నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది .
అమ్మా! పోచక్క తల్లి వేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తునారు అని బాధ పడింది. అప్పుడు పోచమ్మ తల్లి "బ్రహ్మణమ్మ పోయిన జన్మలో పొలలమావాస్య పేరంటాలు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం , గారెలు పెట్టిందని , పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూసింది అని , మడి , తడి లేకుండా అన్ని అమాంగిలం చేసిందని అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయినారని" చెప్పింది . తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది . అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరగన్నునది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. "శ్రావణమాసం చివర బాధ్ర్రపదమాసం తొలుత వచ్చే అమావస్యని పొలలమావాస్య అంటారు . గోడను ఆవు పేడ పాలతో అలికి, పసుపు కుంకుమతో పొలాలు రాసి, కంద మొక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరం పోచక్క తల్లికి కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి . పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి . భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి . ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా , మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి కాపాడుతుందని " చెప్పింది.
ఈ విధంగా బ్రహ్మణమ్మ ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానంని తిరిగిపొందింది.

మంగళవారం, సెప్టెంబర్ 08, 2026

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిగ్రీ, పీజీ కళాశాలల బంద్

దిక్సూచి, కరీంనగర్:

ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ, తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం, 08-09-2026న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ కళాశాలలు ఒక్కరోజు బంద్ పాటించాయి.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, కళాశాలల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే, బంద్‌కు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే తదుపరి దశలో నిరవధిక బంద్‌కు వెళ్లాల్సి వస్తుందని అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు.

ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ (సుప్మా) అధ్యక్షుడు గుగ్గిళ్ల జగన్ గౌడ్, కార్యదర్శి గోవిందవరం కృష్ణ, కోశాధికారి సంగోజు అంజయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు.

విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ

 


దిక్సూచి,  జైపూర్‌, సెప్టెంబరు 8: మండలంలోని వేలాల ఎంపీయూపీఎస్‌ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్‌ బ్యాగుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కీ.శే. దుద్దిళ్ల రామయ్య–సత్యభామ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు దుద్దిళ్ల శ్రీపాదరావు బ్యాగులను అందజేశారు.

ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యుల చేతుల మీదుగా పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైపూర్‌ మండల ఎంపీడీవో, గ్రామ సర్పంచ్‌, వార్డు సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. శారద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కె. శారద మాట్లాడుతూ విద్యార్థుల కోసం స్కూల్‌ బ్యాగులను అందించిన దాత దుద్దిళ్ల శ్రీపాదరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందించిన గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అయ్యగారికి, కార్యక్రమానికి హాజరైన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు


 దిక్సూచి స్పెషల్

స్పీకర్‌గా సభకు గౌరవం..         

ప్రజా నాయకుడిగా మంథనికి ఆత్మీయ బంధం 

అసెంబ్లీ సెంట్రల్‌ హాల్‌గా చిరస్థాయి గుర్తింపు

దిక్సూచి,  హైదరాబాద్:
కొన్ని రాజకీయ జీవితాలు పదవులతో ముగుస్తాయి. మరికొన్ని వ్యక్తిత్వాలు పదవులను దాటి చరిత్రలో నిలిచిపోతాయి. దుద్దిళ్ల శ్రీపాదరావు రెండో కోవకు చెందిన నాయకుడు. ప్రజల సమస్యలను శాసనసభలో బలంగా వినిపించిన ఎమ్మెల్యేగా, సభా నిబంధనలకు పెద్దపీట వేసిన స్పీకర్‌గా ఆయన వేసిన ముద్ర నేటికీ గుర్తుండిపోయింది. ఆయన ఒకప్పుడు నడిపించిన అదే శాసనసభలో ఇప్పుడు ‘దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్‌’ ఏర్పాటు కావడం ఆయన ప్రజా జీవితానికి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ హాల్‌ను ప్రారంభించారు. 

గ్రామ సర్పంచ్‌ నుంచి స్పీకర్‌ వరకు..

1937 నవంబర్ 6న జన్మించిన శ్రీపాదరావు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదివారు. స్వగ్రామం ధన్వాడ నుంచే ప్రజాసేవ ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన అనంతరం మంథని వ్యవసాయాభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు, మహాదేవపూర్ సమితి ఉపాధ్యక్షుడు తదితర బాధ్యతలు చేపట్టారు. రైతులతో, గ్రామీణ ప్రజలతో ఏర్పడిన ఈ అనుబంధమే ఆయన రాజకీయ ఎదుగుదలకు పునాదిగా మారింది. 

1983లో మంథని నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీపాదరావు.. ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించారు. కాంగ్రెస్‌ శాసనసభా పక్ష విప్‌గా, పలు అసెంబ్లీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 1991 ఆగస్టు 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై 1995 జనవరి 11 వరకు ఆ పదవిలో కొనసాగారు.

స్పీకర్‌ అంటే కుర్చీ కాదు.. బాధ్యత

శ్రీపాదరావు స్పీకర్‌ పదవిని అధికార ప్రదర్శనగా కాకుండా ప్రజాస్వామ్య బాధ్యతగా చూశారు. సభా నియమాలను లోతుగా అధ్యయనం చేసి వాటి ఆధారంగానే నిర్ణయాలు తీసుకునేవారని ఆయన రాజకీయ జీవితంపై వచ్చిన పలు విశ్లేషణలు చెబుతున్నాయి.

పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌, రూలింగ్స్‌ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీ వ్యవహారాల్లో ప్రత్యేక ముద్ర వేశాయి. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా సభా హక్కులను కాపాడటమే తన బాధ్యతగా భావించారు.

మైకు ముందు ప్రజలు.. రాజకీయాలు కాదు

ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శ్రీపాదరావు గోదావరి పరివాహక ప్రాంత రైతుల సాగునీటి సమస్యలు, ఉత్తర తెలంగాణ కరువు పరిస్థితులు, దళిత–బహుజన వర్గాల సమస్యలు, నిరుద్యోగం, పేదరికం, నక్సలైట్‌ సమస్య వంటి అంశాలను శాసనసభలో ప్రస్తావించారు.

ఆయన ప్రసంగాల్లో రాజకీయ విమర్శ కంటే సమస్యపై అధ్యయనం, పరిష్కారంపై ఆలోచన ఎక్కువగా ఉండేదని సమకాలీన విశ్లేషణలు పేర్కొంటున్నాయి. అందుకే ఆయన ప్రసంగాలను ఇప్పుడు ‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి’ పేరుతో గ్రంథరూపంలోకి తీసుకువస్తున్నారు. ఎమెస్కో ఈ సంకలనాన్ని ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

పదవి పోయినా.. ప్రజలకు దూరం కాలేదు

1994 ఎన్నికల్లో ఓటమి ఎదురైనా శ్రీపాదరావు ప్రజల నుంచి దూరం కాలేదు. మంథని ప్రజలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం రాజకీయ లెక్కలకు అతీతమైనదిగా నిలిచింది. సామాన్యుడు అర్ధరాత్రి తలుపు తట్టినా స్పందించే నాయకుడనే విశ్వాసం ఆయనపై ఉండేదని ఆయన రాజకీయ జీవితంపై వచ్చిన కథనాలు పేర్కొంటున్నాయి.

1999 ఏప్రిల్ 13న నక్సలైట్ల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు. 62 ఏళ్ల వయసులో ఆయన జీవితం అర్ధాంతరంగా ముగిసినా.. ప్రజలతో ఏర్పడిన బంధం మాత్రం ముగియలేదు.

25 ఏళ్ల తర్వాత.. అదే సభలో శాశ్వత గుర్తింపు

శ్రీపాదరావు మరణించి దాదాపు 27 ఏళ్లు అవుతున్న సమయంలో ఆయన పేరు తెలంగాణ శాసనసభలోని కొత్త సెంట్రల్‌ హాల్‌కు పెట్టడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ తరహాలో రూపొందించిన ఈ ప్రాంగణం శాసనసభ, శాసనమండలి సభ్యులు పరస్పరం చర్చించుకునేందుకు, అధికారిక, శాసనపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడ అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయం ప్రకారం ఈ సెంట్రల్‌ హాల్‌ తెలంగాణ ప్రజాస్వామ్య విలువలు, శాసన సంప్రదాయాలు, చర్చా సంస్కృతికి ప్రతీకగా నిలవాలి.

తండ్రి చూపిన బాటలో తనయుడు

శ్రీపాదరావు వారసత్వాన్ని రాజకీయంగా కొనసాగిస్తున్న ఆయన తనయుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రస్తుతం తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు. తండ్రి మాదిరిగానే విషయ పరిజ్ఞానం, ప్రశాంతత, ప్రజా సమస్యలపై దృష్టితో రాజకీయాల్లో ముందుకు సాగుతున్నారు.

దిక్సూచి మాట

శ్రీపాదరావు కథ ఒక రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర మాత్రమే కాదు.
ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలి?
స్పీకర్‌ పదవి అంటే ఏమిటి?
అధికార, ప్రతిపక్షాల మధ్య నిష్పాక్షికత ఎలా ఉండాలి?
శాసనసభలో మాట్లాడే ప్రతి మాట వెనుక ప్రజా ప్రయోజనం, విషయ పరిజ్ఞానం ఎంత అవసరం?

ఈ ప్రశ్నలకు ఆయన రాజకీయ ప్రస్థానం సమాధానం చెబుతుంది.

ఒకప్పుడు ఆయన కూర్చున్న స్పీకర్‌ కుర్చీ ఆయనను గుర్తుపెట్టుకుంది.
ఇప్పుడు ఆయన నడిపించిన సభే ఆయన పేరును శాశ్వతంగా మోస్తోంది.

అందుకే.. నడిపించిన సభలోనే నిలిచిన పేరు — దుద్దిళ్ల శ్రీపాదరావు. 

సోమవారం, సెప్టెంబర్ 07, 2026

మంథనిలో కాంగ్రెస్‌ 1000 రోజుల పాలన సంబరాలు

 


సంబరాల వీడియోలకు Dtv చూడండి..

దిక్సూచి,  మంథని: 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంథని మండలంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు అయిలి ప్రసాద్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పోలు శివ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రైతు సంక్షేమం, యువతకు అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ, పెట్టుబడి సాయం, ధాన్యం సేకరణతో పాటు విద్య, ఉద్యోగాల రంగంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను నాయకులు వివరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, మెగా డీఎస్సీ, గ్రూప్‌-1, గ్రూప్‌-2, పోలీస్‌ ఉద్యోగాల భర్తీ చేపట్టిందని పేర్కొన్నారు.

‘మంథని అభివృద్ధికి శ్రీధర్‌బాబే దిక్సూచి’

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు, ఓడేడు బ్రిడ్జి, మంథని మాతా శిశు ఆసుపత్రి నిర్మాణాలపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం మంథనిలో 50 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయ సముదాయం, వెజ్‌–నాన్‌వెజ్‌ మార్కెట్లు, విస్తృత రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతోందన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు, దుద్దిళ్ల శ్రీనుబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని నాయకులు హెచ్చరించారు. మంథని ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీధర్‌బాబు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వ 1,000 రోజుల పాలనతో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మున్సిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం, సెప్టెంబర్ 06, 2026

సెప్టెంబర్ 2026 ముఖ్యమైన రోజులు, పండుగలు

 


  • సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి
  • సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవం (Teacher's Day)
  • సెప్టెంబర్ 14: వినాయక చతుర్థి (గణేష్ చతుర్థి)
  • సెప్టెంబర్ 16: ప్రపంచ ఓజోన్ దినోత్సవం (World Ozone Day)
  • సెప్టెంబర్ 17: విశ్వకర్మ పూజ
  • సెప్టెంబర్ 18: ప్రపంచ వెదురు దినోత్సవం (World Bamboo Day)
  • సెప్టెంబర్ 21: అంతర్జాతీయ శాంతి దినోత్సవం మరియు ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం
  • సెప్టెంబర్ 22: రోజ్ డే (క్యాన్సర్ రోగుల సంక్షేమం) & ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం
  • సెప్టెంబర్ 25: అనంత చతుర్దశి (గణేష్ విసర్జన)
  • సెప్టెంబర్ 27: మహాలయ అమావాస్య / పితృపక్షం ప్రారంభం

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026