
- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ విప్ ఆరెపల్లి మోహన్*
- అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా: మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ సవాల్*
*మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలి
- శ్రీధర్ బాబు నిజాయితీ రాష్ట్రానికే తెలుసు. - కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్:
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై, రాష్ట్ర ప్రభుత్వంపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మండిపడ్డారు. గురువారం నగరంలోని కెమిస్ట్ భవన్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య, ఆర్ జిపిఎస్ రాష్ట్ర కోకన్వీనర్ ఉప్పుల అంజన్ ప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకారపు భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, ఎన్.ఎస్.యు ఐ రాష్ట్ర నాయకులు పోతారం సురేందర్ తదితరులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ..
ఫ్యూచర్ సిటీలో అవకతవకలు జరిగాయని, మంత్రి శ్రీధర్ బాబు అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీధర్ బాబు పై చేసిన ఆరోపణలపై మీ వద్ద సాక్ష్యాలు ఉంటే బహిరంగపరచాలి. అవినీతిని రుజువు చేసినట్లయితే రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతానని, నిరూపించినట్లయితే జీవన్ రెడ్డి రాజకీయాల నుండి తప్పుకుంటారా ఆరెపల్లి మోహన్ సవాల్ విసిరినారు. ధైర్యం ఉంటే 2016 నుండి మంథని ప్రాంతంలో ఇసుక దందా ఎవరు ప్రారంభించారో రుజువు చేయాలని అన్నారు, ఇసుక మాఫియాను విచ్చలవిడిగా కొనసాగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు ఎకరాల భూమి ఏమైందని, దళితులకు ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన భూములను తీసుకొని స్మశాన వాటికల్లో రైతు వేదికలు నిర్మించిన సంగతి నిజం కాదా అని నాడు కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు గారి తండ్రితో పని చేశానని చెప్పుకుంటూ ఆయనను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. శ్రీధర్ బాబు గారి నిజాయితీ గురించి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు జీవన్ రెడ్డి గత చరిత్ర ఒకసారి గుర్తు చేసుకోవాలి అని పేర్కొన్నారు
వామన్ రావు దంపతుల హత్య ఉదంతం మంథనిలో శాంతి భద్రతల లోపించడానికి ఎవరు బాధ్యులు జీవన్ రెడ్డి కి తెలియదా అని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ పాలనలో దళిత బంధు పథకాన్ని కేవలం హుజురాబాద్కు మాత్రమే ఎందుకు పరిమితం చేశారు? రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేదు? దీని గురించి బీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడరు అని మండిపడ్డారు.
కులాలకు, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నాడు ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ కొనసాగుతున్నాయి. వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 100 శాతం న్యాయం చేసింది అని అన్నారు.
*సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ*
బిఆర్ఎస్ నేతలు తమ ఉనికి కోల్పోతున్నామని, SIR పేరుతో నియోజకవర్గాల పర్యటన చేపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పై అక్కసు వెళ్లగకుతున్నారు. పుట్ట మధుకర్ అనే వ్యక్తి ఇసుక దోపిడీకి బ్రాండ్ అంబాసిడర్. నేటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఇసుక కాంట్రాక్టర్లను, రోడ్డు కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. అలాంటి వ్యక్తికి వంట పడుతూ జీవన్ రెడ్డి గారు మాట్లాడటం సరైన పద్ధతి కాదు.
కాళేశ్వరంలో రెండు గేట్లు కుంగిపోతే దానిని చిన్నచూపు చూస్తూ ఏం నష్టం జరుగుతుందని హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ అవినీతికి నిదర్శనం. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకొని, సొంత ఖజానాకు తరలించి, అప్పుల పాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు కాకపోవడానికి కారణం మీరు చేసిన అప్పులే.
గ్రానైట్ క్వారీలలో బ్లాక్ మెయిల్కు పాల్పడి వసూలు చేసింది కేటీఆర్, హరీశ్ రావు కాదా? రాబోయే రోజుల్లో శ్రీధర్ బాబు లాంటి నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం. మా కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరు.
ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం ఇవ్వడం ప్రజా వంచన అవుతుందా? బాధ్యతగల మంత్రిగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రీధర్ బాబు ఎంతో శ్రమిస్తున్నారు అని వెల్లడించారు.