Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

బుధవారం, జనవరి 28, 2026

ముంబాయి: గగనతలంపై విషాదం


* విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

*  సంచలనం సృష్టిస్తున్న సంఘటన

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం భారత రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. బుధవారం (జనవరి 28, 2026) ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు.

​ఈ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు రాజకీయ పరిణామాలు ఇలా ఉన్నాయి.

​ముంబై నుంచి తన స్వస్థలమైన బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం (Learjet 45) ప్రమాదానికి గురైంది.

  • ​సమయం: ఉదయం 8:45 గంటల సమయంలో ల్యాండింగ్ కావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.
  • ​స్థలం: పుణె జిల్లాలోని బారామతి విమానాశ్రయం సమీపంలో.
  • ​మృతులు: ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు, ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (PSO), మరియు ఒక అసిస్టెంట్.. మొత్తం ఐదుగురు మరణించారు.
  • ​కారణం: విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రన్‌వే సమీపంలో కుప్పకూలిందని, అనంతరం పేలుడు సంభవించి మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

​అజిత్ పవార్ మృతి కేవలం ప్రమాదం కాదని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరగాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

​1. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ

​ప్రస్తుత దర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకం లేదని, కేవలం సుప్రీంకోర్టు నేతృత్వంలోని కమిటీ మాత్రమే వాస్తవాలను బయటకు తీసుకురాగలదని ఆమె స్పష్టం చేశారు.

​2. రాజకీయ గమనంపై అనుమానం

​గత కొద్ది రోజులుగా అజిత్ పవార్ ప్రస్తుత 'మహాయుతి' కూటమి (BJP - శివసేన షిండే వర్గం) నుండి బయటకు రావాలని యోచిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తన బాబాయి శరద్ పవార్‌తో తిరిగి చేతులు కలిపి 'మహా వికాస్ అఘాడి' (MVA) లోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్న తరుణంలోనే ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు.

​3. భద్రతపై ప్రశ్నలు

​"దేశంలో ఎవరికీ భద్రత లేదు. అధికార కూటమిలో ఉన్న వ్యక్తికే ఇలా జరిగితే, ఇక ప్రతిపక్షాల పరిస్థితి ఏమిటి?" అని మమత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

​రాజకీయ నేపథ్యంలో 'రీయూనియన్' ఊహాగానాలు

​అజిత్ పవార్ మరణానికి ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి:

  • ​మున్సిపల్ ఎన్నికల పొత్తు: ఇటీవల జరిగిన పుణె, పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ ఎన్నికల్లో శరద్ పవార్ మరియు అజిత్ పవార్ వర్గాలు కలిసి పోటీ చేశాయి.
  • ​చిహ్నంపై ఏకాభిప్రాయం: ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల కోసం అజిత్ పవార్‌కి చెందిన 'గడియారం' గుర్తుపైనే రెండు వర్గాలు పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.
  • ​సంకేతాలు: "రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు" అని అజిత్ పవార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా పార్టీ విలీనంపై ఆశలు రేపాయి.
  • ​అజిత్ పవార్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధికారిక సంతాప దినాలను ప్రకటించింది. డీజీసీఏ (DGCA) మరియు ఏఏఐబీ (AAIB) బృందాలు ఇప్పటికే బ్లాక్ బాక్స్ సాయంతో ప్రమాద కారణాలను అన్వేషిస్తున్నాయి.

మంగళవారం, జనవరి 27, 2026

మంథని: మంత్రుల భేటీపై విష ప్రచారం

మంత్రి శ్రీధర్ బాబు (ఫైల్)

*లోక్ భవన్ నుంచి అందరి ముందే ఒకే కారులో వెళ్ళాం.. ఇందులో దాపరికాలు లేవు.

* క్యాబినెట్ అనేది ఒక యూనిట్.... పాలనను సమన్వయం చేసుకోవడం మా బాధ్యత

* మా భేటీలో ప్రధాన చర్చ మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత పైనే: 

* తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు  రాజకీయాలను ఆపాదిస్తూ "రహస్య భేటీ" అంటూ విష ప్రచారం చేయడం తగదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు*. మంత్రుల భేటీపై సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు కావాలనే పని గట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

"ప్రజాస్వామ్యంలో క్యాబినెట్ అనేది ఒక యూనిట్. పాలనాపరమైన అంశాల్లో ఎక్కడా జాప్యం ఏర్పడకుండా ఉండటానికి సీనియర్ మంత్రులుగా మేం చర్చించుకుంటే అందులో తప్పేముంది... ? అది ప్రభుత్వ సమష్టి బాధ్యత. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నివాసంలో మేము భేటీ అయ్యి పాలనాపరమైన అంశాలను చర్చించాం" అని స్పష్టం చేశారు. "లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరి ముందే మేమంతా ఒకే కారులో వెళ్లాం. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సన్నద్ధత అనేది రాజకీయ పార్టీల ప్రాథమిక బాధ్యత. దీనికి కూడా లేనిపోని రంగులు పూయడం సమంజసం కాదు" అని అన్నారు. "నిర్మాణాత్మకమైన విమర్శలను మేము ఎప్పుడూ స్వాగతిస్తాం. కానీ వ్యక్తిత్వ హననానికి, ఊహాజనిత కథనాలకు పాల్పడితే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. రాష్ట్రాభివృద్ధి కోసం... భావితరాల భవిష్యత్తు కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం ఇకనైనా మానుకొని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి" అని కోరారు.

మంథని: పలు కుటుంబాలను మంత్రి పరామర్శ


మంథని పట్టణంలో ఇటీవల మృతిచెందిన వారి కుటుబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం పరామర్శించారు.  మాజీ ఎమ్మెల్సీ  గీట్ల జనార్ధన్ రెడ్డి తనయుడు అజయ్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు భాగవతుల శంకర్ తల్లి అమృతమ్మ, గూడూరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

అలాగే మంథని మండల పరిధిలోని గద్దలపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యూత్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు రాయినేని దేవేందర్, గోస్కుల నారాయణ, కుర్మశెట్టి మల్లయ్య, రాచకొండ బుచ్చమల్లు, వంగరి రామయ్య, లింగం రాయమల్లు, ఓదెలు, గోస్కుల నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

అనారోగ్య బాధితులను సైతం..

మంథని మండల పరిధిలోని గద్దలపల్లి గ్రామంలో మూత బుచ్చన్న కూతురు అనుప్రియ మరియు చిగురు గట్టయ్య, పుల్లే గౌరక్క, పుల్లె రాజయ్య అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

భూపాల్ పల్లి: జాతరకు వెళ్ళే క్రమంలో అనంతలోకాలకు


ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా..

ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

మేడారం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి వెళ్తున్న మహాదేవపూర్ మండలం బొమ్మపూర్ గ్రామానికి చెందిన భక్తులు మహాముత్తారం మండలం పెగడపల్లి పెద్దవాగు వద్ద ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు భక్తులు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు.

ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే భూపాలపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

*సమాచారం అందుకున్న వెంటనే మంథని పట్టణంలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు*.

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని వరంగల్ లోని MGM ఆసుపత్రికి తరలించారు.

 *అక్కడ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు గారు, బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు*.

అదేవిధంగా సంఘటన స్థలానికి చేరుకొని ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్న *మంత్రి శ్రీధర్ బాబు గారు*.

శనివారం, జనవరి 24, 2026

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ సమరం


(హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి)

​* పట్టణ ఓటరు నాడి ఎటు? 

* మూడు పార్టీలకి చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణం

తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ అదే స్థాయిలో హోరాహోరీ పోరు కనిపిస్తోంది.

  • మేయర్ పీఠాలపై కన్ను: రాష్ట్రవ్యాప్తంగా 10కి పైగా కార్పొరేషన్లు, 120కి పైగా మున్సిపాలిటీలకు ఎన్నికలు.
  • ​కీలక నేతలు: ఈ ఎన్నికల బాధ్యతను స్వయంగా భుజాన వేసుకున్న సీఎం రేవంత్, కేటీఆర్, మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.
  • ​బ్యాలెట్ vs ఈవీఎం: ఎన్నికల నిర్వహణపై విపక్షాల అనుమానాలు, విమర్శలు.

​కాంగ్రెస్ పాలనకు అసలైన పరీక్ష

అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇది.


  • ​ప్రతిష్టాత్మకం: ఆరు గ్యారంటీల అమలు, మూసీ పునరుజ్జీవనం వంటి పనులు పట్టణ ఓటర్లను ఎంతవరకు ఆకట్టుకున్నాయో ఈ ఎన్నికలు నిరూపిస్తాయి.
  • ​వ్యూహం: "ప్రజా పాలన" పేరుతో గ్రామస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు పట్టణాల్లో కూడా పాగా వేయాలని చూస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీలపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు.

​ఉనికి కోసం బీఆర్ఎస్ ఆరాటం

​బీఆర్ఎస్ పార్టీకి ఇది కేవలం ఎన్నిక కాదు, ఉనికి చాటుకునే ప్రయత్నం.  


  • ​అడ్వాంటేజ్: సాధారణంగా మున్సిపల్ ప్రాంతాల్లో బీఆర్ఎస్‌కు బలమైన కేడర్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి చేసిన రికార్డు ఉంది.
  • ​సవాళ్లు: ఫోన్ ట్యాపింగ్ విచారణలు, కేటీఆర్‌ను సీబీఐ/సిట్ ప్రశ్నించడం వంటి అంశాలు పార్టీని డిఫెన్స్‌లో పడేశాయి. దీనిని "రాజకీయ కక్ష"గా ప్రజల్లోకి తీసుకెళ్లి సానుభూతి పొందాలని గులాబీ దళం భావిస్తోంది.

​గ్రేటర్ విజయమే పరమావధిగా బీజేపీ..

​బీజేపీ ఈసారి కింగ్ మేకర్‌గా కాకుండా, సింగిల్‌గా మెజారిటీ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది.

  • ​హిందూత్వ ఓటు బ్యాంక్: మతపరమైన సమీకరణాలు మరియు కేంద్ర పథకాల ప్రచారంతో యువతను ఆకర్షించాలని బీజేపీ ప్లాన్.
  • ​టార్గెట్: జీహెచ్‌ఎంసీ (GHMC) తో పాటు కరీంనగర్, నిజామాబాద్ వంటి మేజర్ కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం.

​ముఖ్యమైన సమీకరణాలు:

  1. ​హైదరాబాద్ మెట్రో పాలిటన్ ఏరియా: ఇక్కడ ఫలితాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి.
  2. ​ప్రభుత్వ వ్యతిరేకత: నిరుద్యోగ భృతి, కొత్త నోటిఫికేషన్ల విషయంలో ఆలస్యం యువతలో వ్యతిరేకత తెచ్చే అవకాశం ఉంది.
  3. ​కొత్త పార్టీల ప్రభావం: కవిత గారు ఇతర పార్టీలతో కలిసి చేసే ప్రయోగాలు ఏ మేరకు ఓట్లు చీలుస్తాయో చూడాలి.

గోదావరిఖని: 8 మంది మావోయిస్టులు లొంగుబాటు

మాట్లాడుతున్న రామగుండం పోలీస్ కమిషనర్ 

లొంగిపోయిన వారికి పునరావాస పథకం 

గోదావరిఖని: నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు రామగుండం కమిషనరేటు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్నటువంటి వివిధ రకాల సహాయ సహాకారాలు మరియు లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని, తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని లొంగిపోయారు.

* లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు

లొంగిపోయిన ఎనిమిది మంది వ్యక్తులు మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ వంటి విభాగాల్లో క్రియాశీలకంగా పని చేశారు. వీరు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ మరియు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

1. ధర్మాజీ శ్రీకాంత్, తండ్రి: భీమయ్య, వయస్సు: 33 సంవత్సరాలు, ప్రస్తుతం నివాసం: ఇటీక్యాల LXPT N/o చెగ్యాం గ్రామం, వెల్గటూర్ మండలం, జగిత్యాల జిల్లా.

2019 నుండి CPI (మావోయిస్టు) కోరియర్‌గా పనిచేశాడు. 2024లో వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు అయ్యాడు. జైలు నుండి విడుదలైన అనంతరం మళ్లీ తిరిగి ఛత్తీస్‌గఢ్‌లో పార్టీలో చేరి, పార్టీ మెంబర్‌గా ప్రమోషన్ పొందాడు. కంకనాల రాజిరెడ్డి, ఆజాద్, దామోదర్ వంటి సీనియర్ మావోయిస్టు నాయకులకు కొరియర్‌గా పనిచేశాడు.

2. పొడియం కాములు, వయస్సు: 30 సంవత్సరాలు, మిలీషియా కమాండర్. స్థానిక మిలీషియా సమీకరణ మరియు నాయకత్వంలో కీలక పాత్ర పోషించాడు. 2024 లో దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ అయినాడు, మరల 2025 లో విడుదలై తన కార్యకలాపాలను కొనసాగించాడు.   

3. ముడియం జోగ, , వయస్సు: 25 సంవత్సరాలు, చైతన్య నాట్య మండలితో సంబంధం కలిగి, సాంస్కృతిక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

4. కుంజం లక్కె (స్త్రీ), వయస్సు:23 సంవత్సరాలు, పార్టీ మెంబర్. భద్రు ఆధ్వర్యంలో పనిచేసింది. ఆంధ్రి ఎన్‌కౌంటర్‌లో తప్పించుకుంది. ఆ ఎన్‌కౌంటర్‌లో వరంగల్‌కు చెందిన మాచెర్ల యేసోబు @ జగన్ (RCM) చనిపోయాడు.

5. మోదం భీమ, వయస్సు:30 సంవత్సరాలు, మిలీషియా సభ్యుడు. మావోయిస్టు కి స్థానిక సహాయక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు.

6. కుంజం ఉంగా, వయస్సు:28 సంవత్సరాలు, GAD కమాండర్. స్థానిక గూడాచర్య సమాచారం సేకరణ మరియు లాజిస్టిక్స్ బాధ్యతలు నిర్వహించాడు.

7. ముడికం సుక్రం, వయస్సు:25 సంవత్సరాలు, మిలీషియా సభ్యుడు. స్థానిక ప్రాంత కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నాడు.

8. ముడియం మంగు, వయస్సు:50 సంవత్సరాలు, మిలీషియా సభ్యుడు, జంగిల్ కమిటీ. 

శ్రీకాంత్ ఒక్కడే తెలంగాణ కి చెందినవాడు, మిగిలిన వాళ్ళందరూ ఛతీస్ ఘడ్ రాష్ట్రం , బీజాపూర్ జిల్లా, గంపుర్ గ్రామం, గాంగేలురు పోలీస్ స్టేషన్ పరిధికి చెందినవారు.

*మీ ఊరికి రండి! 

మావోయిస్టులకు పోలీస్ వారి ఆహ్వానం!!*

రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ తరుపున, అజ్ఞాతములో ఉన్న మావోయిస్టులను జన జీవన స్రవంతి లోకి రావాలిసినది గా కోరుచున్నాము.  తెలంగాణ మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి రావాలని, తెలంగాణ అభివృద్దికి తోడ్పడాలని కోరుతున్నాము. అజ్ఞాత మావోయిస్టులు వారి గ్రామాలకు తిరిగి వచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు ఇచ్చే పునరావాస పథకాలు మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తుంది. వారు స్వతంత్రంగా జీవించే విధంగా ప్రభుత్వం వారికి  అన్నీవిధాల తోడ్పాటును అందిస్తుంది. లొంగిపోయిన సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి రామగుండం కమిషనరేటు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని హామీ ఇస్తున్నామన్నారు.  ప్రస్తుత సమాజంలో యువత చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వారు దూరంగా ఉంటున్నారు. మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది. చదువుతున్న వారు ఎవరు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళడం లేదన్నారు.  అజ్ఞాతం లో ఉన్న అదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లా మావోయిస్టులు కూడా వారి గ్రామాలకు తిరిగి రావాలని కోరారు. ఈ సమావేశం లో  అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఇన్స్పెక్టర్ లు రాజేంద్ర ప్రసాద్, భీమేష్, ఆర్ ఐ శేఖర్, ఆర్ ఎస్ ఐ లు వెంకట్, శివ, తదితరులు పాల్గొన్నారు.

శుక్రవారం, జనవరి 23, 2026

నాసా: ఎర్ర గ్రహంపై నీటి జాడలు

  •  మూలం: NASA
  • Mars Perseverance Rover' లేదా 'అంగారక గ్రహం ప్రయోగాలు'
  •  https://youtube.com/playlist?list=PL2aBZuCeDwlRF14ds9UR1uVpLRjDQy7d5&si=B0nAKJGuxGdZ8ayF 


* ఎర్ర గ్రహం రహస్యాలు

* అంగారక గ్రహంపై వేట 

* శాస్త్రవేత్తల ప్రయోగాలు!

విశ్వంలో భూమి తర్వాత మనిషి నివసించడానికి అనువైన గ్రహం ఏదైనా ఉందా? అంటే అందరికీ గుర్తొచ్చే పేరు 'అంగారకుడు' (Mars). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధనా సంస్థలు, ముఖ్యంగా నాసా (NASA), అంగారక గ్రహంపై ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతోంది? శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు? అనే ఆసక్తికర విషయాలు ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

​ఒకప్పుడు అంగారకుడిపై భారీ సముద్రాలు ఉండేవని మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆ నీరంతా ఏమైంది? శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, గ్రహం యొక్క ఉపరితలం కింద భారీ మంచు గడ్డలు (Ice Sheets) నిక్షిప్తమై ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో మానవ నివాసాలకు నీటి వనరుగా మారనున్నాయి.

​జీవం కోసం అన్వేషణ (Search for Life)

​నాసా పంపిన పర్సెవరెన్స్ రోవర్ (Perseverance Rover) ప్రస్తుతం అంగారకుడిపై ఉన్న 'జెజీరో క్రేటర్' అనే ప్రాచీన నది ప్రవహించిన ప్రాంతంలో తిరుగుతోంది.

  • ​కీలక మార్పు: ఇటీవల అక్కడి రాళ్లలో శాస్త్రవేత్తలు 'ఆర్గానిక్ మాలిక్యూల్స్'ను గుర్తించారు. ఇవి గతంలో అక్కడ సూక్ష్మజీవులు ఉండేవని చెప్పడానికి బలమైన ఆధారాలు.

​ఆక్సిజన్ ఉత్పత్తి సాధ్యమేనా?

​అంగారకుడి వాతావరణంలో ఆక్సిజన్ చాలా తక్కువ. కానీ, భవిష్యత్తులో వ్యోమగాములు అక్కడ శ్వాస తీసుకోవడానికి వీలుగా MOXIE అనే చిన్న యంత్రాన్ని నాసా పరీక్షించింది.

  • ​విశేషం: ఇది అంగారకుడిపై ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని, ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఒక చిన్న చెట్టు చేసే పనిని ఈ యంత్రం చేస్తోంది!

​అంగారకుడిపై భూకంపాలు (Marsquakes)

​భూమి మీద లాగే అంగారకుడి మీద కూడా భూకంపాలు వస్తాయని InSight Lander కనుగొంది. దీని ద్వారా ఆ గ్రహం లోపల ఇంకా వేడి ఉందా లేదా అది పూర్తిగా చల్లబడిపోయిందా అనే విషయాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

​ 2030 నాటికి మానవ యాత్ర?

​ఎలోన్ మస్క్ నేతృత్వంలోని SpaceX సంస్థ 'స్టార్‌షిప్' అనే భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తోంది. 2030 కల్లా మనుషులను అంగారకుడిపైకి పంపడమే లక్ష్యంగా ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇది సాధ్యమైతే, మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద మలుపు అవుతుంది.

అంగారక గ్రహంపై పరిశోధనలు కేవలం గ్రహాల గురించి తెలుసుకోవడానికే కాదు, భవిష్యత్తులో భూమికి ఏదైనా ముప్పు వాటిల్లితే మానవ జాతి మనుగడ సాగించడానికి మరో ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయడం కోసం కూడా. త్వరలోనే మనం అంగారకుడి మట్టి నుంచి సేకరించిన నమూనాలను భూమిపై చూడబోతున్నాం!

గురువారం, జనవరి 22, 2026

ఖతార్: అట్టహాసంగా సంక్రాంతి ఉత్సవాలు




(ఖతార్ నుంచి రామడుగు వేణుగోపాల్)

ఆంధ్ర కళా వేదిక (AKV) నిర్వహించిన "సంక్రాంతికి వస్తున్నాము" సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమాన్ని రంగ రంగ వైభోగంగా , అత్యంత అట్టహాసంగా kఖతార్ దేశంలో అల్‌వక్రా ప్రాంతంలోని DPS MIS పాఠశాలయందు 08.01.2025 గురువారం రోజున సాయంకాలం 5.30 గం. నుండి రాత్రి 12 గం. వరకు  నిర్వహించారు. ఐతే సాంస్కృతిక కార్యక్రమం విజయం అనే పదానికి కొత్త నిర్వచనం ఇచ్చింది. ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు "ఆంధ్ర కళా వేదిక"  చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఒక మహా ఘట్టం.

కార్యస్థలిలో  అడుగు పెట్టగానే సంక్రాంతి ఉత్సాహంతో అలంకరించిన వేదిక ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.హరిదాసు , కోడిపుంజు , గాలిపటం, పాలుపొంగించే  సంప్రదాయ అలంకరణలు వేదికను మకర సంక్రాంతి పండుగలా  మార్చాయి. వాతావరణం పూర్తిగా మనవూర్లో జరిగే పండుగ జరుపుకున్న భావనకు గురిచేసింది .వేదికపై సంగీతం, లైటింగ్, నృత్యం కలసి ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని సృష్టించాయి.


AKV కమిటి సభ్యులందరూ సంప్రదాయ ధోతీలు, శాలువాలు ధరించి, మహిళా సభ్యులు పచ్చని చీరలతో  వేదికపైకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ గర్వంతో ఉప్పొంగిపోయారు.


సుమారు 80 మంది కళాకారుల భాగస్వామ్యంతో నృత్య నాటిక ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.ముఖ్యంగా 40 మంది కళాకారులతో శ్రీకృష్ణ లీలల ప్రదర్శన, వేలాది దీపాల వెలుగుల మధ్య, కనులకు  పండుగగా  ఆడిటోరియం అంతా ఆధ్యాత్మిక భావం కలిగించింది.  స్థానిక కళాకారుల ప్రదర్శనలు కూడా అద్భుతంగా ఉండటంవలన , ప్రతి ప్రదర్శనకు చప్పట్ల మోత మోగింది.  


కృష్ణ చైతన్య & మాళవిక గార్ల యుగళ గీతాలు ప్రేక్షకులను  ఉర్రూతలూగించింది.డాన్స్ మాస్టర్లు సత్య & తేజస్విని వేదికపై అగ్నిపర్వతంలా చెలరేగారు.నటుడు పృధ్వీ(థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ )  గారి కుమార్తె శ్రీలు చేసిన నృత్యం ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.


ఖతార్‌లోని భారత రాయబారి శ్రీ విపుల్  గారు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ప్రసంగం ప్రారంభించి, సంక్రాంతి సందేశంతో ముగించగా, సభ మొత్తం హర్షధ్వానాలతో మార్మోగింది. ICC ప్రెసిడెంట్ మరియు భారత రాయబారి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.


AKV అధ్యక్షుడు శ్రీ రమణయ్య గారు తన ప్రసంగాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభించి, కమిటీ  సభ్యుల సమన్వయాన్ని అభినందిస్తూ, AKV కుటుంబ సభ్యుల నాణ్యత మరియు  సహకారాన్ని ప్రశంసిస్తూ , కార్యస్థలం  మొత్తం తెలుగు కుటుంబాలతో నిండినందుకు సంతోషం వ్యక్తం చేశారు.


రామ్ కీ హీరో గారి మాటలు, నటి భూదేవి గారి నృత్యం,జానపద గాయకులు సరళ మరియు జాన్  పాడిన గీతాలు జనాలను  పల్లె వాతావరణానికి  తీసుకెళ్లాయి.   యాంకర్ స్వప్న చౌదరి గారి యాంకరింగ్ కార్యక్రమానికి ప్రాణం పోసింది. ఆమె మాటల సమయంలో ఆడిటోరియం సంపూర్ణ నిశ్శబ్దంలోకి వెళ్లడం ఆమె ప్రతిభకు నిదర్శనం.


టి.డి జనార్దన్ గారు ( అన్న యన్ టీఆర్  లిట్రేచర్ కమిటీ చైర్మన్) గారు మాట్లాడుతూ తెలుగు భాష, యాస, మరియు తెలుగు రాష్ట్ర కీర్తిని ప్రపంచదేశాలకు తెలియజేసిన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారకరారావుగారి గూర్చి అద్భుతంగా వర్ణించారు.


ఈ కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులు పూర్తిగా కుటుంబ సభ్యులే కావడం AKV చరిత్రలో ఒక విశేష ఘట్టం.

ఖతార్ నలుమూలల నుంచి వచ్చిన కుటుంబాలు పిల్లలతో సహా ఆనందంలో మునిగిపోయాయి. ప్రేక్షకులే వేదికపైకి వచ్చి కళాకారులతో కలిసి నృత్యం చేయడం వేదికను ఊపేసింది. పిల్లలు, పెద్దలు, యువత అందరూ ఒకటే ఉత్సాహం.

సాధారణంగా రాత్రి 10 గంటలకే ముగిసే ఈవెంట్, ప్రేక్షకుల ఉత్సాహం చూసి పోలీసులే అనుమతులు ఇస్తూ కార్యక్రమ సమయాన్ని రాత్రి పన్నెండు గంటలవరకు పొడిగించారు. మొదటి నుంచి చివరవరకు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసి ఒక్కరినికూడా కుర్చి నుండి లేవకుండా చేసాయి. 


ఈ కార్యక్రమం సూపర్ హిట్ కాదు, బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ కార్యక్రమం చివరన ప్రతీ ప్రేక్షకుడు తన భావం వ్యక్తం చేసాడు .

కళాకారులకు గౌరవం, స్పాన్సర్లకు ప్రాధాన్యం, AKV కమిటీ మరియు AKV కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఈ విజయంలో ప్రతిఫలించింది. “మళ్లీ తదుపరి కార్యక్రమం ఎప్పుడు చేస్తారు?” అన్న ప్రశ్నలే ఈ విజయానికి అద్దం పట్టాయి.


చివరగా అధ్యక్షులు శ్రీ రమణయ్య గారు ఈ చారిత్రాత్మక విజయానికి కారణమైన అందరు  కళాకారులకు, స్పాన్సర్లకు, AKV కమిటీకి, AKV కుటుంబ సభ్యులకు, మరియు వేలాది ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఒక కార్యక్రమం కాదని, ఇది ఆంధ్ర కళా వేదిక శక్తికి సజీవ సాక్ష్యం అని అన్నారు.

మంథని: ఫిబ్రవరి చివరి నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలి


మంథనిలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

మంథని:  పెద్దపల్లి జిల్లాలో సహకార సంస్థల ఆధ్వర్యంలో చేపడుతున్న పీఎం-కుసుమ్ సోలార్ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని, ఫిబ్రవరి నెలాఖరు లోగా గ్రిడ్ కు అనుసంధానం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* ఆదేశించారు. గురువారం మంథని మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. 

మంథని మండలం కన్నాల గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, నాగారం గ్రామంలో ఎంపిపిఎస్,  పీ.హెచ్.సి సబ్ సెంటర్ , గుంజపడుగు గ్రామంలో నిర్మాణంలో ఉన్న పీ.హెచ్.సి భవనం, జడ్పీహెచ్ఎస్, 1 మెగా వాట్ సోలార్ ప్లాంట్ నిర్మాణం, మంథని లోని ఆర్డిఓ కార్యాలయ నిర్మాణ పనులు,   జడ్పీహెచ్ఎస్ బాలికలు, బుట్టుపల్లి లోని ఆర్ అండ్ ఆర్ పనులను  కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా  *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  కన్నాల పాఠశాలలో ప్రహరి గోడ, గేట్ ఏర్పాటు, మైనర్ మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. నాగారం గ్రామం లోని పాఠశాలలో మంజూరు చేసిన పనులు,  సబ్ సెంటర్ నిర్మాణ పనులు నెల రోజుల్లో లోగా పూర్తి చేయాలని అన్నారు. గుంజపడుగు జడ్పీహెచ్ఎస్ లో మంజూరు చేసిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ తెలిపారు.

గుంజపడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ గోడ నిర్మాణ పనులు, అవసరమైన పరికరాల బిగింపు పూర్తి చేసి మార్చి నాటికీ హ్యాండ్ ఓవర్ చేయాలని

అన్నారు. గుంజపడుగు లో ఫ్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరి చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుతో పాటు, సమాంతరంగా విద్యుత్ రవాణా కోసం ట్రాన్స్ మిషన్ లైన్ నిర్మాణ పనులు కూడా రెండు రోజుల్లో మొదలు పెట్టాలని, దీనికి డిస్కం అధికారులు సహకరించాలని పేర్కొన్నారు. రెడ్కో, విద్యుత్ శాఖలను మంచి సమన్వయం చేస్తున్నారని డిసీఓ ను అభినందించారు.

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా సహకార రంగంలో నిర్మిస్తున్న తొలి ప్రాజెక్టులు పెద్దపల్లి జిల్లాలో చేపట్టడం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని, అందుకు సంబంధిత అధికారులు సంకల్ప సిద్ధితో కృషి చేయాలని సూచించారు.

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా గోదాముల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. బిట్టు పల్లి ఆర్&ఆర్ కాలనీ లో పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని అన్నారు.  ఆర్ &ఆర్ కాలనీ లో అంతర్గత రోడ్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట  డీసీఓ శ్రీమాల, రెడ్కో జిల్లా మేనేజర్ దురిశెట్టి మనోహర్, కేడీసీసీ బ్యాంకు సీఈఓ సత్యనారాయణ రావు, ఎంపిడిఓ శ్రీజ, తహశీల్దార్ అరీఫోద్దిన్, ఏడీఈ వెంకటనారాయణ, రెడ్కో డిఓ మునీందర్, ఏడీఓ లక్ష్మీకాంత్, గ్రీన్ సెక్యూర్ రమాకాంత్ , ఏఈ పి.ఆర్. అనుదీప్, విక్రమ్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


బుధవారం, జనవరి 21, 2026

దావోస్: క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు

 


క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. సుమారు 6 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది.



✳️ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక–2026 సమావేశాల సందర్భంగా, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.

✳️ *ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు*, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జాన్ బాబిక్ గారు, గ్రూప్ సీఈఓ, డైరెక్టర్ అనిల్ కుమార్ బావిసెట్టి గారు, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్ రెడ్డి గారు, స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ గారు పాల్గొన్నారు.

✳️ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. 2047 నాటికి నెట్–జీరో లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధానమని స్పష్టం చేశారు.


✳️ స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది.


✳️ 600 మిలియన్ యూరోలు (సుమారు రూ.6,000 కోట్ల) పెట్టుబడితో గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ పరిశీలిస్తోంది.

మంగళవారం, జనవరి 20, 2026

దావోస్ : ఏఐ రంగంలో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి

 

హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ

దావోస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు  ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక–2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో భేటీ అయ్యారు. రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ ,  గ్లోబల్ హెడ్   జాన్ విల్లెమ్– స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ..  ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలపై ప్రశంసలు కురిపించారు*.

*ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’ గురించి ప్రతినిధి బృందం వివరించింది. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థ నిర్మించడమే ఈ విధాన లక్ష్యమని, మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహా అనుబంధ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగాల్లో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) , రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యనున్న ప్రాంతంలో  పెరి–అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)   తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 


కొత్త లైఫ్ సైన్సెస్ విధానం, ఔషధ తయారీ వ్యూహాలు కలిసి తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పునాది వేస్తాయని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, బలమైన ఐటీ–లైఫ్ సైన్సెస్–హెల్త్ కేర్ టాలెంట్ బేస్, జీనోమ్ వ్యాలీ, 300 ఎకరాలకుపైగా విస్తరించిన మెడికల్ డివైసెస్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఉన్నాయని మంత్రి వివరించారు. హైదరాబాద్ వైద్య పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇక్కడి ఆస్పత్రులు ఇప్పటికే క్రిటికల్ కేర్, అంబులెన్స్ సేవలు వంటి రంగాల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తున్నాయని చెప్పారు.  భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఏఐకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. “ఇదే సరైన సమయం. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడానికి ఇది ఉత్తమ అవకాశమని” మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చి.. జీనోమ్ వ్యాలీని సందర్శించాలని మంత్రి  ఫిలిప్స్ నాయకత్వాన్ని ఆహ్వానించారు.

తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ..  హైదరాబాద్‌లో ఇప్పటికే మెడ్ ట్రానిక్, ఒలంపస్, జీఈ వంటి అగ్రశ్రేణి సంస్థల ఎంబెడెడ్ ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.

రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్– స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ..  ఆరోగ్య రంగంలో తెలంగాణ చేపడుతున్న ఏఐ ఆధారిత మార్పు అత్యంత ప్రశంసనీయమని అన్నారు. తమ నెదర్లాండ్స్ ప్రధాన కార్యాలయాన్ని  తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శించాలని ఆయన ఈ సందర్భంగా ఆహ్వానించారు.

పెద్దపల్లి: పురపాలక ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలి

 

మున్సిపల్ ఎన్నికల సన్నద్దత పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని


పెద్దపల్లి: పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల సన్నద్దత పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో మంగళవారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ*   మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో కమిషన్ విడుదల చేస్తుందని, షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, పులపాలక ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ పరిశీలన, పోలింగ్ నిర్వహణ కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. 

క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద చురుగ్గా ఉండే భద్రత సిబ్బంది నియమించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉండాలని, ప్రతి పోలింగ్ కేంద్రం బయట సిసి కేమేరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ ను బైండోవర్ చేయాలని అన్నారు.

ఎన్నికల ప్రచార పరిశీలన,  కౌంటింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద సాధ్యమైన మేర డ్రోన్ వినియోగించాలని సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైయినర్లు జిల్లాకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. 

*జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి చేశామని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న వసతుల వివరాలు 

 టి- పోల్ లో నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అవసరమైన మేర పోలింగ్ బ్యాలెట్ బాక్సులు, అవసరమైన పోలింగ్ సిబ్బంది సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, ఇతర సిబ్బంది సిద్ధం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలి కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, బయట సీసీ కెమెరా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

4 పట్టణాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గుర్తించామని అన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కొరకు ప్రింటింగ్ ప్రెస్ లో గుర్తింపు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. 

ఈ సమావేశంలో  మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సోమవారం, నవంబర్ 24, 2025

పెద్దపల్లి: మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

 








రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు

**మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీ రూపకల్పన*

**18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నాణ్యమైన చీర పంపిణీ*

**ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు.

సోమవారం పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా *మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలకు అధిక  ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.  మహిళలకు ఉచితంగా బస్సు రవాణా కల్పిస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని, దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వీరికి జూబ్లీహిల్స్ మహిళలు కర్రు కాల్చి వాత పెట్టారని మంత్రి తెలిపారు. 

గత 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా వడ్డి లేని రుణాలు అందించాలని ఆలోచన పాలకులకు రాలేదని, మన ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి ఏడాది వడ్డీ లేని రుణాలు కింద 9 కోట్ల రూపాయలు విడుదల చేసామని, ప్రస్తుత సంవత్సరం మరో 10 కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నామని అన్నారు. 

2047 తెలంగాణ రైసింగ్ పాలసీ లో భాగంగా మహిళా పారిశ్రామిక వేత్తలను  ప్రోత్సహిస్తూ కోటీశ్వరులను చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మహిళలకు ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలలో భూముల కేటాయింపుకు ఆలోచన చేస్తున్నామని అన్నారు. 

పేద కుటుంబంలోని మహిళలు ఇబ్బందులు పడవద్దని 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.  

రాష్ట్రంలోనే మహిళలకు సారే అందించాలని లక్ష్యంతో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డు లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేస్తామని అన్నారు.  పట్టణ ప్రాంతంలోని మహిళలకు వచ్చే సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ, ఎకరానికి 12,000 పెట్టుబడి సహాయం, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.  

ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయల పెంచామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామని, రాబోయే 2 సంవత్సరాల కాలంలో ప్రతి పాఠశాల రూపురేఖలు పూర్తిస్థాయిలో మారుస్తామని అన్నారు.

యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లిలో టాస్క్ రీజినల్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో సిటి స్కాన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల సంక్షేమానికి పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు తమ ఆశీర్వాదం అందించాలని అన్నారు. 

**జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరల పంపిణీ మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పంపిణీ చేస్తున్నామని అన్నారు.  స్వయం సహాయక మహిళా సంఘాల సిసిలు , విఓ లు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేసి చీర అందుకున్న ప్రతి మహిళ ఫోటో యాప్ లో నమోదు చేయాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత కింద లక్షా 20 వేల ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. 

**పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ,*  గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు పంపిణీ చేసి మహిళలను అగౌరవ పరిచారని అన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మంచి డిజైన్ తో నాణ్యమైన చీరలను మహిళలకు అందిస్తున్నామని అన్నారు.   


గ్రామీణ ప్రాంతాలలో  18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నాణ్యమైన చీరను రేవంతన్న ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వడ్డీ లేని రుణాలు గత ప్రభుత్వం విస్మరిస్తే మన ప్రజా ప్రభుత్వం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో మహిళలకు వడ్డి లేని రుణాలు పంపిణీ చేసి 4 కోట్ల 73 లక్షల రూపాయల వడ్డీ డబ్బులు మహిళా బ్యాంక్ ఖాతాలలో జమ చేశామని, ప్రస్తుత సంవత్సరానికి మరో 5 కోట్ల 23 లక్షల పైగా వడ్డీ డబ్బులను కూడా మహిళా సంఘాల ఖాతాలలో జమ చేస్తామని అన్నారు.

మహిళ సంఘాలలోని మహిళలకు ప్రమాద బీమా, జీవిత బీమా కల్పించామని అన్నారు. సహజ మరణం పొందిన 79 మహిళల యొక్క 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేశామని, ప్రమాదవశాత్తు 10 మంది  మహిళలు మరణిస్తే 10 లక్షల రూపాయల చోప్పున బీమా సొమ్ము కుటుంబ సభ్యులకు అందించామని తెలిపారు. 

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి బాగు చేయడం వల్ల ఓపి 3 రేట్లు పెరిగిందని, నెలకు 250 పైగా ప్రసవాలు జరుగుతున్నాయని, గర్భిణీ స్త్రీలకు అవసరమైన టిఫా స్కాన్ ఉచితంగా చేస్తున్నామని అన్నారు.  ఆర్థోపెడిక్, కంటి శస్త్ర చికిత్సల విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. 

**రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ,* ప్రతి మహిళ మరో 10 మందికి ఉపాధి అందించే స్థాయికి ఎదిగే దిశగా సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.  రైతులు, యువత, కార్మికులు, మహిళల సంక్షేమమే అభ్యున్నతిగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ చిన్న, కుటీర పరిశ్రమల స్థాపనలో మహిళలు ముందు ఉండేలా చూస్తున్నామని అన్నారు.  మహిళా సంఘాల ఆధ్వర్యంలో అద్దెకు ఆర్టిసి బస్సులు , పెట్రోల్ బంక్ ఏర్పాటు , సోలార్ విద్యుత్ ప్లాంట్ల స్థాపన వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఆర్.డి.ఓ.గంగయ్య, గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, తహసిల్దార్,ఎంపిడిఓ,సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంథని : మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం



రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు


మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు 

మంథని : మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. 

సోమవారం మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 

వయట్రిస్ సౌజన్యంతో 850 కుట్టు మిషన్లతో మంథని ప్రాంతంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో 21 ఉచిత కొట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. మహిళలకు ఆదాయం మార్గాలు పెరగాలి, వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలచే కుట్టు మిషన్ కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్, ఆర్టిసి అద్దె బస్సుల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి  వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు. 

కుట్టు మిషన్ కేంద్రం ద్వారా మహిళలకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందని మంత్రి తెలిపారు. 

మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రయత్నంతో మంథనిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళ సోదరీమణులు వ్యాపార విస్తరణలో ఎటువంటి కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని, ప్రయాణాలు చేస్తూ వాణిజ్య వ్యాపార రంగాలలో ఎదిగేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నాని మంత్రి తెలిపారు. 

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

 *మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్, ఆర్ఓ ప్లాంటును  ప్రారంభించిన మంత్రి 

మంత్రి శ్రీధర్ బాబు మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 12 లక్షలతో స్కానింగ్ మిషన్, ఒక లక్షల 80 వేల రూపాయలతో ఏర్పాటుచేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, లక్ష రూపాయలతో ఏర్పాటుచేసిన ఔట్ పేషెంట్ రూమ్, 5 లక్షల రూపాయలతో నిర్మించిన పేషెంట్ వెయిటింగ్ హాల్, లక్ష రూపాయలతో కొనుగోలు చేసిన పిల్లల వార్మర్స్,12 లక్షల రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, సీసీ కెమెరాలు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమార స్వామి, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆదివారం, నవంబర్ 23, 2025

కాటారం: మహిళల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కాటారం: మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  తెలిపారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు

 ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

 దేశ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా స్వయం సహాయక సంఘాల  మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల గౌరవం కాపాడే విధంగా నాణ్యమైన చీరలు అందిస్తున్నామన్నారు.

ఆడబిడ్డలకు చీర సారె ఇచ్చి గౌరవించుకోవడం తెలంగాణ సాంప్రదాయమని కాబట్టి ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు అందిస్తుందని అన్నారు. మహిళలు వృద్ధిలోకి రావాలనే లక్ష్యంతో  ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని 

మహిళలు సంతోషంగా ఉంటే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటుందని తెలిపారు. మహిళల వృద్ధికి తోడ్పాటు అందించేందుకు  మహిళ శక్తి కార్యక్రమం ద్వారా వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, బస్సులు, మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లు, పాడి పరిశ్రమలు, మహిళా శక్తి క్యాంటీ లు, వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు  ఏర్పాటు ద్వారా వ్యాపారంలో మెలకువలు చేస్తున్నామని అన్నారు. మహిళ చేతిలో రూపాయి ఉంటే పొదుపు పెరుగుతుందని ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయిలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఇందిరా మహిళ శక్తి చీరలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మహిళ సమాఖ్యలు ద్వారా ప్రతి మహిళకు చేరుతాయని తెలిపారు.

మైలాన్ అనే సంస్థ ద్వారా సిఎస్ఆర్ నిధుల నుండి ఈ ఐదు మండలాల మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమం చేపట్ట బోతున్నామని, ఇప్పటికే మహదేవ్ పూర్ మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అన్నారు.ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతంగా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని మంత్రి కోరారు. 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళ శక్తి బస్సులు, మహిళా సమాఖ్యలలోని సభ్యులైన మహిళలకు కుట్టు మిషన్లు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ లు సైతం మహిళలే కుట్టి అందిస్తున్నారని అన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్లలోని అన్ని మండలాలకు ఒకటి చొప్పున మహిళా శక్తి పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతుందని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఎస్పి సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, రాష్ట్ర ఉపాధి హామీ పథకం సభ్యులు రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, సింగిల్ విండో ఛైర్మన్ మొండెయ్య తదితరులు పాల్గొన్నారు.

మంథని: ముగిసిన సత్య సాయి శత జయంతి వేడుకలు

అలరించిన మహావాది సోదరుల సంగీత విభావరి 

మంథని : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా భక్తులకు చూపిన మార్గం ఆనందదాయకమని, ప్రతి ఒక్కరూ ప్రేమతో జీవించాలని ఆయన కోరుకునే వారని మంథని సత్య సాయిబాబా సేవా ట్రస్ట్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గంగా రాధా కిషన్ అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ముగింపు సందర్భంగా సంగీత విభావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా శతా బాబా శత జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. సంగీత సంగీత విభావరి కార్యక్రమంలో గాయకులుగా మహావాది సుధీర్, విజయ్ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే చివరి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, నిరుపేదలకు దుస్తులు, మందులు అంద చేసినట్లు ఆయన తెలిపారు.

అలరించిన మహావాది సోదరుల భక్తి గీతాలు

 శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్లు, క్రీడా విశ్లేషకులు మహావాది సుధీర్, విజయ్ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంది. గాయకులుగా వారు పాడిన హిందీ, తెలుగు భక్తి పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా ప్రముఖ గాయకుడు స్వర్గీయ కిషోర్ కుమార్ ఆలపించిన భక్తి పాటలు వీరు ఎంతో మధురంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ  కొండా శంకర్, అష్టదని గంగాధర్, రామడుగు మారుతి, మేడగోని రాజమౌళి గౌడ్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజం, నల్లగొండ శ్రీనివాస్, అవధానుల శ్రీనివాస్, రామడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.

మంథని: మంత్రి శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు



మంథని : మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామ రైతులు తమ పొలాలకు రాళ్ళకుంట నుండి వెళ్లే దారి ఇబ్బందిగా మారిందని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి అరేల్లి కిరణ్ గౌడ్ ఆదివారం తెలియజేయగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు రైతుల సమస్యను పరిష్కరించేందుకు మట్టి రప్పించేలా చర్యలు చేపట్టారు. గ్రామ రైతులు సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపినందుకు మంత్రి శ్రీధర్ బాబు కి సూరయ్యపల్లి గ్రామ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పెద్దపల్లి : జిల్లా డీసీపీ భూక్యా రామ్ రెడ్డి



రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా  భూక్యా రామ్ రెడ్డి  ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.  డీసీపి పుల్ల కరుణాకర్ స్థానం లో సీఐడీ విభాగం లో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డి ఐపిఎస్  డీసీపీ గా నియమితులయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల లోని గర్జనపల్లి కి చెందిన ఆయన 1989 బ్యాచ్ ఎస్ఐ గా పోలీస్ శాఖలో చేరి అంచలంచలుగా ఎదిగి 2020 లో ఐపీఎస్ హోదా సాధించారు. డీసీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతా పరిరక్షణ, మహిళా, శిశు రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, యువతలో నేర ప్రవృత్తుల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని, ప్రతి పోలీసు సిబ్బంది సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లలో, సీఐ ల వద్ద, ఏసీపీ లను సంప్రదించాలని, సమస్య పరిష్కారం కాకపోతే డీసీపీ ఆఫీసు కు రావాలని అన్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, గంజాయి సేవించేవారిని మరియు నిషేదిత మత్తు పదార్థాలు అక్రమ రవాణా, సరఫరా, నిల్వ చేయడం వంటి వాటిని ఉక్కుపాదం తో అణిచివేస్తామని తెలిపారు. ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఫోన్లో నేరుగా సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

శుక్రవారం, నవంబర్ 21, 2025

మంథని: ఘనంగా సత్యసాయి జయంతి

శ్రీ సత్య సాయి జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ సత్య సాయి దేవాలయం మంథనిలో ఈ ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు గంగా రాధాకిషన్ ఆధ్వర్యంలో శ్రీ భగవద్గీత లలిత విష్ణు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును నిర్వహించి అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. లోక కళ్యాణార్థం సర్వేజను సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి మానవసేవే మాధవసేవ గోశాలలకు వృద్ధాశ్రమాలకు ధార్మిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారికి మా ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.

హైదరాబాద్: కేటీఆర్ మాటలు పచ్చి అబద్ధాలు


వీడియో కోసం క్లిక్ చేయండి
https://youtu.be/qMh7UWqvmXM?si=e7kDh6wgDXs95iv0

ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు                    పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే దానిని 5-6 లక్షల కుంభకోణంగా చిత్రీకరిస్తూ కేటీఆర్ దుష్ప్రచారం సాగిస్తున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ  ‘ఫ్రీహోల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టులో మూడు జిఓలు ఇచ్చింది వారి ప్రభుత్వ హయాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం నాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఆరోపణలను ఆధారాలతో తిప్పికొట్టారు. 

• కేటీఆర్ చెబ్తున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4740 ఎకరాలే. మిగిలిన భూమి రోడ్లు, డ్రెయినేజి లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరిగింది.

• ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదు. పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవి.

• ఆజమాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించినది బిఆరెస్ ప్రభుత్వమే. కూకట్ పల్లి, ఆజమాబాద్, హఫీజ్ పేట భూములకు సంబంధించి ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్టుమెంట్, జిఓ ఎంస్ 19, 20, 21 లను 2023 ఆగస్టు 29 న జారీ చేసింది.

• ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నాం. 30, 50 శాతం స్లాబులతో ఇంపాక్టు ఫీజు నిర్ణయిస్తూ ఈనెల 17 న జరిగిన కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

• 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఫ్రీహోల్డ్ (Free hold) హక్కులు కల్పించారు. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలి. ఆ జిఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారు.

• జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసాయి. ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే నమ్మే పరిస్థితి లేదు. 

• అసలు కుంభకోణమో, స్కామో జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలి. పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జిఓలు ఇచ్చారు.

• ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలి.

• వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే మేం కల్పించాం. 

• స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో

 పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30 శాతం, 50 శాతం స్లాబులను ప్రతిపాదించారు.

• సిఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారు. వారెవరూ ప్రభుత్వంలో లేరు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గం. ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుంది. ఇప్పటికైనా ఆయన ఆలోచనల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం.

• కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. అది కూడా అందరూ దరఖాస్తు చేసుకుంటేనే.

• యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకోలేరు.

• ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.

• రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు గండికొట్టాలని చూడటమే బిఆరెస్ ప్రధాన కార్యక్రమంగా మారింది.

• హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నాం. ప్రతిపక్షంగా సహకరించక పోయినా ఫర్వాలేదు. అబద్ధాలతో ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయొద్దు. బెదిరింపు ధోరణులు మానుకోవాలి.

• ఓఆర్ ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని మొదటి నుంచి చెబ్తున్నాం. గాలి, నీరు కాలుష్యం లేకుండా చేయడానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నాం.

• పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించడం చూస్తున్నాం. విద్యుత్తు, పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నారు. మన దగ్గర భూముల విలువ ఎక్కువ, లభ్యత కూడా తక్కువ. అయినా పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టం ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. 

• పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026