మున్సిపల్ ఎన్నికల సన్నద్దత పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని
పెద్దపల్లి: పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల సన్నద్దత పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ* మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో కమిషన్ విడుదల చేస్తుందని, షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, పులపాలక ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ పరిశీలన, పోలింగ్ నిర్వహణ కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద చురుగ్గా ఉండే భద్రత సిబ్బంది నియమించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉండాలని, ప్రతి పోలింగ్ కేంద్రం బయట సిసి కేమేరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ ను బైండోవర్ చేయాలని అన్నారు.
ఎన్నికల ప్రచార పరిశీలన, కౌంటింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద సాధ్యమైన మేర డ్రోన్ వినియోగించాలని సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైయినర్లు జిల్లాకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
*జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,* జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి చేశామని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న వసతుల వివరాలు
టి- పోల్ లో నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అవసరమైన మేర పోలింగ్ బ్యాలెట్ బాక్సులు, అవసరమైన పోలింగ్ సిబ్బంది సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, ఇతర సిబ్బంది సిద్ధం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలి కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, బయట సీసీ కెమెరా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
4 పట్టణాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గుర్తించామని అన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కొరకు ప్రింటింగ్ ప్రెస్ లో గుర్తింపు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి