Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

మంగళవారం, జనవరి 20, 2026

దావోస్ : ఏఐ రంగంలో భాగస్వామ్యానికి రాయల్ ఫిలిప్స్ ఆసక్తి

 

హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుపై చర్చ

దావోస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణతో భాగస్వామ్యమయ్యేందుకు  ప్రముఖ హెల్త్ టెక్ సంస్థ రాయల్ ఫిలిప్స్ ఆసక్తి వ్యక్తం చూపింది. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు అవకాశాలపై కూడా చర్చించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ఆర్థిక వేదిక–2026 వార్షిక సమావేశాల్లో భాగంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం ఫిలిప్స్ గ్లోబల్ నాయకత్వంతో భేటీ అయ్యారు. రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ ,  గ్లోబల్ హెడ్   జాన్ విల్లెమ్– స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ..  ఏఐ రంగంలో తెలంగాణ చేపడుతున్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న ఏఐ ఆధారిత సేవలపై ప్రశంసలు కురిపించారు*.

*ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘తెలంగాణ నెక్స్ట్–జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030’ గురించి ప్రతినిధి బృందం వివరించింది. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థ నిర్మించడమే ఈ విధాన లక్ష్యమని, మెడికల్ ఎలక్ట్రానిక్స్ సహా అనుబంధ రంగాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  ఔషధ తయారీ, పరిశోధనాభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగాల్లో ప్రపంచ స్థాయి, స్థిరమైన పారిశ్రామిక క్లస్టర్‌ను తెలంగాణలో నిర్మిస్తున్నామని చెప్పారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) , రీజినల్ రింగ్ రోడ్ (RRR) మధ్యనున్న ప్రాంతంలో  పెరి–అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)   తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 


కొత్త లైఫ్ సైన్సెస్ విధానం, ఔషధ తయారీ వ్యూహాలు కలిసి తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పునాది వేస్తాయని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 2,000కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, బలమైన ఐటీ–లైఫ్ సైన్సెస్–హెల్త్ కేర్ టాలెంట్ బేస్, జీనోమ్ వ్యాలీ, 300 ఎకరాలకుపైగా విస్తరించిన మెడికల్ డివైసెస్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ పార్క్ ఉన్నాయని మంత్రి వివరించారు. హైదరాబాద్ వైద్య పర్యాటకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ఇక్కడి ఆస్పత్రులు ఇప్పటికే క్రిటికల్ కేర్, అంబులెన్స్ సేవలు వంటి రంగాల్లో ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తున్నాయని చెప్పారు.  భవిష్యత్తులో హైదరాబాద్‌ను ఏఐకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ సిటీని నిర్మిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. “ఇదే సరైన సమయం. హైదరాబాద్‌లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయడానికి ఇది ఉత్తమ అవకాశమని” మంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు వచ్చి.. జీనోమ్ వ్యాలీని సందర్శించాలని మంత్రి  ఫిలిప్స్ నాయకత్వాన్ని ఆహ్వానించారు.

తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ..  హైదరాబాద్‌లో ఇప్పటికే మెడ్ ట్రానిక్, ఒలంపస్, జీఈ వంటి అగ్రశ్రేణి సంస్థల ఎంబెడెడ్ ఇంజినీరింగ్, ఆర్ అండ్ డీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.

రాయల్ ఫిలిప్స్ వైస్ ప్రెసిడెంట్ జాన్ విల్లెమ్– స్కీజ్ గ్రాండ్ మాట్లాడుతూ..  ఆరోగ్య రంగంలో తెలంగాణ చేపడుతున్న ఏఐ ఆధారిత మార్పు అత్యంత ప్రశంసనీయమని అన్నారు. తమ నెదర్లాండ్స్ ప్రధాన కార్యాలయాన్ని  తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సందర్శించాలని ఆయన ఈ సందర్భంగా ఆహ్వానించారు.

పెద్దపల్లి: పురపాలక ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉండాలి

 

మున్సిపల్ ఎన్నికల సన్నద్దత పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని


పెద్దపల్లి: పురపాలక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో అవసరమైన ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల సన్నద్దత పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో మంగళవారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ*   మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో కమిషన్ విడుదల చేస్తుందని, షెడ్యూల్ రాగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, పులపాలక ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ పరిశీలన, పోలింగ్ నిర్వహణ కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. 

క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద చురుగ్గా ఉండే భద్రత సిబ్బంది నియమించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉండాలని, ప్రతి పోలింగ్ కేంద్రం బయట సిసి కేమేరా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సోషల్ ఎలిమెంట్స్ ను బైండోవర్ చేయాలని అన్నారు.

ఎన్నికల ప్రచార పరిశీలన,  కౌంటింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాల వద్ద సాధ్యమైన మేర డ్రోన్ వినియోగించాలని సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణకు సంబంధించి మాస్టర్ ట్రైయినర్లు జిల్లాకు చేరుకుంటారని, సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని అన్నారు. 

*జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  జిల్లాలో 3 మున్సిపాలిటీలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి చేశామని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న వసతుల వివరాలు 

 టి- పోల్ లో నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అవసరమైన మేర పోలింగ్ బ్యాలెట్ బాక్సులు, అవసరమైన పోలింగ్ సిబ్బంది సెక్టార్ అధికారులు, రూట్ అధికారులు, ఇతర సిబ్బంది సిద్ధం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పోలి కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, బయట సీసీ కెమెరా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

4 పట్టణాలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను గుర్తించామని అన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కొరకు ప్రింటింగ్ ప్రెస్ లో గుర్తింపు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. 

ఈ సమావేశంలో  మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, మనోహర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సోమవారం, నవంబర్ 24, 2025

పెద్దపల్లి: మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

 








రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు

**మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీ రూపకల్పన*

**18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు నాణ్యమైన చీర పంపిణీ*

**ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం కల్పిస్తుందని రాష్ట్ర ఐ.టి,  పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు.

సోమవారం పెద్దపల్లి పట్టణంలోని స్వరూప గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా *మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళలకు అధిక  ప్రాధాన్యత కల్పిస్తూ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.  మహిళలకు ఉచితంగా బస్సు రవాణా కల్పిస్తే ప్రతిపక్షాలు తట్టుకోలేక పోతున్నాయని, దీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వీరికి జూబ్లీహిల్స్ మహిళలు కర్రు కాల్చి వాత పెట్టారని మంత్రి తెలిపారు. 

గత 10 సంవత్సరాల పాలనలో ఎప్పుడైనా వడ్డి లేని రుణాలు అందించాలని ఆలోచన పాలకులకు రాలేదని, మన ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో లక్ష కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ద్వారా వడ్డీ లేకుండా మహిళా సంఘాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో మొదటి ఏడాది వడ్డీ లేని రుణాలు కింద 9 కోట్ల రూపాయలు విడుదల చేసామని, ప్రస్తుత సంవత్సరం మరో 10 కోట్ల రూపాయలు విడుదల చేయబోతున్నామని అన్నారు. 

2047 తెలంగాణ రైసింగ్ పాలసీ లో భాగంగా మహిళా పారిశ్రామిక వేత్తలను  ప్రోత్సహిస్తూ కోటీశ్వరులను చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మహిళలకు ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలలో భూముల కేటాయింపుకు ఆలోచన చేస్తున్నామని అన్నారు. 

పేద కుటుంబంలోని మహిళలు ఇబ్బందులు పడవద్దని 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని అన్నారు. ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని మంత్రి తెలిపారు.  

రాష్ట్రంలోనే మహిళలకు సారే అందించాలని లక్ష్యంతో నాణ్యమైన చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డు లో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేస్తామని అన్నారు.  పట్టణ ప్రాంతంలోని మహిళలకు వచ్చే సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ, ఎకరానికి 12,000 పెట్టుబడి సహాయం, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు.  

ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయల పెంచామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామని, రాబోయే 2 సంవత్సరాల కాలంలో ప్రతి పాఠశాల రూపురేఖలు పూర్తిస్థాయిలో మారుస్తామని అన్నారు.

యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్దపల్లిలో టాస్క్ రీజినల్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో సిటి స్కాన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల సంక్షేమానికి పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు తమ ఆశీర్వాదం అందించాలని అన్నారు. 

**జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,*  ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరల పంపిణీ మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పంపిణీ చేస్తున్నామని అన్నారు.  స్వయం సహాయక మహిళా సంఘాల సిసిలు , విఓ లు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వేగవంతంగా పూర్తి చేసి చీర అందుకున్న ప్రతి మహిళ ఫోటో యాప్ లో నమోదు చేయాలని అన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొదటి విడత కింద లక్షా 20 వేల ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. 

**పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ,*  గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నాసిరకం చీరలు పంపిణీ చేసి మహిళలను అగౌరవ పరిచారని అన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మంచి డిజైన్ తో నాణ్యమైన చీరలను మహిళలకు అందిస్తున్నామని అన్నారు.   


గ్రామీణ ప్రాంతాలలో  18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నాణ్యమైన చీరను రేవంతన్న ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వడ్డీ లేని రుణాలు గత ప్రభుత్వం విస్మరిస్తే మన ప్రజా ప్రభుత్వం పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో మహిళలకు వడ్డి లేని రుణాలు పంపిణీ చేసి 4 కోట్ల 73 లక్షల రూపాయల వడ్డీ డబ్బులు మహిళా బ్యాంక్ ఖాతాలలో జమ చేశామని, ప్రస్తుత సంవత్సరానికి మరో 5 కోట్ల 23 లక్షల పైగా వడ్డీ డబ్బులను కూడా మహిళా సంఘాల ఖాతాలలో జమ చేస్తామని అన్నారు.

మహిళ సంఘాలలోని మహిళలకు ప్రమాద బీమా, జీవిత బీమా కల్పించామని అన్నారు. సహజ మరణం పొందిన 79 మహిళల యొక్క 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేశామని, ప్రమాదవశాత్తు 10 మంది  మహిళలు మరణిస్తే 10 లక్షల రూపాయల చోప్పున బీమా సొమ్ము కుటుంబ సభ్యులకు అందించామని తెలిపారు. 

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి బాగు చేయడం వల్ల ఓపి 3 రేట్లు పెరిగిందని, నెలకు 250 పైగా ప్రసవాలు జరుగుతున్నాయని, గర్భిణీ స్త్రీలకు అవసరమైన టిఫా స్కాన్ ఉచితంగా చేస్తున్నామని అన్నారు.  ఆర్థోపెడిక్, కంటి శస్త్ర చికిత్సల విజయవంతంగా జరుగుతున్నాయని అన్నారు. 

**రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ,* ప్రతి మహిళ మరో 10 మందికి ఉపాధి అందించే స్థాయికి ఎదిగే దిశగా సహకారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.  రైతులు, యువత, కార్మికులు, మహిళల సంక్షేమమే అభ్యున్నతిగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మహిళా సంఘాలకు లక్ష కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ చిన్న, కుటీర పరిశ్రమల స్థాపనలో మహిళలు ముందు ఉండేలా చూస్తున్నామని అన్నారు.  మహిళా సంఘాల ఆధ్వర్యంలో అద్దెకు ఆర్టిసి బస్సులు , పెట్రోల్ బంక్ ఏర్పాటు , సోలార్ విద్యుత్ ప్లాంట్ల స్థాపన వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, ఆర్.డి.ఓ.గంగయ్య, గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, తహసిల్దార్,ఎంపిడిఓ,సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మంథని : మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం



రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు


మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు 

మంథని : మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. 

సోమవారం మంత్రి డి.శ్రీధర్ బాబు మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో రైతు వేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 

వయట్రిస్ సౌజన్యంతో 850 కుట్టు మిషన్లతో మంథని ప్రాంతంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో 21 ఉచిత కొట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. మహిళలకు ఆదాయం మార్గాలు పెరగాలి, వారి కుటుంబాలు ఆర్థికంగా పటిష్టం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలచే కుట్టు మిషన్ కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్, ఆర్టిసి అద్దె బస్సుల ఏర్పాటు, సోలార్ విద్యుత్ ప్లాంట్, పెట్రోల్ బంక్ ఏర్పాటు వంటి  వివిధ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు. 

కుట్టు మిషన్ కేంద్రం ద్వారా మహిళలకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించిందని మంత్రి తెలిపారు. 

మహిళలకు ఉపాధి కల్పించాలని ప్రయత్నంతో మంథనిలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మహిళ సోదరీమణులు వ్యాపార విస్తరణలో ఎటువంటి కార్యాచరణ తీసుకున్న ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించామని, ఉచిత బస్సు ప్రయాణం ద్వారా అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని, ప్రయాణాలు చేస్తూ వాణిజ్య వ్యాపార రంగాలలో ఎదిగేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నాని మంత్రి తెలిపారు. 

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు పక్కా ప్రణాళికలతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

 *మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్, ఆర్ఓ ప్లాంటును  ప్రారంభించిన మంత్రి 

మంత్రి శ్రీధర్ బాబు మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు 12 లక్షలతో స్కానింగ్ మిషన్, ఒక లక్షల 80 వేల రూపాయలతో ఏర్పాటుచేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, లక్ష రూపాయలతో ఏర్పాటుచేసిన ఔట్ పేషెంట్ రూమ్, 5 లక్షల రూపాయలతో నిర్మించిన పేషెంట్ వెయిటింగ్ హాల్, లక్ష రూపాయలతో కొనుగోలు చేసిన పిల్లల వార్మర్స్,12 లక్షల రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, సీసీ కెమెరాలు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసీల్దార్ కుమార స్వామి, డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆదివారం, నవంబర్ 23, 2025

కాటారం: మహిళల ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కాటారం: మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  తెలిపారు. ఆదివారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు

 ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

 దేశ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా స్వయం సహాయక సంఘాల  మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల గౌరవం కాపాడే విధంగా నాణ్యమైన చీరలు అందిస్తున్నామన్నారు.

ఆడబిడ్డలకు చీర సారె ఇచ్చి గౌరవించుకోవడం తెలంగాణ సాంప్రదాయమని కాబట్టి ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు అందిస్తుందని అన్నారు. మహిళలు వృద్ధిలోకి రావాలనే లక్ష్యంతో  ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని 

మహిళలు సంతోషంగా ఉంటే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటుందని తెలిపారు. మహిళల వృద్ధికి తోడ్పాటు అందించేందుకు  మహిళ శక్తి కార్యక్రమం ద్వారా వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, బస్సులు, మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లు, పాడి పరిశ్రమలు, మహిళా శక్తి క్యాంటీ లు, వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు  ఏర్పాటు ద్వారా వ్యాపారంలో మెలకువలు చేస్తున్నామని అన్నారు. మహిళ చేతిలో రూపాయి ఉంటే పొదుపు పెరుగుతుందని ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయిలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఇందిరా మహిళ శక్తి చీరలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో మహిళ సమాఖ్యలు ద్వారా ప్రతి మహిళకు చేరుతాయని తెలిపారు.

మైలాన్ అనే సంస్థ ద్వారా సిఎస్ఆర్ నిధుల నుండి ఈ ఐదు మండలాల మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమం చేపట్ట బోతున్నామని, ఇప్పటికే మహదేవ్ పూర్ మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అన్నారు.ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతంగా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని మంత్రి కోరారు. 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళ శక్తి బస్సులు, మహిళా సమాఖ్యలలోని సభ్యులైన మహిళలకు కుట్టు మిషన్లు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ లు సైతం మహిళలే కుట్టి అందిస్తున్నారని అన్నారు. భూపాలపల్లి, కాటారం డివిజన్లలోని అన్ని మండలాలకు ఒకటి చొప్పున మహిళా శక్తి పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతుందని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  ఎస్పి సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి,కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, రాష్ట్ర ఉపాధి హామీ పథకం సభ్యులు రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, సింగిల్ విండో ఛైర్మన్ మొండెయ్య తదితరులు పాల్గొన్నారు.

మంథని: ముగిసిన సత్య సాయి శత జయంతి వేడుకలు

అలరించిన మహావాది సోదరుల సంగీత విభావరి 

మంథని : భగవాన్ శ్రీ సత్య సాయిబాబా భక్తులకు చూపిన మార్గం ఆనందదాయకమని, ప్రతి ఒక్కరూ ప్రేమతో జీవించాలని ఆయన కోరుకునే వారని మంథని సత్య సాయిబాబా సేవా ట్రస్ట్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గంగా రాధా కిషన్ అన్నారు. ఆదివారం శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ముగింపు సందర్భంగా సంగీత విభావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా శతా బాబా శత జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందం ఇచ్చిందన్నారు. సంగీత సంగీత విభావరి కార్యక్రమంలో గాయకులుగా మహావాది సుధీర్, విజయ్ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే చివరి రోజున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, నిరుపేదలకు దుస్తులు, మందులు అంద చేసినట్లు ఆయన తెలిపారు.

అలరించిన మహావాది సోదరుల భక్తి గీతాలు

 శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ కామెంటేటర్లు, క్రీడా విశ్లేషకులు మహావాది సుధీర్, విజయ్ సోదరులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంది. గాయకులుగా వారు పాడిన హిందీ, తెలుగు భక్తి పాటలు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా ప్రముఖ గాయకుడు స్వర్గీయ కిషోర్ కుమార్ ఆలపించిన భక్తి పాటలు వీరు ఎంతో మధురంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ  కొండా శంకర్, అష్టదని గంగాధర్, రామడుగు మారుతి, మేడగోని రాజమౌళి గౌడ్, యజ్ఞంభట్ల లక్ష్మీరాజం, నల్లగొండ శ్రీనివాస్, అవధానుల శ్రీనివాస్, రామడుగు శ్రీనివాస్ పాల్గొన్నారు.

మంథని: మంత్రి శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు



మంథని : మంథని మండలంలోని సూరయ్యపల్లి గ్రామ రైతులు తమ పొలాలకు రాళ్ళకుంట నుండి వెళ్లే దారి ఇబ్బందిగా మారిందని రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి అరేల్లి కిరణ్ గౌడ్ ఆదివారం తెలియజేయగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు రైతుల సమస్యను పరిష్కరించేందుకు మట్టి రప్పించేలా చర్యలు చేపట్టారు. గ్రామ రైతులు సమస్యపై వెంటనే స్పందించి పరిష్కారం చూపినందుకు మంత్రి శ్రీధర్ బాబు కి సూరయ్యపల్లి గ్రామ రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పెద్దపల్లి : జిల్లా డీసీపీ భూక్యా రామ్ రెడ్డి



రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ నూతన డీసీపీగా  భూక్యా రామ్ రెడ్డి  ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.  డీసీపి పుల్ల కరుణాకర్ స్థానం లో సీఐడీ విభాగం లో ఎస్పీ గా పనిచేస్తున్న భూక్యా రామ్ రెడ్డి ఐపిఎస్  డీసీపీ గా నియమితులయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల లోని గర్జనపల్లి కి చెందిన ఆయన 1989 బ్యాచ్ ఎస్ఐ గా పోలీస్ శాఖలో చేరి అంచలంచలుగా ఎదిగి 2020 లో ఐపీఎస్ హోదా సాధించారు. డీసీపీ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతా పరిరక్షణ, మహిళా, శిశు రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, యువతలో నేర ప్రవృత్తుల నివారణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని, ప్రతి పోలీసు సిబ్బంది సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లలో, సీఐ ల వద్ద, ఏసీపీ లను సంప్రదించాలని, సమస్య పరిష్కారం కాకపోతే డీసీపీ ఆఫీసు కు రావాలని అన్నారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని, గంజాయి సేవించేవారిని మరియు నిషేదిత మత్తు పదార్థాలు అక్రమ రవాణా, సరఫరా, నిల్వ చేయడం వంటి వాటిని ఉక్కుపాదం తో అణిచివేస్తామని తెలిపారు. ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఫోన్లో నేరుగా సంప్రదించవచ్చని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

శుక్రవారం, నవంబర్ 21, 2025

మంథని: ఘనంగా సత్యసాయి జయంతి

శ్రీ సత్య సాయి జయంతి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ సత్య సాయి దేవాలయం మంథనిలో ఈ ధార్మిక సేవా సంస్థ అధ్యక్షులు గంగా రాధాకిషన్ ఆధ్వర్యంలో శ్రీ భగవద్గీత లలిత విష్ణు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును నిర్వహించి అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. లోక కళ్యాణార్థం సర్వేజను సుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి మానవసేవే మాధవసేవ గోశాలలకు వృద్ధాశ్రమాలకు ధార్మిక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న వారికి మా ధన్యవాదాలు అని ఆయన తెలిపారు.

హైదరాబాద్: కేటీఆర్ మాటలు పచ్చి అబద్ధాలు


వీడియో కోసం క్లిక్ చేయండి
https://youtu.be/qMh7UWqvmXM?si=e7kDh6wgDXs95iv0

ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు                    పారిశ్రామిక భూముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయిస్తే దానిని 5-6 లక్షల కుంభకోణంగా చిత్రీకరిస్తూ కేటీఆర్ దుష్ప్రచారం సాగిస్తున్నారని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ  ‘ఫ్రీహోల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టులో మూడు జిఓలు ఇచ్చింది వారి ప్రభుత్వ హయాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం నాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఆరోపణలను ఆధారాలతో తిప్పికొట్టారు. 

• కేటీఆర్ చెబ్తున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4740 ఎకరాలే. మిగిలిన భూమి రోడ్లు, డ్రెయినేజి లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరిగింది.

• ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదు. పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవి.

• ఆజమాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించినది బిఆరెస్ ప్రభుత్వమే. కూకట్ పల్లి, ఆజమాబాద్, హఫీజ్ పేట భూములకు సంబంధించి ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్టుమెంట్, జిఓ ఎంస్ 19, 20, 21 లను 2023 ఆగస్టు 29 న జారీ చేసింది.

• ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నాం. 30, 50 శాతం స్లాబులతో ఇంపాక్టు ఫీజు నిర్ణయిస్తూ ఈనెల 17 న జరిగిన కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

• 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఫ్రీహోల్డ్ (Free hold) హక్కులు కల్పించారు. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలి. ఆ జిఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారు.

• జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసాయి. ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే నమ్మే పరిస్థితి లేదు. 

• అసలు కుంభకోణమో, స్కామో జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలి. పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జిఓలు ఇచ్చారు.

• ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలి.

• వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే మేం కల్పించాం. 

• స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో

 పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30 శాతం, 50 శాతం స్లాబులను ప్రతిపాదించారు.

• సిఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారు. వారెవరూ ప్రభుత్వంలో లేరు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గం. ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుంది. ఇప్పటికైనా ఆయన ఆలోచనల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం.

• కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నాం. అది కూడా అందరూ దరఖాస్తు చేసుకుంటేనే.

• యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకోలేరు.

• ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.

• రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు గండికొట్టాలని చూడటమే బిఆరెస్ ప్రధాన కార్యక్రమంగా మారింది.

• హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నాం. ప్రతిపక్షంగా సహకరించక పోయినా ఫర్వాలేదు. అబద్ధాలతో ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయొద్దు. బెదిరింపు ధోరణులు మానుకోవాలి.

• ఓఆర్ ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని మొదటి నుంచి చెబ్తున్నాం. గాలి, నీరు కాలుష్యం లేకుండా చేయడానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నాం.

• పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించడం చూస్తున్నాం. విద్యుత్తు, పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నారు. మన దగ్గర భూముల విలువ ఎక్కువ, లభ్యత కూడా తక్కువ. అయినా పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టం ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. 

• పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.

గురువారం, నవంబర్ 20, 2025

మంథని: సీ.సీ.ఎఫ్ కు రూ.12.37 కోట్ల టోకరా

అరెస్టు చూపిస్తున్న పోలీసులు

మంథని :మంథని మండలం గద్దలపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీస్ యొక్క పార్ట్నర్స్ అయిన బైర్నేని వర ప్రసాద్ రావు మరియు తాటిపల్లి శ్రీనివాస్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మంథని సీఐ బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళితే సివిల్ సప్లై కార్పొరేషన్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ కు గాను కొనుగోలు చేసిన వడ్లను శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్లుకు 38,489 క్వింటాళ్లు ఇస్తే అందుకు శ్రీలక్ష్మి ప్రసన్న ఇండస్ట్రీస్ వారు సివిల్ సప్లై కార్పొరేషన్ వారికి 25680.43 క్వింటాళ్ల బియ్యంను అప్పగించాలి. కానీ నిందితులు అయిన A1వర ప్రసాద్ రావు, A2 తాటిపల్లి శ్రీనివాసులు చేసుకున్న అగ్రిమెంట్ దుర్వినియోగం చేసి సివిల్ సప్లై  కార్పొరేషన్ వారికి బియ్యం ఇవ్వకుండా 12 కోట్ల 37 లక్షల 8 వేల 59 రూపాయలు మోసం చేసినందుకు ఫిర్యాది అయిన ముప్పిడి శ్రీకాంత్, తీగల గుట్టపల్లి కరీంనగర్, సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 139/2024 యూ/ఎస్ 406, 409, 420 ఐపిసి సెక్షన్ల కింద మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినది.ఈ కేసులో A2 అయిన తాటిపెల్లి శ్రీనివాసును గతంలో అరెస్టు చేయగా, గురువారం న బైర్నేని వర ప్రసాద్ రావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనైనది మంథని సీఐ బి.రాజు తెలిపారు

మంథని: శ్రీపాదకాలనీలో భూ కబ్జా



అధికారులకు ఫిర్యాదు 

మంథని : మంథని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో అదనంగా భూమి కబ్జా చేసిన ఎండీ మజీద్ పై చర్యలు తీసుకోవాలని మంథనిలోని బోయినపేటకు చెందిన నాయిని సంతోష్ మంగళవారం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపాద కాలనీ ఒకటో వార్డు లో ఎండీ మజీద్  అక్రమంగా భూమి కబ్జా చేసి నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఇందిరమ్మ ఇంటి పట్టా కు 121 గజాలు మాత్రమే అధికారులు ఇచ్చారని, కానీ మజీద్ 363 గజాలు కబ్జా చేసి కాంపౌండ్ గోడ కట్టడం జరిగిందని,మంథని ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, తహసిల్దార్ కుమారస్వామి తో పాటు ఇతర అధికారులకు ఫిర్యాదు లో సంతోష్ పేర్కొన్నారు. కబ్జా చేసిన విలువైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకోని మజీద్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సంతోష్ అధికారులను కోరారు.

హైదరాబాద్: నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీను బాబు



హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో ఇటీవల భారీ మేజర్టితో ఎమ్మెల్యే గా గెలిచిన నవీన్ యాదవ్ కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు హైదరాబాద్ లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిందన్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు శ్రీనుబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నవీన్ యాదవ్ గెలుపులో ఎంతో కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు శ్రీనుబాబు కృతజ్ఞతలు తెలిపారు.

మంథని: సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు



మంథని ఎస్సై డి.రమేష్

 మంథని :మంథని పట్టణ ప్రజలు సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై డి రమేష్  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  మంథని ప్రజలకు ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాలను రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా లేదా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా లేదా ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని కించపరిచే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టరాదు. ఒకవేళ ఎవరైనా  ఒక వ్యక్తికి లేదా ఒక వర్గానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో  పోస్టులు పెట్టినట్లయితే వారి పైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు.

పెద్దపల్లి: పుస్తకాలే ప్రియనేస్తాలు

 


 పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రంధాలయ నూతన భవన నిర్మాణం కోసం డి.ఎం.ఎఫ్.టి ద్వారా రూ.1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణ రావు

అనంతరం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారిని శాలువాతో సన్మానించి, నిప్పుల వాగు గ్రంధాన్ని బహుకరించారు.

తదుపరి జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు గారి చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి గురువారం రోజున శంకుస్థాపన చేసుకుని, జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం గ్రంథాలయాలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. వివిధ ప్రాంతాల ప్రజలు మైగ్రేట్ అయి, ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల, దినదినం పెద్దపల్లి పట్టణ జనాభా పెరిగిపోతుందని తెలిపారు. 30, 40 సంవత్సరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి, జిల్లా కేంద్ర గ్రంథాలయానికి 12 గుంటల స్థలాన్ని కేటాయించి, ఒక కోటి 50 లక్షల రూపాయల డి.ఎం.ఎఫ్.టి నిధులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. సంవత్సరంలోపు బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ఎంఈఓ సురేందర్ కుమార్, మాజీ కౌన్సిలర్లు, గ్రంథాలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు




సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి

రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని*


* గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధత పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్

గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా తయారీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డిసిపి కరుణాకర్ తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ*  గ్రామ పంచాయతీ ఎన్నికలు  తొందరలో నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని, సజావుగా ఎన్నికల జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.  3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహించాలనుకుంటే, ప్రతి ఫేజ్ లో ఏ మండలాల్లో ఎన్నికలు  జరగాలో జిల్లా వారీగా  ప్రణాళిక అందించాలని అన్నారు.

పాత పద్ధతిలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు.  సెప్టెంబర్ 2న విడుదల చేసిన పంచాయతీ తుది ఓటర్ జాబితా సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి నవంబర్ 22 లోపు పరిష్కరించాలని అన్నారు.  నవంబర్ 23న ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి కావాలని అన్నారు. 

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసిసి నిబంధనలు తప్పనిసరిగా  అనుసరించలని అన్నారు. ఎంసిసి ఉల్లంఘన పై వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి  యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఏసిపి లు రమేష్, కృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

శనివారం, నవంబర్ 01, 2025

కరీంనగర్: నారాయణ హైస్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్

కరీంనగర్ పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థ అయిన నారాయణ హైస్కూల్లో విద్యా సంవత్సరంలోని టర్మ్ -1 ముగింపునకు అనుసంధానంగా విద్యార్థి కేంద్రీత విద్యకు నూతన నాందిగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది,

ఏటీఎం అన్నం చైతన్య రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రోగ్రాం ని ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు ప్రాముఖ్యతని ప్రిన్సిపల్ ఎల్లాల భాస్కర్ రెడ్డి వివరిస్తూ విద్యార్థులు టర్మ్-1 లో నేర్చుకున్న పాఠ్యాంశంలోని ప్రతి విషయాన్ని తల్లిదండ్రుల సమక్షంలో వారి యొక్క చదువు మరియు సాధనను తామే ప్రదర్శించే కార్యక్రమంగా పేర్కొన్నారు.

అంతేకాకుండా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే ఈ ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని మరియు భవిష్యత్తులో సమాజంలో ఆత్మనిర్బరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని వారి యొక్క అవగాహన,ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రెసెంటేషన్ నైపుణ్యాలన్నీ ఆచరణలో చూపించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు,

అంతేకాకుండా నారాయణ స్కూల్ లో జరిగే ఇటువంటి ఆవిష్కరణత్మక కార్యక్రమాలు తమ పిల్లలలో మెరుగుపడుతున్న  విద్యాభివృద్ధికి ఇది ఒక శాస్త్రీయ నిదర్శనంగా నిలుస్తుందని మేధావి వర్గాలకు చెందిన తల్లిదండ్రులు నారాయణ విద్యా సంస్థలను కొనియాడారు.

ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ నారాయణ విద్యాసంస్థల యొక్క జిఎం గోపాల్ రెడ్డి డీజీఎం వెంకటరమణారెడ్డి కోఆర్డినేటర్ రవళి వైస్ ప్రిన్సిపల్ శిరీష,శ్వేత, ఏడి సంపత్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సోమవారం, అక్టోబర్ 27, 2025

మంథని: వ్యవసాయ భూములు మాత్రమే తీసుకుంటామంటే ఊకునేది లేదు



రామయ్యపల్లి గ్రామాన్ని కూడా సింగరేణి సేకరించాలి

సింగరేణి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం

మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్


రామగిరి మంథని : సింగరేణి ఓసీపీ టూ విస్తరణ కోసం సింగరేణి యాజమాన్యం రాజాపూర్ గ్రామంతోపాటు 444 ఎకరాల భూమిని తీసుకుంటామని ప్రతిపాధిస్తున్నట్టు సింగరేణి జీఎం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు రామగిరి మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సింగరేణి ఓసీపీ టూ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బుధవారంపేట, రాజాపూర్ గ్రామాల పరిధిలోని 708 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో సింగరేణి అధికారులు స్వాదీనం చేసుకున్నారు. దీనిపై రెండు గ్రామాల రైతులు కోర్టుకు వెళ్లగా ఆ భూమిని తిరిగి రైతులకు ఇవ్వడం జరిగింది. తదురపరి 88 ఎకరాలను మాత్రమే తీసుకున్న సింగరేణి అధికారులు.. ఇప్పుడు మరోసారి కుట్రపూరితంగా రాజాపూర్ గ్రామాన్ని మాత్రమే తీసుకుంటామని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాపూర్ గ్రామాన్ని తీసుకుంటామని చెప్తున్న సింగరేణి అధికారులు.. రామయ్యపల్లి గ్రామాన్ని తీసుకోకుండా కేవలం రామయ్యపల్లి గ్రామ పరిధిలోని వ్యవసాయ భూములను మాత్రమే తీసుకోవడం వల్ల గ్రామస్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పెద్దంపేట, పన్నూర్, మంగళ్ పల్లి, వీర్లపల్లి, వకీల్ పల్లి గ్రామాల ప్రజలు పడ్డ ఇబ్బందులను కండ్లారా చూసిన మేము ఎట్టిపరిస్థితిలో అటువంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్దంగా లేమని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు మా వ్యవసాయ భూమలు సేకరించే ప్రతిపాదనను విరమించుకోవడమో.. లేదంటే మా గ్రామాన్ని సైతం తీసుకుని గ్రామస్థులకు తగు రీతిలో న్యాయం చేయడమో ఏదో ఒకటి చేసే విధంగా అడుగులు వేయాలని హితవు పలికారు. అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ ప్రకటించి సింగరేణి విస్తరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోరాటాలు మా ఊరి ప్రజలకు కొత్త కాదని, గతంలో దొరలను,పోలీస్ ను సైతం ఉరికించిన చరిత్ర గ్రామానికి ఉందనే విషయాన్ని సింగరేణి అధికారులు గమనంలోకి తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం, అక్టోబర్ 24, 2025

మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా): రండి... కలిసి అద్భుతాలు ఆవిష్కరిద్దాం

*ఉమ్మడిగా పరిశోధనలు, సంయుక్త ప్రాజెక్టులు చేపడదాం*

*ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ ప్రతినిధులకు ఆహ్వానం*

*ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక భేటీ*

*అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, మెడికల్ డివైసెస్, సస్టైనబుల్ ఇంజనీరింగ్, క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ తదితర రంగాల్లో వినూత్న ఆవిష్కరణల కోసం తెలంగాణతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని మెల్‌బోర్న్‌లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీ ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానించారు*. ఇక్కడి ప్రముఖ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేస్తూ జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ఫ్యాకల్టీ, స్టూడెంట్ ఎక్స్ఛేంజ్‌లు, కో-ఇన్నోవేషన్ ఇనిషియేటివ్స్ ను చేపట్టాలని కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం మెల్బోర్న్ లోని ప్రఖ్యాత ‘మోనాష్’ యూనివర్సిటీని సందర్శించారు. అనంతరం ఉమ్మడి పరిశోధన, ఇన్నోవేషన్ బేస్డ్ కొలాబరేషన్, అకడమిక్ ఎక్స్ఛేంజ్ , స్టార్టప్ ల భాగస్వామ్యం తదితర అంశాలపై యూనివర్సిటీ ప్రతినిధులతో చర్చించారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని 

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఏఐ ఇన్నోవేషన్ హబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ క్వాంటం కంప్యూటింగ్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్, టీ హబ్, టీ వర్క్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో వినూత్న ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం మరింత ఊతమిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. "గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్" మారేందుకు అవసరమైన ఎకో సిస్టం కలిగిన తెలంగాణ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు యూనివర్సిటీ అకడమిక్ అఫైర్స్ వైస్-ప్రోవోస్ట్ ప్రొఫెసర్ మ్యాథ్యూ గిలెస్పీ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి పరిశోధనలు, సంయుక్త ప్రాజెక్టులను చేపట్టేందుకు వీలుగా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీన్ రీసెర్చ్ ప్రొఫెసర్ లే హై వూ, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ థామ్సన్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా: ‘విక్టోరియా పార్లమెంట్’ను సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ‘విక్టోరియా పార్లమెంట్’ను సందర్శించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ విప్ ‘లీ తార్లామిస్’, పార్లమెంటరీ సెక్రటరీ ‘షీనా వాట్’ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రొసీజర్స్,పార్లమెంటరీ గవర్నెన్స్, పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్, గవర్నెన్స్ రిఫార్మ్స్, డిజిటల్ ఇనీషియేటివ్స్ ను వారికి వివరించారు. ట్రాన్స్‌పరెంట్, టెక్నాలజీ-ఎనేబుల్డ్, సిటిజన్-డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్‌ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ – విక్టోరియా’ మధ్య ఇన్‌స్టిట్యూషనల్ కొలాబరేషన్‌ను పెంపొందించేందుకు చొరవ చూపాలని కోరారు. ప్రగతిశీల విధానాలను అనుసరిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తున్న ‘తెలంగాణ’ లాంటి రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నామని ‘లీ తార్లామిస్’, ‘షీనా వాట్’ తెలిపారు. ‘తెలంగాణ- విక్టోరియా’ మధ్య ద్వైపాక్షిక సహాకారాన్ని పెంపొందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.







FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026