సజావుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉండాలి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని*
* గ్రామపంచాయతీ ఎన్నికల సన్నద్ధత పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమీషనర్
గ్రామపంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా తయారీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్ లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, డిసిపి కరుణాకర్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ* గ్రామ పంచాయతీ ఎన్నికలు తొందరలో నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని, సజావుగా ఎన్నికల జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహించాలనుకుంటే, ప్రతి ఫేజ్ లో ఏ మండలాల్లో ఎన్నికలు జరగాలో జిల్లా వారీగా ప్రణాళిక అందించాలని అన్నారు.
పాత పద్ధతిలో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని అన్నారు. సెప్టెంబర్ 2న విడుదల చేసిన పంచాయతీ తుది ఓటర్ జాబితా సంబంధించి ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరించి నవంబర్ 22 లోపు పరిష్కరించాలని అన్నారు. నవంబర్ 23న ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించి పోలింగ్ కేంద్రాలు, ఫోటోలతో కూడిన ఓటర్ జాబితా ప్రచురణ పూర్తి కావాలని అన్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎంసిసి నిబంధనలు తప్పనిసరిగా అనుసరించలని అన్నారు. ఎంసిసి ఉల్లంఘన పై వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారానికి యంత్రాంగం సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఏసిపి లు రమేష్, కృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి