Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

గురువారం, సెప్టెంబర్ 25, 2025

కాటారం: పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, కలెక్టర్

వీడియో కోసం క్లిక్ చేయండి..
https://youtube.com/shorts/yPGOx9G6t-8?si=gNBkEo5Pm0k7TgUh

పేదవాని సొంతింటి  కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు  రాష్ట్ర, ఐటి పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు అన్నారు. గురువారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు,

మహిళ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణమాసం  కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను  పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు.  అనంతరం

అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా పోషణ మాసం కార్యక్రమ చేపట్టడం జరిగిందన్నారు.

మరొకటి పేద వాడి సొంతింటి  కల నెరవేర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకుకు వచ్చి అర్హులైన లబ్ధిదారులకు నేడు మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందన్నారు.

ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు, గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, అట్టి జాబితా ను గెజిటెడ్ అధికారులతో విచారణ నిర్వహించి నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజక వర్గం వ్యాప్తంగా 3500 ఇళ్ళు మంజూరు అయ్యాయని తెలిపారు.

ప్రతి సంవత్సరం 3500 ఇళ్ళు మంజూరు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఒక్క ఇల్లు అందించలేదని తెలిపారు. మంజూరు అయిన ఇళ్లకు 5 లక్షలతో నిర్మాణము జరుగుతుందని, 

4 విడతలుగా  నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి సోమ వారం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా  మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.

400 నుండి 599 ఎస్ ఎఫ్ ఫ్టీ  వరకు ఇంటి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. అంతకు మించి సైజు పెరిగితే బిల్లులు విడుదల కావని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే సిమెంట్ కూడా తక్కువ దరకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు  ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు  20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. రైతు ఋణ మాఫీ, విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు నేడు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.

ఒక ఇళ్లు నిర్మిస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్లుగా నిలిచిపోటామని తెలిపారు. పేదోళ్లకు ఇబ్బందులు కలిగించే పనులు చేయొద్దని మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు సేవలు చేయాలని ప్రజలను మన్ననలు పొందాలని  తెలిపారు. 

నిర్మాణంలో జాప్యం లేకుండా ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని,  ఇల్లు నిర్మాణం ఆగిపోతే ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారుల వేతనాల నుంచి కోత విధిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వ అధికారులు గానీ ఇతరులు ఎవరైనా లబ్ధిదారులను డబ్బులు అడిగితే పోలీస్ కేసు నమోదు చేయాలని సూచించారు.  మీ ఆశలను నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిర ఇల్లు మంజూరు చేసిందని మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలని సూచించారు.  ర ఇల్లు నిర్మాణంతో సంతోషంగా ఉండాలని, మనం మనం గుర్తుకు రావాలని ఆయన సూచించారు

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. గెజిటెడ్ అధికారులతో విచారణ జరిపి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని తెలిపారు. A I ద్వారా కూడా విచారణ చేపట్టామని తెలిపారు. లబ్ధిదారులు ఫోటో దిగిన చోట మాత్రమే ఇళ్లు నిర్మాణం చేపట్టాలని, 4 విడతలుగా లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు త్వరిత గతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణీ లకు సీమంతం, కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, మహిళా, శిశు సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి, మిషన్ భగీరథ ఈఈ శ్వేతా, మహాదేవపూర్ సింగిల్ విండో ఛైర్మన్ తిరుపతి రెడ్డి, సీడీపీఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.









పెద్దపల్లి: కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు

కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, టీఎన్జీవో అధ్యక్షులు బొంకూరి శంకర్ ,జిల్లా అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

కాటారం: మహా చండీయాగం చేసిన మంత్రి శ్రీధర్ బాబు



వీడియో కోసం... క్లిక్ చేయండి
https://youtu.be/v0mUAzcaF0c?si=NM0tlVP7fe7Y5Tvh

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద గురువారం తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు పూజలు చేసి అనంతరం గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం, నవగ్రహా హోమం, మహా చండీ యాగం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని,సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు, అనంతరం వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.

మంథని: గ్రీన్ హైవే రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న పుట్టపాక గ్రామస్థులు


ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 

 ఏసీబీ మడత రమేష్ జోక్యంతో శాంతించిన రైతులు

 మంథని :మంథని మండలం పుట్టపాక  గ్రామంలో భూ నిర్వాసితులు పుట్టపాక దగ్గర నిర్మిస్తున్న గ్రీన్ హైవే నిర్మాణ పనులను గురువారం ఉదయం అడ్డుకున్నారు. పుట్టపాక దగ్గర నిర్మిస్తున్న నాగ్ పూర్ - విజయవాడ గ్రీన్ హైవే నిర్మాణ పనులను చేపట్టడానికి వచ్చిన అధికారులను, జెసిబిలను భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళనతో పోలీస్ పహార మధ్య ఉద్రిక్తంగా మారింది. మొత్తం 108 కి.మీ దూరం నిర్మించే జాతీయ రహదారి పనులను మూడు ప్యాకేజీల కింద విభజించారు.1వ ప్యాకేజీలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్‌పల్లి నుంచి మంథని మండలం పుట్టపాక వరకు 31 కి.మీ దూరానికి రూ.873లో 2వ ప్యాకేజీ కింద పుట్టపాక నుంచి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి వరకు 38 కిలోమీటర్ల దూరానికి రూ.881 కోట్లు, 3వ ప్యాకేజీ కింద భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి నుంచి హనుమకొండ జిల్లా ఊరగొండ వరకు 39 కి.మీ దూరానికి రూ.851 కోట్లు కేటాయించారు.డివిజన్‌లో మొత్తం 204.46 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇప్పటివరకు 164.49 హెక్టార్లకు పరిహారం చెల్లించగా వివిధ కారణాలతో 19.73 హెక్టార్లు చెల్లింపులు జరగాల్సి ఉంది. 1,519 మంది నిర్వాసితుల్లో 1,303 మందికి రూ.47.13 కోట్ల పరిహారం అందించారు. మరో 216 మందికి రూ.8.51 కోట్లు చెల్లించాల్సి ఉంది. సాగులో ఉన్నవారి పేరిట రికార్డులో లేకపోవడం, సాదా బైనామాలు ఉండటం, వివాదాలు, కోర్టు కేసులతో పరిహారం చెల్లింపులో జాప్యం చోటుచేసుకుంటుంది.
భూ నిర్వాసితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగిందంటూ రైతులు ఆర్బిట్రేషన్ కింద కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పరిహారం మొత్తాన్ని పెంచారు. రూ.51.17 కోట్లు మంజూరు కాగా ఇప్పటివరకు రూ.46.12 కోట్లు చెల్లించగా ఇంకా రూ.5.04 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది. రికార్డులు సరిగ్గా లేని వారికి పరిహారం చెల్లించలేక పోతున్నామని అధికారులు వివరణ ఇస్తున్నారు. చివరికి గోదావరిఖని ఏసిపి మడత రమేష్ జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు.

మంథని: కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబురం

మంథని కోర్టు ఆవరణలో గురువారం మద్యాహ్నం బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు,ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి వి.భవాని,కోర్టుల సిబంది,మహిళా న్యాయవాదులు శ్రీమతి  జి.శ్రీ లక్ష్మి,శ్రీమతి  బండ మాధురి, తో పాటు బార్ అసోసియేషన్ ఉపాద్యక్షులు కే.రఘోత్తం రెడ్డి,ప్రధాన కార్యదర్శి యం. సహేందర్ రెడ్డి, గ్రంథాలయ కార్యదర్శి కటుకం శరీనివాస్,ఏజీపి బి ఆంజనేయులు,సదన్ కుమార్,శశి భూషణ్ కాచె,మంథని శ్రీనివాస్, వ్యాస్ కుమార్ లు పాల్గొన్నారు

బుధవారం, సెప్టెంబర్ 24, 2025

కాటారం: 25న మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం కాటారం మండలంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. మధ్యాహ్నం  1-00 గంటలకు కాటారంలోని  BLM గార్డెన్ లో కాటారం, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్, మలహర్ రావు సంబంధించిన గ్రామాలలో 300 ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు  మంజూరు పత్రాలను మరియు 4 మండలాల 50 CMRF/90 కల్యాణ లక్ష్మి చెక్కులను శ్రీధర్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు, మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి పోషణ్ మహా మాసం అంగన్వాడి లబ్ధిదారులకు నిర్వహించే  కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నట్లు ఆ ప్రకటలో పేర్కొన్నారు.

హైదరాబాద్: యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్థారు

'డేర్ టూ డ్రీమ్' శిబిరం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీధర్ బాబు

వీడియో కోసం.. క్లిక్ చేయండి
https://youtube.com/shorts/0PvtszPGet4?si=9D-5nZxyxQR2xt8o

(దిక్సూచి ప్రధాన ప్రతినిధి)
యువతలో అపారమైన శక్తి, సామర్థ్యాలు ఉన్నాయని, వారిని మనం ప్రోత్సహిస్తే అద్భుతాలుసృష్టించగలరని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ సిఖ్ సొసైటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా తూంకుంటలోని అలంకృత రిసార్ట్‌లో 'డేర్ టూ డ్రీమ్' పేరిట సిఖ్ యువత కోసం ఏర్పాటు చేసిన నాలుగు రోజుల శిక్షణ శిబిరాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు.* ఆలోచనలకు, ఆకాంక్షలకు పరిమితులు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా యువతకు దిశా నిర్దేశం చేశారు. కలలు కనడం ఎంత ముఖ్యమో, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడటం కూడా అంతే ముఖ్యమన్నారు. గెలుపోటముల గురించి ఆలోచించొద్దని, లక్ష్యాన్ని చేరుకునే వరకూ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాలని సూచించారు. కృషి, పట్టుదల లేకుండా ఏ కల సాకారం కాదన్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సిఖ్ సొసైటీ ప్రతినిధులు తేజ్ దీప్ కౌర్, గగన్ కోహ్లీ, సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మంగళవారం, సెప్టెంబర్ 23, 2025

మంథని: లేబర్ స్కీములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు

సహాయ కార్మిక అధికారికి వినతి పత్రం అందజేత         
దిక్సూచి ప్రతినిధి: సీఐటీయూ ఆధ్వర్యంలో మంథని సహాయ కార్మిక అధికారి డి రవీందర్ కు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు  బూడిద గణేష్ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ప్రమాద మరణానికి 10 లక్షలు సహజ మరణానికి రెండు లక్షలు పెంచుతూ నిర్ణయం చేసిందని అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు అనేక సంవత్సరాలుగా చేసిన పోరాట ఫలితంగానే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని దీన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.కానీ స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలని జీవో నెంబర్ 12 తీసుకువచ్చి 346 కోట్ల రూపాయలను ప్రైవేటు సంస్థలకు అక్రమంగా అప్పజెప్పడం అన్యాయమని అన్నారు. జీవో నెంబర్ 12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ లో ఉన్న క్లైమ్ లను వెంటనే పరిష్కారం చేయాలని సిఎస్సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దుచేసి కార్మికులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులతో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు బాబు రవి,మంథని కిష్టయ్య,నఫీజ్ తదితరులు పాల్గొన్నారు

సోమవారం, సెప్టెంబర్ 22, 2025

హైదరాబాద్: ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు

మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ముస్కుల సురేందర్ రెడ్డి సోమవారం సాయంత్రం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. సేవా కార్యక్రమాలతో సంఘాన్ని బలోపేతం చేసే దిశలో అడుగులు వేయాలని, ఆదర్శంగా నిలిచి అందరి మన్ననలు పొందాలని మంత్రి సూచించారు. తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ సంఘానికి, వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా ఉంటాయని అన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి, దామోదర్ రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని: దుర్గమాత మండపాలను సందర్శించిన ఏసీపీ

గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ గారు, గోదావరిఖని ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ దుర్గామాత విగ్రహాలను సందర్శించి అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడుతూ మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నవరాత్రులు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండపాల ప్రాంతాలలో బ్లూ క్లోట్స్ పెట్రో కార్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహించాలని,పాయింట్ బుక్స్ చెక్ చేయాలని సూచించారు.

హైదరాబాద్: సేవే నిజమైన సంపద

*శ్రీ అగ్రసేన్ మహారాజ్ స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ది* 

  *అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కృషి*

*రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు*

సేవే నిజమైన సంపద అని చాటి చెప్పిన శ్రీ అగ్రసేన్ మహారాజ్ ను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 
రైతులు, కార్మికులు, మహిళలు, యువతతో సహా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు. శంషాబాద్ లోని క్లాసిక్ కన్వెన్షన్ లో తెలంగాణ అగర్వాల్
సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘5149వ అగ్రసేన్ జయంతి వేడుకల’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి వృద్ధి సాధించినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. శ్రీ అగ్రసేన్ మహారాజ్ కేవలం పాలకుడు మాత్రమే కాదని, ఒక గొప్ప సామాజిక శిల్పి అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన 'ఒక ఇటుక, ఒక నాణెం' సూత్రం ప్రపంచంలోనే మొదటి స్టార్టప్ ఇంక్యుబేటర్‌ అని పేర్కొన్నారు. సంపదను కొద్దిమందికే పరిమితం చేయకుండా, సమాజంలో పంపిణీ చేసినప్పుడే అభివృద్ధి సాధ్యమని నిరూపించారన్నారు. సమ్మిళిత వృద్ధి, స్టార్టప్‌లు, సామాజిక న్యాయం గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నామంటే అందుకు ఆయన వేల ఏళ్ల కిందట వేసిన మార్గమే కారణమన్నారు. తెలంగాణ అగర్వాల్ సమాజ్ శ్రీ అగ్రసేన్ మహారాజ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తుందని ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రెసిడెంట్ అనిరుధ్ గుప్తా, వైస్ ప్రెసిడెంట్ రూపేష్ అగర్వాల్, జనరల్ సెక్రటరీ వికాస్ కేషన్, జాయింట్ సెక్రటరీ డా.సీమ జైన్, ట్రెజరర్ అచల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని: సైబర్ వారియర్స్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

సైబర్ వారియర్స్ కు టీషర్ట్లను అందజేస్తున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

 రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లో సైబర్ వారియర్స్ తో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  సైబర్ వారియర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. TGCSB హైదరాబాద్  పంపించిన టీ షర్ట్ లను సైబర్ వారియర్స్ కి అందజేశారు.
 ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సైబర్ వారియర్స్ గా పనిచేస్తున్న వారి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న క్రమంలో ప్రజలకు సైబర్ క్రైమ్ సెక్యూరిటీ పై అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని మీమీ పోలీస్ స్టేషన్ ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించాలి చైతన్య పరచాలని సూచించారు.సైబర్ వారియర్స్ కి అప్పగించిన బాధ్యత ని సక్రమంగా నిర్వహిస్తూ విధులలో ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఇన్వెస్టిగేషన్ నిర్వహించి సైబర్ బాధితులకి న్యాయం చేసే విధంగా కృషి చేయాలనీ సీపీ సూచించారు.
 రామగుండము కమిషనరేట్ పరిధి లో ఇటీవల తేదీ:-13-09-2025 రోజున నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా మొత్తం 134 సైబర్ కేసులలో 41,81,824/- రూపాయలు బాధితులకు డబ్బులు వారి సంబంధిత అకౌంట్ లకు రిఫండ్ కావడం జరిగింది. లోక్ అదాలత్ సంబంధించి అధిక కేసులు రిఫండ్ అయ్యేలా కృషి చేసిన ఉత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు సైబర్ వారియర్ పోలీస్ కానిస్టేబుల్ లకు ప్రశంసా పత్రాలను  ఇవ్వడం జరిగింది. 
ఈ సమావేశం లో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ N శ్రీనివాస్, CCPS ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, సీసీ హరీష్, సైబర్ వారియర్స్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది హాజరయ్యారు.

హైదరాబాద్: ఎన్.హెచ్. హైవే నిర్మాణానికి భూ సేకరణ పూర్తి చేయాలి

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
* జాతీయ రహదారుల భూ సేకరణ పురోగతిపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

జాతీయ రహదారుల నిర్మాణానికి గడువు లోగా భూ సేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

సోమవారం సోమవారం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సిఎస్ కె.రామ కృష్ణ రావు లతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణం పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 

హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ విజయవాడ ఎన్.హెచ్ 65 6 లైన్ల విస్తరణ, హైదరాబాద్ నుంచి అమరావతి, మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్ డిండి ఎన్ హెచ్ 764 నాలుగు లైన్ల విస్తరణ, ఎన్.హెచ్ 163 మన్నెగూడ సెక్షన్ 4 లైన్ల విస్తరణ, హైదరాబాద్ మంచిర్యాల కారిడార్ 4 లైన్లో గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడర్ పనుల అవసరమైన భూ సేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్ లు, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించి పలు సూచనలు చేశారు. 

ఈ సందర్భంగా *రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,*   ఎన్.హెచ్ అధికారులు , రాష్ట్ర అధికారులు సమన్వయంతో పని చేస్తూ జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు.  కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారులకు మొదటి ప్రాధాన్యతగా భూ సేకరణ పూర్తి చేయాలని అన్నారు.

ఎన్.హెచ్ 163జి పరిధిలో పెండింగ్ లో ఉన్న 130 హెక్టార్ల భూ బదలాయింపు ప్రక్రియ ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, ఈ రొడ్డు పరిధిలో ఉన్న జిల్లా కలెక్టర్లు  ప్రత్యేకంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తూ భూ బదలాయింపు వేగవంతం చేయాలని, ఆర్డీవో స్థాయి అధికారులకు ప్రత్యేక బాధితులు అప్పగించాలని సీఎం సూచించారు. 

భూ సేకరణ ప్రక్రియలో కలెక్టర్ లు నేరుగా రైతులతో చర్చించాలని, వారికి జాతీయ రహదారుల అథారిటీ ద్వారా మెరుగైన పరిహరం అందించేందుకు కృషి చేస్తున్నామని భరోసా కల్పించాలని అన్నారు.  జాతీయ రహదారులనిర్మాణంలో కోల్పోతున్న అటవీ శాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములు గుర్తించి అడవుల పెంపకం పనులు ప్రారంభించాలని, అటవీ శాఖ ద్వారా అవసరమైన అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులుసమన్వయంతో పని చేయాలని అన్నారు.  
ఈ సమావేశంలో డి.ఎఫ్.ఓ. శివయ్య,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి

అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ డి.వేణు

అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత  అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా *అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

దుబ్బలపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని  సర్వే నెంబర్ 8 గ్రామానికి దూరం కాకుండా సర్వే నెంబర్ 225 లో గ్రామ ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పంచాయతీ రాజ్ ఇంజనీర్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన సంకేత్ కుమార్ తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన బొబ్బిలి సత్యనారాయణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ  పిచ్చి చెట్లను తొలగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా  ఎంపిడిఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

సుల్తానాబాద్ పట్టణం జవహర్ నగర్ కు చెందిన కీర్తి సరిత తనకు దివ్యాంగుల కోటా క్రింద అటెండర్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా వారధీ సొసైటీ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో  సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని: బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి

మాట్లాడుతున్న రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల్ జోన్ ల పరిధిలో రామగుండం పోలీస్ శాఖ మహిళలు బతుకమ్మ ఆడేటువంటి ప్రాంతాల్లో, దుర్గామాత అమ్మవారు ఏర్పాటు చేసిన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, పెట్రోలింగ్, విషబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం మహిళ రక్షణ పోలీసుల బాధ్యత. పోలీసులు ప్రత్యేకంగా నిఘా, పర్యవేక్షణ నిర్వహించడంతో పాటు, ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పిస్తాం అన్నారు. ముఖ్యంగా సాయంత్రం పూట బతుకమ్మలు ఆడే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టి,  ప్రజలకు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు, పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ, విజిబుల్ గా ఉంటూ వెంటనే స్పందించి సహాయం అందిస్తారు. బతుకమ్మ పండుగ సంబరాల సమయంలో మహిళల, ప్రజల భద్రతను పర్యవేక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత, ప్రజలు సురక్షితంగా పండుగను ఆనందించేలా చూడటానికి  పోలీస్ కృషి చేస్తుందని తెలిపారు.
దుర్గామాత నవరాత్రి వేడుకలను రామగుండం కమీషనరేట్ వ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించడం కోసం అన్ని ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయని సీపీ గారు అన్నారు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాల‌ని పోలీస్ కమిషనర్ సూచించారు. వేడుకల సమయంలో ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే, కఠినమైన చర్యలు తీసుకోవబడతాయని హెచ్చరించారు.ఏమైనా సమస్యలు గమనించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయాల్ 100 ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, వదంతులను నమ్మవద్దన్నారు. పండగ ఉత్సవాలను సురక్షితంగా జరుపుకోవడంలో పోలీస్ అధికారులకు సహకరించండి. ప్రజల సహకారంతో ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ నిఘా కొనసాగుతుందని కమిషనర్ తెలిపారు.
పండుగ సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకి, విహార యాత్రలకు వెళ్లే ఆయా గ్రామాల, కాలనీ ల ప్రజలు తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వండి. వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం అన్నారు. అదేవిదంగా మీ గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందించాలని సీపీ గారు సూచించారు.

కరీంనగర్: మొదటి రోజు ప్రత్యేక అలంకరణలో త్రిశక్తి అమ్మవార్లు

శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజయిన సోమవారం, శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న శ్రీ మహాదుర్గ అమ్మవారు. స్వస్తిపుణ్యహవాచనం, మాతృక పూజ, అమ్మవార్లకు అభిషేక పూజలు నిర్వహించి వేద పండితులు నవరాత్రి పూజలు ప్రారంభించగా, శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారు, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ నిర్వహించారు.

కరీంనగర్: అమ్మవారి దీక్ష తీసుకున్న కేంద్రమంత్రి సంజయ్

శ్రీ దేవి నవరాత్రోత్సవాల సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవారి దీక్ష స్వీకరించన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ఆదివారం, సెప్టెంబర్ 21, 2025

కరీంనగర్: నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ మహాశక్తి ఆలయం







🔸 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు  నవరాత్రోత్సవాలు

🔸భవాని దీక్ష స్వీకరణ కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులతో కళకళలాడుతున్న ఆలయం

🔸ఈ నెల 29న సద్దుల బతుకమ్మ,  30న పల్లకి సేవ మరియు దుర్గాష్టమి, అక్టోబర్ 1న మహార్నవమి, 2న విజయదశమి

🔸ప్రతిరోజు రాత్రి 7 గంటలకు అమ్మవారి అవతార వైభవం పై ప్రవచనం,  9 గంటలకు దాండియా

🔶 ప్రతి రోజు రాత్రి 10 గంటల నుండి అమ్మవార్ల మహాభిషేకం, అలంకరణ, ఉదయం 8 గంటలకు మహాహారతి 

🔶ఉత్సవాలలో పాల్గొననున్న శ్రీ బండి సంజయ్ కుమార్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు గారు 

*శ్రీ మహాశక్తి దేవాలయంపై ప్రత్యేక కథనం.*

దసరా నవరాత్రి ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. కరీంనగర్ లో కొలువుదీరిన  శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల మహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంతో పాటు దేవాలయ పరిసరాల వీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నయి.

శ్రీశ్రీశ్రీ  జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల వారి ఆశీస్సులతో ఈనెల 22 నుండి ప్రారంభమవుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2వతేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రతతో,  అంగరంగవైభవంగా, కన్నుల పండుగగా   నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్త భక్తులకు శ్రీ మహాశక్తి దేవాలయం కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయిస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే రహదారులను ఆకట్టుకునే విద్యుద్దీపాల అలంకరణల వెలుగులతో  విరజిమ్మేళ ఏర్పాట్లు చేస్తున్నారు. 

భక్తులకు కొంగుబంగారం... కోరిన కోరికలు తీర్చే  శ్రీ మహాశక్తి అమ్మవార్లు 

శ్రీ మహాశక్తి అమ్మవార్లు నిజంగా చల్లని తల్లులు. ముల్లోకాలకు మూలమైన శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన దివ్య క్షేత్రం. ఆ తల్లులను ప్రార్థిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలు, ఇలా ఒకటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులు. నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శిస్తే సర్వ శుభాలను, ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని పొందవచ్చని శాస్త్ర వచనం. ఈ నవరాత్రి రోజులలో శ్రీ మహాశక్తి దేవాలయం ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా దేవాలయంలో అమ్మవారి భక్తులు స్వీకరించే "భవాని దీక్ష" లు ఇప్పటికే మొదలయ్యాయి.   వేలాది మంది భక్తులు తమ శక్తి కొలది 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 11 రోజుల కోసం నవరాత్రి దీక్షను ప్రతి ఏటా స్వీకరిస్తు నియమనిష్ఠలతో అమ్మవారిని సేవిస్తూ, తరిస్తున్నారు. నవరాత్రోత్సవాలలో భవాని దీక్ష చేపట్టి అమ్మవారిని భక్తితో కొలిస్తే ఎలాంటి బాధనుంచైనా ఉపశమనం లభిస్తుందని సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఇక్కడికి వచ్చే  భక్తులలో ఉంది. అందుకే దేవాలయ ప్రారంభం నుండి మొదలుకొని నేటి వరకు ఇక్కడ భవాని దీక్ష చేపట్టే భక్తులు గణనీయంగా పెరిగిపోయారు. స్రీ, పురుష బేధములు లేకుండా అందరూ ఆచరించే విశిష్ట భవానీ దీక్ష కోసం కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుండి  శ్రీ మహాశక్తి దేవాలయానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి మాలాధారణ కోసం, ఉత్సవాల కోసం తరలివచ్చె అశేష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో, ఏ అలంకరణలో దర్శనమివ్వనున్నారంటే ....

22వ తేదీ, సోమవారం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) అవతారం - ఉదయం 8 గం.లకు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి పూజ, స్వస్తి పుణ్యహవాచనం, గణపతి పూజ, మాతృకపూజ, నాంది, ఆంకురారోపణము, అఖండ దీపారాధనము, సర్వతోబధ్రమండలం, అమ్మవారికి ప్రతిరోజు చతుషష్టి ఉపచారపూజ, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం.సాయంత్రం 6 గం.లకు శ్రీ మహాదుర్గా అమ్మవారికి ఫలపంచామృత అభిషేకం

23తేదీ, మంగళవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారం

ఉదయం 8 గం.లకు శ్రీ గాయత్రీ దేవి పూజ - అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ. ఉదయం 9 గంటలకు సౌందర్యలహరి, కనకధారా స్తోత్ర పారాయణం...

సాయంత్రం 6 గం.లకు లింగార్చన...

24 తేదీ, బుధవారం,శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారం

ఉదయం 8 గం.లకు శ్రీ అన్నపూర్ణాదేవి పూజ ,  అమ్మవారికి శాకాంబరీ అలంకరణ.

సాయంత్రం 6 గం.లకు 108 రకాల నైవేద్యాల సమర్పణ 

25తేదీ, గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ కాత్యాయని  దేవి (కూష్మాండ ) పూజ, అమ్మవారికి పండ్లతో అలంకరణ. సాయంత్రం 6 గం.లకు శ్రీ మహా దుర్గా అమ్మవారికి పుష్పాభిషేకము....

26తేదీ, శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవి (స్కంద మాత) పూజ, రూపాయల(కరెన్సీ) తోఅలంకరణ.

సాయంత్రం 6 గం.లకు సామూహిక కుంకుమ పూజలు , తామర పువ్వులతో   లక్ష్మి సహస్ర నామార్చన.

27తేదీ శనివారం ఉదయం 8 గంటలకు శ్రీ లలితాదేవి (కాత్యాయని) పూజ, అమ్మవారికి గాజులతో అలంకరణ.

సాయంత్రం 6 గం.లకు లలితాసహస్రనామ పారాయణం.

28తేదీ ఆదివారం శ్రీ మహా చండీ దేవి  -  (కాళరాత్రి) పూజ, అమ్మవారికి సూర్య ప్రభ అలంకరణ..సాయంత్రం 6 గం.లకు విష్ణు సహస్ర నామ పారాయణం.

28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు  మూలా నక్షత్రం. శ్రీ సరస్వతి దేవి (మహాగౌరీ) పూజ, అమ్మవారికి పూలతోఅలంకరణ, విద్యార్థులచే సరస్వతి పూజ మరియు పుస్తక పూజ 

సాయంత్రం 6 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ పూజలు.

30 వతేదీ మంగళ వారం ఉదయం 8 గంటలకు శ్రీ దుర్గా దేవి (సిద్ధి రాత్రి)  పూజ,  (దుర్గాష్టమి) అమ్మ వారికి రత్నాలు,  దీపాలతో అలంకరణ, 

సాయంత్రం 6  గంటలకు అమ్మవారి పల్లకి సేవ, శ్రీ రతన్ కుమార్ శిష్య బృందం చే శాస్త్రీయ ఆలయ నృత్యాలు..

అక్టోబర్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీ మహిషాసుర మర్ధిని దేవీపూజ, (మహార్నవమి), రుద్ర సహిత చండీ హోమము.

సాయంత్రం 7 గంటలకు మహిషాసుర సంహారం 


2వ తేదీ  ఉదయం 8 శ్రీ రాజరాజేశ్వరి దేవి పూజ,(విజయదశమి), శమీ పూజ.

ఉదయం 9 గంటల నుండి వాహన పూజలు ప్రారంభం..

అలాగే నవరాత్రి రోజులలో ప్రతిరోజు రాత్రి 7 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో బ్ర.శ్రీ. డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ చే " అమ్మవారి అవతార వైభవం"ప్రవచనం , రాత్రి 9 గంటలకు అమ్మవారి సన్నిధానంలో  దాండియా కార్యక్రమం నిర్వహించనున్నారు.

నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి దర్శనం సర్వ కష్ట నివారణం, మహాపుణ్యదాయకం అయినందున సమస్త హిందూ బంధువులందరూ నవరాత్రి ఉత్సవాల్లో, పూజా కార్యక్రమాల్లో పాల్గొని జగదాంబ మూర్తుల కరుణాకటాక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.











కరీంనగర్: రాంలీలా బ్రహ్మాండంగా నిర్వహిద్దాం

స్థానికులు, వాకర్స్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 

గత పదిహేను సంవత్సరాలుగా మార్క్ ఫెడ్ గ్రౌండ్ లో జరుగుతున్న రాంలీలా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహిద్దామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఏర్పాట్లు స్థానిక మాజీ కార్పోరేటర్లు మల్లికార్జున రాజేందర్,బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ రావు,గంధం శ్రీనివాస్ గౌడ్,హరీష్ గౌడ్ తదితరులతో కలిసి ఉదయం వాకర్స్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు.గతంలో చేసిన వారి అనుభవాలు తీసుకొని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అందరితో కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేద్దామని నరేందర్ రెడ్డి అన్నారు.

పెద్దపల్లి: కలెక్టర్ పై నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం


జిల్లా టీఎన్జిఓ అధ్యక్షుడు బొంకూరి శంకర్* 

పెద్దపల్లి జిల్లా  నిరాధారమైన ఆరోపణలు చేయడానికి జిల్లా టీఎన్జిఓ చైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు.

రామగుండం లోని ఒక ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వారి సొసైటీకి 10 గుంటల భూమి కేటాయించడానికి జిల్లా సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించడాన్ని టీజ్యాక్ చైర్మన్ తెలిపారు. 

జిల్లా కలెక్టర్ ఎల్లప్పుడు ప్రజా సమస్యలు విద్యా ఉద్యోగాలు యువత భవిష్యత్తు వృద్ధుల సంక్షేమం వంటి అనేక అంశాలపై కృషి చేస్తున్నారని, కలెక్టర్ పై అసత్య ప్రచారం చేయడం ఉద్యోగుల  మనో ధైర్యం దెబ్బ  తీయడమేనని అన్నారు.

కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ వసతి గృహాలు కేజీబీవీలలో విద్యార్థులకు తగిన వత్తులు రూపకల్పనకై అన్ని విధాల నిధులు విడుదల చేస్తూ నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని, సీనియర్ సిటిజన్ జాకిట్ ప్రకారం కొడుకులు వారి వృద్ధులను తల్లిదండ్రులను సంక్షేమం చూడనట్లయితే వారిపై కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకుంటూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు 

ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాల అమలుకు కలెక్టర్ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిర్విరామంగా శ్రమిస్తున్న కలెక్టర్ పై ఆరోపణలు చేయడం పనిచేసే ఉద్యోగులు మన భావాలకు తీవ్రమైన భంగం కలుగుతుందని దీనిని జేఏసి పక్షాన ఖండిస్తున్నామని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వీర బుచ్చయ్య మాధవి రవీందర్ ప్రభాకర్ వాణిశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026