Dtv updates
గురువారం, సెప్టెంబర్ 25, 2025
పెద్దపల్లి: కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు
కాటారం: మహా చండీయాగం చేసిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని: గ్రీన్ హైవే రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న పుట్టపాక గ్రామస్థులు
మంథని: కోర్టు ఆవరణలో బతుకమ్మ సంబురం
బుధవారం, సెప్టెంబర్ 24, 2025
కాటారం: 25న మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గురువారం కాటారం మండలంలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలయ్యింది. మధ్యాహ్నం 1-00 గంటలకు కాటారంలోని BLM గార్డెన్ లో కాటారం, మహాముత్తారం, పలిమెల, మహదేవపూర్, మలహర్ రావు సంబంధించిన గ్రామాలలో 300 ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మరియు 4 మండలాల 50 CMRF/90 కల్యాణ లక్ష్మి చెక్కులను శ్రీధర్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నారు, మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి పోషణ్ మహా మాసం అంగన్వాడి లబ్ధిదారులకు నిర్వహించే కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నట్లు ఆ ప్రకటలో పేర్కొన్నారు.
హైదరాబాద్: యువతను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్థారు
మంగళవారం, సెప్టెంబర్ 23, 2025
మంథని: లేబర్ స్కీములను ప్రైవేటు సంస్థలకు ఇవ్వద్దు
సోమవారం, సెప్టెంబర్ 22, 2025
హైదరాబాద్: ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మంథని రెడ్డి సేవా సంఘం అధ్యక్షుడు
గోదావరిఖని: దుర్గమాత మండపాలను సందర్శించిన ఏసీపీ
హైదరాబాద్: సేవే నిజమైన సంపద
గోదావరిఖని: సైబర్ వారియర్స్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి
హైదరాబాద్: ఎన్.హెచ్. హైవే నిర్మాణానికి భూ సేకరణ పూర్తి చేయాలి
పెద్దపల్లి: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి
గోదావరిఖని: బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలకు భద్రతా ఏర్పాట్లు పూర్తి
కరీంనగర్: మొదటి రోజు ప్రత్యేక అలంకరణలో త్రిశక్తి అమ్మవార్లు
కరీంనగర్: అమ్మవారి దీక్ష తీసుకున్న కేంద్రమంత్రి సంజయ్
ఆదివారం, సెప్టెంబర్ 21, 2025
కరీంనగర్: నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ మహాశక్తి ఆలయం
🔸 సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు నవరాత్రోత్సవాలు
🔸భవాని దీక్ష స్వీకరణ కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులతో కళకళలాడుతున్న ఆలయం
🔸ఈ నెల 29న సద్దుల బతుకమ్మ, 30న పల్లకి సేవ మరియు దుర్గాష్టమి, అక్టోబర్ 1న మహార్నవమి, 2న విజయదశమి
🔸ప్రతిరోజు రాత్రి 7 గంటలకు అమ్మవారి అవతార వైభవం పై ప్రవచనం, 9 గంటలకు దాండియా
🔶 ప్రతి రోజు రాత్రి 10 గంటల నుండి అమ్మవార్ల మహాభిషేకం, అలంకరణ, ఉదయం 8 గంటలకు మహాహారతి
🔶ఉత్సవాలలో పాల్గొననున్న శ్రీ బండి సంజయ్ కుమార్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు గారు
*శ్రీ మహాశక్తి దేవాలయంపై ప్రత్యేక కథనం.*
దసరా నవరాత్రి ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. కరీంనగర్ లో కొలువుదీరిన శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల మహిమాన్విత దివ్యక్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాల వేడుకల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయంతో పాటు దేవాలయ పరిసరాల వీధులన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నయి.
శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల వారి ఆశీస్సులతో ఈనెల 22 నుండి ప్రారంభమవుతున్న శ్రీ దేవీ నవరాత్రోత్సవాలు అక్టోబర్ 2వతేదీ వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్రతతో, అంగరంగవైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్త భక్తులకు శ్రీ మహాశక్తి దేవాలయం కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలతో ముస్తాబు చేయిస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే రహదారులను ఆకట్టుకునే విద్యుద్దీపాల అలంకరణల వెలుగులతో విరజిమ్మేళ ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులకు కొంగుబంగారం... కోరిన కోరికలు తీర్చే శ్రీ మహాశక్తి అమ్మవార్లు
శ్రీ మహాశక్తి అమ్మవార్లు నిజంగా చల్లని తల్లులు. ముల్లోకాలకు మూలమైన శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కొలువుదీరిన దివ్య క్షేత్రం. ఆ తల్లులను ప్రార్థిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం, కీర్తి ప్రతిష్టలు, ఇలా ఒకటేమిటి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లులు. నవరాత్రి సమయంలో అమ్మవారిని దర్శిస్తే సర్వ శుభాలను, ఐహిక సుఖాలతో పాటు మోక్షాన్ని పొందవచ్చని శాస్త్ర వచనం. ఈ నవరాత్రి రోజులలో శ్రీ మహాశక్తి దేవాలయం ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుంది. ముఖ్యంగా ప్రతి ఏటా దేవాలయంలో అమ్మవారి భక్తులు స్వీకరించే "భవాని దీక్ష" లు ఇప్పటికే మొదలయ్యాయి. వేలాది మంది భక్తులు తమ శక్తి కొలది 108 రోజులు, 41 రోజులు, 21 రోజులు, 11 రోజుల కోసం నవరాత్రి దీక్షను ప్రతి ఏటా స్వీకరిస్తు నియమనిష్ఠలతో అమ్మవారిని సేవిస్తూ, తరిస్తున్నారు. నవరాత్రోత్సవాలలో భవాని దీక్ష చేపట్టి అమ్మవారిని భక్తితో కొలిస్తే ఎలాంటి బాధనుంచైనా ఉపశమనం లభిస్తుందని సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం ఇక్కడికి వచ్చే భక్తులలో ఉంది. అందుకే దేవాలయ ప్రారంభం నుండి మొదలుకొని నేటి వరకు ఇక్కడ భవాని దీక్ష చేపట్టే భక్తులు గణనీయంగా పెరిగిపోయారు. స్రీ, పురుష బేధములు లేకుండా అందరూ ఆచరించే విశిష్ట భవానీ దీక్ష కోసం కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుండి శ్రీ మహాశక్తి దేవాలయానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి మాలాధారణ కోసం, ఉత్సవాల కోసం తరలివచ్చె అశేష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో, ఏ అలంకరణలో దర్శనమివ్వనున్నారంటే ....
22వ తేదీ, సోమవారం శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి) అవతారం - ఉదయం 8 గం.లకు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి పూజ, స్వస్తి పుణ్యహవాచనం, గణపతి పూజ, మాతృకపూజ, నాంది, ఆంకురారోపణము, అఖండ దీపారాధనము, సర్వతోబధ్రమండలం, అమ్మవారికి ప్రతిరోజు చతుషష్టి ఉపచారపూజ, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం.సాయంత్రం 6 గం.లకు శ్రీ మహాదుర్గా అమ్మవారికి ఫలపంచామృత అభిషేకం
23తేదీ, మంగళవారం శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని) అవతారం
ఉదయం 8 గం.లకు శ్రీ గాయత్రీ దేవి పూజ - అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ. ఉదయం 9 గంటలకు సౌందర్యలహరి, కనకధారా స్తోత్ర పారాయణం...
సాయంత్రం 6 గం.లకు లింగార్చన...
24 తేదీ, బుధవారం,శ్రీ అన్నపూర్ణ దేవి (చంద్ర ఘంట) అవతారం
ఉదయం 8 గం.లకు శ్రీ అన్నపూర్ణాదేవి పూజ , అమ్మవారికి శాకాంబరీ అలంకరణ.
సాయంత్రం 6 గం.లకు 108 రకాల నైవేద్యాల సమర్పణ
25తేదీ, గురువారం ఉదయం 8 గంటలకు శ్రీ కాత్యాయని దేవి (కూష్మాండ ) పూజ, అమ్మవారికి పండ్లతో అలంకరణ. సాయంత్రం 6 గం.లకు శ్రీ మహా దుర్గా అమ్మవారికి పుష్పాభిషేకము....
26తేదీ, శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ మహాలక్ష్మి దేవి (స్కంద మాత) పూజ, రూపాయల(కరెన్సీ) తోఅలంకరణ.
సాయంత్రం 6 గం.లకు సామూహిక కుంకుమ పూజలు , తామర పువ్వులతో లక్ష్మి సహస్ర నామార్చన.
27తేదీ శనివారం ఉదయం 8 గంటలకు శ్రీ లలితాదేవి (కాత్యాయని) పూజ, అమ్మవారికి గాజులతో అలంకరణ.
సాయంత్రం 6 గం.లకు లలితాసహస్రనామ పారాయణం.
28తేదీ ఆదివారం శ్రీ మహా చండీ దేవి - (కాళరాత్రి) పూజ, అమ్మవారికి సూర్య ప్రభ అలంకరణ..సాయంత్రం 6 గం.లకు విష్ణు సహస్ర నామ పారాయణం.
28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు మూలా నక్షత్రం. శ్రీ సరస్వతి దేవి (మహాగౌరీ) పూజ, అమ్మవారికి పూలతోఅలంకరణ, విద్యార్థులచే సరస్వతి పూజ మరియు పుస్తక పూజ
సాయంత్రం 6 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో బతుకమ్మ పూజలు.
30 వతేదీ మంగళ వారం ఉదయం 8 గంటలకు శ్రీ దుర్గా దేవి (సిద్ధి రాత్రి) పూజ, (దుర్గాష్టమి) అమ్మ వారికి రత్నాలు, దీపాలతో అలంకరణ,
సాయంత్రం 6 గంటలకు అమ్మవారి పల్లకి సేవ, శ్రీ రతన్ కుమార్ శిష్య బృందం చే శాస్త్రీయ ఆలయ నృత్యాలు..
అక్టోబర్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు శ్రీ మహిషాసుర మర్ధిని దేవీపూజ, (మహార్నవమి), రుద్ర సహిత చండీ హోమము.
సాయంత్రం 7 గంటలకు మహిషాసుర సంహారం
2వ తేదీ ఉదయం 8 శ్రీ రాజరాజేశ్వరి దేవి పూజ,(విజయదశమి), శమీ పూజ.
ఉదయం 9 గంటల నుండి వాహన పూజలు ప్రారంభం..
అలాగే నవరాత్రి రోజులలో ప్రతిరోజు రాత్రి 7 గం.ల నుండి అమ్మవారి సన్నిధిలో బ్ర.శ్రీ. డా. గర్రెపల్లి మహేశ్వర శర్మ చే " అమ్మవారి అవతార వైభవం"ప్రవచనం , రాత్రి 9 గంటలకు అమ్మవారి సన్నిధానంలో దాండియా కార్యక్రమం నిర్వహించనున్నారు.
నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి దర్శనం సర్వ కష్ట నివారణం, మహాపుణ్యదాయకం అయినందున సమస్త హిందూ బంధువులందరూ నవరాత్రి ఉత్సవాల్లో, పూజా కార్యక్రమాల్లో పాల్గొని జగదాంబ మూర్తుల కరుణాకటాక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.
కరీంనగర్: రాంలీలా బ్రహ్మాండంగా నిర్వహిద్దాం
స్థానికులు, వాకర్స్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
గత పదిహేను సంవత్సరాలుగా మార్క్ ఫెడ్ గ్రౌండ్ లో జరుగుతున్న రాంలీలా కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహిద్దామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఏర్పాట్లు స్థానిక మాజీ కార్పోరేటర్లు మల్లికార్జున రాజేందర్,బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్,వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ రావు,గంధం శ్రీనివాస్ గౌడ్,హరీష్ గౌడ్ తదితరులతో కలిసి ఉదయం వాకర్స్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు.గతంలో చేసిన వారి అనుభవాలు తీసుకొని సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అందరితో కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేద్దామని నరేందర్ రెడ్డి అన్నారు.
పెద్దపల్లి: కలెక్టర్ పై నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం
జిల్లా టీఎన్జిఓ అధ్యక్షుడు బొంకూరి శంకర్*
పెద్దపల్లి జిల్లా నిరాధారమైన ఆరోపణలు చేయడానికి జిల్లా టీఎన్జిఓ చైర్మన్ బొంకూరి శంకర్ తీవ్రంగా ఖండించారు.
రామగుండం లోని ఒక ఆశ్రమ పాఠశాల నిర్వాహకులు వారి సొసైటీకి 10 గుంటల భూమి కేటాయించడానికి జిల్లా సంక్షేమ అధికారి ద్వారా కలెక్టర్ డబ్బులు అడుగుతున్నారని ఆరోపించడాన్ని టీజ్యాక్ చైర్మన్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎల్లప్పుడు ప్రజా సమస్యలు విద్యా ఉద్యోగాలు యువత భవిష్యత్తు వృద్ధుల సంక్షేమం వంటి అనేక అంశాలపై కృషి చేస్తున్నారని, కలెక్టర్ పై అసత్య ప్రచారం చేయడం ఉద్యోగుల మనో ధైర్యం దెబ్బ తీయడమేనని అన్నారు.
కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ వసతి గృహాలు కేజీబీవీలలో విద్యార్థులకు తగిన వత్తులు రూపకల్పనకై అన్ని విధాల నిధులు విడుదల చేస్తూ నాణ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని, సీనియర్ సిటిజన్ జాకిట్ ప్రకారం కొడుకులు వారి వృద్ధులను తల్లిదండ్రులను సంక్షేమం చూడనట్లయితే వారిపై కఠినంగా వ్యవహరించి తగిన చర్యలు తీసుకుంటూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు
ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాల అమలుకు కలెక్టర్ ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిర్విరామంగా శ్రమిస్తున్న కలెక్టర్ పై ఆరోపణలు చేయడం పనిచేసే ఉద్యోగులు మన భావాలకు తీవ్రమైన భంగం కలుగుతుందని దీనిని జేఏసి పక్షాన ఖండిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు వీర బుచ్చయ్య మాధవి రవీందర్ ప్రభాకర్ వాణిశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
మంథని: 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు ఈనెల 22 సోమవారం నుంచి శరన్నవరాత్రి ఉత్సవములు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2 గురువారం వరకు ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రారంభం రోజున అమ్మవారి ఆలయంలో ఉదయం 6 గంటలకు అఖండ దీపారాధన, పుణ్యహ వాచనము, 7 గంటల 45 నిమిషములకు కలశ స్థాపన, 9 గంటలకు నాద బ్రహ్మ సప్తాహ దీక్ష, ఈనెల 28 ఆదివారం రాత్రి 9 గంటలకు చక్రిభజన, 29 సోమవారం రోజున గోపాల కాలువలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు భజన, లలిత, దుర్గా జననము, పవళింపు సేవ, ఆశీర్వచనము కార్యక్రమములు నిర్వహిస్తారు. అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వివిధ దేవతా స్వరూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు జరపడం ఒక సాంప్రదాయం.
ఈ సందర్భంగా మహాలక్ష్మి ఆలయాన్ని అందంగా అలంకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నవరాత్రుల్లో ముత్తైదువలు అమ్మవారికి ఓనించుకోవడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం. తొమ్మిది రోజుల పాటు ఎక్కాహం ( నిరంతర) సామూహిక భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. 29న సోమవారం గోపాల కాల్వలు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలను భజన పాటలు, మద్దెర మోతలు, మహిళల కోలాటాలు, నృత్యాలతో పురవీధులలో ఊరేగిస్తారు. ప్రతి వాడలోను ఉట్టి కొట్టే. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరారు.
FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..
సప్తవర్ణ శోభితం
- 1. శనివారం... సాహితీ సుమాలు సాహిత్య రంగంలో ప్రముఖులు, వారి చరిత్ర, రచనలు, కవితలు,
- 2. ఆదివారం సాంస్కృతికం.. సినిమా, సంస్కృతిక రంగాల్లో లబ్ధప్రతిష్టుల గురించి వ్యాసాలు, ఇంటర్వ్యూలు
- 3. సోమవారం క్రీడా మైదానం క్రీడారంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన వారి వివరాలు,
- 4. మంగళవారం
- 5. బుధవారం
- 6. గురువారం: ఆధ్యాత్మికం.. దేవాలయాలు, పండితులు, ప్రవచనాలు, భక్తి
- 7. శుక్రవారం.. సరస్వతీ నమస్తుభ్యం.. విద్యకు సంబంధించి ప్రముఖ కాలమిస్టుల రచనలు
విశిష్ట పోస్ట్
హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
All time hit
-
ఆధ్యాత్మికతను సామాజిక సేవతో మేళవించిన వ్యక్తిత్వం శ్రీ సీతారామ సేవా సదన్తో సేవా ప్రస్థానం.. ...
-
ప్రపంచ సంస్థలకు హైదరాబాద్ గమ్యస్థానం: మంత్రి శ్రీధర్బాబు దిక్సూచి, హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణకు ఉన్న అతిపెద్ద బలం యువత...
-
మంథని పట్టణంలోని పలు గణనాథులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గురువారం దర్శనం చేసుకున్నారు. 10 వ వార...
Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం



















