Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

ఆదివారం, సెప్టెంబర్ 21, 2025

మంథని: 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు ఈనెల 22  సోమవారం నుంచి శరన్నవరాత్రి  ఉత్సవములు ప్రారంభం కానున్నాయి.  అక్టోబర్ 2 గురువారం వరకు ఈ ఉత్సవాలు నిర్వహించబడతాయి. ప్రారంభం రోజున అమ్మవారి ఆలయంలో ఉదయం 6 గంటలకు అఖండ దీపారాధన, పుణ్యహ వాచనము, 7 గంటల 45 నిమిషములకు కలశ స్థాపన, 9 గంటలకు నాద బ్రహ్మ సప్తాహ దీక్ష, ఈనెల 28 ఆదివారం రాత్రి 9 గంటలకు చక్రిభజన, 29 సోమవారం రోజున గోపాల కాలువలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు భజన, లలిత, దుర్గా జననము, పవళింపు సేవ, ఆశీర్వచనము కార్యక్రమములు నిర్వహిస్తారు.  అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు వివిధ  దేవతా స్వరూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు జరపడం ఒక సాంప్రదాయం. 

ఈ సందర్భంగా  మహాలక్ష్మి ఆలయాన్ని అందంగా అలంకరించారు. నవరాత్రి ఉత్సవాల్లో విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ నవరాత్రుల్లో ముత్తైదువలు అమ్మవారికి ఓనించుకోవడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం. తొమ్మిది రోజుల పాటు ఎక్కాహం ( నిరంతర) సామూహిక భజన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. 29న సోమవారం గోపాల కాల్వలు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలను భజన పాటలు, మద్దెర మోతలు, మహిళల కోలాటాలు, నృత్యాలతో పురవీధులలో ఊరేగిస్తారు. ప్రతి వాడలోను ఉట్టి కొట్టే.  అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరారు.

శనివారం, సెప్టెంబర్ 20, 2025

ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు

 


హైదరాబాద్: హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో భారత్ కు నష్టం

మాట్లాడుతున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

నష్టం జరుగుతున్నా కేంద్రం మౌనమెందుకు?

ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే తెలియాలి

అమెరికాతో చర్చించి సమస్యను పరిష్కరించడంలో విఫలం

తెలంగాణపై తీవ్ర ప్రభావం... కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ


హెచ్-1బీ వీసా రుసుంను  పెంచడం వల్ల మన దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతుందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు ప్రధాని మోదీకే బాగా తెలుసని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

హెచ్-1బీ వీసా రుసుంను ఏటా లక్ష డాలర్లకు పెంచితే కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుంది...? దీని వెనుకున్న మర్మమేంటి...? అని శనివారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన ప్రశ్నించారు. హెచ్ – 1బీ వీసా పొందేవారిలో సుమారు 72 నుంచి 73 శాతం మంది భారతీయులేనని, ఈ ప్రభావం భారత్ పైనే అధికం ఉంటుందని వివరించారు. "2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ కు రికార్డు స్థాయిలో 135.46 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ వచ్చాయి. ఇందులో అమెరికా వాటా 27.7 శాతం. ట్రంప్ తాజా నిర్ణయంతో మనకొచ్చే రెమిటెన్స్ తగ్గిపోతాయి. ఆ ప్రభావం మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై పడుతుంది. ఈ విషయం తెలిసినా ముందస్తుగా అమెరికాతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపలేదు. కనీసం ప్రస్తుతం ఉన్న అమెరికాలో ఉన్న హెచ్- 1బీ వీసాదారులకు మినహాయింపులను సాధించడంలోనూ విఫలమయ్యింది’ అని విమర్శించారు. ‘భారత్ కు నష్టం చేకూర్చేలా ట్రంప్ ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించారు. ఇప్పుడేమో హెచ్ – 1బీ వీసా ఫీజును పెంచారు. మన ఆర్థిక వ్యవస్థకు నష్టం జరుగుతున్నా ప్రధాని మోదీ మాత్రం స్పందించడం లేదు. పైగా... ఇది మన మంచికే అంటూ వ్యాఖ్యనించడం దురదృష్టకరం’ అని అన్నారు. ‘ఇప్పటికైనా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి మేల్కోని సమస్య పరిష్కారానికి నేరుగా అమెరికాతో చర్చించాలి. కనీసం ఇప్పటికే అక్కడున్న హెచ్ – 1బీ వీసాదారులకు తాత్కాలిక మినహాయింపు కల్పించడంపై దృష్టి సారించాలి. భారతీయ ఐటీ నిపుణులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. రెమిటెన్స్ పై ఆధారపడే కుటుంబాలు, సంస్థల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలి’ అని కోరారు. ‘భారతదేశానికొచ్చే మొత్తం రెమిటెన్స్ లో తెలంగాణ దేశంలో 8.1 శాతం వాటాతో నాలుగో స్థానంలో ఉంది. ట్రంప్ నిర్ణయం వల్ల అధికంగా ప్రభావం పడే రాష్ట్రాల్లో మనది ఒకటి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ... ప్రత్యేకంగా లేఖ రాస్తాం’ అని వివరించారు. ‘రాష్ట్రాల హక్కులను హరించడంలో బిజీగా ఉన్న కేంద్రానికి మన భారతీయుల గురించి ఆలోచించే తీరిక లేదు. రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంటే రాష్ట్రాల సమూహం. కానీ... కేంద్రానికి మాత్రం బీజేపీ అధికారంలో ఉన్న వాటినే రాష్ట్రాలుగా పరిగణిస్తుంది. ఏ విషయంలోనూ తెలంగాణను రాష్ట్రంగా పరిగణించడం లేదు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’ అని వాపోయారు.

రామగిరి: బేగంపేటకు ఫ్రీజర్ సౌకర్యం కల్పించండి


మంత్రి శ్రీధర్ బాబు కు దాసరి శివ వినతి

బేగంపేట గ్రామానికి ఫ్రీజర్ ను అందజేయాల్సిందిగా ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాసరి శివ కోరారు.చనిపోయిన వారి మృతదేహాలను (భౌతికకాయాన్ని) సందర్శన కోసం ఉంచడానికి బేగంపేట గ్రామంలో ఫ్రీజర్ అందుబాటులో లేని విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా ఫ్రీజర్ ను అందజేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు హమీ ఇచ్చినట్లు దాసరి శివ పేర్కొన్నారు.అయితే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు గ్రామాన్ని దోచుకుతింటూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారనీ ప్రజల చేత ఓట్లు వేయించుకొని ప్రజల అవసరాలు తీర్చడంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలం చెందారని దాసరి శివ ఆవేదన వ్యక్తం చేశారు.బేగంపేట గ్రామంలోని  సమస్యలకు మంత్రి శ్రీధర్ బాబు గారు పరిష్కారం చూపుతున్నారని ఇప్పటికే నూతన ఐకెపి విస్తరణ పనులు విద్యుత్ స్తంభాలు ఏర్పాట్లు పబ్లిక్ బోర్ల నిర్మాణాలు నూతన బస్ షెల్టర్ నిర్మాణం మురుగునీటి కాలువలు తవ్వకాలు ఉచిత వైద్య సదుపాయాలు ఇతర ప్రాంతాల్లో చనిపోయిన వారికి ఉచిత అంబులెన్స్ సౌకర్యాలాంటి తదితర సమస్యలకు మంత్రి శ్రీధర్ బాబు గారు పరిష్కారం చూపారని దాసరి శివ వెల్లడించారు.

పెద్దపల్లి: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం

నియోజకవర్గ ప్రజల కోసం నిరంతం పని చేస్తున్నాం..

ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీలో రాష్ట్రంలో  పెద్దపల్లి ప్రత్యేక స్థానం..

ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి..

* పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు

పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని నందన గార్డెన్స్ లో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని 820 మంది సీ.ఎం.ఆర్.ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిది) లబ్ధిదారులకు రూ.2,64,06,900/- (రెండు కోట్ల అరవై నాలుగు లక్షల ఆరు వేల తొమ్మిది వందలు) విలువ గల చెక్కులను మరియు పెద్దపల్లి మండల మరియు పట్టణానికి సంబంధించిన 133 మంది కళ్యాణ లక్ష్మి & షాది ముబారక్ లబ్ధిదారులకు రూ.1,33,15,428/- (ఒక కోటి ముప్పై మూడు వేల పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది) విలువ గల చెక్కులను స్థానిక తహసీల్దార్ మరియు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే విజయరమణ రావు  మాట్లాడుతూ..

పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 820 మంది లబ్ధిదారులకు రూ.2.64 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను మరియు పెద్దపల్లి మండలం, పట్టణానికి సంబంధించిన 133 మంది లబ్ధిదారులకు రూ.1.33 కోట్ల విలువ గల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేయడం జరిగిందని పేద ప్రజల ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అగ్రగామిగా నింపేందుకు అహర్నిశలు కష్టపడుతున్నామని తెలిపారు. ప్రవేటు ఆసుపత్రులకు ధీటుగా పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యసేవలను అందిస్తుందని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి పిలునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ మరియు మేము నిరంతరం పని చేస్తున్నామని గుర్తు చేశారు. కోట్ల రూపాయలను వెచ్చించి అధునాతన హంగులతో ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు ఆధునీకరణ చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకునే వారికి అన్ని రకాల సౌకర్యాలను తమ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశామని ప్రజలందరూ స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రులపై దృషి సారించి వాటిని అభివృద్ధి పరుస్తున్నారని ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు

పెద్దపల్లి: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు విధిగా సెలవులు ప్రకటించాలని , ఏదైనా పాఠశాలలు నడిపిస్తున్నట్లు దృష్టికి వచ్చినట్లయితే లేదా ఉపాధ్యాయులు పాఠశాలలకు రమ్మని ఒత్తిడి చేసిన అట్టి పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2025

పెద్దపల్లి: అటవీ సంపదను సంరక్షించాలి

 అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

జిల్లాలోని రెవెన్యూ, పోలీసు, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తూ అటవీ సంపదను సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో  నిర్వహించిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష , అదనపు కలెక్టర్ డి.వేణు, డీసీపీ కరుణాకర్ లతో కలిసి పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ  జిల్లాలో అటవీ నరికివేత జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడానికి వీలు లేదని,  అటవి నరికివేతకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కొత్త అటవీ ఆక్రమణలు అనుమతించవద్దని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి శివయ్య ఆటవి యొక్క స్థితిగతులపై ప్రొజెక్టర్ ద్వారా అధికారులకు వివరించారు. 
ఈ సమావేశంలో   రెవెన్యూ డివిజన్ అధికారులు  బి.గంగయ్య, సురేష్, ఏసీపి లు కృష్ణ, రమేష్, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ







మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమతారెడ్డి 


ట్రినిటీ డిఎడ్ బిఎడ్ కళాశాలలో అలరించిన ముందస్తు బతుకమ్మ సంబరాలు 

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని మాజీ మున్సిపల్ చైర్మన్ రెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మమతారెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ డిఎడ్ బి.ఎడ్ కళాశాలలో శుక్రవారం జరిగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థినిలతో బతుకమ్మను ఎత్తుకొని ర్యాలీగా బయలుదేరి కళాశాల ప్రాంగణంలో ఉంచి బతుకమ్మ పాటలతో దరువు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి మన సంస్కృతికి వారధి అయినటువంటి బతుకమ్మ పండుగను తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ అని కొనియాడారు ఇలాంటి పండుగను వేరే ప్రాంతీయులు ఇతర సంస్కృతిక కార్యక్రమాలను ఇందులో  ఇందులో నిర్వ ఇస్తున్నారని అది సరికాదని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని  కాపాడుకోవాలని దాండియా  నృత్యాలు ప్రధానం కాదని పేర్కొన్నారు.. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ పారె  నీటి ప్రవాహం లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బుర్ర తిరుపతి, రజని జయపాల్ దిలీప్ శర్మ హరి మధుకర్ పి తిరుపతి రమేష్ అనురాధ సుజాత శారద తదితరులు పాల్గొన్నారు..

గురువారం, సెప్టెంబర్ 18, 2025

సూర్యాపేట్ కలెక్టరేట్ లో నిర్వహించిన "తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుక"ల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

 









రంగారెడ్డి: ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన పెరగాలి



రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు


ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన మరింత పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, పర్యావరణ సమతుల్యతకు, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్ కట్ట గ్రామంలోని "పీవీ నర్సింహారావు మెడిసినల్ గార్డెన్" లో బుధవారం ఏర్పాటు చేసిన "ఆరోమెటిక్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ ప్లాంటేషన్" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయుర్వేదం, సిద్ధ వంటి సంప్రదాయ వైద్య విధానాల్లో ఔషధ మొక్కల పాత్ర ఎంతో గొప్పదని, వేప, తులసి, అల్లం లాంటివి నిత్య జీవితంలో మనకు ఎంతగానో ఉపకరిస్తాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ మొక్కల పెంపకం రైతులకు మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. ‘ప్రాణహిత- చేవెళ్ల’ ప్రాజెక్ట్ ద్వారా సాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుంటే, ఆ తర్వాత అధికారంలోకొచ్చిన కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ గడ్డకు విముక్తి కల్పించేందుకు ఎంతో మంది మహానీయులు పోరాటం చేశారని, వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వామి రామనంద తీర్థ, పీవీ నర్సింహా రావు తదితర నాయకుల స్ఫూర్తితో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా పక్కా ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, పీవీ ప్రభాకర్ రావు, శేఖర్ మారంరాజు తదితరులు పాల్గొన్నారు.

మంథని: ఉచిత చేప పిల్లలను పంపిణి చేయాలని మంత్రి కి వినతి

మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందిస్తున్న మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి 

తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీ ఆలస్యం అవుతున్నందున మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని త్వరగా చేప పిల్లల పంపిణీ జరిగేలా చూడాలని మత్స్య శాఖ  జిల్లా డైరెక్టర్ పోతరవేణి క్రాంతి మంత్రికి వినతిపత్రం అందజేశారు. లేనిపక్షంలో నగదు బదిలీ చేపించాలని అలాగే మత్స్యకారులకు నూతన పథకాలు పెట్టి ఆర్ధికంగా ప్రోత్సహించాలని గురువారం హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు కి వినతి పత్రం అందజేశారు.

మంథని: భావి తరాలకు స్పూర్తినిచ్చేది ఉపాధ్యాయులే

  సన్మానిస్తున్న మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు

మంథని  : తమ బోధనా,జ్ఞానం ద్వారా గణనీయమైన ప్రభావాన్ని చూపి భావి తరాలకు స్పూర్తినిచ్చేది ఉపాధ్యాయులేనని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాద్యాయ వర్గాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణా ప్రజా ప్రభుత్వం ఆదేశాల మేరకు మంథని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల విద్యాధికారి దాసరి లక్ష్మి ఆద్వర్యంలో రాష్ట్ర, మండల  స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు సాధించిన పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న హాజరై  ఉత్తమ ఉపాధ్యాయులకు మేమంటో, జ్ఞాపికలు, ప్రశంశా పత్రాలు అందించి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాలల్లో అధునాతన బోధనా పద్దతులు అవలంబించి ఉత్తమ ఉపద్యాయులుగా అవార్డు సాధిoచటం అభినందనియమని అన్నారు. మండల విద్యాధికారి దాసరి లక్ష్మి మాట్లాడుతూ, ఉపాద్యాయులంతా పాఠశాల స్థాయిలో చేస్తున్న కృషి ఫలితంగా జిల్లా విద్యారంగం లో మంథని మండలం ముందుకెళుoదని వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డు అందుకున్న గీట్ల భరత్ రెడ్డి తో పాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు సాధించిన బహుత్ కిషోర్(పిఎస్ తెనుగుగూడెం), ఈర్ల రమేష్ (పిఎస్ అడవిసోమన్ పల్లి), మద్ది రాము(స్వర్ణ పల్లి), ధనశ్రీ(వెంకటాపూర్), నారమల్ల లక్ష్మన్(జెబిఎస్), బోగే చంద్రశేఖర్(గుంజపడుగు),ఈ. సురేష్(మల్లేపల్లి), శిరీష(ఉప్పట్ల), పద్మ(కుచిరాజ్ పల్లి), మాతంగి శ్రీదేవి(జీహెచ్ సి మంథని), వామనమూర్తి(యుపిఎస్ చిల్లపల్లి), కిన్నెర శ్రీనివాస్(జడ్పిహెచ్ఎస్ బాలుర), సిఆర్పి స్వప్నలను సన్మానిoచారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కుమారస్వామి,ఎంపిఓ అనిల్ రెడ్డి, టీజీఈఆర్సి సలహాదారు శశిభూషణ్ కాచే, ఆర్టిఐ మెంబర్ మంథని సురేష్, కాంప్లెక్స్ హెచ్ఎoలు ఈదులపల్లి నరసింహరావు, డాక్టర్ జె.సురేష్ కుమార్, మోసం శ్రీనివాస్, ఉపాధ్యాయులు బోనాల రవీందర్, సిఆర్పి మల్లన్న,ఎర్రం శ్రీనివాస్ , ఉపాధ్యాయ సంఘం నాయకులు, పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

మంథని: సీబీఐ విచారణ షురూ..


 అడ్వకేట్ వామన రావు ఇంటి వద్ద సీబీఐ ఆఫీసర్లు

 హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న బృందం

వామన్ రావు తండ్రి నుంచి వివరాల సేకరణ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అడ్వ‌కేట్‌ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ ప్రారంభమైంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారణ చేపట్టారు. హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో ఏడుగురు నిందితులు బెయిల్‌పై ఉన్నారు. వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హస్తం ఉందని వామన రావు తండ్రి కిషన్‌రావు ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. అనంతరం మంథని కోర్టు ప్రాంగణంలో వామన్ రావు తండ్రి కిషన్ రావు, వామన్ రావు తమ్ముడు చంద్రశేఖర్ నుంచి వివరాలను సీబీఐ అధికారులు సేకరించారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సీబీఐ బృందం పరిశీలించింది. మంథనికి సీబీఐ ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందోనని చర్చ జరుగుతోంది.

బుధవారం, సెప్టెంబర్ 17, 2025

రామగిరి: అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టే రకం

అన్నం పెట్టినోళ్లకే సున్నం పెట్టిన విధంగా పుట్టమధు వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావుపై పుట్టమధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 
రాజకీయ బిక్ష పెట్టిన స్వర్గీయ శ్రీపాద రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై  తీవ్రంగా స్పందించారు.  శ్రీపాద రావు మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతినిధిగా ఆ పదవికి వన్నె తెచ్చి దేశంలోనే ఒక గొప్ప స్పీకర్ గా వారు పేర్కొన్నారు. దమ్ముంటే ఒకసారి శ్రీపాద రావు విగ్రహాన్ని ముట్టుకొని చూడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు సత్తా ఏందో నీకు చూపిస్తానీ సవాల్ చేశారు. ఈరోజు నీ ఇంటి ముందు ధర్నాకు దిగినం రాబోయే రోజులలో నిన్ను రోడ్డు మీద తిరుగకుండా చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి స్వర్గీయ శ్రీపాదరావు గారని అన్నారు. ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వల్లే ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, జడ్పి ఛైర్మన్ గా ఎదిగిన పుట్ట మధుకు అహంకారం నెత్తికెక్కి శ్రీపాదరావు గారి విగ్రహాలు తీసేస్తామని అంటున్నారని అన్నారు. మంథని నియోజకవర్గాన్ని అన్ని రకాలు అభివృద్ది చేసేందుకు అనునిత్యం పనిచేస్తున్న శ్రీధర్ బాబు గారిని చూసి ఓర్వలేకనే బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చిచ్చుపెట్టేందుకు పుట్టమధు మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మంథని ప్రజల ప్రతీ కష్టసుఖాల్లో భాగమవుతున్న శ్రీనుబాబుపై సైతం పదేపదే తన అక్కసును వె‌ళ్లగక్కుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా, అణగారిన వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించిన మంథని ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మంథని: అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

మంథని: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇంటి ముట్టడి నీ ఖండిస్తూ బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కు ప్రాణహాని పొంచివుందని ఆయనకు ఏమైనా జరిగితే అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, మంథని ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మంథని: సామాజిక వైద్య శాలను తనిఖీ చేసిన జడ్జీ

మంథని సామాజిక వైద్య శాలను సీనియరు సివిల్ జడ్జీ వి.భవానీ  ఆకస్మిక తనిఖీ చేశారు,ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, పరిసరాల పరిశుభ్రత, మందుల సరఫరాల, మందుల గడువు తేదీలను పరిశీలిచారు, వారి వెంట ఆస్పత్రి సూపరిండెంట్  డాక్టర్ రాజశేఖర్, వైద్య సిబ్బంది ఉన్నారు.

మంథని: ఘనంగా విశ్వకర్మ జయంతి


భారత ప్రధాని నరేంద్రమోడీ 75వ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ కేంద్ర మరియు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు సేవ పక్వాడ్ 2025 లో భాగంగా సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి,తెలంగాణ విమోచన దినోత్సవం  మంథని నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణ పరిధిలో  భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల ఎలక్షన్ కన్వీనర్ పెద్దపల్లి జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించి స్వీట్లు పంచి హాస్పటల్లో రోగులకు పాలు బ్రెడ్ అందజేశారు.ఈ సేవా పక్వాడ్ కార్యక్రమం పట్టణ మండల కన్వీనర్లు నాంపల్లి రమేష్,మధుకర్ రెడ్డి పట్టణ మరియు మండల కో కన్వీనర్లు బోయిని నారాయణ మరియు ఎల్క సదానందం పర్యవేక్షణ చేయగా పట్టణ మరియు మండల అధ్యక్షులు సబ్బని సంతోష్ వీరబోయిన రాజేందర్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం  చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశానికి ఆగస్టు 15, 1947 నాడు స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ మాత్రం సెప్టెంబర్ 17 1948 వరకు నిజాం నిరంకుశ , దుర్మార్గపు రజాకార్ పాలనలో మగ్గిందని ఎందరో తెలంగాణ సాయుధ పోరాటయోధులు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పిస్తే, సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య జరిపి నిజాం మెడలు వంచి ఈ తెలంగాణకు నిజాం నుండి విమోచనం జరిగి స్వాతంత్రం లభించిందని చెప్పారు. గత కేసిఆర్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీకి వత్తాసు పలుకుతూ తెలంగాణ పౌరులు గత చరిత్ర మరిచిపోయేలా విమోచన దినోత్సవాన్ని తెలంగాణ విలీన దినోత్సవం అంటూ  ప్రచారం చేయడం సిగ్గు చేయడని విమర్శించారు.
సత్య ప్రకాష్ మాట్లాడుతూ యావత్ ప్రపంచం వివిధ రకాల పనిముట్లతో సరళీకృతమైన వృత్తి పనుల చేతనే అభివృద్ధి చెందు తున్నదని అనాది నుంచి విశ్వకర్మ భగవానుని కృపవల్లే ఇది సాధ్యం అయిందని ఆ భగవంతుని జన్మదినం కూడా ఈ రోజే కావడం జరిగిందని చెప్పారు.నరేంద్ర మోడీ ఈ దేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలబెట్టడానికి రోజులో 18 గంటలు శ్రమిస్తున్న ప్రధాని అని నేడు యావత్ ప్రపంచం భారత్ నమ్మకమైనస్నేహం కోసం ఎదురుచూస్తుందని, రానున్న కొద్ది రోజుల్లో ప్రపంచంలోనే మూడవ ఆర్థిక స్థానం మనదేనని.. దానికోసం భారతీయులందరూ  వస్తువులు కొనేముందు స్వదేశీ వస్తువులకు మొదటి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. మోదీ నిస్వార్ధమైన దేశభక్తుడని, కొనియాడారు. భారత్ లోని అన్ని రకాల ప్రజలకు న్యాయం చేకూరే లాగా అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్నారని చెప్పారు. జీఎస్టీ ని తగ్గించి సాధారణ ప్రజలకు నిత్యవసర వస్తువులు చేరువయ్యాలా చేశారని చెప్పారు. హై స్పీడ్ వందే భారత్ రైళ్లను యావత్ దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్నారు. ఇస్రో రంగానికి చేయూతనందిస్తూ ప్రపంచంలోనే ఏ దేశం సాధించినటువంటి అనేక అసాధ్యాలను సుసాధ్యం అయ్యేలా చేస్తున్నారు. సైనిక రంగంలో స్వదేశీ టెక్నాలజీకి గాని,యుద్ధ సామాగ్రికి పెద్ద పీట వేస్తున్నారు. తేజస్ లాంటి యుద్ధ విమానాలకు తయారు చేస్తూ ప్రపంచానికే ఎగుమతి చేస్తుండడానికి ప్రధాన కారణం మోడీ చాతూరేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్, తోట మధుకర్,పట్టణ మరియు మండల నాయకులు మరియు వివిధ మోర్చా అధ్యక్షులు భారతీయ జనతా కార్యకర్త సోదర సోదరీమణులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మంథని: జాతీయ జెండాను ఎగరవేసిన కాంగ్రెస్ నాయకులు

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మంథని పట్టణంలోని పోలీస్ స్టేషన్ దగ్గరలో గల కాంగ్రెస్ పార్టీ జెండా గద్దె వద్ద జెండా ఎగరవేసి అనంతరం మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అయిలి ప్రసాద్ మాట్లాడుతూ..నిజాం హైదరాబాద్ కేంద్రంగా సంస్థానాన్ని ఏర్పాటు చేసుకొని పరిపాలన చేసేవాడు 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నిజాం తెలంగాణ సంస్థానాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించుకొని నిరంకుశ పాలన కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఆనాటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని భారత సైన్యాన్ని హైదరాబాద్ కు పంపించి నిజాం సంస్థానాన్ని చుట్టుముట్టి నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసి నిజాం నిరంకుశ పాలనకు చర్మ గీతం పాడడం జరిగింది అని అన్నారు. నిజాం రజాకార్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పైన అనేక పన్నులు వేస్తూ వెట్టిచాకిరిని చేపించుకుంటూ దోపిడీలకు మరియు అనేక దాడులు చేస్తూ అఘాయిత్యాలకు, మానభంగాలకు పాల్పడుతూ చిన్నా పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఈ ప్రాంతంలో నరమేధాన్ని సృష్టిస్తే, భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐయిలమ్మ , దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి,మల్లు స్వరాజ్యం లాంటి ఎంతోమంది మహనీయులు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి నిజాం నిరంతత్వం పై పోరాటం చేయడం జరిగింది అని అన్నారు. మనలాంటివారు బహుజనులు ఎందరో పోరాటం చేసి చరిత్రలో నిలిచిన మన బహుజనుల పోరాట స్ఫూర్తిగానే ఏర్పడిందని అన్నారు.ఆ మహనీయుల త్యాగాల ఫలితమే నిజాం నిరంకుశ పాలన అంతమై ఈనాడు సెప్టెంబర్ 17 సందర్భంగా మహనీయులను గుర్తు చేసుకుంటూ ఆ మహనీయులకు జోహార్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ప్రచార కమిటీ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే, ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి, మంథని పట్టణ అధ్యక్షులు పోలు శివ, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, డైరెక్టర్ రావికంటి సతీష్, అంకుస్, బీసీ సెల్ మండల అధ్యక్షులు అయిలి శ్రీనివాస్, బీసీ సెల్ ఉపాధ్యక్షుడు పర్షవేణ మోహన్ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అజీమ్ ఖాన్, గోట్కారి కిషన్ జీ, అర్థం సదానందం, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జీ ఆరెల్లి కిరణ్, ఆకుల శ్రీనివాస్, ఎల్లంకి వంశీ, లైసెట్టి రాజు, మాజీ కౌన్సిలరు నక్క నాగేంద్ర శంకర్, వీకే రవి, శ్రీపతి బానయ్య, కుర్ర లింగయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల కిరణ్, మాదాసి పద్మ, దొరగొల్ల శ్రీనివాస్, రామ్ రాజశేఖర్, పాపారావు, పేరవేన లింగయ్య యాదవ్, మంథని సమ్మయ్య, అక్కపాక సదయ్య, మంథని శ్రీనివాస్, గొల్లపల్లి శ్రీనివాస్, ఐసాన్, సంపత్, కాజా, ఆరెల్లి వరుణ్, రంజిత్, ఎరుకల సురేష్ మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దపల్లి: తెలంగాణ ప్రజాపాలన వేడుకల్లో ఎమ్మెల్యే



తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ.చింతకుంట విజయరమణ రావు, మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక నాయకులతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో  పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప  మరియు మాజీ కౌన్సిలర్లు మరియు మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖని: ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు




కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిపి 

ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా గారు మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు , సిబ్బందితో జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ గీతాన్ని ఆలపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ గారు ప్రజాపాలన దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేసారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడి సెప్టెంబర్ 17న ప్రజాపాలనలోకి వచ్చిన రోజు అని కావున తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన రోజు అన్నారు. ప్రజల పై జరిపే  హింస పెరిగిపోవడం తో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, కొమురం బీమ్ వంటి ఎంతోమంది పోరాటయోధులు  పోరాటాలు సాగించరని వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రధాని నెహ్రు, ఉపప్రదాని హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ల చోరువతో జనరల్ చౌదరి అధ్వర్యంలో సైనిక చర్య జరిపి నిజాం ప్రాంతాన్ని భారత్ లో కలపడం జరిగిందని, ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. 

ఈకార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏవో శ్రీనివాస్ , ఆర్ఐ వామన మూర్తి, శ్రీనివాస్, మల్లేశం , గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని టూ టౌన్ సిఐ ప్రసాద్ రావు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు ఎస్ఐ లు ఆర్ఎస్ఐ సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026