మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమతారెడ్డి
ట్రినిటీ డిఎడ్ బిఎడ్ కళాశాలలో అలరించిన ముందస్తు బతుకమ్మ సంబరాలు
తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని మాజీ మున్సిపల్ చైర్మన్ రెడ్డి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మమతారెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ డిఎడ్ బి.ఎడ్ కళాశాలలో శుక్రవారం జరిగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థినిలతో బతుకమ్మను ఎత్తుకొని ర్యాలీగా బయలుదేరి కళాశాల ప్రాంగణంలో ఉంచి బతుకమ్మ పాటలతో దరువు వేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి మన సంస్కృతికి వారధి అయినటువంటి బతుకమ్మ పండుగను తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో అతిపెద్ద పండుగ అని కొనియాడారు ఇలాంటి పండుగను వేరే ప్రాంతీయులు ఇతర సంస్కృతిక కార్యక్రమాలను ఇందులో ఇందులో నిర్వ ఇస్తున్నారని అది సరికాదని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని కాపాడుకోవాలని దాండియా నృత్యాలు ప్రధానం కాదని పేర్కొన్నారు.. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ పారె నీటి ప్రవాహం లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బుర్ర తిరుపతి, రజని జయపాల్ దిలీప్ శర్మ హరి మధుకర్ పి తిరుపతి రమేష్ అనురాధ సుజాత శారద తదితరులు పాల్గొన్నారు..




కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి