ఈదురుగాలుల పట్ల విద్యుత్ శాఖ వారు అప్రమత్తంగా ఉండాలి..
రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలి..
నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాలి..
* ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు..
పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో మరియు జిల్లా సహకార అధికారి అలాగే ప్రాథమిక సహకార సంఘాల కార్యదర్శులతో వానాకాలం సీజన్ పట్ల ముందస్తుగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ వానాకాలన్నీ దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే విజయరమణ రావు సూచించారు. నియోజకవర్గంలో అవసరమైన కొత్త విద్యుత్ సబ్ స్టేషన్లను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అలాగే వానకాలంలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటాయని వాటిని దృష్టిలో ఉంచుకొని రైతులకు మరియు వినియోగదారులకు ఎలాంటి అంతరాయాలు లేకుండా చూసుకోవాలి తెలిపారు. పెద్దపల్లి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నూతనంగా నిర్మాణం చేపడుతున్న బైపాస్ రోడ్డు లో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి వాటిని సురక్షితమైన, అనువైన ప్రదేశాల్లోకి మార్చాలని విద్యుత్ అధికారులను ఆదేశించడం జరిగింది. క్షేత్రస్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలని నియోజకవర్గంలో ఎలెక్ట్రిక్ శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచనలు చేశారు. వానాకాలం సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు మరియు విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వ విప్ విజయరమణ రావు సూచనలు చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులు అందరూ ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించి రైతన్నలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మార్కెట్లో నకిలీ విత్తనాలపై నిఘా ఉంచి వాటి అమ్మకాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎ ఒక్క రైతు కూడా నకిలీ విత్తనాల బారిన పడకుండా చూసుకోవాలని ఆదేశించారు. విత్తనాలు అనేవి నిబంధనలకు అనుగుణంగా సజావుగా అమ్మకాలు సాగేలా చర్యలు తీసుకోవాలని అలాగే రైతులు కేంద్రాల వద్ద ఇబ్బంది పడకుండా డిజిటల్ ఎంట్రీలు, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డిసివో శ్రీమాల గారికి విజయరమణ రావు గారు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి శ్రీమాల, విద్యుత్ శాఖ ఎస్.ఈ గంగాధర్ డి.ఈ రాజబ్రహ్మ చారి, , ఎ.ఈ లు, ఎ.డి.ఈ లు, పాక్స్ కార్యదర్శులు మరియు తదితరులు పాల్గొన్నారు.






