కాటారం:
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLA) అవగాహన కల్పించేందుకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు.

కాటారం మండల కేంద్రంలోని ధన్వాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం, మహాదేవపూర్, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీను బాబు మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు నమోదు కావడంతో పాటు, తప్పులను గుర్తించి సరిదిద్దే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు BLAలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.
పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి