సన్మానిస్తున్న మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు
మంథని : తమ బోధనా,జ్ఞానం ద్వారా గణనీయమైన ప్రభావాన్ని చూపి భావి తరాలకు స్పూర్తినిచ్చేది ఉపాధ్యాయులేనని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాద్యాయ వర్గాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణా ప్రజా ప్రభుత్వం ఆదేశాల మేరకు మంథని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మండల విద్యాధికారి దాసరి లక్ష్మి ఆద్వర్యంలో రాష్ట్ర, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు సాధించిన పలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న హాజరై ఉత్తమ ఉపాధ్యాయులకు మేమంటో, జ్ఞాపికలు, ప్రశంశా పత్రాలు అందించి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, పాఠశాలల్లో అధునాతన బోధనా పద్దతులు అవలంబించి ఉత్తమ ఉపద్యాయులుగా అవార్డు సాధిoచటం అభినందనియమని అన్నారు. మండల విద్యాధికారి దాసరి లక్ష్మి మాట్లాడుతూ, ఉపాద్యాయులంతా పాఠశాల స్థాయిలో చేస్తున్న కృషి ఫలితంగా జిల్లా విద్యారంగం లో మంథని మండలం ముందుకెళుoదని వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డు అందుకున్న గీట్ల భరత్ రెడ్డి తో పాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు సాధించిన బహుత్ కిషోర్(పిఎస్ తెనుగుగూడెం), ఈర్ల రమేష్ (పిఎస్ అడవిసోమన్ పల్లి), మద్ది రాము(స్వర్ణ పల్లి), ధనశ్రీ(వెంకటాపూర్), నారమల్ల లక్ష్మన్(జెబిఎస్), బోగే చంద్రశేఖర్(గుంజపడుగు),ఈ. సురేష్(మల్లేపల్లి), శిరీష(ఉప్పట్ల), పద్మ(కుచిరాజ్ పల్లి), మాతంగి శ్రీదేవి(జీహెచ్ సి మంథని), వామనమూర్తి(యుపిఎస్ చిల్లపల్లి), కిన్నెర శ్రీనివాస్(జడ్పిహెచ్ఎస్ బాలుర), సిఆర్పి స్వప్నలను సన్మానిoచారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కుమారస్వామి,ఎంపిఓ అనిల్ రెడ్డి, టీజీఈఆర్సి సలహాదారు శశిభూషణ్ కాచే, ఆర్టిఐ మెంబర్ మంథని సురేష్, కాంప్లెక్స్ హెచ్ఎoలు ఈదులపల్లి నరసింహరావు, డాక్టర్ జె.సురేష్ కుమార్, మోసం శ్రీనివాస్, ఉపాధ్యాయులు బోనాల రవీందర్, సిఆర్పి మల్లన్న,ఎర్రం శ్రీనివాస్ , ఉపాధ్యాయ సంఘం నాయకులు, పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాద్యాయులు, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


















