దిక్సూచి, మంథని:
మంథని పట్టణంలో నిర్మాణంలో ఉన్న సమీకృత ఆర్డీవో కార్యాలయం, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు, నూతన మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణ పనులను సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్వయంగా పరిశీలించారు. అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులను నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు. మంథని ప్రజలకు త్వరితగతిన ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి తెలిపారు. ప్రజల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా, జవాబు దారితనంతో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు దిశా, నిర్దేశం చేశారు..ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్, పిఎసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, నాయకులు శశిభూషణ్ కాచే, బొబ్బిలి శ్రీధర్ పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి