దిక్సూచి, మంథని:
"వావ్ చాలా బాగున్నాయి.." అన్నారు మంత్రి శ్రీధర్ బాబు.. పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన నేచురల్ బొకేతో పాటు డ్రై ఫ్లవర్ ఫ్రేమ్స్ చూసి ఆయన ప్రశంసించారు.
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కును జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా అధికారులు, సంబంధిత ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ప్రతిపాదిత పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సువర్ణ ప్రనీత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు స్వయంగా తయారుచేసిన నేచురల్ బొకేతో పాటు డ్రై ఫ్లవర్ ఫ్రేమ్స్ మంత్రికి అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థుల సృజనాత్మకతను, కళాత్మక నైపుణ్యాన్ని అభినందిస్తూ వారి ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడి, ఎలా తయారు చేశారో వారిని అడిగి తెలుసుకున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి