కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు
దిక్సూచి, హైదరాబాద్, జూలై, 7:
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్లో మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్ కుమార్ తో పాటు పాలకవర్గం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు 20 మందితో కలిసి మంగళవారం మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో చేరారు. అనంతరం సర్పంచ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే మంథని నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర దిక్సూచి, విద్యావంతుడు నిరంతరం రాష్ట్ర మరియు మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వారు అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం అందించి ఒక ఇంటి పెద్దకొడుకు లాగా అయిండని రోడ్లు ప్రభుత్వ హాస్పిటల్స్ మౌలిక సదుపాయాలు కల్పించి యువతకు ఉపాధి కల్పిస్తున్నారని గారు అన్నారు.



కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి