బడుగుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహా నాయకుడు జగ్జీవన్ రామ్
డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
దిక్సూచి, కరీంనగర్, జూలై 6:
మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు హాజరై కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పుల అంజన్ ప్రసాద్ తో పాటు పలువురు నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కార్యక్రమాన్ని విదేశించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్త ఈ దేశానికి మాజీ ఉప ప్రధానిగా మరియు అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం, పరిముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ . ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు 1971లో ఇండో - పాక్ యుద్ధం జరిగినప్పుడు మన దేశం గెలవడానికి అనేక విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్, అయిన జీవించినంత కాలం ఈ దేశం కోసం, దళిత జాతి కోసం, అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి ఈరోజు వర్ధంతి సందర్భంగా వారికి యావత్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఘనంగా నివాళులు అర్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, వెన్న రాజ మల్లయ్య, సురేందర్ రెడ్డి, వంగల విద్యాసాగర్, కళ్ళపల్లి బాలరాజు, వెన్నం రజిత రెడ్డి, ఫహద్, కంకణాల అనిల్ కుమార్, మనోజ్, మాదాసు శ్రీనివాస్, జీడి రమేష్, ఇమ్రాన్, జూపాక సుదర్శన్, వీర దేవేందర్, ఇమ్రాన్ ఘని, సుంకరి గణపతి, సరిల్లా రతన్ రాజు, సత్తినేని శ్రీకాంత్, కిరణ్ రెడ్డి, షబానా మహమ్మద్ అనీఫ్, ఇమామ్, మాలోతు మహాలక్ష్మి, బషీరుద్దీన్, పాషా, శిల్ప, పెంట శేఖర్, కర్రె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి