ప్రారంభోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
దిక్సూచి, మంథని, జూలై 3:
మంథని పట్టణంలో సూరయ్యపల్లి గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త ఆర్ల వినీత్ ఏర్పాటు చేసిన సమైర ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంస్థను ప్రారంభించిన అనంతరం శ్రీను బాబు మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలు కొత్త వ్యాపారాలను ప్రారంభించి ఉపాధి అవకాశాలను సృష్టించడం సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తూ ఇతరులకు కూడా ఉపాధి కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
సమైర ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ విజయవంతంగా ముందుకు సాగి, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు ఆర్ల వినీత్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు తదితరులు పాల్గొని నూతన సంస్థ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి