Dtv updates

👉👉👉👉🔴 షాహిద్ భగత్ సింగ్ కు నివాళి 👉👉👉👉🔴 కరీంనగర్: ఓటు చోరీపై డీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ర్యాలీ 👉👉👉👉🔴 గణనాధులను దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు 👉👉👉👉🔴 పుష్కర పనులు ఏప్రిల్ నాటికి పూర్తి కావాలి 👉👉👉👉🔴 కరీంనగర్‌లో పూజలందుకుంటున్న గణాధిపతులు 👉👉👉👉🔴 మంథని: ఆ వి'నాయకులకు' వందేళ్లు 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: ‘కేజీఎఫ్‌’కు ముందే యశ్‌ స్టార్‌ : అరవింద్ వ్యాఖ్యలపై యశ్​ తల్లి ఫైర్​ 👉👉👉👉🔴 సినిమా దిక్సూచి: తెలంగాణను ఊపేయడానికి సిద్ధమైన ఓదెల-నాని కాంబో! 👉👉👉👉🔴 చాణక్య అంచనాలను ఎలా చూడాలి.. తెలంగాణ రాజకీయాలపై సర్వేల ప్రభావం ఎంత? 👉👉👉👉🔴 నడిపించిన సభలోనే నిలిచిన పేరు.. దుద్దిళ్ల శ్రీపాదరావు 👉👉👉👉🔴 Follow the దిక్సూచి channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb7Wd7LGpLHYpipmn52X

శుక్రవారం, జులై 03, 2026

బిఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని మోస్తున్నాం

 టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్, బీజేపీలపై  విమర్శల వెల్లువ

దిక్సూచి, కరీంనగర్: 

రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అప్పుల భారాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మోస్తోందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కరీంనగర్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్ఎస్, బీజేపీ పార్టీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్పొరేషన్లు, సొసైటీల పేరుతో ముందస్తు ప్రణాళిక లేకుండా భారీగా అప్పులు చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు, వాయిదాలకే నెలకు సుమారు రూ.6 వేల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోందని, మొత్తం అప్పులు రూ.8 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రజలు బీఆర్ఎస్ పాలనను తిరస్కరించి అధికారానికి దూరం చేశారని, అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మూడు వేలకుపైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే సుమారు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ అమలు చేశామని వివరించారు.

కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.1.20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. సిరిసిల్లలో ఇసుక మాఫియా, నేరెళ్ల ఘటనలు, పోలీసుల దౌర్జన్యాలు ప్రజలు మరచిపోలేదని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విదేశీ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రాలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఒకరికొకరు వ్యతిరేకులుగా నటించినప్పటికీ, కేంద్రంలో కీలక బిల్లులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ స్పీకర్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. ఢిల్లీలో రెండు పార్టీలు అవగాహనతో వ్యవహరించాయని, రాష్ట్రంలో మాత్రం రాజకీయంగా పరస్పరం విమర్శించుకున్నాయని అన్నారు.

కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ సామాన్య ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాల హామీ అమలు కాలేదని, ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరిచారని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై తీవ్ర భారం పడిందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా దేశంలో ఇంధన ధరలు తగ్గకపోవడంతో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

అదానీ, అంబానీల వంటి పారిశ్రామికవేత్తలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని, మతాలు, కులాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరించారని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతినే లక్ష్యంగా పనిచేస్తోందని, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపెల్లి మోహన్, కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్ గౌడ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

FOR SUPPORT.. PLEASE DO SUBSCRIBE..

విశిష్ట పోస్ట్

హైదరాబాద్: సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం

పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మి...

All time hit

Sripad Rao Jayanthi

Sripad Rao Jayanthi
శ్రీపాదకు అశృతర్పణం

జనవరి 29, 2026

జనవరి 29, 2026
జనవరి 29, 2026