పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
దిక్సూచి, రామగుండం, జూలై 3: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులకు పోలీసులంటే భయం కలిగేలా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని వివిధ విభాగాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీసీఎస్ ఏసీపీలు కె. రవీందర్, టి. ప్రవీణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ బి. శ్రీనివాస్ శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నేరాల నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా వ్యవహరించడంతో పాటు, నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో చట్టం పట్ల భయం నెలకొనే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. బాధ్యతలు చేపట్టిన అధికారులు తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తూ కమిషనరేట్ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి